ఆదికాండము 2:1. ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను.
ఒక్కొక్కరి అధికారమును బట్టి, జ్ఞాన పరిధిని బట్టి విషయపరిజ్ఞానముండును. ఉదాహరణకు మహాసభల కన్వీనర్ దృష్టిలో మహాసభ ఏర్పాటులు అనగా “స్థలము సిద్దం చేయుట, పందిరులు వేయించుట, భోజన సదుపాయములు, బస ఏర్పాటులు, సభల ప్రోగ్రాం రెడీ చేయుట…మొదలగు అనేక భారమైన పనులన్నీ ముగించి; వచ్చిన భక్తులందరిని హోస్ట్(ఆతిధ్య సదుపాయములు) చేయగల యంత్రాంగమును సిద్ధము చేయుట”.
ఆదికాండం 2:1 లో రెండు విషయములు ఇమిడి ఉన్నవి. రెండు ఒకదానికి ఒకటి విరుద్ధమైనవి. కాని ఒకటి మరొకదానిని నిరూపించుచున్నది.
సభలను గూర్చి రెండు వ్యూస్ తీసుకుంటే
1. కన్వీనర్ సభల ఏర్పాటు సమస్తమును నిర్వహించుట
2. విశ్వాసి సభలో మంచి వాక్యము విని, తృప్తిగా భోజనం చేసి ఆనందముతో తిరిగివెళ్ళుచుట.
ఇక్కడ కన్వీనర్ పని వేరు, విశ్వాసి పని వేరు. కాని సభ ఒక్కటే. సభల అంతరంగ పరిధిని ప్రతి బైబిలుమిషను విశ్వాసి అందుకోగలరు.
1. దేవుడు ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్తమును నిర్వహించగల(హోస్ట్) సమూహమును సంపూర్తి చేయుట
2. తెలుగు ట్రాన్స్లేషన్ ప్రకారము ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్తసమూహమును సంపూర్తి చేయుట.
సభల విషయానికి వస్తే, విశ్వాసి మంచి వాక్యము, భోజనము అందుకొంటే, కన్వీనర్ ఈ సదుపాయములను సంపూర్తి చేసిరని అర్థము.
పై పరిచయముతో సభలవిలువను గమనిస్తే, సభ అనగా అన్ని సంఘములను హోస్ట్ చేయగల సైన్య సమూహము. దేవుడు బైబిలు మిషనును అందులోగల సమస్త వాగ్ధానములను, మర్మముల వివరములను సంపూర్ణముగా వివరించెను. ఆదిసంఘమైన రోమన్ కేథలిక్, బైబిలును వెలుగులోనికి తెచ్చిన లూధరన్ మిషను, బైబిలును అభ్యసించుచున్న అనేక మిషనులకు ఆఖరి పాఠ్యాంశముగా దేవుడు బైబిలు మిషనును బైలుపర్చెను.
బైబిలు మిషను పరిధిలోని కొన్ని అంశములు
1. ఏడు లోకముల పాఠము, ఏడు మెట్ల ప్రాక్టీసు తో తెలుసుకొనుట
2. దైవ సన్నిధిలో దేవునితో సంభాషించుట
3. ఈ రాకడ సమయములో ప్రపంచ సంఘములకు దైవ వాక్య కార్యములను నిరూపించుట
4. క్రీస్తు ప్రభుని వాక్యమైన బైబిలు మాటలు, దైవమత శక్తి, క్రైస్తవ జీవన శైలిని క్రమమైన రీతిలో అభ్యాసములో పెట్టుట
5. దైవాకాంక్ష కలిగిన అన్ని మతములకు, సంఘములకు ఆహ్వానమందించి దైవ మర్మములను వివరించుట మొదలగు గొప్ప కార్యములు.
దేవుడు స్థాపించిన మిషనులోనికి కొందరు భక్తులు అన్నీ వదులుకొని వచ్చివేసి మిషనును కట్టుకొనిరి. సమస్తమును వదులుకొని మిషనులోనికి వచ్చివేసిన భక్తుల పిల్లలకు సమస్త సదుపాయములు దేవుడు ఇచ్చివేసెను. ఆత్మపూర్ణులైన భక్తులు మిషను ఉనికి పట్టుకు పోవుచున్నారు.
A. సభల బహిరంగ రూపము: అనుకూల ఘటనలు
వీరు సభలలో లీనమైన వారు. మిషను పని.
B. అసందర్భ ఘటనలు:
వీరికి వ్యాపారం బాగుగా జరిగితే సభలు ఘనంగా ఉన్నట్టు … ఇది అసంధర్బ విష్లేషణ.
C. ప్రతికూల ఘటనలు:
వీరు అసలు కాంటెక్ష్ట్‌లో లేనివారు. వీరి వెనుక వెళ్ళేవారు “పెండ్లి భోజనం మానేసి పెంట దగ్గర పారేసిన విస్తర్లకోసం కొట్టుకొని కరుచుకుంటున్న కుక్కలాట చూచుటకు పెరిగెత్తు పిల్లల” వంటివారు.
కాబట్టి బైబిలుమిషను విశ్వాసి ప్రభువు మహిమను, మిషను పరిధిని, ప్రణాళికను, ప్రభోధమును గుర్తించగల ఆత్మను కలిగి ప్రభువు పనిలో నిమగ్నమై ముందుకు సాగు కృప అందరికి దయచేయును గాక.
ప్రార్థన: ప్రభువా! సర్వమతముల వారికి నీ శుభవార్త అందించుము!
మత తర్కములు, మిషను వివాదములు, తప్పుడు బోధలు, పాపశోధనలు, పాపమువలన కలుగు నష్టములు వీటినుండి మమ్మును తప్పించుము.
అన్ని కార్యములు మీ మహిమార్థమై జరుగునట్లు మీ కృపను అనుగ్రహించుము. ఆమేన్.
ఆత్మీయ స్వస్తత Seven steps to increase the faith 1. Read the promises in bible: Bible…
ఆదికాండము 2:1 లో సర్వము లిఖితమైయున్నది. ఆకాశములు, భూమి, వీటిని నడిపించు సమస్త సైన్యసమూహము ఈ వచనములో గలవు.ఇంగ్లీష్‌లో హోస్ట్…
మొట్టమొదటి రాజధాని ఏదేనును మానవుడు కోల్పోయిన తర్వాత దేవుడు బేతేలును రాజధానిగా బైలుపర్చి ఇశ్రాయేలును దర్శించెను. బేతేలు పాడైపోయినపుడు, దేవుడే…
పరిచయం:ప్రపంచంలో ఎక్కడ ఉన్నా జనవరి 27, 28, 29వ తేదీలలో ప్రతీ బైబిలుమిషను విశ్వాసి మనసు మీటింగ్స్ మీదనే ఉంటాయి.…
2019 is a year of fruitful life. Every Christian supposed to exhibit the spiritual fruits.
This website uses cookies.