ప్రియులారా! మీరు యే మతస్తులైననుసరే ఈ పత్రికలోని సంగతి ఎవరికిబడితే వారికి వినిపింపగలరా? దీనిలోని మాటలు మీరు నమ్మినను, నమ్మకపోయినను ఇతరులకు చెప్పవచ్చును.
బోధ:- బైబిలు ఒక్కటే దైవగ్రంధమట. క్రీస్తు ఒక్కడే అన్ని లోకములలో దైవిక రక్షకుడట. ఆయనను మాత్రమే పూజించిన యెడల మోక్షమట. ఆయన అందరికి బైలుపడునట ఆయన దేవుడట, మనకొరకు నరుడై జన్మించి ధర్మములు బోధించి వాటి ప్రకారము
తానే నడిచి చూపించి నరుల నిమిత్తమై చేయవలసిన మేళ్ళన్నియు చేసినాడట. లోకముయొక్క భారము ఎత్తుకొన్నందున తన నరావతార ప్రాణము పోగొట్టుకొనెనట. ఇట్లు ఆయన పాపకారకుడగు సైతానును సమస్త పాపమును వాటి ఫలితములను జయించెనట,
అందుచేతనే ఆయన పరిహరింపలేని పాపమును, స్వస్థపరుపలేని వ్యాధియును, నివారణ చేయలేని అవస్థయును, చేర్చలేని మోక్షమును లేనట్టు క్రెస్తవులు చెప్పుచున్నారు. క్రీస్తు మిగుల త్వరలో భక్తులను ప్రాణముతోనే తీసికొనివెళ్ళునట. అందరును క్రీస్తు
మతములోనికి రావలెనట; కనుక ఎవరు ఆయనను మాత్రమే పూజింతురో వారు ఆ రెండవ రాకడకు సిద్ధము కాగలరట. మిగిలినవారికి అధిక శ్రమలటమీరు దేవుని అడిగి తెలిసికొనవలెనట. దేవుడు అందరికి కనబడి ,మాటలాడునట. హింస పెట్టిన విరోధిని, అతని
అనుచరులను క్రీస్తు హర్మగెద్దోను యుద్ధములో గెలిచి వారిని నరకాగ్ని గుండములో పడవేయునట, అప్పుడే సాతానును వెయ్యేండ్ల చెఱలో బంధించునట. పిమ్మట క్రీస్తును, పరలోక వాస్తవ్వులును, మారిన ఈ భూమి మీద వెయ్యియేండ్లు శాంతిపాలన చేయుచు మత
బోధ వినిపింతురట, ఆ బోధ వినువారి తీర్మానము విని క్రీస్తు తీర్మానము చెప్పునట. సైతానును, మారనివారును నరకములో పడుదురట.
దేవుడు మిమ్మును దీవించును గాక! ఆమెన్.