మొట్టమొదటి రాజధాని ఏదేనును మానవుడు కోల్పోయిన తర్వాత దేవుడు బేతేలును రాజధానిగా బైలుపర్చి ఇశ్రాయేలును దర్శించెను.
బేతేలు పాడైపోయినపుడు, దేవుడే స్వయముగా స్థాపించిన సువార్త అను సీయోను రాజధానిలో ఇప్పుడున్న అన్ని దేశములు నూతన రూపము దాల్చి మనుగడ సాగించుచున్నవి.
రాకడకు చివరి సూచనయైన “యెరూషలేము ఇశ్రాయేలు రాజధాని” అనునది కూడ ఈమద్యనే నెరవేరినది.
సువార్త ఫలములు అందుకొన్న దేశములు సీయోనుకు పోటీగా బబులోను(ఆర్ధిక,ఎంటర్టైన్మెంట్,టెక్నాలజీ మార్కెట్) అను మహా రాజధానిని నిర్మించుచున్నవి.
అయితే ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయమేమిటంటే, “నూతన యెరూషలేము అను దేవుని రాజధాని”, సువార్త(సీయోను) లోనుండి మర్మముగా నిర్మించబడుచున్నది.
నూతన యెరూషలేమును గుర్తించలేని విశ్వాసికి పరలోకపు విందు లేదు. నూతన యెరూషలేము అనగా వధువు సంఘము. వధువునకు గల అలంకారము శ్రమలలో దేవుడిచ్చిన విజయములే. శ్రమలేకుండా విజయములేదు, విజయము లేకుండా మహిమలేదు..
సువార్త నిమిత్తము అన్యాయముగా శ్రమలు అనుభవించుచున్న వారిని గూర్చి దేవునికి ప్రార్ధించి, వధువును పరామర్శించుట దేవుని చివరి రాజధానియైన నూతన యెరూషలేమును (వధువు) కట్టుటయే.
వధువును చూచి పరిహసించువాడు పెద్ద పాష్టరైనను వారి జీవితము చివరికి అంధకారమే.
మన దృష్టి బబులోను మీద నుండి వధువు అను రాజధానికి మారును గాక!
ఇకమీదట సువార్త నిమిత్తము హింసింపబడుచున్న “నూతన రాజధానియైన వధువు” నకు విశ్వాసులద్వారా దేవుడు ఆధరణ కలుగజేయును గాక!
ఈ చివరి రోజులలో వధువు సంఘము ద్వారా దేవుడు తన ప్రజలను రక్షించుచున్నాడు. కావున శ్రమలను అలంకారాముగా ధరించుకొనుము. దేవుడు తప్పక మహిమ పర్చును.
మరనాత.