ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము.
నీవు నీ దేవుడైనయెహోవా మాట శ్రద్ధగా విని నేడు నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలనన్నిటిని అనుసరించి నడుచుకొనిన యెడల, నీ దేవుడైనయెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటె నిన్ను హెచ్చించును.. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన యెడల ఈ దీవెనలన్నియు నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. నీవుపట్టణములో దీవింపబడుదువు; పొలములో దీవింప బడుదువు; నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రెలు, మేకల మందలు దీవింపంపబడును; నీ గంపయు, పిండిపిసుకు నీ తొట్టియు దీవింపబడును. నీవు లోపలికి వచ్చునప్పుడుదువు; వెలుపలికి వెళ్ళునప్పుడు దీవింపబడుదువు. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీయెదుట హతమగునట్లు చేయును; వారొక త్రొవను నీ మీదికి బయలుదేరి వచ్చి యేడు త్రోవల నీ యెదుట నుండి పారిపోవుదురు. నీ కొట్లలోను, నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనునీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞల ననుసరించిఆయన మార్గములలో నడచుకొనిన యెడల యెహోవా నీకు ప్రమాణము చేసియున్నట్లు ఆయన తనకు ప్రతిష్టిత జనముగా నిన్ను స్థాపించును. భూ ప్రజలందరు యెహోవా నామముననీవు పిలువబడుచుండుట చూచి నీకు భయపడుదురు. మరియు యెహోవా నీకిచ్చెదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశమున, యెహోవా నీ గర్భఫల విషయములోను, నీపశువుల విషయములోను, నీ నేలపంట విషయములోను నీకు సమృద్ధిగా మేలు కలుగజేయును. యెఒహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవుచేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును, ఆకాశమను తన మంచి ధననిధిని తెరచును. నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు గాని అప్పు చేయవు. నేడు నేను మీ కాజ్ఞాపించుమాటలన్నిటిలో దేని విషయములోను కుడికి గాని యెడమకు గాని తొలగి, అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నున్న యెడల, యెహోవా నిన్ను తలగానియమించును గాని తోకగా నియమింపడు. నీవు పై వాడవుగా ఉందువు గాని క్రింది వాడవుగా ఉండవు.
నేను నేడు నీ కాజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను, కట్టడలను, నీవు అనుసరించి నడచుకొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని యెడల ఈశాపములన్నియు నీకు సంభవించును. పట్టణములో నీవు శపింపబడుదువు; పొలములో నీవు శపింపబడుదువు; నీ గంపయు, పిండి పిసుకు నీ తొట్టియు శపింపబడును; నీవు లోపలికివచ్చునప్పుడు శపింపబడుదువు;నీ గర్భఫలము, నీ భూమి పంట, నీ ఆవులు నీ గొర్రె మేకల మందలు శపింపబడును; నీవు లోపలికి వచ్చునప్పుడు శపింపబడుదువు; వెలుపలికివెళ్ళునప్పుడు శపింపబడుదువు. నీవు నన్ను విడచి చేసిన నీ దుష్కార్యములు చేత నీవు హతము చేయబడి వేగముగా నశించువరకు నీవు చేయ బూనుకొను కార్యములన్నిటివిషయములోను యెహోవా శాపమును, కలవరమును, గద్దింపును నీ మీదికి తెప్పించును. నీవు స్వాధీనపరచుకొన బోవు దేశములో నుండకుండ నిన్ను క్షీణింప జేయువరకు యెహోవాతెగులు నిన్ను వెంటాడును. యెహోవా క్షయరోగము చేతను, జ్వరముచేతను, మంట చేతను, మహా తాపము చేతను, ఖడ్గము చేతను, కంకి కాటుక చేతను, బూజు చేతను, నిన్నుకొట్టును. నీవు నశించువరకు అవి నిన్ను తరుమును. నీ తలపైని ఆకాశము ఇత్తడివలె నుండును. నీ క్రింది నున్న నేల ఇనుము వలె నుండును.
