I. దైవసన్నిధి 4 భాగములు
ఏకాంత సన్నిధి
ధ్యాన సన్నిధి
కూట సన్నిది
ఏడుగురు సన్నిధి కూటము
II. 1. దేవుని సన్నిధి నరులయొద్ధకు వచ్చుట
- నరులు దేవుని సన్నిధికి పోవుట
III. యద్భోకు రేవు – దైవసన్నిధి
IV. దైవసన్నిధి గల ముగ్గురు యౌవ్వనులు మరియు దానియేలు
V. రూపాంతరము – దైవసన్నిధి
బు-దైవసన్నిధి
VI. సన్నిధి కూటమువారు ఎట్టివారై యుండవలెను?
VII. శోధన – దైవసన్నిధి
VIII. సన్నిధి వన్నె
సన్నిధి వన్నె చక్రము
దైవ సన్నిధి (కనిపెట్టుట)
దైవసన్నిధి నాలుగుభాగములు: 1) ఏకాంతసన్నిధి 2) ధ్యానసన్నిధి 3) కూట సన్నిధి 4) ఏడుగురు సన్నిధి కూటము
గమనిక:- దైవసన్నిధికి 1)శుద్ధి 2) క్రమము ముఖ్య అవసరములు
1. చేయువిధములు-కలుగు భాగ్యములు
- ఏకాంత సన్నిధి:- 1) సమయము :- తెల్లవారుజామున చేయునది. మొదటగా 1931 సం||లో నేర్పించినప్పుడు తెల్లవారుజామున 4నుండి 5గంటలవరకు, తదుపరి కొన్నాళ్ళకు బైబిలుమిషనువారు 3ఎ.యం. నుండి 5 ఎ.యం. వరకని చెప్పినారు. అయ్యగారు నేనైతే 2 గంటల నుండే చేస్తానని చెప్పినారు (అయ్యగారైతే నిత్య సన్నిధి గలవారు)
- సిద్ధపడు విధము:- మంచము దిగక ముందు ప్రకటన 1:6 లోని స్తుతి చేయవలెను. ఇది ప్రభువునకు మొదట చేయు సలాం. 3) బయటికివెళ్ళి కాళ్ళు చేతులు ముఖము కడుగుకొని, బట్టలు మార్చుకొని ఏర్పర్చుకొన్న స్థలమునకు వెళ్ళిమోకాళ్ళూనవలెను, అట్టి సమయములో మంచిగాని చెడుగాని ఏతలంపు రానీయకూడదు. ఒక్క ప్రభువు వైపు మాత్రమే చూడవలెను. ఆయన నీయెదుట ఉన్నారనే తలంపుతప్ప మరేమి రానీయక ఫోటో తీయునపుడు ఫోటో గ్రాఫరు వైపు తేరి చూచునట్లుగా నీ యెదుటనున్న ప్రభువువైపు మాత్రమే చూడవలెను. ప్రభువు పాదములయొద్ద కూర్చుని ఆయన వైపే చూచుచూ వినుచుండిన మరియవలె నీవును ఆయన వైపే చూచుచుండవలెను (కండ్లు మూసికొని) అలాగు 1గంటకు తక్కువ కాకుండా ఆయన సన్నిధిలో కనిపెట్టవలెను, ఇది కనిపెట్టు గంట. ఇది ఒంటరిగా మాత్రమే చేయునది. మోకాళ్ళూని త్రియేక తండ్రిని ముమ్మారు స్తుతించి దేవా! నాకు కనబడుము నాతో మాట్లాడుము. అందరికి కనబడుము. అందరితో మాట్లాడుమని చెప్పి ఇక మౌనముగా ఆయనవైపే చూస్తూ కనిపెట్టవలెను, మంచి మనోనిదానము కలిగి ఉండవలెను. ఇక్కడ కీర్తన పాడే పనిలేదు. వాక్యము చదివే పనిలేదు. స్తుతిచేసే పనిలేదు నీవు మాట్లాడే పనిలేదు ఆయనవైపు మనోనిదానము కలిగి చూచేపని మాత్రమే. ఇది మహాగొప్ప భాగ్యము, (సన్నిధిసంపద అనే పుస్తకములోను, ఉపవాసదీక్ష అనే పుస్తకములోను దీని వివరము గలదు.) కనిపెట్టు గంట
