- కీర్తన 20 (18) “పరిశుద్ధ, పరిశుద్ధ,పరిశుద్ధ, ప్రభువా. ప్రవేశ వాక్యములు బో: దేవుని ప్రియులారా! క్రీస్తుప్రభుని సంఘాభివృద్ధి నిమిత్తమై ఒక వాక్య బోధకుని బాహాట ముగా దైవసన్నిధిలో నియమించునట్టి యొక గొప్పపనిమీద మనమిచ్చట సమావేశమైనందున త్రియేక దేవుడవగు తండ్రియును, పరలోక పరిశుద్ధులును, దేవదూతలును మన మధ్యకు వచ్చియున్నారను విశ్వాసముతో నీయభిషేకారాధనలో నేకీభవించుదము దీనిలోని ప్రతి యంశమును, నమ్రతతోను, గౌరవముతోను, శాంతికరమైన విధానముతోను జరుపుదము. ఇది స్వచ్చాపూర్వకమైన మహానంద విధి. బలవంతమైన నామకార్ధ విధి కాదు. దైవారాధనకు పవిత్రమైన అలంకార స్థానమగునుగాక. ఆమెన్.
దావీదు కీర్తన
95వ అధ్యా|| (ఒకరి తరువాత మరియొకరు చదువుట) త్రైక దేవుని స్తుతితండ్రికిని, కుమారునికిని, పరిశుద్ధాత్మకును, ఆదియందు ఇప్పుడును, ఎల్లప్పుడును యుగయుగముల యందుమహిమ కలుగును గాక. ఆమెన్. బైబిలు పాఠములు
1కొరింధి 4:1-4. లూకా 4:17-21; నిర్గమ 28: 29 40: 12-16.ప్రార్ధన
ప్రేమ స్వరూపి, పరిశుద్ధుడవును, మహా ఘనుడవునగు దేవా తండ్రివిగాను, కుమారుడవుగాను, పరిశుద్ధాత్ముడవుగాను, ప్రత్యక్షమైన తండ్రీ! భూమి మీదనున్న దృశ్య సంఘమునకు పరిశుద్ధ నైజముగల దేవదూతల నేర్పర్చుకొనక, బలహీనులైన మానవుల నేర్పర్చుకొన్న నీ విజ్ఞాన ప్రేమాతిశయమున కనేక స్తోత్రములు. నీవు పిలిచిన యీయనకు నీవు పిలిచిన యుద్ధేశము నెరవేరువరకు పవిత్ర ప్రవర్తనాశక్తియు విశ్వాసశక్తియు, భోధనాశక్తియు ననుగ్రహించుచు సహకారివై యుండుమని నీతోను, పరిశుద్ధాత్మతోను, సదా యేకదేవుడుగు యుగయుగములు జీవించుచు పరిపాలించుచుండు నీ ప్రియకుమారుడును, మా ప్రభువైన యేసుక్రీస్తుద్వారా నిన్ను వేడుకొనుచున్నాము. ఆమెన్. కీర్తన( దేవ సంస్తుతి చేయవే మనసా - 3చరణములు) బైబిలు వాక్యములు ప్రసంగములు
బో: ప్రభువును, సైన్యములకు అధిపతియునైన యెహోవా చెప్పునదేమనగా నా సేవకుడవైన యిశ్రాయేలూ! నీవు నా దాసుడవనియు, నేను నిన్నపేక్షింపక ఏర్పర్చుకొంటిననియు నేను నేను నీతో చెప్పియున్నాను, నీకు తోడైయున్నాను. భయపడకుము. నేను నీ దేవుడనై యున్నాను దిగులుపడకుము, నేను నిన్ను బలపరతును. నీకు సహాయము చేయువాడను నేనే. నీతి యను నాదక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. నీమీద కోప పడువారందరు సిగ్గుపడి విస్మయమొందుదురు. నీతో వాదించువారు మాయమై నశించుపోవుదురు.నీతో కలహించువారిని నీవు వెదుకుదువు గాని వారిని కనుగొనలేకపోవుదువు. నీతో యుద్ధము చేయువారు మాయమైపోవుదురు. అభావులగుదురు. నీదేవుడైన యెహోవానగు నేనే. భయపడకుము. నేను నీకు సహాయము చేసెదనని చెప్పుచు నీ కుడిచేతిని పట్టుకొనుచున్నాను. ( యెషయా 41:8-13.) రక్షకుడైన యేసుప్రభువు చెప్పినదేమనగా మీకు సమాధానము కలుగునుగాక! తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మును పంపుచున్నాను. పరిశుద్ధాత్మను పొందుడి. మీరు యెవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును. ఎవరిపాపములు మీరు నిలిచి యుండనిత్తురో అవి నిలిచియుండును. యోహాను 20: 21-23) పరలోకమందును, భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడియున్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులకు శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు, కుమారునియొక్కయు, పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తీస్మమిచ్చుచు; నేను మీకు ఏసంగతులను ఆజ్ఞాపించితినో వాటి నన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను సదాకాలము మీతోకూడ ఉన్నాను. (మత్తయి 28:18-20) భూమి మీద మీరు వేటినిబంధింతురో అవి పరలోకమందును విప్పబడునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను, మరియు మీలో యిద్దరు తాము వేడుకొనిన యే సంగతిని గూర్చినను భూమిమీద ఏకీభవించిన పక్షమున అది పరలోకమందు నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను, ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడకూడియుందురో అక్కడ నేను వారి మధ్యన ఉందును. మత్తయి 18:18-20) ఇదిగో పాములను, తేళ్ళను త్రొక్కుటకును, శత్రుబలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించియున్నాను! ఏదియు మీకెంత మాత్రమును హానిచేయదు. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవనిసంతోషింపక,మీ పేరులు పరలోకమందు వ్రాయబడియున్నదని సంతోషించుడి. (లూకా 10:19-20.) నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు.క్రొత్త భాషలను మాట్లాడుదురు. పాములను ఎత్తి పట్టుకొందురు. మరణకరమైనది, యేది త్రాగినను అది వారికి హానిచేయదు. రోగులమీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు. (మార్కు 16:17-18) నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను. గనుక నేను చేయు క్రియలు నాయందు విశ్వాసముంచువాడును చేయును. వాటికంటె మరి గొప్పవియు అతడు చేయును. అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీరు నా నామమునుబట్టి మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతును. (యోహాను 14: 12-14)అపొస్తులుడైన పౌలు చెప్పినదేమనగా! ఎవడైనను అధ్యక్షత నాసించినయెడల అట్టివాడు దొడ్డపని అపేక్షించు చున్నాడనుమాట నమ్మతగినది. అధ్యక్షుడగువాడు నిందారహితుడును, ఏకపత్నీపురుషుడును, మితానుభవుడును, స్వస్థబుద్ధిగలవాడును, మర్యాదస్తుడును, అతిధి ప్రియుడును, బోధింపతగినవాడునై యుండి, మద్యపానియు కొట్టువాడుకాక, సాత్వికుడును, జగడమాడని వాడును, ధనాపేక్ష లేనివాడును, సంపూర్ణ మాన్యతకలిగి, తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు తన యింటివారిని బాగుగా ఏలువాడునై యుండవలెను. ఎవడైనను తన యింటివారిని ఏల నేరకపోయిన యెడల అతడు దేవుని సంఘమును ఏలాగు పాలించును? అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడక ఉండునట్లు4 క్రొత్తగా చేరినవాడై యుండరాదు, సంఘమునకు వెలుపటివారిచేత మంచిసాక్ష్యము పొందినవాడై యుండవలెను. (1తిమోథి 3:1-7
