1. Home
  2. Docs
  3. దైవ సాన్నిధ్యము...
  4. అయిదు సన్నిధి కూటముల ప్రతినిధుల కూటము

అయిదు సన్నిధి కూటముల ప్రతినిధుల కూటము

నీవు ఏశావును ద్వేషించి యకోబును ప్రేమించినావని ప్రభువు చెప్పెను యాకోబు పుట్టుకకు ముందు చెప్పెను. పుట్టిన తరువాత అతడు భక్తిగా నడచుకుంటే అప్పుడు ప్రేమించాలి పుట్టకముందే ప్రేమించుటకు అతనిలో ఏ క్రియవున్నది? ఎందుకు పుట్టకముందే యాకోబును ప్రేమించెను? పుట్టకముందు దేవుడు ప్రేమించినాడు తరువాత ఆశీర్వదించినాడు, ప్రేమించినట్లు దేవుడు ప్రవక్తలకు తెలియజేసినాడు దీవించినట్టుకూడ దేవుడు తెలియజేసినాడు ఎవరికంటే తండ్రికే యాకోబు తండ్రియైన ఇస్సాకు దీవించెనని అదెప్పుడు? మోసమప్పుడు ఏశావు యాకోబులు పెద్దవారైన తరువాత ఏశావు యొక్క ఆశీర్వాదమును యాకోబు దొంగలించెను ఇస్సాకు అన్నాడు. నీవు వేటాడి వంటచేసుకొని తీసికొని వస్తే, భోంచేసి దీవిస్తానన్నాడు. దీవెన ఏశావుకు రావలెను. ఇస్సాకు తెలియకుండా యాకోబును దీవించెను. యాకోబును దీవించ వలెనని ఉద్దేశించి దీవించలేదు, అప్పుడు యాకోబు దగాచేసాడని ఇస్సాకు గ్రహించాడు అప్పుడు అన్నాడు అప్పుడు తన ఆత్మలో తెలిసికొనెను. యాకోబు మోసము చేసినను దీవించబడినవాడే మోసము చేసినట్లు తండ్రికి తెలుసు.

యాకోబు దీవించబడకముందే అతడు దీవించబడినవాడని ఇస్సాకు చెప్పెను యాకోబును దీవించకముందు తెలియని రీతిగ దీవించినప్పుడు చెప్పకదీవించివేసిన తరువాత మోసము బయలుపడిన తరువాత యాకోబు నీ వెంత మోసపుచ్చినావని తండ్రి అనలేదు. ఎలాగైనా అతడు దేవునివల్ల దీవించబడినవాడే తనవల్ల కాదు దీవించబడిన వారిని నేను తెలియకుండ దీవించితిని అప్పుడు యాకోబును దగ్గరకు పిలిచి అన్న చంపుతాడని పారిపొమ్మనెను చెప్పి మోసము చేసిన వానిని తిరిగి దీవించెను.

1. పుట్టకముందే దీవించెను మోసము తెలియకుండా.

2. తెలియకుండా దీవించెను.

3. పారిపొమ్మని సలహా ఇచ్చినప్పుడును దీవించెను.

4. నిచ్చెన దగ్గర దీవించెను.

