1. Home
  2. Docs
  3. దైవ సాన్నిధ్యము...
  4. మొదటి ప్రసంగము – దైవ సన్నిధి

మొదటి ప్రసంగము – దైవ సన్నిధి

దైవ సన్నిధి

         యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు 1957 సం||ము

        ప్రార్ధన:- ఓ: త్రియేక దేవుడవైన తండ్రీ! దేవదూతల యొక్క తండ్రీ! నీకు స్తోత్రములు, నీ కుమారుని బట్టి నీకు స్తోత్రములు, నీ కుమారుని బట్టి విశ్వాసులకు మాత్రమే తండ్రివైన తండ్రీ నీకనేక స్తోత్రములు సృష్టినిబట్టి అవిశ్వాసులకు తండ్రీ నీకు స్తోత్రములు దేవదూతల లోకమందు వారికి నీ సన్నిధి భాగ్యము అనుగ్రహించిన నీకు వందనములు. అలాగే భూమి మీదనున్న మాకు కూడ సన్నిధి భాగ్యము అనుగ్రహించిన తండ్రీ నీకు స్తోత్రము, మాకే కాదు. సృష్టి అంతటికి తండ్రివైయున్న నీకు స్తోత్రములు, సృష్టి యావత్తును నిన్ను స్తుతించుచున్నది. మేము కూడ స్తుతించే స్థితి దయచేయుము. నేటి వర్తమానము ద్వారా మా ఆత్మీయ జీవనము వృద్ధి పొందునట్లు దీవించుమని యేసుప్రభువు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమెన్.
                      మొదటి ప్రసంగము

 "జీవమార్గమును నీవు నాకు తెలియజేసెదవు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. "కీర్తన 16:11.

ప్రియులారా: ఈ వేళ ఆదివారము ఆరాధన దినము, ప్రత్యేక ఆదివారము ప్రభువుయొక్క పునరుత్థానము.జ్ఞాపకము చేసికొనవలెను ఈష్టరు పండుగనాడే కాదు ప్రతి దినము మనకు పునరుత్థానము అవసరము (ఇక్కడ నిన్న జరిగిన కూటమువంటి కూటము కాదు ఇది) గుడిలో జరిగేది ఆరాధన. ఇక్కడ ఆరాధన ఉన్నది గనుక ఈ స్థలము కూడదేవాలయము వంటిదే మనము ఇప్పుడు దేవాలయములో ఆరాధనకు కూడుకొనియున్నాము. అది జ్ఞాపకముంచుకొనండి నా ప్రసంగవాక్యము నీ సన్నిధిని సంపూర్ణమైన సంతోషముండును. అనేది-జీవమార్గమును నీవు నాకు తెలియ జేసెదవు. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు బైబిలంతటిలో దైవసన్నిధి అనే మాట కనబడుచున్నది. ఎక్కడ ఆ మాట కనబడునో అక్కడ సన్నిధి యొక్క ఉనికి కనబడును. నేను రెండు భాగములు చేయుచున్నాను.

1. దేవుడు తన సన్నిధిని నరులకు అనుగ్రహించుట

2. నరులే దేవుని సన్నిధికి వచ్చుట.

1. ఆయన సన్నిధి నరుల యొద్దకు వచ్చుట

2. నరులే ఆయన సన్నిధికి వచ్చుట ఏది ముఖ్యము? దేనికదే ముఖ్యము. దైవసన్నిధి మనదగ్గరకు రాకపోతే మనము దేవునిసన్నిధికి వెళ్ళలేము. ఇవి రెండు సంగతులు మరి రెండు సంగతులు వినండి. 

1. భూమి మీద దేవుని సన్నిధియొక్క స్థానము. అందుచేతనే భక్తుడు దేవాలయము కట్టినాడు. మనుష్యులు అందులొనికి వెళ్ళితే దేవుడు అక్కడికి వస్తాడు. అని గుడి కట్టుకొన్నాడు. ఇది రెండవ దానిలో మొదటి భాగము.

రెండవభాగములో రెండవసంగతి ఏమనగా భక్తులందరు పరలోకమునకు వెళ్ళిన తరువాత అక్కడనిత్యసన్నిధి ఉండును ఇవిరెండు, మొదట చెప్పినవి రెండు, మొత్తము నాలుగు జ్ఞాపకముంచుకొనండి.