యెహోవా నీ దేశపువర్షమును ధూళిగాను, బుగ్గిగాను చేయును. నీవు నశించు వరకు అది ఆకశము నుండి నీ మీదికి వచ్చును. యెహోవా నీ శత్రువుల యెదుట నిన్ను ఓడించును. ఒక్క మార్గమున వారియెదుటికి బయలు దేరి నీవు యేడు మార్గములలో వారి యెదుట నుండి పారిపోయి, భూరాజ్యములన్నిటిలోనికి ఇటు అటు చెదరగొట్ట బడుదువు. నీ కళేబరము సకలమైన ఆకాశపక్షులకును, భూజంతువులకును ఆహారమగును. వాటిని బెదరించు వాడెవడును ఉండడు. యెహోవా ఐగుప్తు పుంటి చేతను, మూల వ్యాధి చేతను, కుష్టు చేతను, గజ్జిచేతను నిన్నుబాధించును; నీవు వాటిని పోగొట్టుకొన జాలకుందువు. వెర్రితనము చేతను, గ్రుడ్డితనము చేతను హృదయ విస్మయము చేతను యెహోవా నిన్ను బాధించును. అప్పుడు గ్రుడ్డివాడుచీకటిలో తడువులాడు రీతిగా నీవు మధ్యాహ్నమందు తడువులాడుదువు; నీ మార్గములను వర్ధిల్లజేసి కొనలేవు; నీవు హింసింపబడి నిత్యమును దోచుకొనబడెదవు; నిన్నుతప్పించువాడెవడును లేకపోవును. స్త్రీని ప్రధానము చేసికొందువు గాని వేరొకడు ఆమెను కూడును. ఇల్లు కట్టుదువుగాని దానిలో నివసింపవు. ద్రాక్షతోట నాటుదువు గాని దాని పండ్లుతినవు. నీ యెద్దు నీ కన్నుల యెదుట నుండి బలాత్కారము చేత కొనిపోబడి నీ యొద్దకు మరల తేబడుదు. నీ గొర్రె మేకలు నీ శత్రువులకు ఇయ్యబడును. నిన్ను రక్షించువాడెవడునుఉండడు. నీ కుమారులును, నీ కుమార్తెలును అన్యజనమునకు ఇయ్యబడుదురు. వారి నిమిత్తము నీ కన్నులు దినమెల్ల చూచి, చూచి క్షీణించిపోవును గాని నీ చేత నేమియుకాకపోవును. నీ వెరుగని జనము నీ పొలము పంటను నీ కష్టార్జితమంతయు తినివేయును. నీవు హింసను బాధను మాత్రమే నిత్యము పొందుదువు. నీ కన్నులయెదుట జరుగుదానినిచూచుట వలన నీకు వెర్రియెత్తును.
యెహోవా నీ అరికాలు మొదలుకొని నీ నడినెత్తి వరకు, మోకాళ్ళమీదను, తొడల మీదకుదరని చెడుపుండ్లు పుట్టించి నిన్ను బాధించును. యెహోవానిన్నును, నీవు నీ మీద నియమించుకొను నీ రాజును, నీవే గాని, నీ పితరులే గాని యెరుగని జనమున కప్పగించును. అక్కడ నీవు కొయ్యదేవతలను, రాతిదేవతలను పూజించెదవు. యెహోవా నిన్ను చెదరగొట్టు చోట ప్రజలలో విస్మయమునకు, సామెతకు, నిందకు నీవు హేతువై యుందువు. విస్తారమైన విత్తనములు పొలములోనికి తీసికొనిపోయి కొంచెమే ఇంటికితెచ్చుకొందువు; ఏలయనగా మిడతలు దాని తినివేయును. ద్రాక్షతోటలను నీవు నాటి బాగుచేయుదువు గాని ఆ ద్రాక్షరసమును త్రాగవు. ద్రాక్షపండ్లను సమకూర్చుకొనవు; ఏలయనగాపురుగు వాటిని తినివేయును. ఒలీవ చెట్లు నీ సమస్త ప్రాంతములలో