యెషయా 6;7,8 అధ్యాయములు.
ప్రార్ధన:- ఓ ప్రభువా! ముగింపు మాటలు అందుకొనేశక్తి దయచేయుము ఆమేన్
అయ్యగారికి మిఠాయి తినడమనేది ఇష్టములేదు ఒక్కరోజే ఇష్టమని 5 ఉండలు తినివేశారు. అలాగే రాదురాదు అని కీర్తనంతా పాడేశారు. ఎవరైనా ఒక కవీశ్వరుడు 66 పుస్తకాలమీద ఒకకీర్తన కట్టితే బాగుంటుంది. మీరు వారిని ప్రేరేపించి కట్టించాలి ఏలాగంటే సృష్టిచరిత్ర ఉన్న ఆదికాండము ప్రయాణ చరిత్ర ఉన్న నిర్గమకాండము శుద్ధిచరిత్ర ఆరాధన చరిత్ర ఉన్న లేవీయకాండము, ఒక ముఖ్యమైన అంశము తీసికొని 8:6 పుస్తకాలలోనున్న చరిత్ర తీసుకొని కట్టవలెను ప్రకటనకు ఏమి వస్తుంది అంటే 66 పుస్తకములోగల ప్రకటన పుస్తకము వస్తుంది ఆదికాండము 65 పుస్తకాలలోని సంగతులు క్రమముగా పీల్చుకొనే పుస్తకము. బైబిలులో ఎన్ని పుస్తకములున్నవో అన్ని పుస్తకములలోని సంగతులు ఆదికాండములో నున్నవి. ప్రకటన గ్రంధము వెనుకటి పుస్తకము 65 పుస్తకముల సంగతులున్నవి. ఆదికాండము దాని వెనుకనున్న 65 పుస్తకాలలోని సంగతులున్నవి. అవన్ని వివరించాలంటే ఒక్కవారమైనా ఉండాలి. నోట్సు వ్రాసికొనుటకు ఆదికాండము చివరి అధ్యాయములో చివరి అంశములో మరణమున్నది. ప్రకటన చివరి అధ్యాయము చివరి అంశములో మరణమున్నది. ప్రకటన చివరి అధ్యాయము చివరి అంశములో నిత్యమైన నరకము గురించి యున్నది అలాగే విడదీయుటకు వీలు లేకుండా ఒక పుస్తకమునకు ఒక పుస్తకము విడదీయుటకు వీలులేని సంబంధమున్నది. బైబిలు ఇన్ని అలంకారముల, అర్ధముల, వ్యాఖ్యానముల అన్వయములతో నున్నందువల్ల ఈ రీతిని ఇంకొక పుస్తకము పుట్టదు. గదులు వేయవలెను. ఎన్నోగదులు, ఆ గదులలో ఏమి వ్రాయాలంటే బైబిలుయొక్క లక్షణాలు వ్రాయవలెను. పుస్తకాలు కాదు. ఒక లక్షణమేమంటే ఆకాశములో నున్నది, అప్పుడు బైబిలు కాక ఇతర పుస్తకాలలో ఇటువంటిదేదైనా ఉన్నదా? అలాగని చూస్తే కొన్ని ఉన్నవి కొన్ని ఉండవు, బైబిలులోని లక్షణాలు ఇతర పుస్తకాలలో నుంటే బైబిలు కొట్టివేయవలసిందే. ఏ గ్రంధ కర్తయైనా అటువంటి పందెమువేసినా ఒకక్రైస్తవుడు ఇప్పటికి ఒకడును లేవలేదు.
1. బిల్లాను కీర్తన 2. బైబిలు యొక్క లక్షణములు మీరు బైబిలును గురించి ఒక్కొక్కరికి చెప్పి అభిమానులకు చెప్పి చదువురాని వారికిని చెప్పిన తరువాత, వారు బైబిలు చదువుట ముగించి, ఈ వేళ నేను బైబిలు ముగించినాను అని ఒక్కొక్కరితో ఒక్కొక్క కార్డు వ్రాయించండి. రాకడ సమీపము గనుక బైబిలు ముగించుట అవసరము ముఖ్యము.