 యాకోబు పుట్టకముందే అతడు దీవించబడునని దేవునికి తెలుసు, గనుక అతనిని ప్రేమించి దీవించెను. చిన్నప్పుడు అన్నగారికి గంజి ఇచ్చుటద్వారా మోసము చేసెను 2వసారి వేషము వేసేటప్పుడు అంగీ ధరించెను. 3వ సారి తండ్రి దగ్గరకు వెళ్ళి నేను నీ పెద్దకొడుకునే అని మోసము చేసెను, ఏశావునే అని పేరు చెప్పి మోసము చేసెను యాకోబుతో 1) గంజి 2) వేషము 3) అన్నము ఈ మూడుసార్లు మోసము చేసినను దేవుడు ఊరుకొన్నాడు ఇప్పుడు మోసగించిన యాకోబు యబ్భోకు రేవుదగ్గర ఎలాగైన దీవించుమని అడుగుతాడు. అప్పుడు అసలు దీవెన ఇస్తానని తెలిసి ఊరుకొన్నాడు. యాకోబునకు ఆశీర్వాదముమీద పట్టు ఉన్నదని దేవునికి తెలిసి పట్టుసమయము వచ్చేవరకు ఊరుకొన్నాడు మధ్యనుకూడ దీవించెను గాని చివరి దీవెన యబ్భోకు రేవు అదేమంటే నీవు నన్ను దీవించే వరకు నేను నిన్ను వెళ్ళనివ్వను అని కట్టిపట్టు. మొండిపట్టు, వెళ్ళనియ్యవనే పట్టు పట్టిఉన్నాడు అందుచేత ఆసమయమువరకు ఊరుకొన్నాడు  దేవుడు కొంతకాలము అన్యులలో క్రీస్తు విషయములు తెలిసికొనకుండా ఉంటే ఒక సమయము వస్తే ఆయన ఏమి చెప్పడు. ఊరుకొంటాడు. ఆసమయమువచ్చినప్పుడు దీవించును గనుక గట్టిపట్టు పట్టేటట్లు ఆసమయము వచ్చేవరకు మధ్యమధ్యను దీవిస్తూ ఉన్నను గట్టిపట్టు పట్టినట్లు ఇశ్రాయేలు అనే పేరు ఇవ్వడానికి కనిపెట్టుచూ ఉన్నాడు ఒకనాడు యాకోబు, యబ్భో దగ్గరకు వచ్చినప్పుడు గట్టిపట్టు పట్టగా దీవించెను దానిలో మోసము లేదు కన్నీళ్ళున్నవి. భయము ఉన్నది. ప్రభువు దీవించెను అయితే ఇప్పుడు కొంతమంది తమ ఇష్టప్రకారము తెలియని రీతిగ, తెలియని రీతిలో నడవనిచ్చి, ఏదో ఒక సాధనము రానిచ్చి, పట్టుపట్టె ప్రార్ధన  చేయనిచ్చి ఇకమీదట ఏవిధమైన పొరపాటు చేయకుండునట్లు తెలిసిన పొరపాట్లు, చేయకుండునట్లు దీవించి స్థిరపరచును మన కండ్ల యెదుట ఇట్టికథలెన్నో యున్నవి. అప్పుడు ఇంతవరకు అన్యులుగా నుండి ఇప్పుడు యేసునెరిగి అద్భుతములు చేయుచున్నవారిని చూచి మాకెందుకు అట్టిశక్తి నీయకూడదని క్రైస్తవులందురు. మేము బైబిలు చదువుటలో ప్రార్ధించుటలో గుడికివెళ్ళుటలో, చందాలిచ్చుటలో, అన్నిటిలో క్రమము మాకెందుకియ్యకూడదని అంటున్నారు. దానికి జవాబుగా అనేక మంది మన కండ్ల యెదుట కనబడుచున్నారు ఇక్కడ బల్లమీద పండ్లు ఉండగా అనగా బాగా మగ్గినవి, కొద్దిగా మగ్గినవి. పూర్తిగా మగ్గినవి బడిపిల్లలను వీరికి ఇష్టము