దేశీయులారా! ఈ సంగతి ఎప్పుడైన ఆలోచించారా? లోకములో స్థిరమైన మతములు ఉండగా క్రైస్తవమత మెందుకు వచ్చినదో? ఈ సంగతిని గురించి ఎప్పుడైన దీర్ఘాలోచన చేసినారా? లోకమునకు దేవుడే మనుష్యావతారిగా వచ్చునని నిరీక్షించుచున్నది యూల
మతము. ఇది ఉండగా క్రీస్తుమత మెందుకు? ఎప్పుడైన యోచించినారా? ఏ రీతిగా ఆరాధించినను దేవునికే చెల్లును అని ఏక దైవారాధన కలిగియున్నది హిందూమతము. ఇట్టిది ఉండగా క్రీస్తు మతము ఎందుకు? ఎన్నడైన పరీక్షించినారా? ప్రతి దేశమునకు ఒక
మతము ఉండగా అన్ని దేశములలోను ప్రవేశించి, అన్ని మతముల వారిని పిలుచుచున్న క్రైస్తవ మతోద్దేశము ఏమిటో ఎప్పుడైనా తెలిసికొన్నారా?
2. ప్రతి మతములోను మత గ్రంధములు కలవు వాటిలో మంచి మంచి ధర్మములు గలవు. అట్టి ధర్మముల ననుసరించిన భక్తులు గలరు. అయినను దేవుడెందుకు క్రైస్తవ మత గ్రంధమగు బైబిలును రప్పించినాడో ఎన్నడైన సాంతముగా ఆలోచించినారా?
సాంతముగా అది చదివినారా? అది ఇప్పుడు 2000 భాషలలో ప్రచురమయినది. కోటానుకోట్ల బైబిళ్ళు ప్రజల కందుచున్నవి. ఇంత పని దేవుడెందుకు జరుగనిచ్చుచున్నాడో మీరెప్పుడైన కూర్చుని ఆలోచనలో పెట్టినారా?
- ప్రతి మతములోను గొప్పగొప్ప గురువులున్నారు. ప్రజలకు తమ మతమును నచ్చచెప్పువారున్నారు. ఉపకారులున్నారు. ఇట్టివారుండగా క్రీస్తు ఎందుకువచ్చెనో తెలిసికొనుటకు మీ మనస్సు, మిమ్మునెప్పుడైన ప్రేరేపించునా? ఇతర మతస్థుల చేయుచున్న
పండుగులకు క్రైస్తవులు వెళ్ళి -క్రీస్తే దేవుడు, క్రీస్తే రక్షకుడు. ఆయనను నమ్ముకొనుడి. అప్పుడు మోక్షము అని కేకలు వేసి చెప్పుచున్నారు. వారెందుకిట్లు బోధించుచున్నారో వారినెప్పుడైనా స్నేహభావముతో అడిగినారా? మన లోకము కాక ఇంకను ఎన్ని
లోకములు ఉన్నను వాటికి కూడా క్రీస్తే కర్త అని బైబిలు చెప్పుచున్నది. ఈ మాట ఎప్పుడైన తరచినారా? “సమస్తమును ఆయన మూలముగా కలిగెను కలిగియున్నదేదియు ఆయన లేకుండ, కలుగలేదు” (యోహాను 1:2,3). దేవావతారియగు క్రీస్తు ప్రభువు ఇట్లు
చెప్పుచున్నాడు “పరలోకమందును, భూమిమీదను నాకు సర్వాధికారము ఇయ్యబడియున్నది ” (మత్తయి 28:18).
“మరణము యొక్కయు, పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి” ప్రకటన 1:18).
4. ప్రతి సోమవారo క్రీస్తు ప్రభువు గుంటూరు వద్దనున్న కాకానిలో రోగులకు, భూత పీడితులకు, బిడ్డలు లేనివారికి మేలు చేయుచున్నారు. అనేకులకు ప్రత్యక్షమగుచున్నాడు. కొంత మంది ఎందుచేతనో ఆ మేలు పొందలేక పోవుచున్నారు. ఈ ఘనకార్యము
మీరెప్పుడైన చూచినారా?
మీకు శుభము కలుగును గాక!