(కనిపెట్టు గంట అనగా దేవుని సన్నిధిలో మోకాళ్ళూని కనిపెట్టవలసిన సమయము)
మనమొక అధికారి యొద్దకు వెళ్ళి ఐదు రూపాయలు దయచేండి అని అడిగిన యెడల, ఆయన యిచ్చుననిగాని, యియ్యడనిగాని తెలియకముందు వచ్చివేయుదము గదా! ఆ విధముగానే మనము దేవుని సన్నిధికి వెళ్ళి మనకు కావలసినవి దయచేయుమని ప్రార్ధించి, ఆయన మన మనసులో యేదైన ఒక తలంపు కలిగించు వరకు మోకాళ్ళమీదనే వుండవలెను గాని, ఆమెన్ అని వచ్చివేయుట మర్యాద కాదు. “సత్యమనగా యేమి”టని పిలాతు యేసుక్రీస్తు ప్రభువును ఒక ప్రశ్న అడిగెను ఆప్రశ్నకు ప్రభువు జవాబియ్యకముందే ఆయన ఇంటిలోనికి వెళ్ళిపోయెను. జడ్జిగారింకను కనిపెట్టుకొనియున్న యెడల ప్రభువేమి జవాబిచ్చునో అది సువార్తికులు వ్రాసియుందురు. మనము తెలిసికొనియుందుము, అవతలివారు పలుకువరకు మనము పిలుచుచునే యుందుముగదా? పలికిన వెంటనే పిలుచుట మానివేయుదము. పూర్వికులైన ప్రవక్తలు దేవునిసన్నిధిలో యెంతోసేపు కనిపెట్టియుందురు! వారట్లు కనిపెట్ట బట్టియే గొప్ప గొప్ప ప్రవచన గ్రంధములు వ్రాయగలిగిరి. దేవుని అభిప్రాయములు తెలిసికొనగలిగిరి. తమ అభిప్రాయములో పొరబాట్లుండునుగదా! కనిపెట్టిన పిమ్మట ప్రార్ధించినామను సంతోషమే గాక, దేవుడు జవాబిచ్చువాడను సంతోషముకూడ మనకు గలుగును ప్రార్ధనలో కనిపెట్టు వాడుక సంఘములో సంఘ నాయకులు ప్రవేశ పెట్టలేదు. ఇది గొప్ప లోపము అక్కడక్కడ కొంతమంది విశ్వాసులకు మాత్రమే యీ వాడుక గలదు. కాని సంఘమంతటికి లేదు ఇప్పుడైనను సంఘమంతటను ఈ వాడుక ప్రవేశ పెట్టిన యెడల సంఘముయొక్క విశ్వాసమును, ఆనందమును యెంతో వృద్ధి యగును కనిపెట్టు గంటలో అన్నియు పరిష్కారమగును నీ కఠిన ప్రశ్నలన్నిటికి జవాబు దొరకును, ఏదైన ఒక సంగతి మీద దేవుని కొరకు కనిపెట్ట వలయునను విషయము బైబిలులో గలదు కనిపెట్టుటను గురించి బైబిలులోయున్న వాక్యములు చదివినయెడల యిది తెలుసును. మన మనస్సులోనున్న సంగతి నెరవేరువరకు కనిపెట్టవలసిన కాలము ఒక గంట మాత్రమే అయ్యుండదు గదా! మరియు అది ఒక అరగంటకూడ అయ్యుండవచ్చును గదా! “ఈకీడు యెహోవాచేత కలుగుచున్నది నేను యికయెందుకు యెహోవా కొరకు కనిపెట్టియుండవలెనని ఒక అవిశ్వాసి పలికినట్లు మనమును పలుకకుందుము గాక” (2రాజులు 6:330 ఇదివరకున్న మతాచారవిధులే