3. బైబిలు మిషను కీర్తన పుస్తకము అనగా పాడి, ఖర్చుపెట్టి ఒక కార్డు వ్రాయండి. అన్ని పాటలు పాడామని వ్రాయండి. మీవుళ్ళో ఎన్ని సన్నిధి కూటములు స్థాపిస్తే అంత మంచిది. డిశంబరులో నాకు ఒక కార్డు వ్రాసి దానిలో ఎక్కడెక్కడ ఎన్నిస్థాపించారో నాకు వ్రాయండి. అదేమి కష్టము? 5. మీకు ఓపిక వుంటే ప్రభువు చెప్పిన సంగతులు నాకు వ్రాస్తే ఆ సంగతులన్ని అచ్చువేయిస్తాను. వ్రాసిన వారి పేరు వుండవలెను. క్రింద నా పేరు వుండును. ఒక గ్రామములో అచ్చువేయుచున్నవారి పేరే గాని అయ్యగారి పేరులేనందున వారు దానికి అంగీకరింపలేదు. వ్రాత మాత్రం అయ్యగారిదే. అచ్చువేయించుట అయ్యగారిదే వుద్దేశపూర్వకముగా పేరు వ్రాయించుటలేరు. గనుక తగాదా వచ్చింది. బైబిలు మిషను చీలికలై పోయినది. గనుక అయ్యగారిపేరు అవసరము.
6. ఫణిదము శూద్రులు అనేక కూటములు పెట్టుకొన్నారు అభ్యంతరములు లేకుండ పెట్టవచ్చును.
7. ఎప్పుడయితే శ్రమలు వచ్చునో మీరు సన్నిధి కూటములకు వెళ్ళిదాగుకొనవచ్చును. కొండలకు పారిపోతారు గాని గొప్ప విశ్వాసులు కావాలి. దర్శన వరము కంటె విశ్వాస వరము కావాలి. కల గాని, దర్శనము గాని, ఆపద వస్తుందని తెలియగానే, రాదు అని అనాలి. ఎందుకనగా ప్రభువు నాదగ్గర వుంటే నాకు శ్రమ ఏలాగు వస్తుంది. పత్రికలు చదివినప్పుడును, శ్రమలు వస్తున్నవని చదివినప్పుడు భయపడవద్దు. ఈ శ్రమ నాకు రాదు. కూటమునకు వచ్చినప్పుడు, చెప్పిన పాఠములో ఇది ముఖ్యము. శ్రమ నా దగ్గరకు రాదు అని స్తుతించాలి.
ప్రభువు ఒకరికి శ్రమ రానిస్తారు ఒకరికి రానివ్వరు, అది నా కెందుకు శ్రమ అనేది రాదు అనే విశ్వాసము కలిగి యుండాలి ట్రైనుకు వెళతారు దాటిపోతుంది ఏమో అనుకుంటారు కాని ఆగుతుంది.
8. పందెములు:- మాబోధలు తప్పు అని చెప్పేవారు ఎవరైనా మమ్మును పిలిచి, లేక మా యొద్దకు వచ్చి అడిగితే అన్నిటికీ సమాధానం చెప్పుతాము. మాట్లాడేవారు మీరు కాదు. తండ్రే సమాదానం చెపుతారు. మనకు సన్నిధి కూటములు వున్నవి గనుక ప్రభువును అడిగి తెలుసుకొనండి. ఎందుకంటే ప్రభువు మత్తయిలో చెప్పినారు. నా యొద్ద నేర్చుకొనండి. చింతా కాంతమ్మ గారికి రెండు అద్భుతములు జరిగినవి సన్నిధి లైను, 7, 3, 1. ఈమె ఒక్కరు లైను. బైబిలు చదివేటప్పుడు గుర్తు పెట్టుకొనండి. అండర్ లైను, చుక్కలు, డేష్ లు, నక్షత్రము, తెలియని వాటికి ప్రశ్న? ఎందుకంటే రబ్బరుతో చెరపటానికి, పందెములో, మా పత్రికలలో ఎవరైన తప్పులు పట్టితే సమాధానం చెప్పగలము.