వాక్యమును ప్రకటించుచు, సమయమందును, అసమయమందును, ప్రయాసపడుచు సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, బుద్ధి చెప్పుము. (2తిమోతి 4:2)అభిషేకము పొందవలసిన బోధకుని అడుగవలసిన ప్రశ్నలు
దేవుని పిలుపు నంగీకరించిదుట యీన … అను నిన్ను బైబిలుమిషను సంఘము యెదుట యీ ప్రశ్న అడుగుచున్నాను. ప్రశ్న: నీ బోధలమూలముగ అను, నీప్రార్ధనల మూలముగాను, నీ ప్రవర్తన మూలముగాను, నీ వరములు వాడుకొనుట మూలముగాను, నీ ఉద్యోగము నిలువబెట్టుకొనుచు క్రీస్తుప్రభువునకు మహిమ తెచ్చుకొనుటకై నీ సమయమును, నీశక్తిని, నీ సమస్తమును సద్వినియోగ పరుపయత్నింతువా? జ: ప్రభువు సహాయము వలన అలాగుననే ప్రయత్నించెదను. ప్రశ్న: మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోక మందున్న మీ తండ్రిని మహిమ పరచునట్లు వారి యెదుట నీ వెలుగు ప్రకాశింపనిత్తువా మత్త్తయి 5:16.) జ: ప్రభువు సహాయమువలన అలాగుననే ప్రకాశింప నిత్తును. ప్రశ్న: దేవుని వాక్యము సరిగా బోధించుచు దీర్ఘాలోచన చేసి బాప్తిస్మము ఇచ్చుచు దైవభయములో ప్రభు భోజనము పంచిపెట్టుచు మతసంబంధమైన కార్యములన్నియు, దేవుని ముఖము చూచి సక్రమముగా నదుపుదువా? జ: ప్రభువు సహాయము వలన అలాగుననే నడిపించెదను. ప్రశ్న: బైబిలు మిషను అనుభవము ప్రకారము దేవుడు బయలు పర్చునట్టి బైబిలు వాక్యమును బైబిలుయొక్క అనుభవమైయున్న సంగతులను నిర్భయముగా బోధింతువా? జ ప్రశ్న: ప్రస్తుతము బయలుపడిన పరిశుద్ధాత్మ బాప్తిస్మము యొక్క అవసరము, వరముల అవసరము, ప్రభువు రాకడయొక్క సామీప్యము, అనునట్టి సంగతులు బోధింతువా? జ: ప్రభువు సహాయము వలన ఆలాగుననే బోధించెదను. ప్రశ్న: దేవుని వాక్యప్రకారముగాను, పెద్దల సలహా ప్రకారముగాను నీ ఉద్యోగ ధర్మములు నిర్వహింతువా? జ: ప్రభువు సహాయమువలన ఆలాగుననే నిర్వహించెదను. ఇతర మిషనులలో గురువులుగానుండి బైబిలుమిషనులోనికి గురువులుగా వచ్చి చేరువారిని అడుగవలసిన ప్రశ్నలు- ప్ర: దేవుడు బైబిలుమిషను యం. దేవదాసు అయ్యగారికి బైలుపరచినారనియు, బైబిలుమిషను సిద్ధాంతములన్నియు ప్రభువే బయలుపరచినారనియు నమ్ముచున్నావా? వాటిని బోధింతువా? జ: ప్రభువు సహాయము వలన అలాగుననే చేయుదును.
- ప్ర: బైబిలు మిషనులోని కార్యక్రమములను జరిగించుటకును, కుటుంబజీవిత పోషణ కొరకును, ఇతరులపై ఆధారపడక ప్రభువుమీదనే ఆధారపడి బైబిలుమిషను విశ్వాస పద్ధతినే అనుసరింతువా? జ: ప్రభువు సహాయము వలననే ఆలాగుననే జరిగింతును.
- ప్ర: నేడును ప్రభువు మాట్లాడు నను సంగతిని బోధింతువా? జ: ప్రభువు సహాయమువలన ఆలాగుననే బోధింతును.
- ప్ర: దేవ సన్నిధి అనుభవము కలిగి సంఘమును అట్టి అనుభవములోనికి నడిపింతువా? జ: ప్రభువు సహాయము వలన ఆలాగు చేయుదును.
