పేదరికము, ఇబ్బంది ఇవి సృష్టికర్త కలుగజేసినవి కావు. ఆయన మానవుల ఉపయోగార్ధమై కలుగజేసినవి ఏవనగా; జీవము, వెలుగు, గాలి, వాన, ఆకాశము, భూమి వాటిలోనున్న సమస్తము, వాటిలో జబ్బు వస్తువు లేమియు లేవు. అన్నియు శ్రేష్టమైనవే,
పవిత్రమైనవే, మన తలిదండ్రులైన ఆది మానవులు కూడ పవిత్రులే కాని పాపము ప్రవేశించినందున మానవులకు అనేక కష్టములు అప్పటి నుండి నేటి వరకు కలుగుచున్నవి. వ్యాధులు, ఇబ్బందులు, తెలియని అపాయములు ఇవి తప్పుట లేదు. ఇవి మన
పొరబాటు వలన కలుగుచున్నవి. దేవుడు కలుగజేసినవి కావు. ఆకాశదానము, భూదానము గొప్ప దానములై యునవి. ఈ దానములకంటె మరియొక గొప్ప దానము కలది? దైవ విషయములు, సృష్టి విషయములు, నరుల విషయములు తెలియ పరచునట్టి ఒక
గ్రంధమును దేవుడు మనకు అనుగ్రహించినాడు దాని పేరు బైబిలు. దానిలో మానవులెట్లు నడువ వలెనో, ఈ లోకములో జీవించినంత కాలము ఏమిచేయవలెనో, ఈ లోక జీవితము చాలించిన తర్వాత మోక్షములో మనకు రానైయున్న పరమ భాగ్యమెట్లు
సంపాదించుకొనవలెనో ఈ గ్రంధమందు తెలిసికొనవచ్చును. గనుక ఈ గ్రంధమే గొప్ప దానము.
మరి యొక దానము కలదు. అది ఏది? సృష్టికర్తను చూడవలెననియు, ఆయన మాటలు వినవలెననియు మానవులు కోరుచున్నారు నిరాకారుడైన దేవుడు మానవులకు ఎట్లు కనబడ వీలుండును? దగ్గర నుండుటకు వీలుండును గాని, కనబడుటకు వీలు
లేదు అందుచేత ఆయన మన నరరూపము ధరించి శరీరధారిగా జన్మించెను. జన్మించి మానవులకు కనబడి, వారితో కలిసి మెలిసి యుండి వారితో మాట్లాడి ఈ ప్రకారముగా చేసి మానవులను సంతుష్టి పరచెను. దేవుడు మానవుడైనాడు గనుక మానవులకున్న
నామము వంటి ఒక నామము పెట్టుకొనుట అగత్యమైయుండెను. లేని యెడల ఆయనను పిలుచుట యెట్లు? యేసుక్రీస్తు అను నామము ఆయన ప్రసిద్దికెక్కెను. అనేక ధర్మములను బోధించెను. పాపులకు క్షమాపణ, రోగులకు స్వస్థత, మృతులలో కొందరికి
పునరుజ్జీవము అనుగ్రహించెను. తుదకు సర్వలోక పాప పరిహారార్ధమై యజ్ఞముగా హతుడై పునరుత్థానుడై మోక్ష లోకమునకు ఆరోహణమయ్యెను. ఆయన మిక్కిలి త్వరలో వచ్చి విశ్వాసులను ప్రాణముతోనే మోక్షలోకమునకు తీసికొని వెళ్ళనైయున్నాడు
సిద్ధపడండి.
ఈయన బీదలు మొదలైన వారిని గూర్చి చెప్పిన కొన్ని మాటలు ఇందు పొందుపరచుచున్నాను. ఏవనగా:- "ఏమి తిందుమో, యేమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చియైనను, ఏమి ధరించు కొందుమో అని మీ దేహమును మీ ప్రాణమును
గూర్చియైనను, ఏమి ధరించు కొందుమో అని మీ దేహమును గూర్చియైనను చింతింపకుడి. ఆహారముకంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి అవి విత్తవు, కోయవు, కొట్లలో మీ పరలోకపు తండ్ర్ కూర్చుకొనవు.
అయిననుఇ వాటిని పోషించుచున్నాడు. మీరు వాటి కంటే బహు శ్రేష్టులు కాఅ? మీఓ ఎవడు చింతించుట వలన తన యెత్తు మూరెడు ఎక్కువ చేసికొనగలడు? వస్త్రములను గూర్చి మీరు చింతించ్పనేల? అడవిపువ్వులు ఏలాగున ఎదుగుచున్నవో ఆలోచించుడి
అవి కష్టపడవు. ఒకడకవు. అయినను తన సమస్త వైభముతో కూడిన సొలొమోను సహితము వాటిలో ఒకదాని వలెనైనను అలంకరింప బడలేదు. నేడు ఉండి రేపు పొయిలో వేయబడు అడవి గడ్డిని దేవుడీలాగు అలంకరించిన యెడల అల్ప విశ్వాసులారా! మీకు
మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయునుగదా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకొందుమో అని చితింపకుడి. అన్యజనులు వాటి విషయమై విచారింతురు. ఇవన్నియు మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియును. కాబట్టి మీరు
ఆయన రాజ్యమును, నీతిని మొదటాట్టుడి మీకు తీయబడును. వెదకుడి. అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును.” మత్తయి 6:25-33. “అడుగుడి మీకియ్యబడును. వెదకుడి మీకు దొరకును. తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును.
వెదకువానికి దొరకును, తట్టువానికి తీయబడును” మత్తయి 7:7,8. “నా నామమును బట్టి మీరు నన్నేమి అడిగినను నేను చేతును,”యోహాను 14:4.