1. Home
  2. Docs
  3. దైవ సాన్నిధ్యము...
  4. రెండవ ప్రసంగము – సన్నిధి పోరాటము

రెండవ ప్రసంగము – సన్నిధి పోరాటము

ప్రార్ధన:- ఓ తండ్రీ! ముగ్గురుగా బయలు పడిన తండ్రీ! ఒక్కడవుగా బయలుపడిన తండ్రీ! స్తోత్రము మేము అయోగ్యులమైనప్పటికిని మమ్ములను నీ బిడ్డలుగా అంగీకరించిన నీకుస్తోత్రం నీవు అక్కడ వున్నావు. పరలోకంలో అక్కడవున్నావు దేవదూతల లోకములో అక్కడ వున్నావు భక్తులు ఉండే లోకములో అక్కడ వున్నావు ఆకాశమందుకూడా అక్కడ వున్నావు భూమిమీద కూడ వున్నావు. ఈ వరండా మీద కూడ వున్నావు. గనుక నీకు అనేక వందనములు బలహీనులమైన మాకు బలమైన వర్తమానములు దయచేయుము. నీ వాక్య ప్రకారము నడవలేనివారమైన మాకు ఆప్రకారం నడిచే వర్తమానము దయచేయుము ఇక్కడ వున్న ప్రతీవారికి అధమపక్షము ఒక్కవర్తమానము అందునట్లు కృప దయచేయుమని యేసుప్రభువు నామమున వేడుకొనుచున్నాము. ఆమెన్.

   అయ్యగారికి ఒక చిక్కు వున్నది. హక్కువున్నది. వచ్చే చిక్కు నేను చెప్పేది అందరకు వినబడదు వినబడినా అర్ధము కాదు. నా దగ్గరకు వచ్చే పాదుర్లకు అది క్రొత్తగా వుండదు రోజూవచ్చే వారికి క్రొత్తగా వుండనక్కరలేదు. క్రొత్తగా వచ్చినవారికి క్రొత్తగా వుండవలెను. 37సం|| క్రితము లూథరుగిరి సెమెనెరీలో ఒకప్రసంగము చేయవలసి వచ్చినది. 350 మంది వచ్చిరి. వారందరికి వంట ఏర్పాటు చేయించుట అయ్యగారి పని, అయ్యగారి వంతు వచ్చేటప్పటికి మరల వంట కాన్పరెన్స్ కు వచ్చేవారు అప్పటి ప్రసంగము గతించిన 10సం|| లలో ఇండియాలో క్రైస్తవమతము ఏలాగు వృద్ధిపొందినదో చెప్పుటకు వచ్చెను ఒకచార్టువేసిరి ఇంత ప్రసంగము 15ని||లలో ముగించమనిరి, ప్రతిసంవత్సరము ఎంతెంత మంది వచ్చిరో చెప్పి ఆమెన్ అన్నారు అప్పుడు అలాగున కాదు ఇంత పెద్ద చార్టు వ్రాసుకొనివచ్చి ఇంతలో ముగించారు మరల చెప్పమనండి అనగా దొరికిందే సందని ఒక గంట సేపు చెప్పిరి. బర్మాలో తెలుగువారు ఎంతమంది ఉన్నారో వివరించినారు. చెప్పి చెప్పి వంట ఆఫీసునకు దిగిపోయినారు బెంచిమీదకు పోయి కూర్చున్నారు అప్పుడు ఒక దొరగారు చప్పట్లు కొట్టగా అందరు కొట్టిరి, ఒక ఆయన ఆ ఎందుకేమిటి ఆ సంగతులు మనకేమి పట్టినవి రాజమండ్రి మన ప్రాంతములవారి కొరకు ప్రార్ధించాలి గాని కాశ్మీరు వారిని గురించి మనకు ఎందుకు అన్నారు.   అలాగే నా ప్రసంగం వినేవారు కొంత మంది బాగా లేదనవచ్చును. అలాగనుట వంశ పారంపర్యమే. 1922 సం|| నుండి ఇది అనుభవమున్నది. ఇప్పుడు ప్రశ్న? ఉదయం చెప్పిన పాఠంలో ఏదీ క్రొత్తలేదు అనేలేదు చేతులు ఎత్తండి. అయ్యగారికి క్రొత్తేనట. ఎవరూ ఆవిషయము చెప్పుటలేదు వినుటలేదు. 1) సృష్టి శాస్త్రము 2) మనస్సాక్షి శాస్త్రము. 3) ధర్మ శాస్త్రము. ఈ మూడు చెప్పిన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను నమ్మని శాస్త్రులు కొందరు వున్నారు. ఉదయమున చెప్పినది కొంతవరకు సాగించిచూస్తాను.

