రక్షణ వార్తావళి

⌘K
  1. Home
  2. Docs
  3. రక్షణ వార్తావళి...
  4. నేడును దేవుడు మీకు కనబడును

నేడును దేవుడు మీకు కనబడును

ప్రియులారా, మీకు దేవుని దీవెన కలుగును గాక! మీరు ప్రతి దినము సాయంకాలము 7గంటల నుండి 10 గంటల వరకు దైవధ్యానము చేసిన తరువాత భోజనము చేయవచ్చును. వీలు లేని యెడల ఒక గంట సేప్లెనని కోరుచున్నాడు. ఇంత పెద్ద భూలోకమును,

అంత విశాలమైన ఆకాశమును మన కొరకు కలుగిన ధ్యానములో ఉండవలెను. అప్పుడు ఈ దిగువ ప్రార్ధన వంటి ప్రార్ధన చేసికొనవచ్చును. యెలాగనిన దేవా! ఆకాశమును, భూమిని, సమతమును, మమ్ములను కలుగజేసిన తండ్రీ! మా పొరబాటులు క్షమించి

మాకు కనబడుము. మాకు చెప్పవలసినవి చెప్పుము. మేమడుగు ప్రశ్నలకు జవాబులు వినిపించుము. మా అవస్థలు తీర్చుము. జీవాంతమందు మమ్మును నీ మోక్షములోనికి చేర్చుకొనుము.

ఈ ప్రార్ధన చేసిన తరువాత నిశ్శబ్దముగా ఉండి దేవుడు యేమి చెప్పునో ఆలకింపవలెను. ఏ మతస్థులైన సరే, ఎంత దుర్భుద్ది గలవారైనను, శక్తి పూజ చేయు వారైనను సరే, దేవుడు లేడను నాస్తికులైన సరే ఈ ప్రార్ధన చేసి మేలు పొందగలరు. దేవుడు మన అందరి

తండ్రి. మనము ఆయన బిడ్డలము. తల్లిదండ్రులు తమ బిడ్డలకు కనబడకుండ ఉందురా? మాటలాడ్ద్దకుండ ఉందురా? బిడ్డలు తమ తల్లిదండ్రులకు కనబడకుండ ఉందురా? వారితో మాటలాడ్ద్దకుండ ఉందురా? ఉండరు. అలాగైన యెడల మన తల్లిదండ్రుల కంటె

గొప్పవాడు దేవుడు. కనుక ఆయన మనకు ఎందుకు కనబడడు? తప్పకుండ కనబడును. అడిగినప్పుడు కనబడని యెడల ఆయన దేవుడని నమ్మము గదా! కనబడని దేవుడు లేడు. మన మీద ఆయనకు ప్రేమ. మనకు ఆయన మీద లేకపోయినను, ఆయన

మనకు కనబడవలెనని కోరుచున్నాడు. ఇంత పెద్ద భూలోకమును, అంత విశాలమైన ఆకాశమును మన కొరకు కలుగ జేసిన దేవుడు మనకు ఎందుకు కనబడడు? మన మీద ప్రేమ లేని యెడల ఈ రెండు లోకములను ఎందుకు కలుగజేసెను?

 మీలో ఒక చెడ్డ తలంపు పుట్టిన యెడల అది దురాత్మ యొక్క పని అని గ్రహింపవలెను. మీ నోట చెడ్డ మాట వచ్చిన యెడల అది భూతము యొక్క పని అని గ్రహింపవలెను. మీ క్రియలలో ఒక క్రియ దుష్క్రియ అయిన యెడల అది సైతాను యొక్క పని అని 

గ్రహింపవలెను. మంచి బోధ వినుటకు ఇష్టము లేనప్పుడు అది దయ్యము యొక్క పని అని గ్రహింపవలెను. మంచి పత్రికలు చదువుట ఇష్టము లేనప్పుడు అది దుష్టాత్మ యొక్క పని అని గ్రహింపవలెను. మంచితనము మీద ఇష్టము కలిగినప్పుడు అది దేవుని

పని అని గ్రహించవలెను. ఉపకార కార్యము చేయవలెనను కోరిక కలిగినప్పుడు అది దేవుని పని అని గ్రహింపవలెను.

 ప్రతి మనుష్యునిలో మంచి ఉన్నది. చెడు ఉన్నది. మీలో ఎన్ని చెడుగులు ఉన్నవో అవి లెక్క పెట్టుకొని, దేవునికి చెప్పి వాటిని పరిహరించుకొనండి. ఎన్ని మంచి గుణములున్నవో అవి లెక్క పెట్టుకొని దేవునికి చెప్పవలెను. ఆయన అన్ని దీవెనలు 

దయచేయును; చెడుగును పూర్తిగా మానివేయవలెను. మంచిని అవలంభింప వలెను. చాలా కష్ట పడితే గాని ఈ రెండు పనులు జరుగవు. మీకు చెడుగు ఇష్టము లేదని నాకు తెలియును. ఈ పత్రికలో ఉన్న ప్రకారము మీరు చేయుటకు ప్రయత్నించవలెను.

ఎవరెవరికి దేవుడు దర్శనములో గాని, స్వప్నములో గాని, కనబడుచున్నారో అది తెలిసికొనండి. దేవుడు కనబడును అను విషయము అనేక మందికి క్రొత్త విషయము. అంగడికి క్రొత్త సరుకు వచ్చిన యెడల కొనకుండా ఉందురా? వచ్చినదని చెప్పగా వినకుండా 

ఉందురా? విని పరీక్షించుటకు వెళ్ళకుండా ఉందురా? దేవుడు కనబడును అను విషయము ఎవరికి క్రొత్తగ నుండునో వారు ఈ పత్రికలో ఉన్నట్లు ధ్యానములో ఉండండి. దేవా! ప్రతి మనుష్యునికి కనబడి నీవే స్వయముగ ఒక బోధకుని వలె బోధించుము అని ఈ

పత్రిక వ్రాసిన నేను తరచుగ దేవుని ప్రార్ధించుచున్నాను. నా పట్టు ఎప్పటికైనను నెరవేరును అని నా నమ్మిక, నా నిరీక్షణ; ధ్యాన స్థలములోనే గాక ఎక్కడ బడితే అక్కడ, ఎప్పుడు బడితే అప్పుడు ఈ తలంపు మీదే ఉండుటకు మీకు దేవుడు శక్తిని అనుగ్రహించును

గాక! ఆమేన్.

Please follow and like us:

How can we help?