మేమునెరవేర్చలేకపోవుచుండగా. మీరీక్రొత్తాచారమొకటి తెచ్చి పెట్టినారు, ఇదెట్లు వీలుండునని యెదురుచెప్పు వారికి మేమేమి చెప్పగలము? చేసి చూడండి అని మాత్రమే చెప్పగలము ఎంత చెప్పినను వంకలు తెచ్చువారుండకపోరు అయినను అవి వినక కనిపెట్టువేళ నీ నిమిత్తమై కనిపెట్టుకొని యున్నట్లు భావించుకొని కనిపెట్టుచోటికి వెళ్ళుము ప్రభువు రాకడ మిగులు సమీపమని నమ్మువారు సిద్ధపడుటకు కనిపెట్టు సమయమొక గొప్పసాధనమని మా తాత్పర్యము కనిపెట్టుగంట సర్వమతముల వారికిని, నాస్తి పలుకును, భక్తులకును, మానవ జన్మమెత్తిన ప్రతివారికిని, ఉపయోగమే. - బోధ వినుట అనిష్టము: సద్భోధ వినుట నీ కిష్టములేక పోవచ్చును. ఇది ఒక దుర్భుద్ధి అని తెలిసినను ప్రార్ధనలో కనిపెట్టుట మానవద్దు దేవుడిచ్చిన రోజులోని 24 గంటలలో ఒక గంటయైనను కనిపెట్టుటయందు గడపలేవా? కనిపెట్టగ బోధయందిష్టము కలుగును కనిపెట్టుట వలన నీ బ్రతుకు యెంత శుభకరముగ వర్ధిల్లునో తెలిసికొనగలవు.
- పాపములొప్పుకొనుట అనిష్టము: నీది తప్పని తెలిసికొనినను తప్పు ఒప్పుకొనుట కిష్టపడవు ఇదియొక దుర్భుద్ధి, ఇంత పాపము పెట్టుకొని తగుదునని యెట్లు కనిపెట్టుస్థలమునకు వెళ్ళగలవని అనుకొనవద్దు వెళ్ళుము, మోకరించుము కనిపెట్టుము, అప్పుడు పాపములొప్పుకొనుటకు నీకిష్టము కలుగును
- పాములు విసర్జించుట అనిష్టము: నీకు వదలజాలని పాపమేదోయొకటి నీలో నుండవచ్చును, ఎన్నిపాపములైనను విసర్జింప గలవు గాని అది విసర్జింపలేవు దానినివిసర్జించుట నీకిష్టమేయుండదు ఇది నీ మీద యేలుబడిచేయు పాపమైయుండును అది నిన్ను చిక్కులు పెట్టుపాపము. ఐనను ఉదయముననే లేచి శరీరశుద్ధి గావించుకొని, పాపము లేని వారివలె దైవసన్నిధిలోనికి పరిగెత్తుము. కనిపెట్టుము అని పాపము లేని వారివలె దైవసన్నిధిలోనికి పరిగెత్తుము.కనిపెట్టుము అని పాపము మీద అప్పుడు నీకు అసహ్యత కలుగును. నీకది బానిస యగును. నీవే యేలుబడిచేయుదువు.
- పాపమును గెలువలేని బలహీనత: పాపమున్నది దానిని విసర్జించుట నీకిష్టమే గెలువవలెనని ఎన్నోమారులు ప్రయత్నించినావు ఎంతో మంది చేత ప్రార్ధన చేయించుకొన్నావు. ఐనను గెలువలేకపోవుచున్నావు. దిగులుపడకుము-కనిపెట్టు సమయములో నీవు బాగు పడుదువు. పాపమును గెలువలేని నీ కెందుకు కనిపెట్టుటని నిన్నెరిగిన వారందరు, బెదిరిపోవద్దు సన్నిధిలోనికి వెళ్ళుము. కనిపెట్టుము: కనిపెట్టుఫలము పొందుదువు.