వచ్చినవి తీసికొనండని పంతులుగారంటే ఏమి తీసికొంటారు? ఒకబ్బాయి మాత్రము పండినవి తీసికొనెను అది తీసికొనుటకు పంతులుగారికి ఏర్పాటా ? ఆ అబ్బాయి ఏర్పాటా ? అబ్బాయి ఇష్టము మీద సరే అన్నాడు అది పంతులుగారి ఏర్పాటు అబ్బాయి ఇష్టముందా? పంతులుగారు సరే అనుటముందా? అట్లు ఎవరైనా చిరకాల కోరిక ఉండి పట్టుబట్టి దేవుని వద్ద నుండి పొందినప్పుడు దేవుడుసరే అని అంగీకరించును పైనందున ఆ అబ్బాయి పండేతీసికొనునని పంతులుగారికి ముందుతెలియక పోయినను యాకోబు ఆశీర్వాదము అందుకొనునని దేవునికి ముందే తెలుసును అందుచేత మొదటి సారి ఇస్సాకునకు దేవుడు తెలియజేసెను తరువాత యాకోబునకు విచారములో నున్నప్పుడు నిద్రలో నున్నప్పుడు తాను చేసిన మోసముయొక్క జ్ఞప్తిలో నున్నప్పుడు అన్న భయములో నున్నప్పుడు, అడవిలో నున్నప్పుడు, ఏకాంతలో నున్నప్పుడు దేవుడు ఆశీర్వాదము యాకోబుకే చెప్పివేసెను మొదట తండ్రికి చెప్పెను. పిమ్మట నిచ్చెన వద్ద. అడవిలో ఊరి బయటచెప్పెను, నిచ్చెన వద్ద చెప్పిన దానిని యాకోబు పుట్టకముందు దేవుడు అనుకొన్న దానిని తనదుర్భిణిలో చూచి తండ్రికి చెప్పినదానిని నిచ్చెన దగ్గర యాకోబుకు దేవుడు చెప్పిన దానిని యబ్బోకు దగ్గర ముద్ర వేసి స్థిరపరచెను అప్పుడెందుకు పోరాటము వచ్చేనంటే తనస్వంతహృదయములో పుట్టిన మోసము పోయినది తల్లి నేర్పిన మోసము పోయినది కాని ఒకటున్నది. ఒక గొప్ప లోటున్నది  భయమున్నది. నేను నీ తండ్రికి చెప్పాను. నీతండ్రి నిన్నుదీవించాడు నేను నిచ్చెన దగ్గర చెప్పాను ఇంకా నీకు భయమెందుకు? మోసమును తీసివేసినట్లు భయమును కూడ గట్టిపట్టు పట్టిన యాకోబు విషయములో దేవుడుకూడ గట్టిపట్టు పట్టెనుదేవుడు ఒక ఉపాయము చేసెను. ఇస్సాకు యొక్క తప్పు చూసి ఊరుకొన్నాడు. ఏశావు తప్పుచూసి ఊరుకొన్నాడు తల్లి తప్పు చూసి ఊరుకొన్నాడు ఇంతమంది తప్పులు చేస్తే మాత్రము నేను చివరకు నా యిష్టము నెరవేర్చుకుంటాను అని దేవుడు కూర్చున్నాడు. ఇప్పుడు నెరవేర్చుకున్నాడు పూర్తిగా నెరవేర్చుకున్నాడు. యబ్భోకు రేవు అయిన తరువాత జీవాంత పర్యాంతము యాకోబు ఏ పొరపాటు లేకుండా జాగ్రత్తగా నుండెను సన్నిధిలో నున్నాడు గనుక సన్నిధిలోనున్నప్పుడు నలుగురు భార్యలు, పదకొండుమంది పిల్లలు, గొర్రెలుమందలు గాని లేవు ఏకాంతముగా దైవసన్నిధిలో నున్నాడు ఆ దైవసన్నిధియే అతని జీవితములో అతని స్థిరపరచెను.      

