క్రీస్తుప్రభువు నిరాకారుడైన దేవుడుగా ఉండక, మన నిమిత్తమై శరీరము గల నరుడాయెను గనుకనే ఆయన సాధువు. నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించు మనెను గనుక క్రీస్తు సాధువు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు అని
బోధించెను గనుక క్రీస్తు సాధువు. ఒకరిని ధూషించమని గాని, చంపుమని గాని బోధింపలేదు గనుక క్రీస్తు సాధువు. ధర్మము చేయుమని చెప్పెనే గాని ఒకరి ఆస్తి దోచుకొనుమని గాని, ఒకరి ఆస్తిని పాడు చేయుమని గాని బోధింపలేదు గనుక క్రీస్తు సాధువు. దేవుడు
లేడనే సిద్ధాంతమేర్పరుపక దేవుడు కలడని పరలోకమందున్న మా తండ్రీ! అను ప్రార్ధన నేర్పించెను గనుక క్రీస్తు సాధువు. మహోన్నతమైన ఈ ప్రధమాంశమును పేర్కొనెను గనుక క్రీస్తు సాధువు. నేను పావన దేవుడను ఈ పాప నరులతో కలిసి మెలిసి ఉండకూడదు.
అని గర్వాతిశయముతో మసలక పాపులతోను, సుంకరులతోను భోజన పంక్తిని కూర్చుండెను గనుక క్రీస్తు సాధువు.
మీరు దేవుని రాజ్యమును నీతిని మొదట వెదకుడి అప్పుడ వన్నియు మీకు అనుగ్రహింపబడును అని ప్రసంగించెను గనుక క్రీస్తు సాధువు. మొట్ట మొదటే దేవుని తలంపు ఉన్న యెడల అవి అనగా అన్న వస్త్రాదులు దొరుకును అని వాక్యభావము.పారమార్ధిక
విషయములను మనము కలిగి యుండవలెనని తెలియపరచెను గనుక క్రీస్తు పరిపూర్ణోప దేశికుడగు సాధువు. ఉభయ లోకముల సౌఖ్యములను కనబరచిన సాధువు. ఆయన నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన
ప్రభువును ప్రేమింపవలెననునదియే, ఇది ముఖ్యమైనదియు, మొదటిదియునైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. ఈ రెండు అజ్ఞలు ధర్మశాస్త్ర మంతటికిని, ప్రవక్తలకును ఆధారమై యున్నవని చెప్పెను గనుక క్రీస్తు
సాధువు.
శరీర జీవనము, ఆత్మీయ జీవనము అను రెండు జీవనములను గురించియు; దేవుడు, నరుడు అను ఇద్దరు వ్యక్తులను గురించియు ఉదాహరించెను. గనుక ద్వివిధ బోధకుడైన క్రీస్తు గొప్ప సాధువు. క్రీస్తు ప్రభువు సర్వలోక జన రక్షణార్ధమై తన ప్రాణమును
సమర్పించెను గాని, ఎవరి ప్రాణమును తీసి వేయనట్టి గొప్ప త్యాగ పురుషుడగు క్రీస్తు సాధువు. అందరును క్రీస్తు యొక్క మాదిరిని అనుసరించిన యెడల మనమే గాదు అన్ని దేశములు సుఖించును. క్రీస్తు మతము మొదటి నుండి బీదలకు సహాయము
చేయుచున్నది. గాని ఒకరి ఆస్తిని బలవంతముగా దోచుకొని సహాయము చేయుటలేదు. గనుక అందరును క్రీస్తు మతము యొక్క మాదిరిని అనుసరించుట మహోపకార కార్యమగును. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నియు నేల పంట తిందువు……నీ
ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. అని దేవుడు ఆదామునకు ప్రవచనము వినిపించెను. ఆది 3:17-19. ఎవరిమట్టుకు వారు కష్టపడి ఆహారము సంపాదించుకొనవలెనను భావమిందులో కనబడుచున్నది. గాని ఒకరై సంపాదన తీసికొని మరియొకరికి
ఇయ్యవలెను అను భావము కనబడుటలేదు. మొదటి శతాబ్దపు క్రైస్తవులు అందరి సంపాదన. అందరి సమ్మతి మీద, అందరును పంచుకొనిరి, గాని అందరి ఆస్థిని బలవంతముగా లాగుకొని పంచుకొనలేదు. అ.కా.4:32-37.
క్రీస్తు సాధువు, ఆయనను నమ్మిన వారిలో గొప్ప మార్పు చేసెను. శరీర జీవనము, ఆత్మీయ జీవనము అను రెండు జీవనములను గురించియు; దేవుడు, నరుడు అను ఇద్దరు వ్యక్తులను గురించియు ఉదాహరించెను. గనుక ద్వివిధ బోధకుడైన క్రీస్తు గొప్ప
సాధువు. క్రీస్తు ప్రభువు సర్వలోక జన రక్షణార్ధమై తన ప్రాణమును సమర్పించెను గాని, ఎవరి ప్రాణమును తీసి వేయనట్టి గొప్ప త్యాగ పురుషుడగు క్రీస్తు సాధువు. అందరును క్రీస్తు యొక్క మాదిరిని అనుసరించిన యెడల మనమే గాదు అన్ని దేశములు
సుఖించును. క్రీస్తు మతము మొదటి నుండి బీదలకు సహాయము చేయుచున్నది. గాని ఒకరి ఆస్తిని బలవంతముగా దోచుకొని సహాయము చేయుటలేదు. గనుక అందరును క్రీస్తు మతము యొక్క మాదిరిని అనుసరించుట మహోపకార కార్యమగును.
ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నియు నేల పంట తిందువు……నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. అని దేవుడు ఆదామునకు ప్రవచనము వినిపించెను. ఆది 3:17-19. ఎవరిమట్టుకు వారు కష్టపడి ఆహారము సంపాదించుకొనవలెనను
భావమిందులో కనబడుచున్నది. గాని ఒకరై సంపాదన తీసికొని మరియొకరికి ఇయ్యవలెను అను భావము కనబడుటలేదు. మొదటి శతాబ్దపు క్రైస్తవులు అందరి సంపాదన. అందరి సమ్మతి మీద, అందరును పంచుకొనిరి, గాని అందరి ఆస్థిని బలవంతముగా
లాగుకొని పంచుకొనలేదు. అ.కా.4:32-37.
క్రీస్తు సాధువు, ఆయనను నమ్మిన వారిలో గొప్ప మార్పు చేసెను.