దైవ రాజ్య స్థాపనకై నూతన నిబంధన నిర్మాణం కొరకు ప్రభువైన యేసు క్రీస్తు పొందిన మహా శ్రమలు
Day1 => వాక్య భాగము: Mat 21:1-11; Mark 11:1-11; Luke 19:29-44; John 12:12-19
రాజనీతి: అవసరమైన/నిజమైన సందేశాన్ని ప్రతికూల పరిస్థితులలో సరైన రీతిలో సమయస్పూర్తితో ప్రదర్శించాలి.
ధ్యాన సారాంశము:
సత్యము: యేసుప్రభువు క్రీస్తుగా, రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా నిరూపించబడెను.
కృప: ప్రభువు సాధుస్వభావియై మనకు అత్యంత సమీపముగా ఉండుట.
ప్రార్థన: రాజులకు రాజుగా ఈ లోకమునకు విచ్చేసిన యేసుప్రభువా! మీకు ప్రణుతులు. మేము ఏ పరిస్థితిలో ఉన్నప్పటిని సత్యమును ప్రకటించుటకు తగిన తెలివిని/జ్ఞానమును దయచేయుమని వేడుకొనుచున్నాము పరమతండ్రీ! ఆమేన్.
విశ్వాస జీవితం కుంచం కింద పెట్టబడిన దీపం కాదు. నిస్సారమైన ఉప్పూ కాదు. దైవ సహవాసం కలిగిన మిషను యొక్క వెలుగు ప్రపంచానికి తప్పక కనిపిస్తుంది. దైవ ప్రత్యక్షతను రుచి చూపిస్తుంది. ఈ లోకం ఆ దైవ ప్రేమ యొక్క రుచి తెలుసుకొని కూడ, ఆ వెలుగును అనుమంతించలేక దానిపై యుద్దం ప్రకటిస్తుంది తప్ప, ఆ వెలుగును వెలిగించుకొని ప్రపంచానికి వెలుగునివ్వదు.
కావున విశ్వాసి లోకములో సత్యమును స్థాపించుటకు సిలువను ధ్యానించవలసి యున్నది. సిలువ యాత్రలో ఎన్నో మెళకువలు ప్రభువు నేర్పించెను. ముఖ్యముగా ఈ రోజు పాఠము ప్రభువు సాధు స్వభావిగా గాడిద మీద ఎక్కి, శిష్యుల విజయ కేరింతలతో రాజులకు రాజుగా, సృష్టిమీద సర్వాధికారిగా ప్రదర్శింపబడెను.
ప్రభువైన యేసు క్రీస్తు గాడిదపై యెరూషలేములో రాజుగా ప్రవేశిస్తున్నారు. ఆ దేశ ప్రజలు కూడ ఆయనను రోమన్ ప్రభుత్వం నుండి విడిపించే రారాజుగా అనుకుంటున్నారు. యేసు ప్రభువు యెరూషలేములో ప్రవేశిస్తే ఇక జరిగేది యుద్దమే. నిజానికి యేసు ప్రభువు బయలుదేరినది కూడ యుద్దనికే. కాని ఈ యుద్దం ఇహ పరమైన రాజ్యం కోసం కాదు. మనకు పరలోక రాజ్యమిచ్చుటకు, ప్రేమతో దైవ రాజ్యమును స్థాపించి, స్థిరపరచి; ఇహ లోకంలో శాంతి, సమాధానము గల దేశములను నిర్మించడానికి. ఇది యుద్దమే కాని హాని లేని యుద్దము. హాయినిచ్చే యుద్దం.
- యుద్ద ప్రణాలిక:
- యేసు, క్రీస్తు ప్రభువని ఋజువు పర్చుకొనుట
- సాతాను తలను చితకకొట్టుటకు బయలుదేరిన యుద్దవీరుడని తెలియపర్చాలి
- ఈ యుద్దం హానిలేనిదని, ఇహపరమైన రాజ్యంపై కాదనె సమాచారాన్ని ప్రదర్శించాలి
- సత్యాన్ని సంపూర్ణంగా స్థాపించకుండ సమాప్తమైపో కూడదు.
అ దేశం మొత్తం హోసన్నా! హోసన్నా! అంటూ నినాదాలతో నిండిపోయింది. ఆ సమయంలో ఏదైన చెప్పాలంటె ప్రకటించలేని పరిస్థితి. కేవలం ప్రదర్శించడం ద్వారానె అటు రోమన్ ప్రభుత్వానికి, ఇటు మత పెద్దలకు మరియు తన్ను ప్రేమించు వారికి సందేశాన్ని అందించాలి.