   ప్రశ్న-ఏశావు ఏమి తప్పుచేశాడు? ఇస్సాకు ఏశావు. రిబ్కా యాకోబు మోసము నున్నను తప్పులో నున్నను దేవునికి అడ్డముగా తప్పులో నున్నను దేవుని అడ్డములను పాయచేసుకొని యబ్భోకు రేవు వద్ద దైవసన్నిధిలో యాకోబుదీవెనలను స్థిరపరచెను ఎన్ని పొరపాట్లు ఉన్నను (మీలో దిద్దుకొని పాయచేసికొని, దేవునివలె పాయచేసుకొని) దైవసన్నిధిలోనికి రండి అప్పుడు మిమ్మును యాకోబువలె స్థిరపరచును.

  సన్నిధి కూటము చేయుటకు మీరందరును ఇష్టము గలవారేనా? ఇష్ట పడితే పట్టుదలతో సన్నిధిలో ఉంటే తప్పక ఆయన దీవించి స్థిరపరచును.

                  సన్నిధి కూటము వారు ఎట్టివారు?

1. సన్నిధికూటమనగా 7గురు మెంబర్లు ఉండవలెను.

2. అందరు ఒకే మాట మీద ఉండవలసిన మెంబర్లు గలది స్కు ఆగవలెను మరియు ప్రభువు సన్నిధికూటము.

3. అనుకొన్న సమయమునకు హాజరు కాగల మెంబర్లు ఉన్న సన్నిధికూటము.

4. బైబిలు చదువగల మెంబర్లుగల సన్నిధికూటము.

5. ప్రభువుమీద ప్రశ్నలువేసి జవాబుపొందే సన్నిధికూటము ఇది ముఖ్యమైన విషయము.

6. ప్రభువుచెప్పే జవాబులు వ్రాసుకొనగలిగే మెంబర్లు ఉండేది సన్నిధికూటము.

షరా:- చదువురాని వారు ఉన్నయెడల వారు నేర్చుకొనుటకు ఆరంభించవలెను ఆరంభించే సమయములో రావచ్చును ఎప్పుడైనా రావచ్చును ఎప్పుడైనా ఒక్కసారి సన్నిధికూటము సంగతి తెలిసికొనుటకు రానియ్యవచ్చును మరియు ప్రభువు ఏమిచెప్పునో అదిచేసేవారై యుండవలెను. సన్నిదికూటమునకు రాలేనివారు ప్రార్ధకూటములో తయారైన తరువాత రావచ్చును ఎవరికైనా తప్పుడు దర్శనములువస్తే మరియొకరికి వచ్చేవరకు ఆగవలెను మరియు ప్రభువు జవాబు చెప్పేవరకు కనిపెట్టవలెను మోకాళ్ళూని కూటములో దైవసన్నిధియందు ఉండవలెను ఇది దేవుని యెడల గల గౌరవమునకు సూచన ఇట్టి కూటము మీకు ఉన్న యెడల మీ కూటస్థులలో ఇద్దరిని మాత్రమే ఏర్పర్చి బేతేలు గృహమునకు పంపబడి ఇక్కడ దైవసన్నిధి కూటము జరుపు విధులు బోధింపులు, దేవదాసయ్యగారు వ్రాయమని చెప్పినందున నేను వ్రాయుచున్నాను మరియు అయ్యగారి పత్రికలు తరచుగా మీరు అచ్చువేయించుకొని పట్టణమంతయు పంచిపెట్టండి.

