సంఘారాధనలు

⌘K
  1. Home
  2. Docs
  3. సంఘారాధనలు...
  4. 3. ప్రభు భోజన సంస్కారాధన

3. ప్రభు భోజన సంస్కారాధన

( బాప్తీస్మము పొందినవారికి ప్రభువు రాత్రి భోజనమునకు ముందు

పాదశుద్ధి చేయవలెను.)

                                                     వాక్య పఠన

   దా.కీ. 23 అ. మార్కు 11: 22- 25; 1కొరింధి 11: 23-33.

   బో: తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు పరిశుద్ధాత్ముని 

యొక్కయు నామమున ఆమెన్.

                                         పాపము ఒప్పుదల క్రమము

   బో: ప్రియులారా నేను పాపములేని వాడనని యనుకొనువాడు 

మోసములోపడిపోవును. మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల

దేవుడు క్షమించివేయును. ఒప్పుకొననివాడు మరింత గొప్పపాపియై దేవునికి

దూరస్తుడగును., నేనిప్పుడడుగు ప్రశ్నలకు హృదయపూర్వకముగ

ఉత్తరమీయుడి.

      1. ప్రశ్న: మీరు జన్మమును బట్టియు, మీ తలంపులను బట్టియు, 

మాటలను బట్టియు, క్రియల బట్టియు, పరలోకపు తం డ్రి యొక్క

మనస్సును ఆయాస పెట్టియున్నారని ఒప్పుకొనుచున్నారా?

        జవాబు: ఔను, ఒప్పుకొను చున్నాము.

      2. ప్ర: మీ పాపములన్నిటిని మన ప్రభువైన యేసు నామమును బట్టి 

తండ్రి క్షమించినాడని నమ్ముచున్నారా?

       జ: నమ్ముచున్నాను.

      3. ప్ర: మీరు యే పాపమునకు లోబ డక సమస్త శోధనలను దైవ 

వాగ్దానములను బట్టి జయించుటకు నిశ్చయించుకొనుచున్నారా?

        జ: ఔను నిశ్చయించుకొనుచున్నాము.

                                                        పాప క్షమాపణ ప్రకటన

   నిజముగా పాపములను గురించి దుఖించి వాటిని ఒప్పుకొని యిక మీదట 

జాగ్రత్తగా నుందుమని ప్రమాణము చేసిన యెడల అట్టి వారికి వాక్య సేవకుడైన

నేను తండ్రియొక్కయు, కుమారునియొక్కయు పరిశుద్ధాత్ముని యొక్కయు

నామమున పాపక్షమాపణ ప్రకటించుచున్నాను, మరియు పాపము

నొప్పుకొనక పాపస్థితి యందుండు వారికి విలువ పాపముల సంగతి

ప్రకటించుచున్నాను.

                                    ప్రభువు ప్రార్ధన (అందరు చెప్పవలెను)  

                                                          పాద శుద్ధి

        బో: ప్రియులారా ! యేసుప్రభువు భోజన సమయమందు ఒక 

తువాలు తీసికొని నడుమునకు కట్టుకొనెను. గనుక నేనును అట్లు

చేయుచున్నాను. ఇది పరిచర్య చేయుట కుండవవలసిన మనస్సునకు గురుతై

యున్నది. అంతటప్రభువు పళ్ళెములో నీళ్ళు పోసెను., కనుక నేనును అట్లు

చేయుచున్నాను. పిమ్మట ప్రభువు శిష్యుల పాదములు కడుగుచు ఆ

తువాలుతో తుడిచెను, గనుక నేనును అట్లు చేయుచున్నాను. “నేను నిన్ను

కడగని యెడల నాతో నీకు పాలు లేదని ప్రభువు పేరుతో చెప్పెను” [ప్రభువుతో

నీకు పాలు కలుగును గాక అని చెప్పుచు భోజనాదుల పాదములు

కడుగవలయును] యోహాను 13:12-17.

                                                    భోజనాచారము

స్తుతి దా.కీ 136

బో: ప్రభువుల ప్రభువునకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుడి. ఆయన కృప

నిరంతర ముండును.

సం: ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయువాడు ఆయన కృప

నిరంతర ముండును. కీర్తన 136:4.

బో: యెహోవా దయాళుడు, యెహువాను స్తుతించుడి.

సం: ఆయన నామమును కీర్తించుడి. అది మనోహరము కీర్తన 135:3.

బో:మన దేవుడైన యెహోవాన్ తాను యేర్పర్చుకొనిన వారిని ఉత్సాహ ధ్వనితో

వెలుపలికి రప్పించెను.

సం: ఆకాశములోనుండి ఆహారము నిచ్చి వారిని తృప్తి పర్చెను. కీర్తన 105:40

దేవదూతల ఆహారము నరులు భుజించిరి.

బో: దేవా! మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము.

సం: నీవు సమీపముగా నున్నావని కృతజ్ఞతా స్తుతులు చెల్లించుచున్నాము.

దా. కీ.75:1

                                                         స్తుతి ప్రార్ధన

 ప్రేమవైయున్న తండ్రీ! నీకుమారునితో నిన్ను బయలు పరచుకొన్న నీకు 

మహిమ, మహిమ, మహిమ యని స్తుతించుచున్నాము. ఈ ప్రత్యక్షతను

మేము గౌరవింపగల జ్ఞాన విధేయత నగ్రహింపుము. ఆమెన్.

