Meeting Updates
Latest Progress
పనులు జరుగుచున్నవి. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడియున్నవి.
ప్రభువా! సభల నిమిత్తము చేయుచున్న అన్ని ప్రార్థనలు యేసు నామములో సమర్పించుకొనుచున్నాము పరమ తండ్రీ! ఆమేన్.
అందరికి ఉచిత భోజన సదుపాయము కలదు.
మంచినీరు అందుబాటులో ఉండును.
పందిరి, స్టేజ్, లైటింగ్... పనులన్నిటి కొరకు, పనిచేయుచున్నవారి కొరకు ప్రార్థించండి.
దూర ప్రాంతములనుండి వచ్చువారి ప్రయాణ జాగ్రత్తల కొరకు,
వంట సామాగ్రి, భోజనశాల, వంటలు చేయువారు, సహకరించువారి కొరకు,
భోజనములు వడ్డించువారు, శుభ్రము చేయువారి కొరకు,
అందరి ఆరోగ్యము కొరకు, చురుకుగా పాల్గొనుటకు ప్రార్థించుదము.
పాప ప్రేరేపణ గలవారలారా! దేవుడు మీకు పాప విసర్జన శక్తినిచ్చి మిమ్మును దీవించును గాక!
అనారోగ్యవంతులారా! దేవుడు మీకు ఆరోగ్యమిచ్చి మిమ్మును దీవించును గాక!
లేమిగల వారలారా! దేవుడు మీకు కలిమినిచ్చి మిమ్మును దీవించును గాక!
బిడ్డలులేని వారలారా! దేవుడు మీకు శిశుదానము చేసి మిమ్మును దీవించును గాక!
భూత పీడితులారా! దేవుడు మీకు విముక్తిని దయచేసి మిమ్మును దీవించును గాక!
మందమతులారా! దేవుడు మీకు నిర్మలమైన జ్ఞానమిచ్చి మిమ్మును దీవించును గాక!
శత్రుబాధగల వారలారా! దేవుడు మీకు శత్రు బాధలేకుండా జేసి మిమ్మును దీవించును గాక!
అన్యాయము పాలగుచున్న వారలారా! దేవుడు మీకు న్యాయమనుగ్రహించి మిమ్మును దీవించును గాక!
బుణబాధగల వారలారా! దేవుడు మీకు బుణబాధ తీర్చి మిమ్మును దీవించును గాక!
యుక్త సమయమున పెండ్లి సమకూడని వారలారా! దేవుడు మీకు మంచి జత నేర్చరచి మిమ్మును దీవించును గాక!
కుటుంబ కలహములుగల వారలారా! దేవుడు మీ కలహములను ఆపుజేసి, ఐకమత్యత కలిగించి మిమ్మును దీవించును గాక!
నానా విధములైన చిక్కులు గలవారలారా! దేవుడు మీ చిక్కులను విడదీసి మిమ్మును దీవించును గాక!
దైవభక్తి కుదరని వారలారా! దేవుడు మీకు మనో నిదానమును, స్థిరభక్తావేశమును పుట్టించి మిమ్మును దీవించును గాక!
చదువరులారా! దేవుని యెడల అపనమ్మిక, భీతి, విసుగుదల, తొందరపడు గుణము, అనాలోచన, చింత, నిరాశ, మొదలగునవి మీలోనికి చేరకుండునట్లు దేవుడు మిమ్మును దీవించును గాక!
జీవాంతమందు మీకు మోక్షభాగ్యము లభించునట్లు దేవుడు మిమ్మును దీవించును గాక!
ఆమేన్ .
పనులు జరుగుచున్నవి. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడియున్నవి.