అయిదు సన్నిధి కూటముల ప్రతినిధుల కూటము

  బైబిలు పాఠము యెషయా 1,2 అధ్యాములు. మరనాత 1. సిరాకానిసిరా బైబిలులో ఎక్కడున్నది. ||సమూయేలు 3:26 సన్నిధికూటములు ఎంతచక్కగా చదువుచున్నారో తెలిసికొనుచున్నారని తెలియుచున్నది బైబిలులో ప్రభువు చెప్పినది చదవకపోతే, వినకపోతే గుర్తు పెట్టుకొనకపోతే మహాతగుదువని సన్నిదికూటములోనికి వెళ్ళి ప్రభువు చెప్పేమాటలు వినడానికి ఏలాగు వెళ్ళుచున్నారు బైబిలు బాగా చదవకుండా సన్నిదిలోనికి వెళ్ళితే తప్పుడు దర్శనములు వచ్చును. రాకడ సన్నిధికూటస్థులలో ఉండకూడదు రాకడ వచ్చేటప్పటికి బైబిలు ముగించనివారు వుంటారు సన్నిధి కూటస్థులలో ఉండకూడదు. ప్రతి అధ్యాయము, ప్రతి వచనము, ప్రతిమాట చదువవలెను, ప్రతి వర్తమానము చదవాలి ప్రతి గ్రంధము చదవాలి. అనగా బైబిలంతా దేవుడు ఆదియందు భూమ్యాకాశములను సృజించెను అలాచదివితే మాటమాట చదివినట్లే, ఒకమాట ఒకవచనం, ఒక అధ్యాయం, ఒక గ్రంధము విడిచిపెట్టిన ఆదికాండము 5వ అధ్యాయములో అన్నీ పేర్లే అని ఇదెందుకని ఆయాకు విడిచి మరొక అధ్యాయము చదువుతారు. ప్రతీమాట చదవాలంటే మెల్లగా చదవాలి ఆసమయంలో ప్రభువు వర్తమానమిచ్చును సన్నిధి కూటములో కాదు చదువుట, ఇంటిదగ్గర ఎప్పుడైనా చదవాలి, ఆ చదివినది వ్రాయాలి. అందులోనుండి వర్తమానము వచ్చును. దేవుడు బైబిలులో నున్న ప్రతీమాట అవసరము అని తోచే మాటకూడ మనము శ్రద్దతో చదవాలి. అప్పుడు దేవుని బైబిలు మన బైబిలు అగును దేవుని బైబిలు వేరు సిరా అనే మాట అనవసరముగా బైబిలులో నున్నది. అది మనకు అనవసరమని అనుకొన్నాము, గనుక మన బైబిలులో లేదు. ఇప్పుడు మన దగ్గర నున్న బైబిలు, బైబిలు సొసైటీవారి బైబిలు వారు అచ్చువేశారు. సిరా ప్రభువు కూడచెప్పెను. వ్రాయుమని అప్పుడు ప్రాసే అభక్తుడు ప్రభువా ఇదెందుకు? అని అడుగును అదెందుకు? నీకెందుకు? నేను చెప్పేది వ్రాయి అలాగే మీరు బైబిలు చదివేటపుడు అవసరమనేది నీకెందుకు? అది మీపనిగాదు. గ్రంధములో నున్నది. గనుక చదువు జ్ఞాపకముంచుకొనుమని కూడ చెప్పెను కొంతమందికి జ్ఞాపకశక్తి ఉండదు దానికి మనమేమి చేయగలము? ఈ సంవత్సరము మేము ఆ సిరా అనేమాట ఉన్న అధ్యాయము చదివాము అని అనుకొనుచున్నారా? 20 సంవత్సరములు క్రిందట చదివారు అది ఇంకా  జ్ఞాపకమున్నదా? లేదా? అలాగే మీరుకూడ జ్ఞాపకముంచుకొనండి పోనీ అవసరమైనవి జ్ఞాపకముంచు కొనకపోయిన అవసరమైనవైనా  జ్ఞాపకముంచు కొంటున్నారా? అదీలేదు ఇదీలేదు. ఊరికే టూకీగా చదివేస్తారు. టూకీగా చదావటానికేనా? గనుక ఇప్పుడు చెప్పేదేమటే సిరా అన్నది జ్ఞాపకమున్న లేకపోయిన ఒకటే ఎందుకో ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది గనుక అవసరమైనవి ఉన్నవి, బాగా జ్ఞాపకముంచుకోండి. బైబిలు బాగా చదవనివాళ్ళు కూటానికి వెళ్ళకూడదు.

  అసలు సన్నిధి కూటము 41 సం||ల క్రితము ఆరంభించవలసినది ఆరంభించక ఆరంభించి అవకతవక వాళ్ళనా ఏర్పర్చుకొనడము, నేర్చుకొనుటకు రావచ్చునుగాని సన్నిధికూటముగా ఏర్పర్చుకొనగూడదు వారు వస్తే నష్టము రక్షణకుసన్నిధికి ఏమిసంబంధములేదు. చెప్పేవివారు వినవచ్చునుగాని సన్నిధిలో చెప్పేవి వారు వినకూడదు ఒకవేళవస్తారు రావద్దన్నావస్తారు ఏమిచేయాలి మెంబర్లుకాదు. 7గురు కాదు ఇంకొక 7గురు ఉండవచ్చునుగాని వారు సన్నిధికూటస్థులు కారు చిన్న పిల్లలంత భక్తులు లోకములో ఉండుట కష్టము. వారే దేవునికి ప్రియమైన భక్తులు (చిన్నపిల్లలకు చదువులేదా?) చిన్న పిల్లలు నన్ను నమ్ముచున్నారు. పెద్దవారు ఒకదినం నమ్ముతారు, ఒకదినం నమ్మరు. బాప్తిస్మమునకు సంబంధము లేదుగాని చిన్నపిల్లలకు దేవుని రాజ్యమునకు రాకడకు సంబంధమున్నది, చిన్నపిల్లలకు బాప్తిస్మమివ్వకముందే వారు దేవుని రాజ్యమునకు వారసులు ఈ లాంటి వారిదే పరలోకరాజ్యము" రాజ్యానికి, రాకడకు విశ్వాసమునకు, పసిపిల్లలకు సంబంధమున్నది చిన్నపిల్లలు నన్ను నమ్ముచున్నారని బైబిలులో నున్నది అదే ప్రభువు స్వయముగా చెప్పెను. రాజ్యము అట్టివారిదని బైబిలులోనున్నది. పేతురు మీరు చిన్నపిల్లలవంటివారైతే", "స్నానికుడైన యోహాను గర్భములో గంతులు వేసెను" తల్లియొద్ద స్తన్యపానము చేయునప్పుడే నాకు నమ్మిక పుట్టించితిని దావీదు కీర్తన 22:9