 మొదటి భాగము:- దేవుని సన్నిధి నరులయొద్దకు వచ్చుట.

 వివరము:- మొదటికథ ఆది 3:8 ఆదాము. హవ్వలు చెట్టు చాటున దాగి ఉన్నప్పుడు దేవుడే వారి యొద్దకు వచ్చెను కాని ఆదాము, హవ్వలు దేవుని దగ్గరకు వెళ్ళలేదు. ఆయన వచ్చి ప్రసవ వేదన అనే శిక్షయు చెమట ఓడ్చి కష్ట పడవలెను అనే శిక్షయు ఈ రెండును తెలియపరచెను, అది మాత్రమే కాకుండ స్త్రీ సంతానములో రక్షకుని పంపిస్తాను అనే దీవెన వినిపించినాడు.

మూడుదీవెనలు:- 1) సంతానము 2) పంట 3) యేసుప్రభువు లోకమునకు రక్షకుడుగా వచ్చుట, యేసుప్రభువు పేరు అక్కడలేదు. స్త్రీ సంతానము అని ఉన్నది. ఆ సంతానము క్రీస్తే అని పౌలు వ్రాస్తున్నాడు. గనుక దేవుని సన్నిధికి వచ్చి ఈ మూడు దీవెనలు ఇచ్చినవి. గనుక మనము ఇప్పుడు దేవుని సన్నిధి కలిగియుండే మనకును దీవెనలు వస్తున్నవి.  

 2వ కథ:- హనోకు ఆది 5:22:- దేవునిసన్నిధి భూలోకమునకు వచ్చి హనోకును పరలోకమునకు తీసికొనివెళ్ళినది. అలాగుననే రేపు యేసుప్రభువు వచ్చి వధువు సంఘమును పరలోకమునకు తీసికొని వెళ్ళును.

 3వ కథ:- ఆది 7వ అ:- దేవుని సన్నిధి నోవాహు యొద్దకు వచ్చి రక్షణ ఓడ కట్టమన్నాడు. నోవాహు దేవుని సన్నిధికి వెళ్ళలేదు. దేవుని సన్నిదే ఆయన దగ్గరకు వచ్చెను. దేవుని సన్నిధి నోవాహు దగ్గరకు వచ్చిన తరువాత నోవాహు దేవుని సన్నిధికి అనేక పర్యాయములు వెళ్ళవచ్చును.

 4వ కథ:- ఆది:- అబ్రహాము కల్దీయులలోనున్నప్పుడు దేవుని సన్నిధి వెళ్ళి నేను చూపించు దేశమునకు వెళ్ళమనెను, దేవుని సన్నిధి ఆయన దగ్గరకు రాబట్టి ఆయన దేవుని సన్నిధిలోనికి అనేక పర్యాయములు వెళ్ళగలడు.

5వ కథ:- ఆది 16 అ:- ఎండవేళప్పుడు అబ్రహాము తన గుడారము యొద్ద ఉన్నప్పుడు ప్రభువు అతని యొద్దకు వెళ్ళెను. ముఖాముఖిగా మాట్లాడును. అది ముఖాముఖి సన్నిధి లేక (సముఖము) అబ్రహాము భోజనము సిద్ధము చేస్తే తిన్నాడు అంతకు ముందు కాళ్ళకు నీళ్ళిస్తే పుచ్చుకొని కడుగుకొన్నారు. ఎంత గొప్ప సన్నిధి భాగ్యము. ఇటువంటి కథ బైబిలులో రెండవది మరెక్కడా ఉన్నట్లు నేను చూడలేదు.      

6వ కథ:- ఆది 18,20-33:-సొదొమ గొమొర్రా గ్రామమునకు వెలుపటి కథ, అప్పుడు దేవుడు ప్రత్యక్షముగాకనబడి సంగతి చెప్పినాడు. తనతో వచ్చిన ఇద్దరు దేవదూతలు ముందు వెళ్ళిపోయిరి తరువాత దేవుడు ఒంటరిగా నుండి అబ్రహాముతో మాటలాడినాడు అది దేవుని సన్నిధి అబ్రహాము మాటలాడినాడు. దేవుడు మాటలాడినాడు. వంతుల ప్రకారముగా ఒకరి తర్వాత ఒకరు మాటలాడినారు ఇది గొప్ప సంభాషణ స్నేహితులు వస్తే ఇద్దరు మాటలాడినట్లుగ వీరిద్దరు గొప్పసంభాషణ చేసిరి బైబిలులో వ్రాయబడిన గొప్ప సంభాషణ ఇదే.

7వ కథ: ఆది 28:18:-యాకోబు ప్రయాణములో విచారముతో నుండగా పరలోకమునుండి ఒక నిచ్చెన తనదగ్గరగా వేయబడియున్నది అప్పుడు ప్రభువు మాట్లాడినాడు యాకోబు లేచిన తరువాత ఇది దేవుడు ఉన్న స్థలము "దేవుని సన్నిధి" అని పేరు పెట్టెను ఆ పేరు ఏమిటంటె "బేతేలు" బేతేలు అనగా దేవుని ఇల్లు దేవుడుండే స్థలము (ఆ పేరు మనమున్న ఇంటికి పెట్టబడెను)

 8వ కథ:- నిర్గమ 3అ. :- ఇప్పటికి ఆదికాండమైనది నిర్గమ కాండములోనికి అడుగుపెడదాము, ఒక పొద వున్నది. ఆ పొదలో అగ్ని నాలుకలు వస్తున్నవి. అక్కడ ప్రభువున్నాడు, అక్కడ మోషే ఉన్నాడు. దేవుడు మోషేతో మాట్లాడెను. నేను నీకు చూపించు దేశము వెళ్ళమని అబ్రహాముతో చెప్పినప్పుడు అబ్రహాము వెంటనే వెళ్ళెను. ఇక్కడ మోషేను వెళ్ళమంటే నీవు ఎవరినైనా పంపుకో నేను వెళ్ళలేను. నేను నత్తివాడను అని సాకులు చెప్పినాడు. అప్పుడు బలవంతముగా మోషేను పంపును ప్రభువు ఒకమాట చెప్పెను ఈ పొద స్థలము పరిశుద్ధ స్థలము గనుక నీ చెప్పులు తీసివేయుమని చెప్పును. మోషే దేవునితో ఏమనినప్పటికిని (మాబాగే కాని) ఆ పొద దగ్గర దేవుని సన్నిధిని దేవుని చూచెను మాటలు విన్నాడు ఎంత ధన్యత! ఎదిరించే ఈ మురాభి మనిషికి ఎంత ధన్యత వచ్చినది ఈ మోషే దేవుని సన్నిధికి వెళ్ళలేదు గొర్రెలు కాచుకొనుటకు వెళ్ళెను దేవుని సన్నిధి దొరికెను ఒకదానికిపోతే మరియొకటి దొరికెను అలాగే యితడు కూడ ఎలాంటి దుర్మార్గులైనాసరే దేవుని సన్నిధికి వెళితే దొరకును అనగా గద్దింపులు, వర్తమానము, ధైర్యాలు, అద్భుతాలు సేవ, ఈమొదలగునవి నేడుకూడ దొరుకును; నేడు మీగ్రామములో సన్నిధి కూటములు పెట్టుకొనండి. అప్పుడివన్నీ దొరకును.

9వ కథ:- నిర్గమ 19, 20:- ఆ తర్వాత మోషే పొదదగ్గర నుండి ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తునుండి ఎర్రసముద్రము దాటి అడవిలోనికి వెళ్ళి సేనాయి కొండ ఎక్కెను మంచి ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళెను. అక్కడ దేవునితో ముఖాముఖిగా మాట్లాడే ధన్యత దొరికినది మన వలె ఒక గంట కాదు; 40 రోజులు తండి తిప్పలు లేవు. గొప్ప సన్నిధి మనలో ఎవరైనా 40దినాలు దేవుని సన్నిధిలో ఉంటే చచ్చిపోతారు. అన్నములేక, నీళ్ళు లేక చనిపోతారు. ఈ మోషే మాత్రము చావలేదు. మన బైబిలులో ఇప్పుడు చదివిన మొదటి మాట నీకు నాకు జీవమార్గమును తెలియ జేసెదవు. అక్కడ మోషే జీవముతో నుండెను, నీ కృషి చేతితో నిత్యము, సుఖములు కలవు మోషే సుఖముగా నున్నాడు.

 మోషే   1. జీవముతో నున్నాడు.

           2. సంతోషముగా నున్నాడు.

           3. సుఖముగా నున్నాడు.

 సన్నిధిలో నుండే వారు అటువంటి ధన్యత తప్పకపొందుదురు మనదేశములో 40 దినములు లెక్క వేసుకొని ఉండాలని సన్నిధికి వెళ్ళారు గాని కృషించిపోయెను. ఆయన దైవ భక్తుడే సంపూర్ణ సమర్పణ గలవాడే, ప్రత్యక్షత గలవాడే. ఎందుచేతనో గాని 40 దినముల ఉపవాస సన్నిధి భాగ్యము కలుగలేదు. సన్నిధిభాగ్యము కలిగిందిగాని ఆయనకు తెలియదు. మనకు తెలియదు. ఎన్ని రోజులు ఆయన శరీరము కృషించినది. మోషే అయితే ఆ 40 దినాలలో తండి తిప్పలు లేకపోయినా ఏమి తగ్గలేదు. ఆశ్చర్యము మన తెలుగు జీల్లాలలో ఒక విశ్వాసి కలదు. దైవాజ్ఞ ప్రకారము 90 రోజులు ఉపవాసమున్నది. దైవసన్నిధిలో నుండి 90 దినాలలో అప్పుడప్పుడు కొద్దికొద్దిగా నీళ్ళు త్రాగేది. ఆశ్చర్యము.

 10వ కథ:- 1 దిన 28:19:- అక్కడనుండి రాగా మోషే దగ్గరనుండి ఒక్కటే పెద్ద గీత దావీదు వరకు (మోషే-దావీదు) ఈయనకు తీరుబడిలేదు. ఎప్పుడు యుద్దము చేయడమే దావీదును గురించి ఒక మాట బైబిలులోనున్నది. మనిషి దేవునితో మాట్లాడినాడు: అని దావీదే సాక్స్యమిచ్చుచున్నాడు. దేవుడు కొండమీద మోషేకు వ్రాసి చూపించెను. అలాగుననే దావీదునకు కూడా గాలిలో వ్రాసి చూపించెను కాబట్టి మన మందరము దేవుని సన్నిధిలో ఉండవలెనని చెప్పి ముగించుచున్నాను.

