- పాపమున్నంత కాలము అశాంతి. అది మానివేసిన యెడల శాంతి,
పాపము మానివేయుటకు మార్గమేదైన కలదా? దైవారాధన లేకపోవుట,
తల్లిదండ్రుల యెడలను అవిధేయతగా నుండుట. అబద్ధములాడుట,
దొంగిలించుట, లంచం పుచ్చుకొనుట, తగని ధరలు చెప్పిసరుకు అమ్ముట,
జాతి ద్వేషము, మత ద్వేషము కలిగియుండుట, ఒకరిని అల్లరి పెట్టుట,
త్రాగుడున కలవాటు పడుట, తిట్టుట, కొట్టుట, జీవ హింస చేయుట, నరహత్య
చేయుట ఇట్టి పాపములు శాంతి లేకుండ చేయును. “అల్లరితో కూడిన
ఆటపాటలైనను, మత్తయినను లేక కామ విలాసములైనను, పోకిరి చేష్టలైనను
లేక కలహమైనను మత్సరమైనను లేక పగటి యందు నడుచుకొన్నట్టు
మర్యాదగా నడచు కొందము” అని బైబిలులో ఉన్నది (రోమా 13:13). ఇవియు
శాంతి లేకుండ చేయును.
2. ఆది మానవులు ఒక్క పాపమే చేసిరి కాని వారి తర్వాత వచ్చిన
వారందరు అనేక పాపములు చేసిరి కనుక పాపమునకు పెరుగుట కలదు.
తప్పు చేసిన వానిని అడిగిన యెడల చేయలేదని అబద్ధమాడును. తప్పు ఒక
పాపము. అబద్ధమాడుట ఇంకొక పాపము. పాపముతో బాటు హాని కూడ
ఎక్కువగును. అపుడు దేశమునకు అశాంతి. ఇవి లేని యెడల శాంతి. ఇవి
లేకుండ చేయుటకు విరుగుడు ఏమైనా కలదా? ప్రతివానికి మనస్సాక్షి కలదు
గనుక ఏది పాపమో అది తెలియని నరుడుండునా?
- పాపకార్యములు మానివేసినను సత్కార్యములు చేయకపోవుట చేయుట
కూడా పాపమే. ‘సత్క్రియ చేయనియెడల వాకిట పాపము పొంచియుండును ‘
అని బైబిలు వ్రాయబడియున్నది (ఆది4:7) బీదలకు ధర్మంచేయుట రోగులను
పరామర్శించుట పరదేశులను సత్కరించుట, కష్టస్థితిలోనున్న వారికి
సహాయము చేయుట, తెలియని వారికి సద్భోధలు వినిపించుట.
అపకారమునకు ప్రత్యుపకారం చేయుట. తెలియని వారికి సద్భోధలు
వినిపించుట, అపకారమునకు ప్రత్యుపకారం చేయుట ఇట్టివి సత్క్రియలు.
సత్క్రియలు లేనందున అశాంతి. అవి ఉన్నందున శాంతి. సత్క్రియలు చేయుటకు
వీలేమైన కలదా?
4. కరువులు, వ్యాధులు, సంతాన విహీనత, అకాలమరణములు, ఆకస్మిక
విపత్తులు, భూకంపములు, పిడుగులు ఇట్టివి పాప ఫలితములు. పాపము
వలన మాత్రమే గాక పాపమువలన కలుగు ఫలితముల వ;లన కూడ అశాంతి,
అని లేని యెడల శాంతి, ఇట్టి వాటికి విముక్తి సాధనము ఏదైనా కలదా?
5. దేవుడు మనకు ఉచితముగా ఇచ్చుచున్న ఎండ, వెన్నెల, వాన, గాలి
మన జివనాధారములై యున్నవి. కాని వాని వలన కూడ మనకు హాని
కలుగుచున్నది. గనుక ఈ హాని కూడ పాపఫలితములలో చేర్చవచ్చును.
ద్వితీ. 11:17 వీని నుండి విమోచన కలిగినపుడు శాంతి. ఇట్టి విమోచనకు
ఉపాయమేమైనా కలదా?