  "ఈ చిన్నవారిలో" గనుక పెద్దవారుంటే చిన్న పిల్లలే దేవుని రాజ్యమునకు అర్హులైయున్నారు అంతగొప్ప విశ్వాసము అంతగొప్ప భక్తి అంతగొప్ప పవిత్రత, అంతగొప్ప అర్హత మనకు రావడము చాలకష్టము, పసిపిల్లలు పుట్టగానే యేసుప్రభువు వంక చూస్తారు. లోపల నున్న పిండము భూమిమీద పడగానే అంతా గ్రహించేశక్తి ఉన్నది మీరైనా నమ్మరుగాని వ్రాసికొంటే నమ్ముతారు.

II చదువులేనివారు సన్నిధికూటము యొక్క అంతస్తులోనికి రాగలిగితే శ్రద్దతో వెంటనే చదువు నేర్చుకొనవలెను. వెంటనే బైబిలు నేర్చుకొనవలెను ఎవరిమట్టుకు వారికే బైబిలుండవలెను. గాని ఒకరి బైబిలు ఒకరు చదువగూడదు. ఎందుకంటే ఎవరికిష్టము వచ్చినవివారు గుర్తుపెట్టుకొనులాగున నీ బైబిలు ఎవ్వరికిని ఇవ్వవద్దు, నీవె చదువుకో దానిద్వారా నీతోనే ప్రభువు మాట్లాడును కండ్ల జబ్బుంటే బాగుచేసికొని మరి చదువుకో, కండ్లజబ్బుకు మంచిమందు కసిందాకు పసరు. ప్రభువు టీచరై అ.ఆ.లు గుణింతాలు నేర్పిస్తే వద్దనే వారెవరు? దానికి పరవాలేదు చదవడానికి బద్దకించేవారు సన్నిధికూటమునకు కూడ రాకుండా బద్ధకించితే చాలమంచిది సన్నిధికూటము కంటే నీపనిఎక్కువ గనుక నీ పని దగ్గరే ఉండిపో కూటానికి ఎందుకు? పనివల్ల చదవకపోతే) ఈ పూటంతా వ్యతిరేక మాటలు, చాదస్తపు మాటలు, ఇష్టములేని మాటలు, చదువుట మాత్రమేకాదు నోట్స్ కూడ వ్రాయుట నేర్చుకొనవలెను ప్రభువు చెప్పితే భక్తులు వ్రాసేరా? లేదా? గనుక అందరు ప్రశ్న వేస్తారు. 1. మాకు రక్షణ లేదా? 2. బైబిలు మిషనులోనికి వస్తేగాని మాకు రక్షణ లేదా? ఈరెండు అజ్ఞాన ప్రశ్నలు రక్షణకును సన్నిధి కూటమునకు సంబంధములేదు. అదివరకే రక్షణపొంది ఉన్నారు.

III. ఉదరశుద్ధి, హృదయశుద్ధి, ఒడలుశుద్ధి, వస్త్రశుద్ధి, [అరికాళ్ళు కడుగకుండ సన్నిధిలోనికి రాకూడదు) ఈ నాలుగు శుద్ధులు చేసికొన్న వారు సన్నిధికూటమునకు రావచ్చును. నేను ఇవి లేనటువంటి వారిని రావద్దు అంటున్నాను. గాని కొన్నాళ్ళకు ఈ చిక్కులన్ని చూచి వారే మానివేస్తారు. మనము వెళ్ళిన ఆ మొదటి మెంబర్లకున్న ధన్యత మనకురాదు. అని వారే వెళ్ళిపోతారు ఇంటివద్ద చేసికొనవచ్చును అది ఒక అంతస్థు ఈ అంతస్థురాదు.