11వ కథ:- దావీదు దగ్గరనుండి యెషయ వరకు (ఆమెన్) ఒక గీత యెషయ మొదలుకొని మలాకివరకు ఒకగీత. ఆమధ్యనున్న ప్రవక్తలందరు దైవ సన్నిధిలో గడుపుట మాత్రమే కాదు. దేవుడు వారికి కనబడ్డాడు, వారితో మాట్లాడినాడు. వారు ఆ మాటలు వ్రాసి కొన్నారు.
  1. సన్నిధిలో గడిపినారు. 2. సన్నిధిలో ప్రభువు కనబడ్డారు. 3. ప్రభువు వారితో మాట్లాడినారు. 4. వారు విన్నది. వ్రాసుకున్నారు. సన్నిధిలో ఈ 4 భాగ్యములు ఉన్నది. (ఇప్పుడు) మీరందరు మీటింగులు ముగింపు అయిన తరువాత సన్నిధిలో నుండండి మీరు ప్రభువు సన్నిధిలో ఉన్న, ప్రభువు మీకు కనబడును మీతో మాట్లాడును (వ్రాయ గలిగినన్ని నోట్సులు వ్రాసికొనండి) ఇది బైబిలులోని పద్దతి, ఆదికాండములో ఒకకథ విడిచిపెట్టెను. ఆ కథ అసాధ్యమైన కథ. అట్టికథ ఇప్పుడు ఎవరైనా నడపగలరో లేదో తెలుపుట కష్టము. యబ్బోకు రేవు: ఆది 32:22-32 యబ్బోకు రేవు దగ్గర యాకోబు యబ్బోకు తర్వాత యాకోబు అక్కడ పోరాటము. తెల్లవార్లు పోరాటమే. ఎవరితోను దేవుడు యాకోబుతో పోరాడెను. ఎందుకు? (మీరువెళ్ళి) యాకోబు దేవునితో పోరాడు అంటారు. పెనుగులాడెను అంటారు యాకోబుతో దేవుడు పెనుగులాడెను అని ఉన్నది. దేవుని సన్నిధికి ఎవరైతే వెళతారో వారితో దేవుడు పెనుగులాడతాడు. పెనుగులాడేటప్పుడు మీరు ఏడ్చుతారు. ఏడుస్తారు. జాగ్రత్త! ఇప్పుడు నవ్వుతారా అగ్ని కాల్చునట్లుగా దైవాగ్ని మిమ్ములను కాల్చివేయును. (తాడేపల్లిలో ఇంకా ఇతరస్థలములలో వేడెక్కుతుంది శరీరమైతే కాలుతుంది) దేవుడు నీలో ఫలాని తప్పుంది: ఒప్పుకో అంటే మనిషి అంటాడు. ఆహా అహా అంటున్నాడు దేవుడు మనిషిని గుద్దుతున్నాడు, తప్పు ఒప్పుకో లేకపోతే తత్ క్షణమే అంటున్నాడు తుదకు తప్పుతెలిసికొని దేవుని గట్టిగాపట్టుకొనును ఆయన వదలించు కోబోతే వదలుటలేదు ఈయాకోబుకు ఈఅలవాటు చిన్నప్పటినుండి అలవాటయినది. తల్లి కడుపులోనే అన్నగారికాలు గట్టిగా పట్టుకొన్నాడు నా కంటె ముందుగా ఎక్కడికి వెళ్తావు? నన్ను దీవిస్తేగాని నిన్ను (మాత్రము పోనియ్యనన్నాడు (అయితే అయ్యిందిగాని) యాకోబు గట్టిపట్టేపట్టినాడు తుదకు దేవుడు దీవించినాడు అలాగుననే ఇప్పుడెవరైతే వారి గృహాలలో వారి సంఘాలలో వారి పేటలలో సన్నిధి కూటము పెడతారో వారిని దీవించకుండా ప్రభువు వెళ్ళనేవెళ్ళడు ఈ సన్నిధి కూటమిలో యాకోబు ఒక్కడే స్వజనులు ఎవ్వరూలేరు మనము ఎంతమందిమైనా కూడుకొని సన్నిధి కూటము పెట్టుకొనవచ్చును ఈసన్నిధికూటమి మాకు చేతకాదు అన్నవారే ముందు పెట్టవలెను ఎవరైతే మనస్సు నిలుపబడుట్తలేదు అంటారో వారే పెట్టాలి వారేనాయకులుగా నుండాలి. అయ్యగారు ఒక పేపరు వేసిరి దానిపేరే దైవసన్నిధి 7గురు కలిసి సన్నిధికూటము పెట్టండి ఏడుగురు సమకూడకపోతే ముగ్గురైనా పెట్టండి ముగ్గురూ సమకూడకపోతే ఒక్కరైనా పెట్టండి ఈ ఒక్కడే 7గురు కలిసిన సన్నిధి అవుతుంది. సన్నిధి కూటము ఏలూరులో ఒక కూటము యేసుప్రభువు వెంటనే వచ్చారు యేసుప్రభువు దైవసన్నిధి కూటమి ముగ్గురు దైవసన్నిధి కూటమి ఒక్కరు దైవసన్నిధి కూటమి ఒక్కరుంటే సన్నిధి కూటము ఏలాగు అయినది అది సన్నిధి అయినది గాని సన్నిధి కూటము కాదు ఈఒక్కడే చేస్తాడు ఆయన దేవుడు దూతలు పరిశుద్ధులు అవుతారు వీరందరు కలిస్తే కూటమి అవ్వలేదూ! ఐదుగురు కూటమి అయ్యింది. సన్నిధిలో కనబడినవారు ఒకరు ఆ ఒక్కాయన వెళ్ళగా యేసుప్రభువు వెంటనే వచ్చారు తర్వాత దేవదూతలు వస్తారు తర్వాత ఇక్కడనుండి పరలోకానికి వెళ్ళినపరిశుద్ధులు వస్తారు 5వ వారు ఈ భూలోకములో నివసించుచున్న విశ్వాసులలో ఎవరో ఒకరు ఆత్మరూపిగ వెళతారు ఇది (ఇప్పుడు జరుగుచున్న) అనుభవసాక్ష్యము చరిత్ర గుంటూరులో ఒక సన్నిధి కూటమున్నది. ఈ కూటమి ఉదయం 10గం||నుండి 11వరకు ప్రభువేస్వయముగా వచ్చి దానికొకపేరు పెట్టిరి నిత్యజీవకూటమి బెజవాడలో ఒక సన్నిధి కూటమున్నది ఇది చాలా కాలమునుండి ఉన్నది దాని పేరుచిన్న కన్నియ కూటము ఏలూరులో ఒక కూటము దాని పేరు ప్రసన్న కూటము తాడేపల్లిగూడెం షారోను సన్నిధి కూటము.