 ఓ దేవా! అరణ్యములో నీ ఎన్నికజనమైన యిశ్రాయేలీయులకు భోజనపు 

బల్ల సిద్ధపర్చిన నీవు మాకు నీ కుమారునిదేఅరా మా ఆత్మీయ

జీవనపోషణార్ధమై సంస్కారపు భోజన బల్ల వేసినందుకు నీకు స్తోత్రము

లాచరించుచున్నాము. ఇది తగిన రీతిని అనుభవించుటకై మమ్ములను నీ

ఆత్మచేత అక్కడికి నడిపింపునుము. ఆమెన్.

                                                         స్తుతి వచనము

 సిం హాసనము దూతల స్తుతి పాట [యెషయా 6:3] సైన్యములకు 

అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు సర్వలోకము

ఆయన మహిమతో నిండియున్నది. [7 మార్లు]

                                                             ప్రసంగము

భో: ప్రియులారా! మీరు ఇప్పుడు ప్రభువు బల్ల వద్దకు రాగోరుచున్నారు. ఇది

మంచిదే. ప్రభువు పిలుచుచున్నందున మీరు వచ్చిన యెడల మీరాక ఎంతో

మంచిది. మీరు మీకంటికి కనబడుచున్నరొట్టెయును, ద్రాక్షరసమును కూడ

పుచ్చుకొనుచుండగా ప్రభువు యొక్క శరీర రక్తములను చెదరనీయకుడి, మీ

హృదయములను కృతజ్ఞతాస్తుతులతో నింపుడి, నీతికొరకు ఆకలి దప్పులు

గలవారు ధన్యులు. వారు తృప్తిపరచబడుదురు.

                                                             వాక్యము 

  లోకపాపమును మోసికొనిపోవు దేవుని గొర్రెపిల్లవైన ఓ క్రీస్తు నీ 

సమాధానము మాకు దయచేయుము. ఆమెన్.

                                             ప్రతిష్టయును, సమాభాక్త్వమును

                                                 వాక్యము-మత్తయి 26:26-29 

  యేసుప్రభువు రొట్టె పట్టుకొనెను. గనుక నేనును అట్లు చేయుచున్నాను. 

యేసు ప్రభువు కృతజ్ఞతా స్తుతులు చెల్లించెను, గనుక నేనును, అట్లు

చేయుచున్నాను. ప్రభువా! ఇది దయచేసినందుకు నీకు స్తోత్రము. పిమ్మట

ప్రభువు రొట్టె విరిచెను, గనుక నేనును అట్లు చేయుచున్నాను. అటుపిమ్మట

ప్రభువు దానిని వారికిచ్చెను. నేనును అట్లు చేయుచున్నాను. పుచ్చుకొని

తినుడి, ఇద్ మీ కొరకియ్యబడిన క్రీస్తు శ్సరీరము ప్రభువు గిన్నె పట్టుకొనెను,.

నేనును అట్లు చేయుచున్నాను. ప్రభువు కృతజ్ఞతా స్తుతులు చెల్లించెను.గనుక

నేనును అట్లు చేయుచున్నాను. తండ్రి! యిది దయచేసినందుకు నీకు

స్తోత్రములు. పిమ్మట ప్రభువు దానిని వారికిచ్చెను. నేనును అట్లు

చేయుచున్నాను.దీనిలోనిది మీరందరు త్రాగుడి. ఇది క్రీస్తు రక్తము. అనగా

పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడిన క్రొత్త నిబంధన

రక్తము.

   మనప్రభువైన యేసుక్రీస్తుయొక్క పరిశుద్ధ శరీరమును, అ అమూల్య 

రక్తమును, మీ ఆత్మీయ జీవమును పోషించుచు, బలపరచుచు పెండ్లి

కుమారుని రాకకును, అనంత జీవమునకును మిమ్మును సిద్ధపరచును గాక!

ఆమెన్.

                                                          ప్రార్ధన చేయుదము

  బో: ఓ ప్రభువా! పెండ్లికుమారుడుగా రానై యున్న మా ప్రియుడవగు 

ప్రభువా! నీ శరీర రక్తములతో నీవు మమ్మును పోషించినందున నీకు

కృతజ్ఞులమై యున్నాము. ఈసంస్కార భోజనములో నున్న అద్భుతమైన

క్రియను మేము గ్రహించలేక పోవుచున్నను ఆ క్రియను, ఆ క్రియ యొక్క

ఫలితమును మేము నమ్ముచు వందనములు చేయుచున్నాము.

  పరలోకపు తండ్రీ! నీ కుమారుని ద్వారా నీ సంఘమునకు నీ 

వనుగ్రహించిన యీ పరిశుద్ధ భోజనము యొక్క ఉద్ధేశము లన్నిటి విషయమై

నీకు స్తుతులు సమర్పణ చేయుచూ నీ ఉద్ధేశము నెరవేరుటకై నీ ఆత్మ యొక్క

ప్రేరేపణ దయచేయుమని ప్రభువు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమెన్.

                                               (పాటపాడుచుండగా చందా 

యెత్తబడును)

                                   ఆది 14:18 నిర్గమ 12:21-28, 11 సమూ 9: 13 

కీర్తనలు 23అ.

                                 మత్తయి 26:27-29. 5:6, 22:4-22 మార్కు 14: 

22-25.

                                 లూకా 14:15-24., 15:22-23, 22:15-20. 

యోహాను 6:47-59.

                                 యోహాను 13:4-15 1కొరొంధి 10:21, 11:23-29 

ప్రకటన 19:9.

Please follow and like us:

How can we help?