6. అన్ని కష్టములకు విరుగుడు ఒక్కటే-అది దైవ ప్రార్ధన. అన్ని దీవెనలకు
మార్గ సాధన మొక్కటే – అది దైవ ప్రార్ధన. 1రాజులు 8:35,36. దేవుని
ప్రార్ధించునపుడు మనకు ఉండవలసిన రెండు లక్షణములు – మనస్సులోని
పాపములు, కష్టములు, కోరికలు దేవుని యెదుట
చెప్పుకొనవలెను. ఇది గమనింపవలసిన మొదటి పని. నా ప్రార్ధలన్నియు
దేవుడు నెరవేర్చునని మనసులో దృఢముగా నమ్మవలెను. ఇది గమనింప
వలసిన రెండవ పని. మనకు ప్రతి దినము ఇరువది నాలుగు గంటల సమయ్మ
కలదు. ఒక గంట దైవధ్యానంలో గడుపుట వలన మనకు శాంతియు,
కార్య్సిద్ధియు కలుగక మానదు. ప్రతి గృహములోని వారందరును దినమున
కొకమారు సమావేశమై దైవ ప్రార్ధన చేయబూనుకొనుట ఆనందకరమైన వృత్తియై
యున్నది. అధమ పక్షము పావుగంటయైన దైవధ్యానములో గడుపుట
మంచిది. ప్రార్ధన పూర్తి అయిన పిమ్మట కొంతసేపు నిశ్శబ్ధముగా నున్న యెడల
దేవుడు మనసులో మంచి తలంపులు కలిగించును. చేసి చూడండి.
7. ఓ దేవా! సర్వలోకమును నన్నును కలుగజేసిన తండ్రీ నీకు
వందనములు. నా పాపములు క్షమించుము. నాకు పాపములను నిరాకరించు
శక్తి దయచేయుము. నీ వనుగ్రహించు దానములు అందుకొనగల
విశ్వాసమును, పవిత్రముగా జీవింపగల సమర్ధతను, పరోపకారార్ధమై పాటు
పడగల శ్రద్ధను, నీ విషయములు నరులకు బోధింపగల వాక్చాతుర్యమును
అనుగ్రహింపుము. నాకును, మా దేశమునకును, లోకమునకును శాంతి
కలిగింపుము. తరచుగా నీ విషయములు నాకు బయలుపరచుచు
జీవాంతమందు నీ సన్నిధికి చేర్చుకొనుము తద్థాస్తు. ఇట్టి ప్రార్ధన యొకటి
అభ్యాసం చేసుకొనండి. కీర్తన 5:3.
- దైవ ప్రార్ధన ఇష్టములేని వారున్న యెడల వారు కూడ ధ్యానములో
నుండగలరు. ఏమి చేసిన యెడల నాకును, దేశమునకును శాంతి కల్గును?
అని ఆలోచించుటకై కొంత ధ్యాన సమయము ఉపయోగించు కొనగలరు.
అపుడు వారి జ్ఞానమునకును మంచి మంచి ఉపాయములు తోచును,
జ్ఞానమును సద్వినియోగ పరచువారు ప్రయోజనకారులు. మనసును నిర్మల
పరచుకొనువారు తమకును, ఇతరులకును శాంతి కలుగుటకు కారకులై
యుండగలరు. ధ్యానకాలమందు జ్ఞానమును, మనస్సాక్షిని పనిలో పెట్టగల
వీరు దేశోపకారులు కాగలరు.
- మా బోధ-దేవుడు మానవుల మధ్య శ్సరీరధారిగా నివసించుచు, తన
ప్రేమను అద్భుత కార్యముల మూలముగా కనపరచుటకై మన భూమి మీద
యేసుక్రీస్తుగ ప్రసిద్ధి కెక్కెను. సర్వజనులకు పాప విముక్తిని మాదిరిగల
జీవితమును ప్రదర్శించెను. యేసు ప్రభువు ప్రాణ సమర్పణలో తన ప్రేమను,
పునరుత్థానంలో తన జయమును కనబరచి తన వృత్తాంతమును అందరికి
ప్రకటించుడని బోధించి, మహిమ శరీరంతో ఆరోహణమై, దేవలోకమున సిం
హాసనాసీనుడుగా నుండి, మన రాక కొరకు కనిపెట్టుటలో రక్షణాహ్వాన సిద్ధిని
ప్రత్యక్ష పరచుచున్నాడు. చదువరులకు దీని వలన కలుగవలసిన మేళ్ళు
కలుగును గాక!