- చాలా కష్టము, మీరు మీ యొక్క సమస్యలు మాకు చెప్పి యేసుక్రీస్తు ప్రభువు ఏమి అందిస్తే అక్కడ నుండి క్రీస్తు పూజ చేస్తాము అని అనండి అప్పుడు చెప్పుదుము. ఉదా:- ఒక అన్యుని ఆవు పోయినది. మూడుదినములయ్యెను మన దగ్గరకు వచ్చి యేసుప్రభువును అడిగి చెప్పమంటే చెప్పిన తరువాత యేసు ప్రభువును పూజిస్తావా అని అడుగవలెను.
- ఇది చాల భయంకరము:- చావు మంచము మీద వున్న వారి కొరకు ప్రార్ధిస్తాము. బాగు పడేది, చచ్చేది కూడ చెప్పివేస్తాము. అక్కడనుండి ప్రభువును అక్కడ నుండి ప్రభువును ఆశ్రయిస్తాము. మరియు ఆస్పత్రి అధికారులు శానిటోరియం అధికారులు. గ్రుడ్డివారి పాఠశాల అధికారులు మమ్ము కోరితె మేము వచ్చి పూర్తిగా బోధిస్తాము. పూర్తిగా సహాయము చేస్తాము. రప్పిస్తారా వారు. మనము పబ్లిక్ చేయాలి. పేపరు వెయ్యాలి. ఒక వేళ మేము రాలేకపోతే మా ఇంటిలో వుండి ప్రార్ధిస్తాము. లేదా మా బోధకులను పంపిస్తాము. ప్రార్ధన ఔషధములను పత్రిక ఆరంభించారు. రెండు పేజీలయినది. బోధ ఎందుకు, క్లుప్తముగా అన్ని వుండాలని ప్రభువు చెప్పారు. నేను తప్పించుకొనడానికి సన్నిధికూటములు పెట్టమన్నాను ఒకవేళ ప్రభువు చెపితే చేయలేకపోతానేమో కొడుకు తండ్రితో అన్నాడు. ఆ దుక్కునుకొట్టు అన్నాడు కొట్టికొట్టి కొట్టలేక తండ్రి దగ్గరకు వచ్చి నాయనా ఇక నేను కొట్టలేను అంటే తండ్రి ఏమంటాడు. సరే నాయనా ఎవరితోనైనా కొట్టిస్తానంటా అలాగే యేసుప్రభువు నేను చేయలేను అంటే ఆయన చేసిపెట్టును, పౌలు ఏమన్నాడు మనము లేనిదే సువార్త పని పూర్తి కాదు అన్నారు. మనము రాకపోతే బైబిలు కథలు పూర్తికావు. ఇప్పుడు పూర్తి అగుచున్నవి. హెబ్రీ 11:4; ఇది ఒక ఆదివారపు ప్రసంగము. 1. బోధ పందెము 2. పత్రిక పందెము. 3. స్వస్థపందెము 4. దర్శన పందెము. 5. బైబిలుమిషను పందెము:- బైబిలుమిషను దేవుడు ఏర్పరచిందికాదు. అనేవారికి మేము సమాధానము చెప్పుతాము. సన్నిధి వన్నె :- 1. ఆది 4: 12-14:2. నిర్గమ 33:14. ఒక మనిషి వస్తాడు. చాల జబ్బుగానుంటే ప్రార్ధన చేయమంటాడు నేను ప్రార్ధన చేస్తాను. నెరవేరలేకపోతే తిడతాడు. అనిచేయరు నేను ప్రార్ధన చేస్తాను యేసుప్రభువు బాగుచేస్తాడు. బాగుకాకపోతే నన్ను అనవద్దు అని రోగిని అనాలి. అతనికి నమ్మకం తక్కువ భయముంది రోగికి