  యబ్భోకు, యాకోబు, అక్కడ ఒక వాక్యన్నది ఏమండి యాకోబు మనుష్యునితో పోట్లాడెను. దేవునితో పోట్లాడెను తెల్లవార్లూ ఆయనతో పోరాడినది ఎవరో తెలియదు మనకు మనుష్యునితో, పోట్లాడ లేదు గదా!

 ఆది కాం|| 32:28: యేసుప్రభువు నరావతార మెత్తకముందు నరుడుగా కనబడి పోరాడెను, ఆయన దేవుడు గనుక దేవుడుగా కూడ పోరాడెను. జయశాలియై ఇశ్రాఏలయ్యెను. మనము సన్నిధికూటము పెట్టుకొని యేసుప్రభువుకు ప్రార్ధనచేస్తే వస్తారు. ఆయన భూమి మీద నున్న శరీరముతో కాక పరలోక శరీరముతో వస్తారు. అబ్రహాము దగ్గరకు డేరా దగ్గరకు ఆయన శరీరమువలె కనబడినా, ఆత్మశరీరముతో కనబడెను అందుచే యేసుప్రభువు యూదులతో సంభాషించేటప్పుడు అబ్రహాము నా దినము చూచి సంతోషించెను అని చెప్పెను. ఆమాట డేరా దగ్గర, సొదొమ మైదానము వరకు అబ్రహాముతో నడచి వెళ్ళెను. మనిషితోనెకాదు, దేవునితో నడచివెళ్ళెను అబ్రహాముతో నడచి వెళ్ళెను అలాగె మనుష్యుడె కనబడ్డాడు. దేవుడై ఉన్నాడు అందుచేత మనిషితోను, దేవునితోను పోరాడి గెలిచావు అన్నాడు దానిలో ఒక చిన్నసంగతి ఉన్నది. నీవు దేవునితోను, మనుష్యులతోను అని ఉన్నది దేవునితో అదిసరే మనుష్యునితో, కథలో మనిషి ఒక్కరే కదా! వ్రాతలో మనుష్యులతో అని ఉన్నది. ఆతేడా ఎందుకుచెప్పిరో మీకు తెలిసిందా! కథలో ఒక్కడుగా నున్నది. వ్రాతలో మనుష్యుడుగా అని ఉండి తన సహోదరుడైన ఏశావుతో పోరాడి గెలిచెను తన మామగారైన పద్దనరాములో జీవితములో గెలిచెను.     

      తన అన్నగారుమీద ముగ్గురైయున్నాము. మనము దైవ సన్నిధికి వెళితే భయపడతారు. ప్రభువు కనబడుట ఇష్టమైతే సన్నిధిలో నుండుట కూడ ఇష్టమేనా? ఆయన కనబడుట మీకిష్టమైతే సన్నిధిలో కూడ ఉండుట కూడ మీకిష్టమైఉండును. ప్రభువా! నేను ప్రార్ధనైతే చేస్తున్నాను గాని నాకు కనబడవద్దు అన్నమాట అట్టి ప్రార్ధన ఒక్కరేచేశారు. ఇశ్రాయేలీయులు సేనాయి కొండదగ్గర దేవుడు మాకు కనబడనవసరము లేదని ప్రార్ధించిరి. కారణము మాకు భయము నీవు మాత్రము మాకు చెప్పు దేవుని సంగతులని అన్నారు అనేకమంది అని వారు బ్రతిమిలాడారు మాకు కనబడవద్దని అంటారు. ఒకప్పుడు ఒకరికి అయ్యగారు ప్రార్ధన చేస్తు ఉంటే పారిపోవుటకు సందుదొరుకునని చూశారు. తీరాకనబడితే నాపాపములు ఒప్పుకొనవలెనని; ఇప్పుడట్టివారుండేవారు సన్నిధిలో కనబడవచ్చును. యూదా మతములో నున్న విశ్వాసులు, నీవు సన్నిధిలోనికి వెళ్ళవచ్చు అని చెప్పవద్దు సన్నిధిలోనికి వెళ్ళవచ్చు. అలాగే బౌద్ధమతములో నున్న అవిశ్వాసీ! జైన మతములో నున్న అవిశ్వాసీ! నీవు కనబడవలెనని నీ సన్నిధిలోనికి వెళ్ళవచ్చు. నీవును సన్నిధిలోనికి వెళ్ళవచ్చు క్రైస్తవ మతములో నున్న అవిశ్వాసీ దైవ సన్నిధిలోనికి వెళ్ళవచ్చు. అని చెప్పవచ్చును అలాగే మహమ్మదీయ మతములో నున్న అవిశ్వాసీ నీవు  సన్నిధిలోనికి వెళ్ళవచ్చు అని చెప్పవచ్చును.         

    నాస్తిక మతములోని వారిని దైవ సన్నిధిలోనికి వెళ్ళు అని చెప్పవచ్చును గాని క్రీస్తు సన్నిధిలోనికి వెళ్ళు అంటే తక్కిన మతముల వారు ఒప్పుకోరు. యూదా మతములో ఉన్న ఆరాధకుని వారి యొద్దకు వెళ్ళమన్నా వెళ్ళరు. ఏ మతములోని ఆరాధకుని సన్నిధిలోనికి వెళ్ళండి. అంటే వెళ్ళరు గాని దైవ సన్నిధికి వెళ్ళమంటే బాగుంది అంటారు. వెళ్ళినా వెళ్ళకపోయినా, గనుక మీరందరు తక్కిన మతస్తులందరికి దైవసన్నిధిలోనికి వెళ్ళండి అని చెప్పండి. ఎవరికంటే అన్ని మతములలో నున్న అవిశ్వాసులకు అనగా తమ తమ మతములోని వారిని వారి మతముల యెడల మాత్రము విశ్వాసములేదు తమ మతముల యెడల భక్తిగల భక్తులున్నారు అట్టి భక్తిహీనులకీ దైవసన్నిధికి వెళ్ళండి అని చెప్పాలి.

ఆయా మతములలో, ఆయా మతములవారు ఎవరిని పూజించుచున్నారో వారిపేరు ఎత్తకూడదు దేవుని పేరు ఎత్తవచ్చును. అన్ని మతములకు సంబంధము దేవుడు అనే మాటలో నున్నది ఆదియందు దేవుడు భూమ్యాకాశములను కలుగజేసెను. అని ఉన్నది గనుక బైబిలే గొప్ప ఆధారము.

1వ అధ్యాయము తరువాత తక్కిన మతములు వచ్చినవి ఈ సంగతి ఏప్రిల్ లో జరిగే మీటింగులలో చెప్పాలని పెట్టెలో దాచిపెట్టాను. “మంచిఎర” వలవంటి ఎర చేపకు నొప్పిలేకుండ బయటకుతీసే ఎర, అప్పుడు మీరు రారులెండి అప్పటికే చాల ఖర్చు అయినది ఎన్నడూ రానివారు వచ్చారు.