IV. దేవుని యొక్క సిం హాసనమువద్ద 7 గురు దేవదూతలున్నారు. వారికి సన్నిధిదూతలని పేరు మిఖాయేలు, గబ్రియేలు వీరే 7గురిలో ముఖ్యులు తక్కినవారిపేర్లు బైబిలులో వ్రాయబడలేదుగాని ప్రకటనలో 7 ముద్రలు 7 బూరలు, 7 పాత్రలు పట్టుకొని పనిచేసే వారున్నారు గనుక 7 గురు 7గురు 7గురు అని ఉన్నది గనుక భూలోకంలో గుంటూరులో 7గురు బెజవాడలో 7గురు అలాగే అన్ని స్థలములో 7గురు చొప్పున ఇంకొక 7గురు తయారైన తరువాత 7గురిలో కలువ వచ్చును. (కాని పెద్ద హాలు కావలెను)

V. 7గురిలో భేదాలుంటే వారు మరిమొదటే జారిపోతారు ఒకవేళవారు సన్నిధికూటములో నున్నా అది సన్నిధికూటముకాదు. భేదముండకూడదు.

VI. సిద్ధపడవలెను పెండ్లికుమార్తె పెండ్లీ అరాధనకు సిద్ధపడునట్లు సన్నిధి కూటమునకు కూటము జరుపుకొని వారు సిద్ధపడవలెను ఈవేళ మనము ఆ రూల్స్ జవదాటేము. ఏలాగంటే నిన్న చెప్పారు సరిగా 8గంటలకే కూడి ఆరంభించమన్నారు అది జరుగలేదు అప్పుడప్పుడు ఇక్కడ జరిగే కూటమునకు కూడ సరిగా 6 గంటలకు కీర్తన ఎత్తవలసింది ఎత్తలేదు. ట్రెయిను ఆలస్యమైతే మనమేమిచేయలేము. ఒకప్పుడు ప్రభువు ఈలాగు చెప్పారు 8 గంటలని నియమించుకొని 8-30 గంటలకు రావచ్చునా? ఈదినములలో ప్రతివారి చేతికి గడియారములున్నవి. ప్రతివారు గడియారములు కొనుక్కొనుడి. మీరు సన్నిధి భాగ్యవంతులు ఒకప్పుడు అయ్యగారి కూటస్థులు చూడడానికి ఆలస్యముగా వెళ్ళితే కోపముతోకాక నెమ్మదిగా మీరు సమయమునకు సిద్ధపడలేరు. అని ఎంత మృదువుగా అన్నారో మీరు సమయానికి సిద్ధపడలేరు అట్టి అలవాటు ప్రార్ధనకూటమునకు సరిపోవునేమోగాని సన్నిధికూటమునకు సరిపోదు. సమయమునకు రాకపోతే ప్రభువున్నూ, దూతలున్నూ పరలోక భూలోక పరిశుద్ధులును, వచ్చే ఉంటారు. వారికక్కడ ఏమీ పని లేదా ఏమిటి? మీరు వచ్చేవరకు ఉంటారు వారు? ఉండక వెళ్ళిపోతారు

ప్రశ్న:- నేను ఊరువెళ్ళితే సన్నిధికూటమునకు రాలేనుగదా?