కొంతమంది నూనె ఇస్తారు. కొందరు అనేకమైన వస్తువులు ఇస్తారు. మనమైతే కాగితములో అన్నీ వ్రాసి కాగితము ఇస్తాము. అదే గొప్ప. 6వ పందెము:- శక్తి పూజను మేము జరగకుండ చేస్తాము. క్రైస్తవ కీర్తనలో శాస్త్రయుక్తముగా లేకపోయిన పాడుకొంటే శక్తి వస్తుంది. బైబిలులో దయ్యాలను గురించి ఎక్కడ ఉన్నదో అక్కడ గురుతు పెట్టాలి. 23 సం||ల క్రిందట ఇంగ్లీషులో ఒక పుస్తకము వేశారు దయ్యాలను వెళ్ళగొట్టే పుస్తకమని, ఆ పుస్తకం చదవాలని అయ్యగారికున్నది. డబ్బులేదు. ప్రభువు మాత్రము వద్దన్నారు గాని అంత ఉపయోగములేదు. కాబట్టి వద్దన్నారు. మంచి ఆదరణ గల మాట చెప్పుతాను. చీకటి రాజ్యములో అందరి పేరు కంటే నా పేరు ఘనముగా మ్రోగుతుంది. ప్రార్ధన:- ఓ దయగల తండ్రీ! మేము మాట్లాడుకొన్న మహిమ సంగతులు మమ్మును ఎవరేమనుకొన్నా, పత్రికలు వేసే నీ మహాకృప దయచేయుమని ప్రభువు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమెన్! భూమి మీద మీరు ధనము కూర్చుకొనవద్దు, పరలోకమందు కూర్చుకొనండి అని ప్రార్ధన చేస్తే పరలోకమునుండి ధనము వస్తుంది. ఉత్తరమున మధ్యధరా సముద్రము దక్షిణమున కైసరైయ సముద్రము, పేతురుగార్కి భోజనము ఆలస్యమైనందున ఆకలిగా ఉండి సన్నిధికి వెళ్ళిపోయినాడు, మేడ ఎక్కినాడు. మేడేగాదు సన్నిధికి ఎక్కినాడు, పేతురుకు ఇష్టములేని పని దేవుడు చెప్పినాడు. అప్పుడు దేవుడు చెప్పినాడు కాబట్టి పేతురుకు ఈసంగతులు చెప్పినాడు. మనకాలములో నున్న బ్రాహ్మణుని నిష్టవంటి నిష్టగలవాడు పేతురు. అంత నిష్టవున్నను పేతురుకు దేవుడు చెప్పాడు గనుక వెళ్ళాడు. దేవునికి పక్షపాతము లేదని పాఠము నేర్పాడు. పేతురుకు గొప్పపాఠము అందరకు వేదము బాగుగా తెలిపిన మన మూడువేల మందికి ఒక్కసారే బాప్తిస్మము యిచ్చి నాయన పేతురు క్రీస్తుమతము లోనికి అన్యులకు కూడ చేర్చుకొనవలెనని తెలియును. వరాలు కూడ వారికి ఇస్తాడని తెలియదు. వరముల వివరము తెలియదు. శతాధిపతికి దర్శన వరము, పరిశుద్ధ బాప్తీస్మవరము ఉన్నది క్రొత్తగా చెప్పినదే యున్నది పేతురు అన్యుల ఇంటికి వెళ్ళి భోజనము చేస్తాడని తెలిస్తే యూదులు తిడతారు. ఎదురు చుశారేమిటి ? పదిపాళ్ళలో తొమ్మిదిపాళ్ళున్నవి. ఈయనకు నదిలో స్నానము ఇష్టములేదు గనుక రేపటికి ఉండమంటే