సంఘారాధనలు

⌘K
  1. Home
  2. Docs
  3. సంఘారాధనలు...
  4. 14. కాలోచిత ప్రార్ధనలు...
  5. క్రిష్ట్మసు స్తోత్రారాధన

క్రిష్ట్మసు స్తోత్రారాధన

యోహాను 1అ. ఎఫెసి 1:4-12 ఫిలిప్పీ 2:4-7 ఆది 3:14; 9:26;12:1-3;49:9,10 సంఖ్య 24:16.17 ద్వితి 18:16-22 కీర్తన 72:16-18 యెషయా 7:14;9:6,11:1. మీకా 5:2, లూకా 1:26-56. 2:1-38; మత్తయి 1:18-26. ఆ|| గలతీ 4:4, 5 రొమా 1:2-9. హెబ్రి 1;1-5. యోహాను 1అ. ఎఫెసి 1:4-12 ఫిలిప్పీ 2:4-7 ఆది 3:14; 9:26;12:1-3;49:9,10 సంఖ్య 24:16.17 ద్వితి 18:16-22 కీర్తన 72:16-18 యెషయా 7:14;9:6,11:1. మీకా 5:2, లూకా 1:26-56. 2:1-38; మత్తయి 1:18-26. ఆ|| గలతీ 4:4, 5 రొమా 1:2-9. హెబ్రి 1;1-5.

                          క్రిస్ట్మసు అనగా క్రీస్తును ఆరాధించుట అని అర్ధము

    ప్రేమ స్వరూపివైన తండ్రీ! నీవు లోకమును ప్రేమించియున్నావు అను వాక్యమును బట్టియు, విశ్వసించువారు నశింపక నిత్య జీవము పొందుటకై నీ అద్వితీయకుమారుని పంపిన వృత్తాంతమును బట్టియు నిన్ను స్తుతించుచుచు ఆరాధించుచున్నాము. బహిరంగమున మొట్టమొదట శిశువుగా ప్రత్యక్షమైన జనత్రైక కుమారుడవైన యేసుప్రభువా పాపమును, దుష్ట ఫలితమును గల ఈ లోకమునకు రాగోరిన నిన్ను స్తుతించుచు ఆరాధించుచున్నాము.                       క్రిస్ట్మసు అనగా క్రీస్తును ఆరాధించుట అని అర్ధము .

   పరిశుద్ధాత్మవైన తండ్రీ! మా ప్రియరక్షకుడు మా భూలోకమునకు రావలసిన రాకడను నీవు పరిశుద్ధ కన్యక మూలముగ నెరవేర్చినందులకు నిన్ను స్తుతించుచు ఆరాధించుచున్నాము. త్రియేక దేవుడవైన తండ్రీ! అనాదిలో నీవు ఉద్దేశించిన కార్యములను యుక కాలముల యందు చిత్రమైన పద్దతుల మూలముగ జరిగించుచు వచ్చిన నీ అనంత జ్ఞానమును బట్టి నిన్ను స్తుతించుచు ఆరాధించుచున్నాము.       పరిశుద్ధాత్మవైన తండ్రీ! మా ప్రియరక్షకుడు మా భూలోకమునకు రావలసిన రాకడను నీవు పరిశుద్ధ కన్యక మూలముగ నెరవేర్చినందులకు నిన్ను స్తుతించుచు ఆరాధించుచున్నాము. త్రియేక దేవుడవైన తండ్రీ! అనాదిలో నీవు ఉద్దేశించిన కార్యములను యుక కాలముల యందు చిత్రమైన పద్దతుల మూలముగ జరిగించుచు వచ్చిన నీ అనంత జ్ఞానమును బట్టి నిన్ను స్తుతించుచు ఆరాధించుచున్నాము.

    శిశువైన యేసుప్రభువా, సర్వలోక రక్షకుడవైన నీవు సర్వలోక  ప్రజాసంఖ్య లిఖిత సమయమున కాలము పరిపూర్ణమైనప్పుడు జన్మించిన నిన్ను స్తుతించుచు ఆరాధించుచున్నాము.  మానవ శిశువైన దేవా, ప్రజా సంఖ్యగణన దినములలో పుట్టుటవల్ల ప్రజల సంఖ్యలో చేరుటకు బిడియపడని నిన్ను స్తుతించుచు ఆరాధించుచున్నాము.    

            శిశువైన తండ్రీ! ప్రవచన ప్రకారము బెత్లెహేములో పుట్టి ప్రవచనము సార్ధకము చేసిన నిన్ను స్తుతించుచు ఆరాధించుచున్నాము.  క్రీస్తుప్రభువుగా వచ్చిన శిశువా! భూమి యాకాశములను వాటిలోని  సమస్తమును నీవియైయున్నప్పటికిని గొప్ప వారి గృహములలో నున్న ఉయ్యాలతొట్టిలేనివాడవై పశువులతొట్టిలో పరుండిన నీ దీనత్వమును బట్టి నిన్ను స్తుతించుచు ఆరాధించుచున్నాము.  

  యేసు ప్రభువుగా వచ్చిన శిశువా, విశ్వాసులకు నీ నీతి వస్త్రమును ధరింపజేయగల నీవు పొత్తిగుడ్డలు ధరించుకొన్నంత పేదరికము రాగా సహించుకొన్న నిన్ను స్తుతించుచు ఆరాధించుచున్నాము. శిశువుగా కనబడి కాల క్రమేణ వెయ్యేండ్ల స్వీయ పరిపాలనలో రాజులందరికంటెను గొప్పవాడవుగ కనబడకపోవు నీవు ప్రపంచ చక్రవర్తివైన ఔగుస్తుపాలనలో జన్మించుటవల్ల నీ వెంత దేవుడవైనను, మానవ జన్మమునుబట్టి మానవాధికారుల స్వాధీనములో చేరిన నీవినయస్వభావమునకు అనుగుణ్యముగా నిన్ను స్తుతించుచు ఆరాధించుచున్నాము.

   శిశువు అనిపించుకొన్న రాజా, నరులు ఎంత గొప్ప చక్రవర్తులైనను నీ వలననే గొప్ప స్థితికి వచ్చినందున అట్టి ఔగుస్తువంటి వారిని కూడ నీ సేవలో ఉపయోగపరచుకొనుచున్న నిన్ను స్తుతించుచు ఆరాధించుచున్నాము. ఆమెన్.
Please follow and like us:

How can we help?