రక్షణ వార్తావళి

⌘K
  1. Home
  2. Docs
  3. రక్షణ వార్తావళి...
  4. శ్రవణేంద్రియ వృత్తి

శ్రవణేంద్రియ వృత్తి

దేశీయ సహకారులైన ప్రియులారా, మీ ఆత్మలకు శాంతి కలుగు గాక!

పధ్యము:- వినదగు నెవ్వరు చెప్పిన వినినంతనె వేగపడక-వివరింపదగున్!

        కనికల్ల నిజము తెలిసిన! మనుజుడెపో నీతిపరుడు-మహిలో సుమతీ||

    ఇది ఒక హిందూమత భక్తుడు రచియించిన కంద పద్యము. దీనిలో గొప్ప నీతి వివరింపబడియున్నది. లోకములో అనేక మతములు, మత శాఖలు బేధాబేధములైన అభిప్రాయములు కలవు. మనుష్యులు అనేకులు, మనసులు అనేకములు. కాబట్టి 

మనమందరము చెప్పునది వినవలెను. వినిన తరువాత దేవుడిచ్చిన జ్ఞానశక్తితో ఆలోచింపవలెను. బాగుగ పరీక్షింపవలెను. మనసాక్షికి సరియని తోచినది అవలంభింప వలెను. సరికాదని తోచినది విసర్జింపవలెను గాని మనుష్యుని విసర్జింపరాదు. మనుషులు

మన జాతివారే గనుక విసర్జింపరాదు. సలహాలు చెప్పవచ్చును మనకు ఇష్టములేని మనుష్యుల క్షేమార్ధమై దేవుని ప్రార్ధింపవలెను.

  చదువరులారా! యీ పద్యములో ఉన్నట్లును, యీ పత్రికలో ఉన్నట్లును మీరు చేయ గలరా! చేసి చూడండి మీకు దీవెన కలుగును. ఇది హిందూమత భక్తుడు రచించిన నీతిబోధ గనుక ముఖ్యముగ మొదట హిందువులే దీనిని గౌరవింపవలెను. అంతే గాని యే 

మతస్తులైన తమ విషయములను బోధించునప్పుడు యీ బోధ మా మతబోధ కాదు. ఇది పరమతబోధ గనుక మేము వినము అని అనుకొనరాదు. మరల చెప్పుచున్నాము, జారత్తగా వినండి:- 1) వినవలెను.2) యెవరుచెప్పినను చెవియొగ్గవలెను.3) వినిన

వెంటనే కోపపడరాదు.4) గాని సంగతి సంద్ర్భములు తెలిసికొనవలెను. 5) తరువాత వినిన దానిలో యేది అసత్యమో తెలిసికొనవలెను.6) ఆ తరువాత వినిన దానిలో యేది అసత్యమో తెలిసికొనవలెను.- ఈ ఆరు సిద్ధాంతములు అవలంభించువారే నిజమైన

హిందూమతస్థులు. భర్తృహరి దైవజ్ఞానము వలన వ్రాసిన కవి. ఆయన యీ మాట సుమతికి చెప్పుచున్నాడు గనుక మంచి మనసుగల మనుష్యునికి చెప్పుచున్నాడు. హిందువులే కాదు ఇతర మతస్తులు కూడ మంచి మనస్సుగలవారై యుండవలెను. మంచి

ఉద్దేశముతో బోధింపవలెను. మనుష్యులందరు మంచివారై యుండవలెను అను కోరిక గలవారై యుండవలెను. కొన్ని విత్తనములు మంచి నేలను పడెను. అవి మొలిచి, పెరిగి ముప్పదంతులుగాను, అరువదంతులుగానూ, నూరంతలుగాను ఫలించెను. వినుటకు

చెవులు గలవాడు వినును గాక! అని యేసుక్రీస్తు ప్రభువు చెప్పెను. మార్కు 4:8,9. చెవిగలవాడు సంఘములతో ఆత్మ (దైవాత్మ) చెప్పుచున్న మాట వినునుగాక. ప్రకటన 2:7. మంచి సంగతులు వినుటకే దేవుడు మన శరీరములో చెవులను అమర్చియున్నాడు.

గాని మనకు మంచి చెడ్డలు వినబడుచున్నవి. వేరుచేయుట మన పని.

Please follow and like us:

How can we help?