- బైబిలు చదువుట అనిష్టము: ఒకానొక సమయమందు బైబిలుచదువుట నీకిష్టము కలుగదు. ఇది యొక దుర్భుద్ధియని నీవు నమ్మినను కనిపెట్టుగంట మరచిపోవద్దు: వెళ్ళుము. ఒకగంట సేపు దేవుని సన్నిధిలో మోకాళ్ళమీదనే కనిపెట్టుము. తుదకు బైబిలు చదువుట యందు నీకిష్టము కలుగును.
- ప్రార్ధన చేయుట నీకు అనిష్టము: ప్రార్ధన చేయుటకు ఒకానొకప్పుడు యేమియు యిష్టముండదు. బలవంతముగా చేయబోయినను మాటలే రావు. ఇదియొక బలహీనత, ఐనను ఒక గంట కనిపెట్టుట మానవద్దు, అయ్యోప్రార్ధనమీద యిష్టములేక పోవుచున్నది. ఎట్లు కనిపెట్టగలవని అందువేమో ఫరవాలేదు వెళ్ళి కనిపెట్టుము. అప్పుడు నీకు ప్రార్ధన యందిష్టము కలుగును.
- సువార్త ప్రకటించుట అనిష్టము: నీకు సువార్త తెలుసును నీ హృదయము సరిగానేయున్నది. ఎందుచేతనో గాని సువార్త ప్రకటించుట నీకిష్టము లేదు వారికి సువార్త ప్రకటించిన విందురా అని అందువు ఇదియు దుర్భుద్ధియే సువాతవలన మేలుపొదిన నీవు ఇతరులు మేలు పొందుట కిష్టపడనియెడల అది దుర్భుద్ధికాక మరేమి బుద్ధి? ఐనను నీ గదిలోనికి వెళ్ళుము. కనిపెట్టుట అను గొప్ప కార్యమును చేయుము అప్పుడు సువార్త బోధించుట నీ కిష్టమగును.
- విశ్వాసము లేని స్థితి: ఒకానొకప్పుడు దైవవిషయమందేమియు విశ్వాసము కలుగదు ఏ మతము నిజముకాదని తోచును దేవుడున్నట్టు నా పక్షమున్నట్టు నరకమున్నట్టు యెవరు చూచినారు? క్రీస్తు వచ్చినట్టు చూచినవారేరి? అనుయిట్టి అవిశ్వాస ప్రశ్నలు మనసులో పుట్టును. ఇట్టి ప్రశ్నలతోనే కనిపెట్టు స్థలమునకు వెళ్ళుము: సందేహింపకుము: కనిపెట్టుము కనిపెట్టగా కనిపెట్టగా నీ ప్రశ్నలన్నియు అంతరించిపోవును స్థిర విశ్వాసము కలుగును.
- నిరాశ:- నీ కథలు తెలిసిన ఒక బోధకుడు నీకు దారిలో కనబడి ఓ దురంతకుడా! దేవుడు నీకు రక్షణానుగ్రహించునప్పుడు నీ వెక్కడికి వెళ్ళుదువు? నీవు రక్షణను నిర్లక్ష్యపెట్టుచున్నావు; నీకు మారుమనస్సు కలుగుట దుర్లభమని పలుకును అప్పుడు నీ ముఖము కళ తగ్గును: నీ గుండె కొట్టుకొనును: రాత్రులు నీ స్వప్నములలో దయ్యములు కనబడును: చావు పెట్టె కనబడును: నరకము, నరకము అను శబ్ధము వినబడును: వెర్రి కేకలువేయుదువు: అంతలో మెళుకువ వచ్చును. ఏమిచేయుదువు? నిరాశపడుదువుగదా ? ఆబోధకుని మాటలను దుష్ట స్వప్నములను మందలింపు క్రింద లెక్క కట్టుకొనుము వెళ్ళుము కనిపెట్టుగదికి. ఉండుము విశ్వాసము వచ్చువరకు అప్పుడు నీ మనస్సులో ధైర్యమును, సంతోషమును కలుగును.