నుండును గాని తిఎలముతో తలనంటుకొనవు; నీ ఒలీవ కయలు రాలిపోవును. కుమారులను, కుమార్తెలనుకందువు గాని వారు నీ యొద్ద నుండరు. వారు చెరపట్టబడుదురు. మిడతలు దండు నీ చెట్లన్నిటిని, నీ భూమి పంటను ఆక్రమించుకొనును. నీ మధ్యనున్న పరదేశి నీ కంటె మిక్క్లిహెచ్చగును. నీవు మిక్కిలి తగ్గిపోదువు. అతడు నీకు అప్పిచ్చునుగాని నీవు అతనికి అప్పియ్యలేవు. అతడు తలగానుండును. నీవు తోకగా నుందువు. నీవు నాశనము చేయబడువరకుఈ శాపములన్నియు నీ మీదికి వచ్చి, నిన్ను తరిమి, నిన్ను పట్టుకొనును; ఏలయనగా నీ దేవుడైన యెహోవా నీ కాజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను అనుసరించినడచుకొనునట్లు నీవు ఆయన మాట వినలేదు. మరియు అవి చిరకాలము వరకు ని మీదను నీ సంతానము మీదను సూచనగాను, నీవు సంతోషముతోను, హృదయానందముతోను నీదేవుడైన యెహోవాకు నీవు దాసుడవు కాలేదు గనుక ఆకలి దప్పులతోను, వస్త్రహీనతతోను, అన్ని లోపములతోను యెహోవ నీ మీదికి రప్పించు నీ శత్రువులకు దాసుడవగుదువు. వారునిన్ను నశింపజేయువరకు నీ మెడ మీద ఇనుపకాడి యుంచుదురు.
యెహోవా దూరమైయున్న భూదిగంతము నుండి ఒక జనమును, అనగా నీకు రాని భాష కలిగిన జనమును, కౄరముఖము కలిగి వృద్దులను, యౌవస్థు నిన్ను నశింపజేయువరకూలను కటాక్షింపని జనమును గద్ధ యెగిరి వచ్చునట్లు నీ మీదికి రప్పించును. నిన్ను నశింప జేయువరకు నీపశువులను, నీ పొలముల ఫలములను వారు తినివేతురు. నిన్ను నశింపజేయువరకు ధాన్యమునేగాని, ద్రాక్షరసమునేగాని, తైలమునే గాని, పశువుల మందలనే గాని గొర్రెమేకలమందలనే గాని నీకు విలువనియ్యరు. మరియు నీవు ఆశ్రయించిన ఉన్నత ప్రాకారములు గల నీ కోటలు పడువరకును నీ దేశమందంతటను, నీ గ్రామములన్నిటిలోను వారు నిన్నుముట్టడివేయుదురు. అప్పుడు ముట్టడిలోను నీ శత్రువులు నిన్ను పెట్టు ఇబ్బందిలోను నీ గర్భఫలమును, అనగా నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన నీ కుమారులయొక్కయు, నీకుమార్తెల యొక్కయు, మాంసము తిందువు. మీలో బహు మృదువైన స్వభావమును, అతి సుకుమారమును గల మనుష్యుని కన్ను తన సహోదరి యెడలను, తన కౌగిటి భార్యయెడలను, తాను చంపక విడుచు తమ కడమ పిల్లల యెడలను చెడ్డదైనందున అతడు తాను తిను తన పిల్లల మాంసములో కొంచెమైనను వారిలో నెవనికిని పెట్టడు; ఏలయనగా మీశత్రువులు మీ గ్రామములన్నిటియందు మిమ్మును ఇరుకుపరచుట వలనను ముట్టడివేయుట వలనను ఏమియు లేకపోవుట చేత మీలో మృదుత్వమును. అతి సుకుమారమును, కలిగిమృదుత్వము చేతను, అతి సుకుమారము