రక్షణ వార్తావళి

⌘K
  1. Home
  2. Docs
  3. రక్షణ వార్తావళి...
  4. పరిష్కారాంశము

పరిష్కారాంశము

“సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి” 1థెస్స. 5:21.

  ప్రియులారా! ఈ వచనము బైబిలు వచనము. ఏ మతమునైనను, ఏ మనుష్యునైనను, దైవసృష్టిలోని ఏ జీవినైనను, ఏ వస్తువునైనను, మానవులు కల్పించుకొన్న ఏ ఉపయోగకరమగు సాధనమునైనను తుంచనాడకూడదు. సమస్తమును పరీక్షించి మేలైనది 

యేదని తోచునో అది స్వీకరింపవలెను గాని ద్వేషభావము హాని. దేవుని దృష్టిలోను, సహమానవుల దృష్టిలోను యుక్తముగ ప్రవర్తించు అలవాటు చేసికొనవలెను. మంచిచెడ్డలను గ్రహించుటకు దేవుడు మనలో జ్ఞాన శక్తిని అమర్చియున్నాడు. మంచిని చూచి

సమ్మతపడి అవలంభించుటకు దేవుడు మనలో మనస్సాక్షిని యేర్పరచియున్నాడు. మనకు తెలిసినంత మట్టునకు ఆనందించి ఆ ప్రకారము నడుచుకొందుము. జ్ఞానం, మనసాక్షి ఈ రెండును మన జన్మమందు దేవుడు మనలో పెట్టిన గొప్ప గ్రంధములవంటివి.

దేవుడు మనకు ఈ రెండింటివలన బైలుపరచు కొనుచున్నాడు. మనము ఎదిగిన తరువాత మన జ్ఞానమునకు సూర్య, చంద్ర, నక్షత్రములును, భూమియును, భూమి మీదనున్న జీవులును, వృక్షాదులును, వర్షమును, గాలియును, దేవుని వలన మన మేలుకొరకు

కలిగినవి అర్ధమగును. అప్పుడే – ఇంతగొప్ప భూమి చేసినవాడు యెంత గొప్పశక్తి గలవాడై యుండవలెను? అని తోచును. అంత గొప్ప విశాలమైన ఆకాశమును కలుగజేసినవాడు యెంత శక్తిమంతుడై యుండవలెను? అని తోచక మానదు గనుక ఆ దేవునినే గాని

మరి యే మనుష్యునైనను, యే సృష్టినైనను పూజింపకూడదని మన మనస్సాక్షికి గ్రాహ్యమగును.

     చదువరులారా! ఈ రెండును మీలో ఉండి, మీకు యేమి తోచునట్లు చెయునో అదే చేయండి. మతగ్రంధములు, ఇతర గ్రంధములు ఈ రెండును ఆ రెంటి తర్వాత వచ్చినవే. ఈ రెంటిని మనము సన్మానించుట వలన ఇహపరములయందు మంచిచెడ్డలు 

కొద్దిగానైనను తెలియనివారు లోకములో నుండరు. మాకుతెలియలేదని ఎవరును తీర్పుకాలమదు దేవుని ముఖమునెదుట చెప్పలేరు. మాకు తెలియలేదని ఎవరును తీర్పుకాలమందు దేవుని ముఖమునెదుట చెప్పలేరు. మనమున్న మతమునే కాక ఇతర

మతములను గురించి కూడ తెలిసికొనవలెను. ప్రతి మతములోను దైవకళ ఉన్నది. ప్రతి మతములోను సజ్జనులు, దుర్జనులు ఉన్నారు. మంచి ఆచారములు, దురాచారములు ఉన్నవి. అంతమాత్రమున ఆ మతములును కొట్టివేయకూడదు గాని క్రైస్తవులు తమ

మతమును దేవుడు బైలుపరచినదనియు, సంపూర్ణమైనదనియు చెప్పుచున్న విషయమును తర్కించుకొనండి.

 దేవునినడిగి సత్యమును తెలిసికొనండి.
Please follow and like us:

How can we help?