- విసుగుదల: నేను ఒక సంగతినిగూర్చి యెన్నో రోజులనుండి ప్రార్ధించుచున్నాను: విశ్వాసముతో అడుగుచున్నాను: నాకు తెలిసినంత మట్టుకు నాలో యే అడ్డము లేదు. అయినను నా ప్రార్ధన ఆలకించుట లేదు: ఎందుకో తెలియదు దేవుని వాగ్ధానములు చూడగా నోరూరుచున్నది అని ఈరీతిగా దేవునిమీద విసుగుకొనుచున్నావు గదా ఇది ఒక నీరస బుద్ధి కనిపెట్టుచోటునకు వెళ్ళుము, నీ మనసుకు శాంతి కలుగును దేవుని యెడల నీకు మంచి అభిప్రాయములు పుట్టును.
- అసూయ: నే నెన్నోమారులు ప్రార్ధింపగా దేవుడు వినలేదు గాని వీరు ప్రార్ధింపగానే విన్నాడు యని యితరుల మీద అసూయపడుదువు దేవుడు పక్షపాతియని తలంతువు ఇవియు దుర్భుద్దులే. అయినను సన్నిధిలోనికి వెళ్ళుటకు జంకకుము: కనిపెట్టుము. ఈ దుర్గుణములు నివారణ యగును.
- వీలు లేని స్థితి: కనిపెట్టవలెననిన అన్నియు అడ్డములే; మనసు కుదరదు: స్థలము దొరకదు. స్థలము దొరికినను అందరి మాటలు వినబడుచుండును. స్థలముదొరికిన, సమయము దొరకదు. సమయము దొరికిన, స్థలము దొరకదు, స్థలము, సమయము దొరికిన నిద్ర నిద్ర అని అనుకుందువేమో! విస్తారముగా ఆలోచింపకుము. చొరవచేసుకొని యెక్కడో ఒకచోటయిరుకుము. కనిపెట్టుము. కనిపెట్టుటయందు నీ కిష్టమున్నదని నీ తండ్రికి తెలుసుగదా! నీ ఆశకు విలువ గలదు. వీలులేకపోయినను బలవంతముగా వీలు కలుగజేసికొనుము పనులకు వీలు కలుగజేసికొనుచున్నావు గదా! కనిపెట్టుటకు వీలు కలిగించుకొనలేవా? ఇట్లు నీవు కనిపెట్టు అలవాటు కలిగిన యెడల క్రమేణ చెడుగంతయు ఒత్తిగలిగిపోవును, మంచి నీ జీవితములో ప్రవేశించును: దైవాత్మ నీకు సహాయము చేయును, నాసలహా ప్రకారము నీవు చేసినందుకు విచారపడవు. దేవునిసన్నిధిలో గడిపిన సమయము వృధాగా గడిపిన సమయమని భావించుకొనవద్దు. ఒకసారి కనిపెట్టగా నెమ్మది దొరకక పోయినయెడల మరియొకసారి కనిపెట్టుము అశ్రద్ద చేయవద్దు.
- అసూయ: నే నెన్నోమారులు ప్రార్ధింపగా దేవుడు వినలేదు గాని వీరు ప్రార్ధింపగానే విన్నాడు యని యితరుల మీద అసూయపడుదువు దేవుడు పక్షపాతియని తలంతువు ఇవియు దుర్భుద్దులే. అయినను సన్నిధిలోనికి వెళ్ళుటకు జంకకుము: కనిపెట్టుము. ఈ దుర్గుణములు నివారణ యగును.