ఆగమంటున్నారు. ప్రార్ధన:- తండ్రి యొక్కయు, కుమారునియొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామమున బాప్తిస్మము పొందుడి అని చెప్పిన యేసు అప్పుడు నీవు ఆ శిష్యుల దగ్గరనున్న నీవు యిప్పుడు మాదగ్గర వీరి దగ్గర ఉన్నావు మీరు వెళ్ళి సంచరించి బాప్తిస్మము కొనసాగించండి నయందు అని చెప్పి తానెవ్వరికి బాప్తిస్మము ఇవ్వక శిష్యులకు అధికారమిచ్చెను. గనుక అధికారమిచ్చిన ఆయనకు స్తోత్రములు రూపాంతర కొండపైన ఈయనే నా ప్రియ కుమారుడు. ఈయనయందు ఆనందించండి అని ఎవరిని గురించి తండ్రి సాక్ష్యమిచ్చెనో ఆ యేసు ప్రభువు బాప్తిస్మమిచ్చెను. కాబట్టి ఆయనకు వందనములు. బాప్తిస్మకాలమందు తండ్రి, కుమార , పరిశుద్ధాత్మ హాజరైయున్నారు. ఈ యోహాను, ఎవరికి బాప్తిస్మమిచ్చెనో, సలీము రేవులో, యోర్దాను నదిలో ఈయన లోక పాపములను మోసుకొనిపోవు దేవుని గొర్రెపిల్ల అని ఎవరిని గూర్చిసాక్ష్యమిచ్చెనో ఆ యేసుప్రభువే బాప్తీస్మము ఏర్పాటు చేసెను కాబట్టి అనేక వందనములు త్రియేక దేవునికి వందనములు. బాప్తీస్మము పొందినవారు ఇదివరకు మాకు బంధువులు కారుగాని ఇప్పుడు బంధువులైనారు. దేవదూతలయొక్క బంధువులైరి పరలోక వాస్తవ్వుల బంధువులైరి త్రియేకదేవుని యొక్క బిడ్డలైరి, ఈ గొప్ప కార్యము నిమిత్తమై త్రియేకదేవునికి వందనములు.
వీరు బాప్తీస్మము పొందవలెనని భ్రాంతి ఉన్నది. కారు చీకటిలో నుండి వెలుగులోనికి వచ్చిరిగదా, కాంతిలోనికి వచ్చిరి. ఇప్పుడు వీరి మనస్సు ఆందోళనగా లేదు. మనశ్శాంతి కలిగియుండుడి. తేలింది భ్రాంతి. ప్రకాశించినది కాంతి. వారి మనస్సులో కలిగింది శాంతి. ఈ మూడు దేవుడు మీకు అనుగ్రహించినాడని గ్రహింతురుగాక! ఆ ప్రార్ధన పుట్టింది పరలోకములో, ఈ ప్రార్ధన పరలోకసంబంధమైన ప్రార్ధన, నరలోక సంబంధమైన ప్రార్ధన, ఈ ప్రార్ధన వంటి ప్రార్ధన ఏ కవీశ్వరుడైన, ఏ వేదాంతియైన, ఏ దేవదూతయైన వ్రాయలేదు. ప్రార్ధన 1893వ సం||లో అమెరికా దేశములో “చికాగో” పట్టణములో అన్ని మతముల వారు సభ చేసిరి. ఈ సభ కారకుడు మన దేశస్థుడైన వివేకానందస్వామిగారు. మతనాయకులందరు ఉపన్యాసాలు చేసిన అనంతరము అందరు కలిపి చేసిరి. ఎందుకు చేసారంటే ప్రార్ధనలో ఏ దేవుని పేరు లేదు ఈ ప్రార్ధన అందరు “యస్” అన్నారు గనుక అందరు ఒప్పుకోవలసిందే.