రక్షణ వార్తావళి

⌘K
  1. Home
  2. Docs
  3. రక్షణ వార్తావళి...
  4. నాలుగు కంచెలు

నాలుగు కంచెలు

కీర్తనలు 20: 1-9; 65:11.

త్రియేక దేవుని యొక్క దీవెన మాత్రమేగాక పరలోకముయొక్క దీవెన కూడా మీకు కలుగునుగాక! ఆమెన్.

                                     దైవ వాగ్ధాన జయము 

1. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. నిర్గమ, 15:26.

2. మనము అడుగువాటన్నిటి కంటెను, ఊహించు వాటన్నిటికంటెను 

అత్యధికముగా చేయ శక్తిగల దేవుడు. ఎఫెసీ, 3:21.

3. దేవునికి సమస్తమును సాధ్యము. మత్తయి 19:26.

4. ప్రార్ధన చేయునపుడు మీరు అడుగుచున్నవాటి నెల్లను పొంది యున్నామని నమ్ముడి. మార్కు 11:29.

5. మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక, మత్తయి 9:29.

6. నా నామమును బట్టి మీరు నన్నేమి అడిగినను నేను చేతును. యోహాను 14:14.

7. అడుగుడి మీకియ్యబడును. మత్తయి 7:7.

8. నీ గదిలోనికి వెళ్ళి తలుపువేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్ధన చేయుము. మత్తయి 6:6.

నాలు కంచెలు ఏవనగా:

1. మారుమనస్సు అనే కంచె.

2. ప్రార్ధన అనే కంచె.

3. నమ్ముట అనే కంచె.

4. స్తుతి అనే కంచె.

  ఒక బోర్డును తలంచుకొనుడి. అందులో పైన మనిషియు, క్రింద సైతాను ఉన్నారు. సైతాను పైకివెళ్ళి మనిషిని నాశనము చేయుటకు పూనుకొన్నాడు. అయితే ఆ మనిషి యెదుట రెండు గుంపులున్నారు. 1. మారుమనస్సు పొందుట 2. ప్రార్ధన చేయుట. 3. నమ్ముట 4. స్తుతించుట. ఈ ఈ నాలుగును మనిషి చేసేవి. ఇవి మనిషి చేసే ప్రయత్నములు. యోబు గ్రంధము లో ఏమున్నదనగా సైతాను దేవుని యొద్దకు వెళ్ళి నీవు యోబు చుట్టు కంచె వేసినావు గనుక అతడు నాశనముకాడని అన్నాడు.  

  ఇంకా సాతానన్నదేమనగా నీవు యోబు చుట్టువేసిన కంచె తీసివేయి. అప్పుడు యోబు ఎలాగుంటాడో తెలియునని దేవునితో చెప్పెను. కంచె తీసివేసిన యెడల అప్పుడు యోబు యొక్క భక్తి నిలిచి బలపడును. కాబట్టి దైవజనులు, విశ్వాసులు ప్రార్ధన కంచెను, మనచుట్టు వేసికొన్న యెడల సాతాను ఆ కంచెలు దాటి రాకుండ ఉండును. మారుమనస్సు, ప్రార్ధించుట, నమ్ముట, స్తుతించుట అను ఈ నాలుగు కంచెలు సాతాను దాటివేస్తేనే గాని మనలను నాశనము చేయలేడు. ఈ నాలుగు కంచెలు సాతాను దాటివచ్చిన యెడల భక్తుడవైన నీవు నాశనమవుతావు. ఈ నాలుగు కంచెలు సరిగా ఉన్నట్లయితే సాతాను దాటి రాగలడా? దాటి రాలేడు.

1. మారుమనసు అనే కంచె:- నీవు మారుమనసు పొందినట్లైతే అతడు మారుమనస్సు అనే కంచెను దాటిరాగలడా? దాటి రాలేడు.

2. ప్రార్ధన అనే కంచె:- భక్తులు ప్రార్ధన చేయుచునుంటే సాతానుడు ఆ ప్రార్ధనకంచె దాటిరాగలడా? రాలేడు.

3. నమ్ముట అనే కంచె:- దేవునిని గురించి గొప్ప విశ్వాసము భక్తునికి ఉన్నది గనుక దానిని దాటి సాతానుడు రాలేడు.

4. స్తుతి అనే కంచె:- దేవా! నా ప్రార్ధన ఆలకించినావని స్తుతించినట్లయితే, సాతానుడు ఆ స్తుతికంచె దాటి రాలేడు.

నేను సుళువుగా దాటగలను, నాకు ఉపాయములున్నవని సాతాను అనుచున్నాడు. అందుకు గల కారణము; మనిషివైన నీవు వేసిన కంచెను నేనెందుకు దాటలేను అనునదియే.