- వీలు లేని స్థితి: కనిపెట్టవలెననిన అన్నియు అడ్డములే; మనసు కుదరదు: స్థలము దొరకదు. స్థలము దొరికినను అందరి మాటలు వినబడుచుండును. స్థలముదొరికిన, సమయము దొరకదు. సమయము దొరకదు సమయము దొరికిన, స్థలము దొరకదు, స్థలము, సమయము దొరికిన నిద్ర నిద్ర అని అనుకుందువేమో! విస్తారముగా ఆలోచింపకుము. చొరవచేసుకొని యెక్కడో ఒకచోటయిరుకుము. కనిపెట్టుము. కనిపెట్టుటయందు నీ కిష్టమున్నదని నీ తండ్రికి తెలుసుగదా! నీ ఆశకు విలువ గలదు. వీలులేకపోయినను బలవంతముగా వీలు కలుగజేసికొనుము పనులకు వీలు కలుగజేసికొనుచున్నావు గదా! కనిపెట్టుటకు వీలు కలిగించుకొనలేవా? ఇట్లు నీవు కనిపెట్టు అలవాటు కలిగిన యెడల క్రమేణ చెడుగంతయు ఒత్తిగలిగిపోవును, మంచి నీ జీవితములో ప్రవేశించును: దైవాత్మ నీకు సహాయము చేయును, నాసలహా ప్రకారము నీవు చేసినందుకు విచారపడవు. దేవునిసన్నిధిలో గడిపిన సమయము వృధాగా గడిపిన సమయమని భావించుకొనవద్దు. ఒకసారి కనిపెట్టగా నెమ్మది దొరకక పోయినయెడల మరియొకసారి కనిపెట్టుము అశ్రద్ద చేయవద్దు.
- కృపను లోకువ కట్టు స్థితి:- కనిపెట్టు గది యొకటి యున్నది. గదా! గనుక ఎన్ని పాపములైనను చేసికొనవచ్చును. చేసి కనిపెట్టు గదిలోనికి వెళ్ళిన పాపములన్నియు పరిహారమగునని అనుకొందువేమో. ఇట్లనుకొనుట దేవునికృపను లోకువకట్టుటయై యున్నది అది అపాయకరమైన స్థితి నేను నీకు సదుపాయము చూపించుచుండగా నీవనుకొన గూడదు. కనిపెట్టు స్థలమునకు వెళ్ళుము: కనిపెట్టుము మేలు కలుగక మానదు.
- కనిపెట్టు సమయమున గలుగు భాగ్యము: కనిపెట్టు సమయముతో ఒకరికిపాపములొప్పుకొను వాలు కలిగినది ఒకరికి ప్రార్ధన ధోరణి కలిగినది: ఒకరికి స్తుతిచేయు ప్రవాహము వచ్చినది. ఒకరికి దర్శ్న వరము లభించినది ఈ ప్రకారముగా ఒక్కొక్కరికి ఒక్కొక్క భాఘ్యము కలిగినది. ఎన్నిభాఘ్యములో వివరింపలేము. మేము వ్రాసినది తక్కువైనను, ఎక్కువ గ్రహించుకొనవలెను ఈపత్రికలో మేము వ్రాసిన బలహీనతలు గలవారు మాత్రమే కాదు లేనివారును ఈ కనిపెట్టు సమయమును ఉపయోగించుకొనవలెను: కీర్తనలు పాడుకొనుట, ప్రార్ధనలు చేసికొనుట బైబిలు చదువుకొనుట అను పనులు తత్పూర్యమే ముగించుకొనుట మంచిది: తరువాత కూడ చేసి కొనవచ్చును ఎవరి వీలుకొలది వారు చేస్కొనవచ్చును కనిపెట్టు సమయములో దైవ సహవాసానుభవము కలుగును. ఏలియా తన ప్రార్ధన నెరవేరువరకును కర్మెలు కొండమీద కనిపెట్టుకొని ప్రార్ధన సాగించుచునేయుండును. మొదటిమారు ప్రార్ధనకు నెరవేర్పు కనబడనప్పుడు రెండవమారు ప్రార్ధన చేసెను. ఈప్రకారముగా ఏడుమారులు ప్రార్ధన చేయుచునే నెరవేర్పుకొరకు కనిపెట్టెను తుదకు నెరవేర్పు కలిగెను. 1రాజులు 18అ|| మూడు సంగతులు:1} కైపెట్టు గదిలో మనోనిదానము కలిగియుండుము: అనగా చెడుతలంపులు రానీయకుము. మంచి సంగతులుకూడ జ్ఞాపకము చేసికొనకుము, తండ్రి, కుమార, పరిశుశుద్ధాత్మలు నీ యెదుట వున్నారను ఒక తలంపు మాత్రమే చివరివరకును ఉండవలెను. ఇదే నీ వక్కడ చేయవలసిన గొప్పపని యత్నించుము. 2) ఎన్నో రోజులనుండి కనిపెట్టు గంటను వాడుకొనుచున్నాను. నాకేమియు అనుభవ ము కలుగలేదని యనుచున్నావు. అట్లు కనిపెట్టుటయే నీకు కలిగిన మొదటి భాగ్యము గదా! 3) కనిపెట్టు గంట గలిగినవారితో మాటలాడిన కొన్ని సంగతులు నేర్చుకొనగలవు.