జవాబు:- ఎక్కడబడితే అక్కడ ఉండవచ్చును “యేసు నీ తలపే నాకు” అనే కీర్తన, ఆసమయములో వీలులేకపోతే టైము మార్చుకోవచ్చు సమయము ఏర్పాటు చేసికొనుట మన ఇష్టమే. గాని ప్రభువు చెప్పిన సమయము మార్చుటకు విలులేదు

VII. పని:- మనకు పనికంటే సన్నిధికూటమే ఎక్కువ అవసరము. ఒక సంవత్సరము లూథరు మిషను పని వారు పరీక్షాధికారులలో అయ్యగారు ఒకరు, పరీక్ష అయింది పేపర్లు దిద్ది పంపాలి. ఆ పంపడమనేది మిషనుపనే గదా! ఆ సమయములో పొరుగూరువెళ్ళి సన్నిధికూటములో నున్నారు సన్నిధికూటములోనుండి తొందరపడుచున్నారు. త్వరగా వచ్చి పేపర్లు దిద్ది వారికి పంపివేయాలని అనుకొనుచున్నారు కొన్నిరోజులైన తరువాత మిషనెరీలు నీ కొరకు కని పెట్టుచున్నారని ప్రభువు చెప్పగా దిద్ది పంపివేసిరి వెంటనే దిద్ది పంపివేసిరి గాని 8వ తేదీన దిద్దపంప ప్రయత్నిస్తే వద్దన్నారు ఎందుకంటే పంపవలసిన టైము ప్రభువుకు తెలుసు అక్కడ నుండి బయలుదేరవలసిన రోజున ఉదయమున త్వరపడు నిమిత్తము ప్రభువు చాలా తొందరపెట్టి బయలుదేరేటప్పుడు నేను కూడా వస్తున్నాను గనుక మనపని ఏమంత ముఖ్యముకాదు చెప్పవలసినదేమిటంటే అన్ని పనులకంటే సన్నిధిపని ముఖ్యము ఎక్కువవారు వీరు వచ్చే వరకు కనిపెట్టరాదు ఒకరికొకరు పిలుచుకొననే కూడదు నడిపించు ఆయనరానిచో వచ్చినవారే ఆరంభించుకొనవచ్చును. ఎందుచేత? నడిపించు ఆ నాయకుడు నాయకుడు కాదు యేసుప్రభువే నాయకుడు ఉద్ధేశ్పూర్వకముగా ఏదిచేసిన తప్పుకాదు యేసుప్రభువే నాయకుడు ఉద్ధేశపూర్వకముగా ఏదిచేసిన తప్పు.

VII. ప్రభువు నందు పూర్తిగా సహవాసముంటే అడ్డాలేమి రావు (ఎవరికైతే పూర్తిగా సహవాసము హృదయములో నుండునో వారికి అడ్డాలుండవు. అసలు హృదయములోనే సన్నిధి ఉండాలి) ఇది సన్నిధి కూటముకాదు. గాని సన్నిధికూటముయొక్క పాఠశాల.

IX. మరికొన్ని శుద్ధులు:- గది, సామాను వాకిలికూడ శుద్ధిగా నుండవలెను మరియు బైటతడిలేకుండా చేసుకొనవలెను, కుదిరేటట్లు చేసికొనవలెను.

X. జాగ్రత్త:- సంపూర్ణ సన్నిధి కూటము:- పనులు లేకుండా రోజంతా సన్నిధికూటము చేస్తే అదే సంపూర్ణ సన్నిధికూటము. అంటే ఉద్యోగములుండకూడదు, కూలిపనులు కూడదు వంట పనివారిచే చేయించవచ్చు. బజారుపని కూడదు రోజంతా అంటే ప్రోగ్రాము ప్రకారము జరుపుకొనవచ్చును అనగా ఉదయం 8గం|| నుండి 12 వరకు. 2 గం|| నుండి 6గం|| వరకు మిగతా సమయములో అన్ని పనులుండ వచ్చును. మీ చీర కొంచెము మాసిన మసి అంటుకొన్న సబ్బుతో శుభ్రము చేయవలెను స్నానము చేయకుండా రాకూడదు అట్లు రావడము అమర్యాద, స్నానము చేయకపోవుట, తల సరిగా దువ్వకపోవుట, ఇవిలేనివారు సన్నిధిలోనికి రాకూడదు, సన్నిధి కూటస్థులందరు శుద్ధులు గమనించుట కొరకు ద్వితీయోపదేశకాండము చదువవలెను సన్నిధి కూటము కొరకు మంచి బిల్డింగు కావాలి ప్రార్ధించండి 5 భాగాలుగా చెప్పుదును బాగా ప్రార్ధించండి.

Please follow and like us:

How can we help?