  1. మారుమనసు అను కంచె దాటుదును: భక్తుడు “ప్రభువా! నేను పాపిని, క్షమించుము. నేనికమీదట కుదురుగా ఉందునని అనును. అప్పుడు సాతాను తన మనస్సులో మనిషి జన్మపాపి. మనిషి దేవునియెదుట ఒప్పుకొన్నట్లు నిలుచునా? ఈ దినము పాపి కుదురుగా ఉంటాను అంటాడు. రేపటి దినమున పాపములో పడి, సిగ్గుతో పడినానని అనలేడు. జాగ్రత్తగా వుందును. అట్లుండుటకు ప్రయత్నము చేసెదనని అనునుగాని, పాపములో పడినాను గాన క్షమింపుమని అనడు, గనుక యిప్పుడు సాతాను కంచె దాటగలడా? లేడా? దాటగలడు.
  2. ప్రార్ధనా కంచెను దాటుదును: మొదటి కంచెలోని మాటలు భక్తుని మాటలా? దేవుని మాటలా? ఇవి మనిషి మాటలే గనుక దాటినాడు. మొదటి ప్రార్ధన: ప్రభువా, సైతానును జయించుటకు శక్తి దయచేయుమని అనును. రెండవ ప్రార్ధన: నాకు అన్నవస్త్రములు దయచేయుమని అనును. మూడవ ప్రార్ధన: వ్యాధులు కుదుర్చుమని అనును. నాలుగవ ప్రార్ధన: నీ సంగతులు గ్రహించునట్లు నాకు జ్ఞానము దయచేయుమని అనును.

ఐదవ ప్రార్ధన: నీ సంగతులకు సమ్మతించేటందుకు మంచి మనస్సాక్షిని దయచేయుమనును. ఈ అయిదు కలిపిన అది ప్రార్ధన కంచె అగును. మారుమనసు పొందుటకు మనిషి ఈలాగు చేయవలెనని బైబిలులోనే యున్నది. ఆలాగున్నదే మనిషి చేసినాడు. ఈలాగున బైబిలులో నున్నది చేసినప్పటికిని ఈ కంచెను కూడా సాతానుడు ఏలాగు దాటగలడు? మనిషిదే లోపము గనుక దాటినాడు. శక్తికొరకు, అన్నవస్త్రముల కొరకు, జ్ఞానము కొరకు ప్రార్ధించినాడు జ్ఞానముకొరకు ప్రార్ధించినందు వలననే బైబిలు చదువుకొనుటకు వీలు కలిగినది. విద్యార్ధులు కొందరు పరీక్షలలో ఉత్తీర్ణులగుచున్నారు గాని కొందరు అగుటలేదు. ఆలాగుననే ఇది కూడా మనిషివేసిన కంచె గనుక సాతాను సుళువుగా దాటగలుగుచున్నాడు. గనుక ప్రార్ధన సరిగాలేకపోతే సాతానుడు ఈ కంచెను సుళువుగా దాటగలడు.

 3. నమ్ముట అను కంచె దాటుదును: భూమ్యాకాశములను కలుగజేసిన దేవుని నమ్ముచున్నాను      అని ఆదివారపు     ఆరాధనలో అనును. జగదైక కుమారుని నమ్ముచున్నానని మనిషి అనుచున్నాడు. ఇవి మనిషి బైబిలులో ఉన్నదానిని బట్టి అనుచున్నాడు. ఎంత బైబిలునుబట్టి అనుచున్నప్పటికిని ఓమనిషీ, నీవు మోక్షానికి వెళ్ళెదవా? లేక నరకమునకు వెళ్ళెదవా? అని అడిగిన బింకముగా వెళ్తానని అనును గాని ఆలాగు ఆదివారపు ఆరాధనలో చెప్పి, సోమవారము శోధన రాగానే అపనమ్మకస్థుడై నేను మోక్షమునకు వెళ్ళునది, నరకమునకు వెళ్ళునది ఆ దేవునికే తెలియునని అనును. ఈలాగు సాతానుడు ఈ కంచెను కూడ దాటిపోవును. దీనికి కారణము మనిషియొక్క అపనమ్మిక.              