4) కలుగు ఫలితములు – యెషయా 40: 30-31 లో గల భాగ్యములు కలుగును. ఎన్నడును తోట్రుపాటు పడవు. పైకి ఎదిగే స్థితియేగాని పడిపోయే స్థితి ఎన్నడును కలుగదు. నీలోని దుర్గుణములు పోయి సద్గుణములు అనగా ఆయన దివ్యలక్షణములు అద్దబడును “సూర్యుండు పువ్వులకెంత సొగసైన రంగులద్దున్ – సూర్యుండైనట్టి యేసు శుభ గుణములద్దున్” రాజు దగ్గరకు వెళ్ళి ఆకర్షింపబడిన ఎస్తేరును హెగేసిద్ధపర్చిన భాగ్యము, రాజు ఆకర్షించిన భాగ్యము నీకు కలుగును, ఇది పెoడ్లికుమార్తె సిద్ధపడు విడిదిగది ప్రత్యేక భోజనముతో సిద్ధపరచు స్థలమది. పరమ గీతము 5:1లో నున్న మధురమైన ఆహారము భుజించు స్థానమిది. పరమ గీతము 3: 4-5లలో నున్నట్లు అరలో ఆనందించు భాగ్యము. నోటి ముద్దులతో ముద్దుబెట్టుకొను సమయము ఆయనలో నీవు నీలో ఆయన ఏకమయ్యే సమయము రానైయున్న పెండ్లికుమారుని ఎదుర్కొనుటకు సిద్ధపడు పెండ్లికుమార్తె విడిదిగది ఉద్యానవనమిది ఇది అన్నిటికన్న మహ్హముఖ్యమైన సమయము, స్థలమునై యున్నది బైబిలుమిషను యొక్క గొప్పతనము అక్కడనే ఉన్నది. మానకచేయువారికి ఇదిగొప్ప అనుభవము గొప్ప మార్పు కల్గించును.
షరా:- ఇది నీ జీవిత కాలములో వ్యాధి ఉన్న, బాధ ఉన్న తుదకు మరణమున్నను కూడ ఈభాగ్యవంతమైన సమయమును, స్థితిని మానకూడదు. ఇది నీ నిష్టగాను, వ్రతముగాను ఉండవలెను. మోకాళ్ళున్నంత కాలము చేయు వ్రతము ఒక్కదినమైనను మానిన యెడల నీ వ్రతము చెడిపోవును. మచ్చ ఏర్పడును.