   యబ్భోకు ఎలాగైతే యాకోబుదాటాడో అలాగే మనము పాత నిబంధన దాటి క్రొత్త నిబంధనలోనికి రావలెను అయ్యగారు స్వయముగా చెప్పుచుండగా అయ్యగారిబోధ విననివారు ఎవరైనావచ్చారా? మనము క్రొత్త నిబంధనలోనికి వచ్చాము, అక్కడ దేవుడు మన శరీరములోనే ప్రత్యక్షమైనాడు మనము పేరు పెట్టుకొన్నట్లు యేసుక్రీస్తు అను పేరు పెట్టుకొన్నాడు. యాకోబునకు ఒక రాత్రియంతా కనబడెను. దేవుడు క్రొత్త నిబంధనలలో 33 1|2సం||లు మనుష్యులకు కనబడుచునేయున్నాడు. యాకోబునకు, యబ్భోకు రేవువద్దనే కనబడెను, క్రొత్తనిబంధనలలో పట్టణాలలో కనబడెను పల్లెలలో కనబడెను, కొండలమీద కనబడెను, సరస్సు దగ్గర కనబడెను. అరణ్యములో కనబడ్డాడు, నది దగ్గర కనబడెను. మఠాలు దగ్గర కనబడెను. స్మశానం దగ్గర కనబడెను. మరణమున్న ఇంటిదగ్గర కనబడెను, బజారులో కనబడెను. దేవాలయములో కనబడెను, పాపులయొద్ద కనబడెను భక్తులయొద్ద కనబడెను. పండితులయొద్ద కనబడెను, పంచాయితీలలో కనబడెను,  గవర్నమెంటు కోర్టులో కనబడెను, చివరిగా శిలువమీద కనబడెను, పునరుత్థాన దినమున ప్రయాణస్తుల దగ్గర, పండుగలలో చిన్నప్పుడు కనబడెను ఎదిగినప్పుడు కనబడెను ఉద్యోగమువచ్చి బోధచేయునప్పుడు, కనబడెను. జనసమూహములో కనబడెను "రారే మన యేసు స్వామిని" నది చెరువు మఠము: జన పథము, జనమున్న పల్లె పట్టణములు, జబ్భుగా నున్న వారికి కనబడెను దయ్యాలు పట్టిన వారి దగ్గరకు కనబడెను, అన్నివిడిచి ఏకాంతస్థలములలో కనబడెను. ఆ ఏకాంత స్థలమే దైవసన్నిధి. లూకా ఏమివ్రాసాడంటే ఇంకా చాలా రాత్రి ఉండగనే ఆయన కొండలలోనికి ప్రార్ధన కొరకై తన తండ్రితో మాట్లాడుటకై ఎవరులేని స్థలము ఒక ఫిడ్డెనకూ యని స్థలము. ఆపైన అడవిస్థలము వెళ్ళి ధ్యానములో నున్నాడు. అదే దైవసన్నిధి. (మీరు ఇంటికి వెళ్ళి ఈ మాట బాగా చదవండి) యేసుప్రభువు తన శిష్యులను ఎఫ్రాయిము మన్యములోనికి ఏకాంత స్థలములోనికి తీసికొని వెళ్ళినాడు.

        అక్కడ ఏమిచెప్పెనో బైబిలులో లేదు గాని చాల సంగతులు చెప్పెను. ఇప్పుడు మన 5 సన్నిధి ప్రార్ధనా కూటములలో అడిగితే బయలుపరచును. అందులో ఒక అంతమేదంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు, ముగ్గురు ఒక్కరు ఏలాగయ్యారో ఒక్కరు ముగ్గురు ఎలాగయ్యారో అది వారికి బోధించలేదు వారు గ్రహించలేరు గనుక ఇపుడు మనకు బోధింతురు. దైవసన్నిధి కూటములో ఉండి అడిగితే వస్తూ పాఠము చెపుతారు. అప్పుడు మనమడిగితే ముగ్గురు వచ్చి కనబడతారు. కాస్సేపటికి ఆ ముగ్గురు ఒక్కటైపోతారు అది నిజమో కాదో మా దైవసన్నిధి కూటములో ప్రయత్నించి చూడండి. దైవసన్నిధి కూటములో తప్ప ఇంకెక్కడాబయలుపడదు. 

 సన్నిధికూటములో మనమున్న యెడల ఎన్ని అద్భుతములున్నవో అన్నీఅద్భుతములు సమయానుకూలముగ మనమేచేస్తాము. అప్పుడు విరోధులు తగ్గిపోతారు. సన్నిధి లేనిచో అద్భుతములు జరుగవు అద్భుతములు జరగకపోతే విరోధము తగ్గదు. విరోధము తగ్గాలంటే సన్నిధిలో నుండండి. దీనికి చాలవివరమున్నది. పరలోకభక్తులు మీరు సన్నిధిలోనికి వెళ్ళండి, వెళ్ళండి. అని ప్రేరేపిస్తున్నారు, అప్పుడు అద్భుతములు జరుగునని చెప్పుచున్నారు. బైబిలు అద్భుతములు ఇంకా ఎక్కువ జరుగునని చెప్పుచున్నది (మీరు మీ,మీ, ఇండ్లకు వెళ్ళి సన్నిధికూటములు స్థాపిస్తారో అట్టివారు చేతులెత్తండి.) భక్తిలేనివారైనాసరే, ఏ మతస్తులైనాసరే, వ్యాధిగ్రస్తులైనాసరే ఇంకా ఎవరైనాసరే దైవసన్నిధి కూటమునకు వెళ్ళితే అద్భుతములు జరుగును.

మొదటి అద్భుతము నీవు మారడమే.

Please follow and like us:

How can we help?