యేసు ప్రభువు గుర్రాన్నొ, ఏనుగునో ఉపయోగిస్తే ప్రస్తుతమున్న రాజ్యంపై యుద్దం ప్రకటించినట్టు కాబట్టి రోమన్ ప్రభుత్వం అనవసరముగా యుద్దానికి సన్నద్దం అవుతుంది. హాని జరుగును కావున ఆయన వాటిని ఉపయోగించలేదు. రాజులకు రాజు గాడిదను ఉపయోగించడం అవమానమే అయినా గాని; అక్కడె, అప్పుడే దేవుడిచ్చు మహా మహిమ ముందు ఆ అవమానమును లెక్క చేయలేదు. అందుకే తన ప్రణాలికలో గాడిదను సిద్దపర్చిరి. లేఖనములలో ప్రవక్తలు వీటినే గుర్తుగా భావించారు. అది ఇక్కడ నెరవేరింది. (అపొస్తల కార్యములు 4:27,28)
యూదా దేశంలో పెద్దలు కలిసి ఒకరిని రాజుగా ప్రకటిస్తే ఆయనను రాజుగా అభిషేకించినట్లే. ప్రభువు పిల్లలను ఎన్నుకున్నారు కాబట్టి, వారంతా ఆయనను దావీదు వారసునిగా స్తుతించినను ఆయన ఈ లోక రాజ్య స్థాపనకు రాలేదని ప్రదర్శించినారు.
- విశ్వాసి గమనించవలసిన విషయములు:
- గాడిద/వాహకము: అభయాని అనే ఈ హాని లేని యుద్దంలో దైవ లక్షణాలను ప్రదర్శించడం ప్రధానం గాని ఎంత పెద్ద వాహనము/వాహకము కలిగియున్నాము అనేది కాదు. దేవుడు విశ్వాసి/సువార్తికునికి ఇచ్చే మహిమ ఎంతోగొప్పది. అందుకే నిజమైన దైవజనునికి సరైన వాహనములు ఉండవేమో! వధువు సంఘమే వారి వాహకము.
- దేవుడిచ్చిన మిషనులో(పనిలో) ఉన్నపుడు లోకము అవమానపర్చినను, అదే సమయంలో దేవుడిచ్చు మహా మహిమను గుర్తెరిగి సాగిపోవడమే విశ్వాసి లక్షణం. అవమానము, మహిమ; ఈ రెండూ ప్రక్కపక్కనే ఉంటాయి. మహిమను చూచి నడిచినట్లయితే మనకు విజయము, మహా మహిమలోనికి ప్రవేశిస్తాము. అవమానమును దృష్టిలో ఉంచితే ఓటమి, నిరాశ, బాధ, నరకము. కావున విశ్వాసి దేవుని సంగతులు మాని, ఇతర విషయాలను పదే పదే ప్రస్తావనలో ఉంచితే ప్రమాదపు అంచున ఉన్నట్లు గుర్తించాలి.
- ప్రభువు సేవను చిన్నవారు, ఎన్నికలేనివారే మోస్తారు. వారిని ప్రేమించి ఘనపర్చుము. దేవుడు తగిన ఫలమును దయచేయును.
శ్రమ ధ్యానము:
=> రాజాధి రాజు, ప్రభువులకు ప్రభువు, పరలోకమునుండి అరుదెంచిన ఆ దైవ కుమారుడు, ఈ లోకములో అనేక అవమానములలో భాగముగా గాడిదను ఉపయోగించుట=> దేశం మొత్తం యేసుక్రీస్తును ప్రభువుగా కొనియాడుతుండగా, యాజకులు/రాజులు/అధికారులు మాత్రం గుర్తించలేకపోవడం.
=> ఇప్పుడు కూడ ప్రభువైన యేసు క్రీస్తుకు సిలువ శ్రమ ఏదనగా, మన కళ్ళ యెదుటె దైవ కార్యం కనిపిస్తున్నా, దైవ రాజ్య ఫలములను అనుభవిస్తున్నా, ఆయనను గుర్తెరగ లేని కఠిన హృదయం. ఆయనకు ఇవ్వవలసిన మహిమ స్థాన స్తుతిని పూర్ణమనసుతో అర్పించలేని మనసు. కఠిన హృదయులు (హేడెస్ లో పరలోకం, నరకం చూపించి, దేవుని చూపించినా గాని మారని వారు) మాత్రమే నరకానికి వెళ్తారు. కావున మన కఠిన హృదయమును దేవునికి సమర్పించి ఆయననే స్తుతించే మనసు తెచ్చుకొందుము గాక!
పరిశీలన : మన ఉద్దేశ్యము, ఆలోచన, ప్రవర్తన మంచిదె కావచ్చు కాని మన ప్రదర్శన ఈ లోకం ముందు ఏవిధంగా ఉంది? దేశములో నీతి, శాంతి, సమాధానము నెలకొల్పే మాటలు మనలోనుండి వస్తున్నాయా? కుటుంబములో ప్రేమ, ఆప్యాయత పెంచే చేతల శిలువ మోయుచున్నామా! సంఘములో సంతోషము, సమృద్ధి కలుగజేయుటకు ఓర్పు, సహన సిలువ మోయుచున్నామా?
ప్రార్థన: పరిశుద్ధుడవైన ప్రభువా! నీ పరిశుద్ధాత్మను దయచేసినందుకు వందనములు. నీవు మాకిచ్చిన నీ దైవ లక్షణములు మరియు ఆత్మ ఫలములను సరైన రీతిలో సాక్ష్యమిచ్చుటకు మాకు జ్ఞానమును దయచేయుమని ప్రభువైన యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రీ! ఆమేన్.
Social Presence
Share your thoughts and suggestions
-
Like this page on Facebook
-
Tweet this page on Twitter
Tweet -
Recommend this website on Google +