షరా:- మొదటగా 40 దినాలు ఒక్కదినమైనను మానకుండా అభ్యాసముచేయుము, 39దినాలుచేసిన ఒక్కదినము మానితే 39దినాలు చేసిన వ్రతము చెడిపోవును మరల ఒకటి అని ఆరంభించి 40దినాలు ముగించవలెను ఆమీదట ఎవ్వరికైనను చెప్పవచ్చును. అంతవరకు ఎవ్వరికి చెప్పకూడదు ఒక్కదినమున మానినట్లయిన పెట్టక్రిందనున్న కోడిగ్రుడ్డు 21దినాలు పొదగకుండాయుంటే ఎట్లు పిల్లరూపము రాక అడిలిపోయి పెంటమీద పారవేయబడునో అట్లే నీ ఆత్మీయస్థితి యుండును గాన ఈ వ్రతము మొదట ఆత్మీయ అభివృద్ధికి గొప్ప సాధనము. ఇది లేకుండా అక్రమముగా నున్న యెడల నీవు ఫలించినట్లు కనబడుదువుగాని తుదకు దెబ్బతిందువు. ఇది మానక చేయవలసిన గొప్ప వ్రతము ఇది బైబిలు మిషనుకు గొప్పబలమైన పునాది. పునాది లేకుండా గట్టిన కట్టడము గతి యెంతో నీవెంత గొప్పపనులు చేసినా, సేవచేసినా వరములు కలిగిఉన్నను నీగతి అంతే. గనుక బైబిలు మిషను వారలారా! మీరు చేయండి, లోకమునకు ఇది వెల్లడిచేయండి. ఇది కల్గించిన యెడల వారే ప్రభువును సంపాదించుకొని పెండ్లికుమార్తెగా సిద్ధపడగలరు. ఇది మనకు తండ్రి దగ్గరనుండి గొప్పవరముగా మన తండ్రిగారు దించి తెచ్చిన గొప్పవరము. ఇది చేయలేని యెడల నీవు బైబిలుమిషను వ్యక్తివికావు, పెండ్లికుమార్తెవు కాజాలవు. గాన సమయములేదు. ఇప్పుడైనను ఆరంభించి అభివృద్ధి పొందుము.
|| ధ్యాన సన్నిధి:- ఇది ఎప్పుడైనా చేయవచ్చును. ముఖ్యముగా బైబిలు చదివిన మీదట మోకాళ్ళూని అదేధ్యానించుము, నీవు చదివిన భాగ్యమును నీ ఆత్మనేత్రములతో చూడగలవు. అందు వ్రాయబడి ఉన్న లోతైన మర్మములను నీవు అందుకొనగలవు జ్ఞానముతో అందుకొని అందించువర్తమానమునకును ఆత్మతో అందించు వర్తమానమునకును ఎంతో బేధముండును. ఆత్మతో అందించు వర్తమానమే హెబ్రీ 4;12లో పనిచేయును. ఆ నున్నట్లుగా ధ్యానముచే నిన్ను క్రీస్తులోనికి నడిపించును క్రీస్తు ప్రభువు నిన్ను తండ్రిలోనికి నడిపించును.
ఆత్మగల్గినవారు ధ్యానములోనికి నడిపించునప్పుడు నీవు మంచి మనోనిదానము కలిగి ఉన్నయెడల వారితో పాటు అనగా ఆ నడుపుదలతో నీవును నడిచివెళ్ళగలవు: చూడగలవు: బలపడగలవు గనుక ధ్యాన సన్నిధి లేకపోతే వాక్యములోని మర్మములను అందుకొనలేవు. బైబిలు మిషను వారమైన మనము అందుకొని అందించువారమై యుండవలెను.
షరా:- ఒకప్పుడు అయ్యగారు అనాది స్తుతి చేయించుచు మనలను ధ్యానములో నడిపించి,నడిపించి మహిమ పుంతలో నడిపించి, నడిపించి అనాదిలోనున్న దేవునిని కలిసికొని స్తుతించునట్లు నడిపించిరి. ధ్యానములో నడిపించువారి వెంట మనమును అనగా మన ఆత్మయు నడిచివెళ్ళిన యెడల చూడగలము. అనుభవించగలము ఇది ప్రతి దినము కలిగి ఉండవలెను.