 4. స్తుతికంచెను దాటుదును: మనిషి "ఓ ప్రభువా! నా వ్యాధి తీసివేసినావు గనుక స్తోత్రములు అనును. అలాగనుట మంచిదే. ఇది బైబిలులోని వాక్యానుసారముగా అన్నాడు. అప్పుడు బలముగా స్తుతించినాడు. ఈలాగు స్తుతి చేసి, బుధవారమునాడు అప్పుడు బలముగా స్తుతించినాడు. ఈలాగు స్తుతిచేసి, బుధవారమునాడు బాగుగానే యున్నాడు గాని, గురువారమునాడు మరలా జబ్బుపడిన యెడల ప్రభువా! నీవు నన్ను యింత బాగుగా స్వస్థపరచి ఏమిలాభము? ఆలాగనడు.  తిరిగి వ్యాధి వచ్చినది: అని విసిగి తండ్రిని ప్రశ్నించిన యెడల సైతానుకు చోటు, సందు ఇచ్చినట్లే. మొన్న బాగుచేసిన తండ్రి ఈ దినమున కూడ బాగుచేయునని స్తోత్రము చెల్లించిన బాగుండును గాని ఆలాగనడు. మనిషి విసుకొనును. గనుక సాతాను సుళువుగా ఈ కంచె అనగా స్తుతి కంచె దాటివేయును. ఈలాగు మనిషి నాలుగు కంచెలు వేసినా సాతాను వాటిని దాటివేసెను. ఈలాగు ఎన్ని కంచెలు వేసినను, ఇవన్నీ మనిషి కంచెలేకదా అని దాటును. అసలు కంచె స్తుతి కంచె. గనుక  స్తుతి కంచె గట్టిగా ఉన్నచో పై మూడుకంచెలు గట్టిగా ఉండును. గనుక మనమందరము ఈ స్తుతికంచెకు పురి పెట్టవలసియున్నది. సైతానువచ్చి మనలను పాపము చేయుమని  బాగా ప్రేరేపించును. మనము స్తుతి చేసినట్లయితే జయము పొందగలము. ఇది యేసురక్తమునకు జయము గాని మనకు జయమేది?

ఆలాగు కాకుండ దేవా! నా మేలు కొరకు ఈ పాపము చేయించే శోధన నీవు రానిచ్చావు. ఏదైనా, నీసెలవు లేకుండ రాదని స్తుతించవలెను. అప్పుడు మనకు జయము వచ్చును. భక్తులందరు ఈ స్తుతి చేసారా? మీరు చేసినారా? అయితే కొందరికి తెలియదు. తెలిసినా ఇట్టి స్తుతి చేయలేరు. గనుక సైతాను దాటినాడు. సరిగా స్తుతి పురి చేయలేదని, మనిషి వేసిన కంచె అని సైతాను దాటెను. మనిషి వేసిన కంచెలు సాతాను దాటగలడు.మనిషిచేత పాపము చేయించుటకు దేవుడు సాతానుకు సెలవిచ్చిన యెడల మనిషి స్తోత్రము చేయగలడా? పండును తినమని అవ్వను సైతాను శోధించినప్పుడు, దేవా! నీవు సైతానుకు ఈలాగు సెలవిచ్చినావని వందనములు చెల్లించిన యెడల పాపములో పడకపోవునుగాని, ఆలాగు అననందున అక్కడ కంచె దాటి మన వరకు కుమ్మరము అవ్వ తెచ్చినది. ఇంకా కష్టము వచ్చిన స్తుతి చేయండి.వ్యాధి పోకపోయిన స్తుతిచేయండి.అన్ని కేసులలో మనిషి వేసిన కంచెలు బలముగా లేనందున సాతాను యిన్ని ఏళ్ళుగా దాటుచు వచ్చెను. సంసార కూపము ద్వారా పడిపోకూడదు. లోకములో యుండుటయే అసలు సంసారము. పాపములో పడిపోవువాడు బలవంతుడా? బలహీనుడా? భక్తుడు బలవంతుడు. బలహీనుడైనవాడు పడిపోవును. స్థిరుడు కానందున పడిపోవుచున్నాడు. భక్తుడు, పడినా లేచును. మనిషి బలవంతుడైన యెడల నేరములోనుండి లేచును. పాపమెరుగని అవ్వమ్మే పడగా మనము పడిపోమా? దేవుడు సైతానునకు ఎక్కువ బలమిచ్చెనా? భక్తునికి ఎక్కువ బలమిచ్చెనా? భక్తునికే. ఏలాగనగా

  1. శత్రుబలమంతటిమీద మీకు సర్వాధికారమిచ్చియున్నాను.
  2. సాతానును శిఘ్రముగా మోకాళ్ళక్రింద చితుక త్రొక్కింతును.
  3. దేవునికి భయపడి అపవాదిని నెదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. సాతానుడు పారిపోయేవాడు గనుక పిరికివాడు. సాతానుడు నాలుగు కంచెలెందుకు దాటెననగా అవి మనిషి వేసిన కంచెలు గనుక! అవి వాక్యానుసారముగా వేసినట్లయితే వాడు వానిని దాటలేడు.

ప్రార్ధన:- ఓ త్రియేకదేవా, ఈ మాటలు బోర్డుమీద యున్నట్లుగా మా హృదయములలో కూడ ముద్రించుమని వేడుకొనుచున్నాము. ఆమెన్

Please follow and like us:

How can we help?

Leave a Reply