మత్తయి 24.అ|| 25:6-10. మార్కు 13. అ|| లూకా 17:34-37; 21అ|| యోహాను 14:3 కార్య 1:11 2:19. 1కొరింధి 15 అ|| కీర్తన 45. అ|| యెహెజ్కేలు 37:21. ఎఫెసి 5:27. 1దెస 4:16, 17, 5:2, 2పేతురు 3:3-9.
ప్రార్ధన:- త్రియేక దేవుడవైన ఓ తండ్రీ! ప్రభువా! సర్వాధికారీ సమస్త సృష్టికి కర్తవైన ఓతండ్రీ నీ మహా గొప్ప మహిమ యెదుట పాపులమైన మేమీదినమందు కూర్చుండి మా ప్రభువు యొక్క రెండవ రాకడ ధ్యానము చేయగోరుచు నిన్ను స్తుతించుచున్నాము. ఓ దేవా నీవు కలుగజేసిన సూర్య చంద్ర నక్షత్రములను వధువు సంఘము చూచినపుడు, ఇవే ఇంత కాంతిగా ఉంటే నాతండ్రి ఇంకా ఎంత కాంతిగా ఉండునో అని తలంచే తలంపు వధువు సంఘమునకు దయచేయుము. నేనింకెప్పుడు పరలోకములోనికి వెళ్ళి ఆయన మహిమకాంతిలో జ్యోతివలె ప్రకాశించి ఆనందించే కృప వధువు సంఘమునకు దయచేయుము ఆరాబోయే మహిమ కాంతికి మేము సిద్ధపడులాగున ఇప్పుడే ఈజ్యోతులకాంతిని ఆకాశమందుచూపుచున్నందుకు నీకు వందనములు. ఆకాశ జ్యోతుల కాంతిని చూపుచు నీ మహిమ కాంతిని జ్ఞాపకము చేస్తున్నందుకు వందనములు. వాటికి స్వరము లేకపోయిన 1. బోధకుల కంటె 2. గ్రంధములకంటే మాకు ముందుగా నీ మహిమను తెలియజేయు జ్యోతులనుబట్టి నీకు వందనములు.
2. నీవు మాకు దాచిపెట్టి ఉంచిన మేఘజలమును చూడగా, మేము పరలోకములోనికి వచ్చి చూడబోయే. సుకారు బావియొద్ద సమరయస్త్రీతో చెప్పిన జీవ జలమును జ్ఞాపకముచేయునట్టి కృప వధువు సంఘమునకు దయచేయుము. 3. మరలా రాగా మాకంటే తక్కువగా నిన్ను గూర్చి తెలిసియున్న పక్ష్యాదులయొక్క ఉదయకాల గానములు చూడగా పరలోకానికి వెళ్ళి ఆగని స్తుతిగానము మేమెరుగని స్తుతి గానము, దూతల స్తుతి గానము, భక్తుల స్తుతిగానము గ్రహించు వధువు సంఘ స్థితి జ్ఞాపకము దయచేయుము. 4. ఇంకా క్రిందికి రాగా పాపముచేయు మానవులకు ఇట్టి పండ్లు పువ్వులు ఆనందము దయ చేయు మాకు, పరలోకములో జీవ వృక్ష పండ్లు, ఆనంద పుష్పములు, వస్తువులు దయచేయునని తలంచే కృప వధువు సంఘమునకు దయచేయుము.
5. పాపమువలన చెడిన ఈ సృష్తిలోనే ఇంత రమ్యమున్నది. ఇంతకంటే పరలోకములో ఎంత రమ్యముండునో అని ఎదురు చూచే వధువు సంఘ కృప దయచేయుము. 6. పాప లోకములో నుండియే మా తండ్రి కొంతమంది విశ్వాసులను నేర్పరచి బోధించే బోధకులను ఇచ్చిన ఈ క్రమము చూస్తుండగా, ఇక్కడి బోధకులవలననే ఇట్టి మహిమ బోధలు వివరింపబడుచున్నవి. పాపములేని పరలోకములో పరిశుద్దులు వినిపించే బోధలు ఎంత వినసొంపుగా నుండునో అని తలచే తలంపు, జ్ఞాపకముచేసే వధువు సంఘ కృప యిమ్ము.
7. ఇక్కడ ధ్యానము చేసే వారి సమాజము కొద్దిమందే, అక్కడ సమావేశమయ్యే గుంపు దీనికంటే పెద్దదేగాని వీటన్నిటికంటే ఎక్కువైన సమావేశము ఎక్కువైనది. మా స్నేహితులు, బంధువులు, క్రొత్త నిబంధన వారు, పాత నిబంధన వారు, సంఘ చరిత్రవారు, మా మిషనువారు ఉన్నారు. మే మెన్నడు అనుకొనని పరమ దుర్మార్గులైనవారు పరమ భక్తులుగా ఉన్నారని అనుకొనగల వధువు సంఘ తలంపు దయచేయుమని వందనము లర్పిస్తున్నాము. 8. కొందరు దర్శనములు చూస్తున్నారు, అంత సంతోషములేదు. అక్కడ అందరిని చూస్తాము. ఈ పాడులోకము, పాడుచెత్త, పాడైనవన్నీ ఇక్కడ చూస్తున్నాము. అక్కడ అట్టి పాడు ఉండదు గనుక ముఖాముఖిగా చూచే వధువు సంఘ కృప దయచేయుము.
9. త్వరగా వస్తానన్న ప్రభువు త్వరగా వస్తుంటే, త్వరగా మేము సిద్ధపడి, ప్రభువా, నీవు ఒక్కడవే కాదు. మేముకూడ త్వరగా వస్తున్నాము అని చెప్పే వధువు సంఘ కృప దయచేయుము.
10. పాపులమధ్యను, సుంకరుల మధ్యను కూర్చుండి యున్న మా ప్రభువువలె పాపులు, సుంకరులమధ్య నేడు ఉన్న్మ వధువు సంఘము యొక్క నిరీక్షణ, సమావేశము, బోధలు, గానములు మాచుట్తూ నున్న వారు చూస్తుండగా వారికిని ప్రేరేపణ కలిగి వధువు సంఘములోనికి వచ్చేటట్టు చేయగలవని నమ్మి, ఇన్నాళ్ళకు మీరుకూడా వధువు సంఘములోనికి వచ్చినారా అని హస్తపరిచయము జేసికొనే వధువు సంఘ కృప దయచేయుము, తండ్రీ! విశేషముగా మేము నీసన్నిధిలో ఉండగలిగే కృపదయచేయుము. నీ కృపగల వర్తమానము అందించుమనియు రావలసిన వారిని రప్పించుమనియు వేడుకొనుచున్నాము. ఆమెన్.
Please follow and like us: