Seven steps to increase the faith
ఆత్మీయ స్వస్తత Seven steps to increase the faith 1. Read the promises in bible: Bible is full of promises. It has the premises for all kinds of sick people. In bible we can see the promises for 1) Sinners, 2) Poor 3) Sick, 4) Unbelievers 5) People who suffer with fear. It has the promises for all kinds of professionals like business, job, farming, lawyers etc. One can read from the book of Mathew 5, 6, 7 chapters, from the book of Hebrews 11 and 12 chapters, psalms 25th chapter, Joshua 1st chapter. Your faith on god will increase if you read these chapters. This is the easiest step.
2. Read the bible: Read a book from the bible whichever you like more till your faith increases. George Muller who has great faith on God used to follow this strategy. He read bible for 200 times. He used to read bible completely for four times in a year. He said ‘I saw that the most important thing I had to give myself to the reading of the bible (the word of God) and meditation of it.
3. Praise God: Praising God is easy when you have faith. It is difficult for you to praise God, if your faith on God goes down. Then you should strive and force yourselves to praise God. We can use praising words like, Praise God, Glory to God, Hallelujah, Thank you lord for your kindness, mercy, love and your Devine qualities etc., we can also read praise psalms or sing praise songs.
4. Praise in spirit: 1 Corinthians 14:15 Paul said, I will praise god in spirit. When we start praising God, we will praise with our understanding. But when we praise more and more the spirit in us will start praising with our understanding. As long as we praise with our own understanding it will not be that great. We will be filled with happiness when we praise god in spirit. Then the praise will be continued like a flow. 5. Preach the Gospel: Jesus said to his disciples to preach the gospel. It’s responsibility of every believer to preach the gospel. Preach the gospel at-least to one person in a day. When we start preaching the gospel the Devine spirit will start teaching you. 6. Cross or troubles: sometimes we will be lazy, that sluggishness goes away when something difficult happens. Sadhu Sundar singh: whenever he was lazy, he used to ask God to send him a trouble. Only when there is a trouble, does the actual groaning prayer come to the brain!
7. Waiting hour(Isiah 40:31 & 64:4): In Luke 17:5, the apostles prayed to Jesus to increase their faith. We should also ask God & wait in his presence to increase faith. Our own trails will be stopped. God will give you message, praise and faith. Sometimes you will have no interest to read the bible, praise God, and preach the gospel then you need to “Wait upon God”.
All problems get solved in the hour of waiting and all your difficult questions find the answer. It is mentioned in the Bible that we have to wait upon god on any issue. This will be clear to us if we read the verses in the Bible concerning ‘Waiting’. The time that we have to wait till the fulfillment of a desire in our minds, may not be just an hour but can be even half-an-hour!
మహాసభలు 2021
ఆదికాండము 2:1. ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను.
ఒక్కొక్కరి అధికారమును బట్టి, జ్ఞాన పరిధిని బట్టి విషయపరిజ్ఞానముండును. ఉదాహరణకు మహాసభల కన్వీనర్ దృష్టిలో మహాసభ ఏర్పాటులు అనగా “స్థలము సిద్దం చేయుట, పందిరులు వేయించుట, భోజన సదుపాయములు, బస ఏర్పాటులు, సభల ప్రోగ్రాం రెడీ చేయుట…మొదలగు అనేక భారమైన పనులన్నీ ముగించి; వచ్చిన భక్తులందరిని హోస్ట్(ఆతిధ్య సదుపాయములు) చేయగల యంత్రాంగమును సిద్ధము చేయుట”.
ఆదికాండం 2:1 లో రెండు విషయములు ఇమిడి ఉన్నవి. రెండు ఒకదానికి ఒకటి విరుద్ధమైనవి. కాని ఒకటి మరొకదానిని నిరూపించుచున్నది.
సభలను గూర్చి రెండు వ్యూస్ తీసుకుంటే
1. కన్వీనర్ సభల ఏర్పాటు సమస్తమును నిర్వహించుట
2. విశ్వాసి సభలో మంచి వాక్యము విని, తృప్తిగా భోజనం చేసి ఆనందముతో తిరిగివెళ్ళుచుట.
ఇక్కడ కన్వీనర్ పని వేరు, విశ్వాసి పని వేరు. కాని సభ ఒక్కటే. సభల అంతరంగ పరిధిని ప్రతి బైబిలుమిషను విశ్వాసి అందుకోగలరు.
1. దేవుడు ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్తమును నిర్వహించగల(హోస్ట్) సమూహమును సంపూర్తి చేయుట
2. తెలుగు ట్రాన్స్లేషన్ ప్రకారము ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్తసమూహమును సంపూర్తి చేయుట.
సభల విషయానికి వస్తే, విశ్వాసి మంచి వాక్యము, భోజనము అందుకొంటే, కన్వీనర్ ఈ సదుపాయములను సంపూర్తి చేసిరని అర్థము.
పై పరిచయముతో సభలవిలువను గమనిస్తే, సభ అనగా అన్ని సంఘములను హోస్ట్ చేయగల సైన్య సమూహము. దేవుడు బైబిలు మిషనును అందులోగల సమస్త వాగ్ధానములను, మర్మముల వివరములను సంపూర్ణముగా వివరించెను. ఆదిసంఘమైన రోమన్ కేథలిక్, బైబిలును వెలుగులోనికి తెచ్చిన లూధరన్ మిషను, బైబిలును అభ్యసించుచున్న అనేక మిషనులకు ఆఖరి పాఠ్యాంశముగా దేవుడు బైబిలు మిషనును బైలుపర్చెను.
బైబిలు మిషను పరిధిలోని కొన్ని అంశములు
1. ఏడు లోకముల పాఠము, ఏడు మెట్ల ప్రాక్టీసు తో తెలుసుకొనుట
2. దైవ సన్నిధిలో దేవునితో సంభాషించుట
3. ఈ రాకడ సమయములో ప్రపంచ సంఘములకు దైవ వాక్య కార్యములను నిరూపించుట
4. క్రీస్తు ప్రభుని వాక్యమైన బైబిలు మాటలు, దైవమత శక్తి, క్రైస్తవ జీవన శైలిని క్రమమైన రీతిలో అభ్యాసములో పెట్టుట
5. దైవాకాంక్ష కలిగిన అన్ని మతములకు, సంఘములకు ఆహ్వానమందించి దైవ మర్మములను వివరించుట మొదలగు గొప్ప కార్యములు.
దేవుడు స్థాపించిన మిషనులోనికి కొందరు భక్తులు అన్నీ వదులుకొని వచ్చివేసి మిషనును కట్టుకొనిరి. సమస్తమును వదులుకొని మిషనులోనికి వచ్చివేసిన భక్తుల పిల్లలకు సమస్త సదుపాయములు దేవుడు ఇచ్చివేసెను. ఆత్మపూర్ణులైన భక్తులు మిషను ఉనికి పట్టుకు పోవుచున్నారు.
A. సభల బహిరంగ రూపము: అనుకూల ఘటనలు
- అధికారులు సభల ఏర్పాటులు సంపూర్తి చేయుట
- విశ్వాసులు క్రమముగా పాల్గొనుట.
వీరు సభలలో లీనమైన వారు. మిషను పని.
B. అసందర్భ ఘటనలు:
- వ్యాపారవేత్తలు స్టాల్స్ పెట్టి జీవనోపాది కొనసాగించుట
- ఇతర ట్రాన్స్‌పోర్ట్ వారు
వీరికి వ్యాపారం బాగుగా జరిగితే సభలు ఘనంగా ఉన్నట్టు … ఇది అసంధర్బ విష్లేషణ.
C. ప్రతికూల ఘటనలు:
- భోజనం, సాంబారులో ముక్కలు ఎక్కువ పడలేదని అలిగి వెళ్ళిపోయేవారు
- ఇంటెర్నెట్‌లో ఏదో ఊహించుకొని మిషను అంటే ఏంటి? అక్కడ బట్టలు కుడతారా అని ఎగతాళీ చేసేవారు.
వీరు అసలు కాంటెక్ష్ట్‌లో లేనివారు. వీరి వెనుక వెళ్ళేవారు “పెండ్లి భోజనం మానేసి పెంట దగ్గర పారేసిన విస్తర్లకోసం కొట్టుకొని కరుచుకుంటున్న కుక్కలాట చూచుటకు పెరిగెత్తు పిల్లల” వంటివారు.
కాబట్టి బైబిలుమిషను విశ్వాసి ప్రభువు మహిమను, మిషను పరిధిని, ప్రణాళికను, ప్రభోధమును గుర్తించగల ఆత్మను కలిగి ప్రభువు పనిలో నిమగ్నమై ముందుకు సాగు కృప అందరికి దయచేయును గాక.
ప్రార్థన: ప్రభువా! సర్వమతముల వారికి నీ శుభవార్త అందించుము!
మత తర్కములు, మిషను వివాదములు, తప్పుడు బోధలు, పాపశోధనలు, పాపమువలన కలుగు నష్టములు వీటినుండి మమ్మును తప్పించుము.
అన్ని కార్యములు మీ మహిమార్థమై జరుగునట్లు మీ కృపను అనుగ్రహించుము. ఆమేన్.
సిలువ సైన్య సమూహము (hosting the cross)
ఆదికాండము 2:1 లో సర్వము లిఖితమైయున్నది. ఆకాశములు, భూమి, వీటిని నడిపించు సమస్త సైన్యసమూహము ఈ వచనములో గలవు.
ఇంగ్లీష్‌లో హోస్ట్ అనే పదమునకు సరైన తెలుగు బిబ్లికల్ పదము దొరకలేదు. బైబిలులో సైన్యము, సమూహము, పట్టుకొమ్మ అను పదములు ఉపయోగింపబడెను. కావలి, రక్షణ, భరించు, మోయు, సహించు అను అర్థము కూడ దాగి ఉన్నది.
ప్రభువు సిలువపై సమస్తమును భరించి, సమాధానపరచి, విశ్వాసులకు సర్వాధికారమునిచ్చెను. విశ్వాస సైన్య సమూహమునకు జన్మనిచ్చు ఏకైక ఆశ్రమము సిలువ.
ప్రభువు సిలువ చెంత ఉన్న శిష్యులు భూదింగంతములవరకు వెళ్ళి భూమిని తలక్రిందులుగా చేసిరి.కొన్ని వేల సంవత్సరములనుండి సతమతమౌతున్న సమస్యలను సువార్తతో సమూలముగా పరిష్కరించిరి. సిలువలోని శక్తి అటువంటిది. సిలువను భరించుట దైవశక్తిని ధరించుట అను అనుభవము ప్రతి విశ్వాసి కలిగియుండును.
ప్రభువైన యేసుక్రీస్తు సమస్తమును తన సిలువ ద్వారా జయించి మనకు అధికారమిచ్చెనని, సిలువ ధ్యానము సంతోషమును, సమాధానమును కలుగజేయును అను సత్యమును మన అనుభవములోనికి తెచ్చుకొందుము గాక!
కొలస్సీ 1:20 ఆయన సిలువరక్తముచేత సంధిచేసి, ఆయనద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోక మందున్నవైనను, వాటినన్నిటిని ఆయనద్వారా తనతో సమాధానపరచుకొన వలెననియు తండ్రి అభీష్టమాయెను. హెబ్రీ 12:2 మనముకూడ ప్రతిభారమును, సుళువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసువైపు చూచుచు, మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. ఆయన తనయెదుట ఉంచబడిన ఆనందముకొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి, సిలువను సహించి, దేవుని సింహాసనముయొక్క కుడి పార్శ్వమున ఆసీనుడైయున్నాడు. |
ప్రభువునకు గల ప్రత్యేకత సిలువ ఘట్టము. ఆ 7 వారములు(పస్కా నుండి ఆరోహణమువరకు) సమస్త సైన్య సమూహము (సృష్టి, దేవదూతలు, పరలోకము, నరలోకము, పాతాళలోకము) స్పందించిన విధము ఒక ప్రత్యేకమైనది. మరణము, కావలిగల సమాధి, పునరుత్ధానము, ఆరోహణము ఎంత ఏకైక ఘట్టములో రాకడ కూడ మన ఊహకు అందని రక్షణ ప్రక్రియ.
సైన్యములకు అధిపతియైన దేవుని సమూహములో ఇమిడి యుండుటకు సుళువైన సిలువను భరించు హృదయమును దేవుడు మనకు దయచేయునుగాక!
ఫిబ్రవరి 26, భస్మ బుధవారము నుండి సిలువధ్యానములు ప్రారంభము. ఏప్రిల్ 10, మంచి శుక్రవారము. ఏప్రిల్ 12, పునరుత్ధాన పండుగ. మే 21, ఆరోహణ పండుగ. మే 31, పెంతెకోస్తు పండుగ.
నీ రాజధాని ఎక్కడ?
మొట్టమొదటి రాజధాని ఏదేనును మానవుడు కోల్పోయిన తర్వాత దేవుడు బేతేలును రాజధానిగా బైలుపర్చి ఇశ్రాయేలును దర్శించెను.
బేతేలు పాడైపోయినపుడు, దేవుడే స్వయముగా స్థాపించిన సువార్త అను సీయోను రాజధానిలో ఇప్పుడున్న అన్ని దేశములు నూతన రూపము దాల్చి మనుగడ సాగించుచున్నవి.
రాకడకు చివరి సూచనయైన “యెరూషలేము ఇశ్రాయేలు రాజధాని” అనునది కూడ ఈమద్యనే నెరవేరినది.
సువార్త ఫలములు అందుకొన్న దేశములు సీయోనుకు పోటీగా బబులోను(ఆర్ధిక,ఎంటర్టైన్మెంట్,టెక్నాలజీ మార్కెట్) అను మహా రాజధానిని నిర్మించుచున్నవి.
అయితే ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయమేమిటంటే, “నూతన యెరూషలేము అను దేవుని రాజధాని”, సువార్త(సీయోను) లోనుండి మర్మముగా నిర్మించబడుచున్నది.
నూతన యెరూషలేమును గుర్తించలేని విశ్వాసికి పరలోకపు విందు లేదు. నూతన యెరూషలేము అనగా వధువు సంఘము. వధువునకు గల అలంకారము శ్రమలలో దేవుడిచ్చిన విజయములే. శ్రమలేకుండా విజయములేదు, విజయము లేకుండా మహిమలేదు..
సువార్త నిమిత్తము అన్యాయముగా శ్రమలు అనుభవించుచున్న వారిని గూర్చి దేవునికి ప్రార్ధించి, వధువును పరామర్శించుట దేవుని చివరి రాజధానియైన నూతన యెరూషలేమును (వధువు) కట్టుటయే.
వధువును చూచి పరిహసించువాడు పెద్ద పాష్టరైనను వారి జీవితము చివరికి అంధకారమే.
మన దృష్టి బబులోను మీద నుండి వధువు అను రాజధానికి మారును గాక!
ఇకమీదట సువార్త నిమిత్తము హింసింపబడుచున్న “నూతన రాజధానియైన వధువు” నకు విశ్వాసులద్వారా దేవుడు ఆధరణ కలుగజేయును గాక!
ఈ చివరి రోజులలో వధువు సంఘము ద్వారా దేవుడు తన ప్రజలను రక్షించుచున్నాడు. కావున శ్రమలను అలంకారాముగా ధరించుకొనుము. దేవుడు తప్పక మహిమ పర్చును.
మరనాత.
బైబిలుమిషను మహాసభలు
పరిచయం:
ప్రపంచంలో ఎక్కడ ఉన్నా జనవరి 27, 28, 29వ తేదీలలో ప్రతీ బైబిలుమిషను విశ్వాసి మనసు మీటింగ్స్ మీదనే ఉంటాయి. అనేక లక్షల మంది ప్రత్యక్షంగా పాల్గొంటారు. పాల్గొనలేనివారు మరి ఎక్కువ ఆసక్తిగా ఆన్‌లైన్, ఎలెక్ట్రానిక్ మీడియా ద్వారా పాల్గొంటారు. ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మొత్తం మీద 30లక్షలమంది కంటే ఎక్కువగా ఈ మూడురోజులు దైవసన్నిధిలో గడుపుతువుంటారు.
ప్రభువైన యేసుక్రీస్తు మొదటి రాకడ కేవలం ఈ భూగోళంలోని మానవుల రక్షణ కొరకే కాక; ఆకాశ, వాయుమండల అంధకార శక్తులను అంతమొందించి మనకు విజయమిచ్చుటకు వచ్చెను. ఆయన వాక్యము సర్వ సృష్టికి ప్రకటించుటకు సంఘములు స్థాపింపబడెను. విశ్వాసికి ఉన్న ఆత్మ పనులు వేరు, సంఘమునకు గల ఆత్మ కార్యములు వేరు. అదేవిధముగా బైబిలు మిషను సభకు దేవుడు ఒక ప్రత్యేకమైన ఆత్మను అనుగ్రహించెను. ఈ ఆత్మచేయు ప్రత్యేక పని ఏదనగా “ప్రతివాని మదికి రాకడద్వని వినిపించి ఇతర జనులను కూడ రాకడకు సిద్ధము చేయుట” అను దైవ కార్యము.
బైబిలుమిషను సభకు మరియొక పేరు వధువుసభ. అసలైన మగబిడ్డకు జన్మ నిచ్చుటకు ప్రసవవేదన ఇప్పటికే మొదలైనది. వధువుసభ అరుపులు మహాసభ వినగలిగే ఏకాంత హృదయమును దేవుడు దయచేయునుగాక!
సభలో ప్రయాస ఉన్నది. సభలు మహిమ కరముగా జరుగుటకు విశ్వాసి చేసినది దేవుడు తనకన్నట్టుగానే భావించును. పందిరులు ఎన్నయినను వధువుసభ యొక్క ఆత్మ ఒక్కటే.
సభల అంతరంగ సృష్టి:
సభలు చూడడానికి వచ్చిన ఇతరులు, సభల బయటి ప్రాంగణంలో చిరువ్యాపారులు మొదలగు 50 వేలనుండి లక్షవరకు బయట గందరగోళంగా తిరిగే జనాలను పక్కనపెడితే, అసలైన విశ్వాసులకు కలిగే అనుభవమును గురించి ధ్యానిస్తే ఈ విషయాలు సాక్ష్యమిస్తాయి.
1. సభలో సభ: విశ్వాసి ఈ మహాసభలలో లీనమై ఉండగా వధువుసభ లో ఉన్నశ్రమ, సహనము, వేదన..లను రుచి చూపించడమే గాక దానికి తగిన ఆధరణ, మహిమ అంతస్థు ఏదోవొక రీతిగా అందించబడతాయి.
2. సృష్టిలో సృష్టి: బైబిలుమిషను గ్రౌండ్‌లో అంతకుముందు ఏ పందిరి ఉండదు. ఈ 3రోజులకోసం బహు ఖర్చుతో సభా వాతావరణం కల్పిస్తారు. విశ్వాసి ఖాళీగా, ఏ ఆకాంక్ష లేకుండా వచ్చినా, అనేక అవసరాలతో వచ్చినాగాని ఈ సభలలో దేవుడు అంతరంగ విశ్వాసము, ఆశీర్వాదము, దీవెనను ప్రతీ హృదయములో సృష్టించి నూతనపరచడంతో విశ్వాసులు ఆనందముతో ఈ సంవత్సరాన్ని కొనసాగిస్తారు.
దేవుని సృష్టిని అంగీకరించుచున్నావా?
క్రైస్తవ జీవితం నిరంతర సృష్టి. మహాసభ నుండి వధువుసభకు, రక్తమాంస శరీరమునుండి మహిమశరీరమునకు చేర్చే విశ్వాస ఫ్యాక్టరీ ఈ మహాసభలు. దేవుడు తన అమూల్యమైన ప్రణాళికను అందించే ఈ వాతావరణంలో ఒక్క క్షణం ప్రార్థించి ప్రభువు అందించే నూతన హృదయమును అందుకొనుటకు సన్నిధిలో కనిపెట్టి దేవుడు అనేక రెట్లుగా అందించబోవు నూతన సృష్టికి వారసులమైయుందుము గాక!
షారోను పొలము వంటి మహాసభలో విశ్వాసులను పుష్పాలు మొలిచిన పుష్ప సంఘమైన సభను గూర్చియు, సభాధిపతియైన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చియు నిరంతరము వినుచు, చెప్పుచున్న శుభవార్తలోనే నిజమైన సుఖము కలదు.
షరా! ప్రకటన పరమగీతములలో ఇంత విషయము దాగి ఉన్నదా అని అయ్యగారి ప్రసంగములను మరలా సంఘములలో ధ్యానించు చుండెడి వారు. సభలో ప్రభువును చూచినాము అని పూర్వము సాక్ష్యమిచ్చెడి వారు. నేడును ఈ సభల ద్వారా కలిగిన దైవ దర్శనము ప్రతీ విశ్వాసిలోను నాటబడును గాక!
దేవుడు తన దైవ లక్షణమును ప్రతీ విశ్వాసికి అద్దును గాక! ప్రపంచ వ్యాప్తముగా బైబిలుమిషను బోధల పరిమళాన్ని, విశ్వాస జీవనశైలిని పరిచయం చేయుటకు ఆయత్తపడుదము గాక!. దేవుడు తన ప్రణాళికను తానే స్వయముగా ఒక్కొక్కరికి ప్రత్యక్షపరుచునుగాక! ఆమేన్.
దేవుడు అనుగ్రహించిన దైవదూత సభలకు కాపుదలగా ఉండును గాక!
All the best for Bible Mission Meetings
Mission of 2019
2019 is a year of fruitful life. Every Christian supposed to exhibit the spiritual fruits.
Pending from 2018
A. ఇంటెర్నెట్ లో కనిపించని బైబిలుమిషను పాటలు:
38. పెంతెకొస్తు, 58. ఏకాంత స్థలము కోరుము 68. ఎవరు కావలె 71. సర్వలోక ప్రభువునకు 73. చేసుకొనరాదు 74. కలుగజేయలేదు 81. ప్రభు సంస్కారపు విందు 82. జీవనాధ జీవరాజ 83. మహిమ లోకంబునకు 93. శ్రీపావనత్రైకుడా 94. దేవ రమ్ము, నీ రాక 105. మెళకువగ నుండండి 108. విశ్వాస దివ్విదే 112. హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ యేసుకే 113. బైబిలుమిషనును నీవే బైలుపరచి 114. జయము జయము యేసు 115. పోపోవె ఓ సాతానా
B. Unable to translate Bible Mission Sunday worship to Indian languages. We need respective language verification volunteers. Please check this page for example.
C. Voice for రక్షణ పద్యములు. Few contributions are done. Available Videos are added at the bottom of this page.
క్రిస్ట్మస్ విత్తన గుళిక
సత్యమును ప్రత్యక్షపరచుటకు జీవము ప్రయాణమై, భూమిమీద జ్ఞానముతో నీతిని స్థాపించి, న్యాయము జరిగించుటకు, ప్రేమాస్వరూపియైన పరిశుద్ధుని జన్మమే క్రిస్ట్మస్.