చేతను నేల మీద తన అరికాలు నమోప తెగింపని స్త్రీ తన కాళ్ళ మధ్య నుండి పడు మావిని, తాను కనబోవు పిల్లలను తాను రహస్యముగాతినవలెనని తన కౌగిటి పెనిమిటి యెడలనైనను, తన కుమారుని యెడలనైనను, తన కుమార్తె యెడలనైనను కటాక్షము చూపకపోవును. నీవు జాగ్రత్తపడి ఈ గ్రంధములో వ్రాయబడిన ఈధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి గైకొనుచు, నీ దేవుడైన యెహోవా అను ఆ మహిమగల భీకరమైన నామమునకు భయపడని యెడల యెహోవా నీకును, నీ సంతతికినిఆశ్చర్యమైన తెగుళ్ళను కలుగజేయును. అవి దీర్గకాలముండు గొప్ప తెగుళ్ళను చెడ్డ రోగములునైయుండును. నీవు భయపడిన ఐగుప్తు క్షయవ్యాధులన్నిటిని ఆయన నీమీదికితెప్పించును; అవి నిన్ను వెంటాడును. మరియు నీవు దర్శించువరకు ఈ ధర్మశాస్త్ర గ్రంధములో వ్రాయబడని ప్రతి రోగమును, ప్రతి తెగులును ఆయన నీకు కలుగజేయును. నీవు నీదేవుడైన యెహోవా మాట వినలేదు కనుక ఆకాశ నక్షత్రములవలె విస్తారములైన మీరు; లెక్కకు తక్కువై కొద్ది మందే మిగిలియుందురు. కాబట్టి మీకు మేలు చేయుచు, మిమ్మునువిస్తరింపజేయుటకును, మీ దేవుడైన యెహోవా మి యందు ఎట్లు సంతోషించెనో, అట్లు మిమ్మును నశింపజేయుటకును మిము సమ్హరించుటకును యెహోవా సంతోషించును గనుక నీవుస్వాధీనపరుచు కొనుటకు ప్రవేశించుచున్న దేశములో నుండి పెల్లగింప బడుదువు. దేశము యొక్క ఈ కొన మొదలుకొని ఆ కొన వరకును సమస్త జనములలోనికి యెహోవా నిన్నుచెదరగొట్టును. అక్కడ నీవైనను, నీ పితరులైనను ఎరుగని కొయ్యవియు, రాతివియునైన అన్య దేవతలను పూజింతువు. ఆ జనములలో నీకు నెమ్మది కలుగదు; నీ అరికాలికి విశ్రాంతికలుగదు అక్కడ యెహోవా హృదయ కంపమును, నేత్రక్షీణతయు, మనోవేదన కలుగ జేయును.
నీకు ఎల్లప్పుడు ప్రాణభయము కలిగి యుండును.నీవు రేయింబగళ్ళు భయపడుదువు. నీ ప్రాణము నీకు దక్కునను నమ్మకము నీ కేమియు ఉండదు. నీ హృదయములో పుట్టు భయము చేతను, నీ కన్ను చూచువాటిచేతను ఉదయమున -అయ్యో, ఎప్పుడుసాయంకాలమగునా అనియు, సాయంకాలమున – అయ్యో, ఎప్పుడు ఉదయమగునా అనియు అను కొందువు. మరియు నీవు మరి ఎప్పుడును దీనిని చూడకూడదని నేను నీతో చెప్పినమార్గమున యెహోవా ఐగుప్తునకు ఓడల మీద నిన్ను మరల రప్పించును. అక్కడ మీరు దాసులనుగాను, దాసీలగాను, నీ శత్రువులకు మిమ్మును అమ్మజూపుకొను వారుందురు. గానిమిమ్మును కొనువాడొకడైన నుండడు”.
వివరము:- ఇది దేవుడు ఇశ్రాయేలీయులకు అనగా యూదులకు చెప్పిన సలహా, కాని ఏ మతస్థులైనను దైవాజ్ఞ ప్రకారము నడచుకొనని యెడల కష్టస్థితి లభించును.