జెకర్యా 9:9. మత్తయి 21:1-17. మార్కు 11:1-11.లూకా 19:29-46 యోహాను 12:12-16.
ప్రార్ధన
రారాజువైన ప్రభువా! ప్రవక్తలు ప్రవచించిన ప్రకారము గార్ధభాసీనుడై జయోత్సాహముతో యెరూషలేమునందు ప్రవేశించిన నీకు నుతులు. ఈ యెరూషలేము ప్రవేశము నీ రెండవరాకడలో పరలోక నూతన యెరూషలేమునందు ప్రవేశించుటకు సూచనగా జరిగించిన నీకు స్తోత్రములు. నీవు భూలోక యెరూషలేమునకు వెళ్ళునప్పుడు గార్ధభముపై కూర్చుండుట, రేపు నీవు రెండవ రాకడలో పెండ్లికుమార్తెను తీసికొని వెళ్ళుటకు వచ్చునప్పుడు నీవు కూర్చుండు మేఘమునకు సూచనగా చూపించిన నీకు నుతులు. నీవు యెరూషలేమునకు జయోత్సాహముతో వెళ్ళునప్పుడు నీముందు ఒక గుంపు, నీ వెనుక ఒక గుంపు ఉన్నట్లు నీవు రెండవరాకడలో మేఘముమీద వచ్చునప్పుడు నిన్ను కలసికొను మృతుల గుంపును, సజీవులగుంపును, సూచించునట్లు శిష్యులు పరచిన వస్త్రము నీవు రాకడలో వాహనముగా ఏర్పర్చుకొన్న షెఖీనామేఘముపై పెండ్లికుమార్తె వేయు స్తుతి వస్త్రమునకు ముంగుర్తుగా నేర్పర్చిన నీ ప్రేమ కార్యము నిమిత్తమై నా జ్ఞానమునకు తోచినన్ని వందనములు. ప్రభువా! నీకు జయమురాక ముందే జయము పాడినప్పుడు నీవు అంగీకరించుటవలన విశ్వాసులకుముందు అపజయము కనబడినను చివరికి జయమే అనియు, అప జయము ఉన్నను, స్తుతించవలెననియు, జయమనుకలవరింపు నీ బిడ్డలెప్పుడును కలిగి ఉండవలెననియు,నిన్ను బట్టి మాకు అన్ని విషయములలో జయమేననియు, మాకు నేర్పిన నీకు నాశక్తికి మించిన ప్రణతులు. యీ మా స్తుతులను మేఘారూఢుడై రానున్న ప్రభువు ద్వారా అంగీకరించుము. ఆమెన్.
Please follow and like us: