Categories: Bible Mission

బైబిలుమిషను మహాసభలు

పరిచయం:
ప్రపంచంలో ఎక్కడ ఉన్నా జనవరి 27, 28, 29వ తేదీలలో ప్రతీ బైబిలుమిషను విశ్వాసి మనసు మీటింగ్స్ మీదనే ఉంటాయి. అనేక లక్షల మంది ప్రత్యక్షంగా పాల్గొంటారు. పాల్గొనలేనివారు మరి ఎక్కువ ఆసక్తిగా ఆన్‌లైన్, ఎలెక్ట్రానిక్ మీడియా ద్వారా పాల్గొంటారు. ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మొత్తం మీద 30లక్షలమంది కంటే ఎక్కువగా ఈ మూడురోజులు దైవసన్నిధిలో గడుపుతువుంటారు.

ప్రభువైన యేసుక్రీస్తు మొదటి రాకడ కేవలం ఈ భూగోళంలోని మానవుల రక్షణ కొరకే కాక; ఆకాశ, వాయుమండల అంధకార శక్తులను అంతమొందించి మనకు విజయమిచ్చుటకు వచ్చెను. ఆయన వాక్యము సర్వ సృష్టికి ప్రకటించుటకు సంఘములు స్థాపింపబడెను. విశ్వాసికి ఉన్న ఆత్మ పనులు వేరు, సంఘమునకు గల ఆత్మ కార్యములు వేరు. అదేవిధముగా బైబిలు మిషను సభకు దేవుడు ఒక ప్రత్యేకమైన ఆత్మను అనుగ్రహించెను. ఈ ఆత్మచేయు ప్రత్యేక పని ఏదనగా “ప్రతివాని మదికి రాకడద్వని వినిపించి ఇతర జనులను కూడ రాకడకు సిద్ధము చేయుట” అను దైవ కార్యము.

బైబిలుమిషను సభకు మరియొక పేరు వధువుసభ. అసలైన మగబిడ్డకు జన్మ నిచ్చుటకు ప్రసవవేదన ఇప్పటికే మొదలైనది. వధువుసభ అరుపులు మహాసభ వినగలిగే ఏకాంత హృదయమును దేవుడు దయచేయునుగాక!

సభలో ప్రయాస ఉన్నది. సభలు మహిమ కరముగా జరుగుటకు విశ్వాసి చేసినది దేవుడు తనకన్నట్టుగానే భావించును. పందిరులు ఎన్నయినను వధువుసభ యొక్క ఆత్మ ఒక్కటే.

సభల అంతరంగ సృష్టి:
సభలు చూడడానికి వచ్చిన ఇతరులు, సభల బయటి ప్రాంగణంలో చిరువ్యాపారులు మొదలగు 50 వేలనుండి లక్షవరకు బయట గందరగోళంగా తిరిగే జనాలను పక్కనపెడితే, అసలైన విశ్వాసులకు కలిగే అనుభవమును గురించి ధ్యానిస్తే ఈ విషయాలు సాక్ష్యమిస్తాయి.

1. సభలో సభ: విశ్వాసి ఈ మహాసభలలో లీనమై ఉండగా వధువుసభ లో ఉన్నశ్రమ, సహనము, వేదన..లను రుచి చూపించడమే గాక దానికి తగిన ఆధరణ, మహిమ అంతస్థు ఏదోవొక రీతిగా అందించబడతాయి.

2. సృష్టిలో సృష్టి: బైబిలుమిషను గ్రౌండ్‌లో అంతకుముందు ఏ పందిరి ఉండదు.  ఈ 3రోజులకోసం బహు ఖర్చుతో సభా వాతావరణం కల్పిస్తారు. విశ్వాసి ఖాళీగా, ఏ ఆకాంక్ష లేకుండా వచ్చినా, అనేక అవసరాలతో వచ్చినాగాని ఈ సభలలో దేవుడు అంతరంగ విశ్వాసము, ఆశీర్వాదము, దీవెనను ప్రతీ హృదయములో సృష్టించి నూతనపరచడంతో విశ్వాసులు ఆనందముతో ఈ సంవత్సరాన్ని కొనసాగిస్తారు.

దేవుని సృష్టిని అంగీకరించుచున్నావా?
క్రైస్తవ జీవితం నిరంతర సృష్టి. మహాసభ నుండి వధువుసభకు, రక్తమాంస శరీరమునుండి మహిమశరీరమునకు చేర్చే విశ్వాస ఫ్యాక్టరీ ఈ మహాసభలు. దేవుడు తన అమూల్యమైన ప్రణాళికను అందించే ఈ వాతావరణంలో ఒక్క క్షణం ప్రార్థించి ప్రభువు అందించే నూతన హృదయమును అందుకొనుటకు సన్నిధిలో కనిపెట్టి దేవుడు అనేక రెట్లుగా అందించబోవు నూతన సృష్టికి వారసులమైయుందుము గాక!

షారోను పొలము వంటి మహాసభలో విశ్వాసులను పుష్పాలు మొలిచిన పుష్ప సంఘమైన సభను గూర్చియు, సభాధిపతియైన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చియు నిరంతరము వినుచు, చెప్పుచున్న శుభవార్తలోనే నిజమైన సుఖము కలదు.

షరా! ప్రకటన పరమగీతములలో ఇంత విషయము దాగి ఉన్నదా అని అయ్యగారి ప్రసంగములను మరలా సంఘములలో ధ్యానించు చుండెడి వారు.  సభలో ప్రభువును చూచినాము అని పూర్వము సాక్ష్యమిచ్చెడి వారు. నేడును ఈ సభల ద్వారా కలిగిన దైవ దర్శనము ప్రతీ విశ్వాసిలోను నాటబడును గాక!

దేవుడు తన దైవ లక్షణమును ప్రతీ విశ్వాసికి అద్దును గాక! ప్రపంచ వ్యాప్తముగా బైబిలుమిషను బోధల పరిమళాన్ని, విశ్వాస జీవనశైలిని పరిచయం చేయుటకు ఆయత్తపడుదము గాక!. దేవుడు తన ప్రణాళికను తానే స్వయముగా ఒక్కొక్కరికి ప్రత్యక్షపరుచునుగాక! ఆమేన్.

దేవుడు అనుగ్రహించిన దైవదూత సభలకు కాపుదలగా ఉండును గాక!

All the best for Bible Mission Meetings

admin

Share
Published by
admin

Recent Posts

Seven steps to increase the faith

ఆత్మీయ స్వస్తత Seven steps to increase the faith 1. Read the promises in bible: Bible…

4 years ago

మహాసభలు 2021

ఆదికాండము 2:1. ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. ఒక్కొక్కరి అధికారమును బట్టి, జ్ఞాన పరిధిని బట్టి విషయపరిజ్ఞానముండును.…

4 years ago

సిలువ సైన్య సమూహము (hosting the cross)

ఆదికాండము 2:1 లో సర్వము లిఖితమైయున్నది. ఆకాశములు, భూమి, వీటిని నడిపించు సమస్త సైన్యసమూహము ఈ వచనములో గలవు.ఇంగ్లీష్‌లో హోస్ట్…

5 years ago

నీ రాజధాని ఎక్కడ?

మొట్టమొదటి రాజధాని ఏదేనును మానవుడు కోల్పోయిన తర్వాత దేవుడు బేతేలును రాజధానిగా బైలుపర్చి ఇశ్రాయేలును దర్శించెను. బేతేలు పాడైపోయినపుడు, దేవుడే…

5 years ago

App Help

6 years ago

Mission of 2019

2019 is a year of fruitful life. Every Christian supposed to exhibit the spiritual fruits.

6 years ago

This website uses cookies.