కాకినాడలో రాకడగుంపు సన్నిధికూటమి ఇవన్ని ప్రభువువచ్చి పెట్టిన పేరులు ఈ కూటముల లోనికి ఇదివరకు చెప్పిన 4గురు వెళ్ళుచున్నారు కూటమంతా కలిసి ఒక్కడే తక్కిన 4గురు కలిసి 4గురు ఆనలుగురు ఈ ఒకరు కలిసి 5గురు అయినారు వారువచ్చి వీరితో మాటాడుచుంటే వీరు వ్రాసుకొంటున్నారు అంతా వ్రాసుకోలేక పోవుచున్నారు ఎక్కడని వ్రాయగలరు? చాల కష్టము గనుక ముఖ్యమైనవి మాత్రము వ్రాసికొనుచున్నారు.

 సన్నిధి కూటమిలో జరిగే కార్యక్రమము వినండి. ఇప్పుడు జరుగుచునేయున్నది బైబిలులోనిది కాదు. సంఘములోనిది. 1) వీరు వెళ్ళగానే ప్రభువుమీద ప్రశ్న వేయుచున్నారు. ప్రభువేకాదు. తక్కిన వారుకూడా వారిటైము వచ్చినప్పుడు జవాబు చెప్పుచున్నారు. బైబిలు మిషనులో వున్న వారందరు సన్నిధి కూటము పెట్టవలెనని (నేను ఈదినమందు) సలహా ఇస్తున్నాను. నాపత్రికలద్వారా ఇదివరకే సలహా ఇచ్చివేసినాను. తెలుగులోమాత్రమేకాల ఇంగ్లీషులో కూడా వ్రాసిపంపినందువల్ల అందరికి సలహా ఇచ్చినాను. (మద్రాసులో బిల్లిగ్రహందొరగారి కూటమిలో మా పత్రికలు పంచిరి ఇప్పుడు మాత్రమే కాదు) ఇది వరకు మద్రాసులో, (అంతకుముందు) రాజమండ్రిలో సన్నిధి కూటమి ఆరంభించినాము. అనగా అయ్యగారే బోధించినారు. కొంత అభ్యాసము కూడా చేయించినారు. రాజమండ్రిలో అభ్యాసం చేయించడం జరిగింది బహిరంగముగా చేయించడం ఇప్పటికి 13సం|| కావచ్చుగాని అంతకుముందే 1912 సం||లోనే రాజమండ్రిలో బోధించినాను. సంతోషించినారు. గాని సన్నిధి కూటములు పెట్టుకోలేదు. ఏవో ఆటంకములు కలిగి ఒకరు లేక ఇద్దరు పెట్టుకొన్నారు. గాని వృద్ధిలేదు. 1912లో బోధించినాను. చెప్పడము అప్పుడు గాని, అయ్య గారు అభ్యాసము చేయుట అంతకుముందే బహిరంగముగా అభ్యాసము చేయుట 1901 సం||లో స్థిరపడిపోయినది.  గనుక ఇక ఇవి పోవు.(భీమవరం, రాజమండ్రిలో కొద్దిగా ఊగిసలాడుచున్నది. అవి కూడ వృద్ధిలోనికి వచ్చిన తరువాత చెప్పుతాను. అక్కడక్కడ పెడుతున్నారు. వృద్ధిలోనికి వచ్చును.) తప్పకుండ ప్రభువు నాకు కనబడి మాట్లాడుచున్నారని నేను 56 సం|| క్రితం చెప్పితే అలాగా కనబడుచున్నారండి అని అన్నారుగాని ఎవరును అవలంభించలేదు. తర్వాత నిజంతెలుసుకున్నారుగాని తక్కువ మంది ఇప్పటికి అయిదు కూటములే) ఇప్పుడు 500 కూటములు కాకపోతే ఏలాగు? 
Please follow and like us:

How can we help?