- ప్ర: ప్రభువు యొక్క రెండవరాకడ మిక్కిలి సమీపముగా నున్నదని నమ్మి అందరు కొరకు సిద్ధపడి సంఘమును సిద్ధపరుతువా? జ: ప్రభువు సహాయము వలన అట్లే చేయుదును. ప్రమాణము
(అభిషేకము పొందవలసినవారి మాటలు)
ప్రజల మేలుకొరకును, ఆయన రాజ్యాభివృధికొరకును పెండ్లికుమార్తె, సిద్ధపడవలసిన ప్రయత్నముకొరకు
యం. దేవదాసు అయ్యగారు త్రియేకదేవుని సెలవుప్రకారము యిదివరకే బైబిలు మిషను పేరుతో యొక మిషను స్థాపించినారు. ఈ మిషను వృద్ధికొరకు వాక్యప్రకారముగాను, ఆత్మ నడిపింపు ప్రకారముగాను చేయుదునని నిశ్చయించుకొన్నాను. ఈ నా హృదయ నిశ్చయత మీకు బయలుపరచుచున్నాను.
* (అభిషేకము పొందవలసిన బోధకుడు స్వయముగా చెప్పవలసిన మాటలు)
అభిషేకము
బో: సర్వవ్యాపియగు త్రియేకదేవుడును, పరలోక పరిశుద్ధులును, పరిశుద్ధ దేవదూతలును, యీ నిమిషమందు యీ స్థలమును చూడవచ్చి యీ సంతోషములో పాలివారగుచున్నారని యెవరు నమ్ముచున్నారో వారందరును గౌరవబుద్ధి వెల్లడించుటకై లేచి నిలువ బడుడి.
ప్రతిష్టించుట
అందరు నిలువబడియుండగా అభిషేకము పొందవలసిన బోధకుడు మోకరింపవలెను.
(పాష్టరుగా) సృష్టికర్తయగు తండ్రియొక్కయు, రక్షణ కార్యకారియగు కుమారునియొక్కయు,సంఘ మార్గదర్శియగు పరిశుద్ధాత్మ నామమున పరిశుద్ధవాక్య సంస్కారముల ఉద్యోగమును నీ కప్పగించి నిన్ను క్రైస్తవ సంఘకాపరిగా అభిషేకించుచూ దైవ సేవకై ప్రతిష్టించుచున్నాను.
(రెవరెండుగా) దేవుడు యం. దేవదాసు అయ్యగారికి బయలుపరచిన బైబిలు మిషను నందు గల సంఘకార్యములను జరిగించుటకును వధువు సంఘ సిద్ధబాటుకొరకైన అనుభవ అంతస్తులను నేర్పించి సిద్ధపరచుటకై నిన్ను క్రైస్తవ సంఘ గురువుగా అభిషేకించుచు, ప్రతిష్టించుచున్నాను.
స్తోత్ర ప్రార్ధన
ఆకాశమును, భూమిని సమస్తమును కలుగజేసిన ప్రియుడగు మా తండ్రీ! మీ కుమారుని మూలమున మాకు తండ్రిగానున్న మా తండ్రీ! భిన్నాభిప్రాయమునెదుట బైబిలుమిషను పేరుతో నొక మిషను స్థాపించుకొనుటకు నీ విచ్చిన ఉపదేశము నిమిత్తమై నిన్ను స్తుతించుచున్నాము. మరియు యీ నీ సేవకుని పిలిచి నేడు అభిషేకారాధన దినముగా నియమించిన నీ సామర్ధ్యమును; కొనియాడుచున్నాము. ఈ మిషను పనిని సర్వలోక రాష్ట్రముల పరిశీలనా దృష్టియెదుటను అన్నిమిషనుల విభేధముల దృష్టిపథము యెదుటను, అంధకార రాజ్యముయొక్క ద్వేషభావనేత్రములయెదుటను, సంఘము యొక్క ఆమోద ముఖబింబము నెదుటను, నీ వాగ్ధానసిద్ది కనుబరచుచు సాగింతునని ముందుగానే నమ్మి నీకు వందనము లాచరించుచున్నాను. ఆమెన్.
దీవెన
యెషయ 61: 1. లూకా 4:18. అ.కా.10: 38. 2కొరింధి 1:21. 1యోహాను 2:20,27.
Please follow and like us: