1. Home
  2. Docs
  3. దైవ సాన్నిధ్యము...
  4. సన్నిధిలో కుర్చీ వేయుట

సన్నిధిలో కుర్చీ వేయుట

బైబిలుమిషను వారమైన మేము దినమునకు ఒక గంట నిశ్శబ్దముగా దైవ సన్నిధిలో ప్రభువు మాట్లాడుటకొరకు సన్నిధి మాకు నేర్పించిన యం. దెవదాసు అయ్యగారు దైవసన్నిధిలో కుర్చీ వేయండి, ప్రభువును పరలోక పరిశుద్దులును వచ్చి కూర్చుందురు అని మాకు నేర్పించినారు కొందరు దీనిని గూర్చి వేరే విధముగా మాట్లాడుచున్నారు. గనుక ఈ విషయము వ్రాయుచున్నాము.

1. పాత నిబంధన కాలములో అబ్రహామును దర్శించుటకు యెహోవా వచ్చెనని గలదు. ప్రభువా! అని నమస్కరించెను “దయచేసి కాళ్ళుకడుగుకొని ఈచెట్టు క్రింద అలసట తీర్చుకొనండి” ఆది18: 1-14, యెహోవా అలసట తీర్చుకొనుటకు అబ్రహాము ఆ చెట్టు క్రింద ఏమిచేసెను, ప్రభువా, అన్నాడుగదా! ఆ ప్రభువు కూర్చుండెనుగదా! మా మధ్యకు వచ్చిన ప్రభువును సన్మానించుటకు కుర్చీ వేయుట తప్పా!

2. పాత నిబంధన సంఘమును నడిపించిన మోషేతో (నిర్గమ 25:22) నేను నిన్ను అక్కడ కలిసికొందును అని దేవుడు చెప్పెను. అక్కడ అనగా ఎక్కడ? కరుణా పీటము మీద నుండియు, శాసనములుగల మందసము మీదనుండు రెండు కెరూబుల మధ్య నుండియు మాట్లాడెదనని చెప్పెను. దేవుడు ఉండి మాట్లాడుటకు చూచుకొనెను గనుక మీఎదుటికి ప్రభువు ఆయన ఒక స్థలమును ఏర్పరచుకొనెను గనుక మీఎదుటికి ప్రభువువచ్చి మాట్లాడునప్పుడు. ఆయనను నిలువబెట్టి మేము కూర్చుండుట ఏమి మర్యాద గనుకనే సన్నిధిలో కుర్చీ వేయుచున్నాము. ఆది 25:1-22.

3. బేతనియలో మరియ, మార్తలు ప్రభువును తమ ఇంట చేర్చుకొన్నప్పుడు ఆయన వారి ఇంటిలో కూర్చుండలేదా! మరియ ఆయన పాదములయొద్ద కూర్చుండెను గదా? లూకా 10:39.

4. శిష్యులు గార్ధభమును తోలుకొని వచ్చి దానిపై బట్టలు వేయగా ఆయన బట్టలుపై కూర్చున్నారు గదా! మత్తయి 21:7. ఇంకను అనేక చోట్ల ప్రభువు కూర్చుండుట వాక్యములో చూడగలము, కడవరి రాత్రి ప్రభువు తన శిష్యులతో భోజన పంక్తిలో కూర్చుండెను యోహాను 13:4

5. మన కాలములో సాధుసుందరసింగుగారు “ప్రభు పాద సన్నిధి” పుస్తకములో వ్రాసిన విషయములు ప్రభువు ఎదుట మోకరించి గదా ప్రశ్నలు వేసెను ప్రభువు ఎక్కడ కూర్చున్నారు?

ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉందురో నేనక్కడ ఉందునని వాగ్దానము చేసిన ప్రభువు మా ఎదుటనున్నారను విశ్వాసము మాకు గలదు. గనుకనే ఆయనను గౌరవించుటకు కుర్చీ వేయుచున్నాము ఆయన మన యందును, మనము ఆయనలోను ఉండుటను అనుభవము గలవారు. అట్టి విశ్వాసము గలవారు ప్రభువును ఎంతైన గౌరవించగలరు. అట్టి అంతస్తులు గల వారికిది అభ్యంతరము కాదు.

పాత నిబంధన కాలములో ప్రవక్తలను గౌరవించుటకు వారికి ప్రత్యేక గది ఏర్పరిచిరి వారికి మంచము బల్ల, కుర్చీ, దీపము ఉంచిరని గలదు పరలోక పరిశుద్ధులు మా కూటములకు వచ్చునప్పుడు వారిని మేము గౌరవించుట తప్పుకాదు. “అబ్రహాము, దావీదు మొదలగువారు మా చుట్టాలే అనియు, పేతురాది సకలాపోస్తుల్ మాకూటస్తులనియు” కీర్తన పాడుచున్నాము. వారు మా బంధువులు, మా కూటస్థులు వారు మా దైవసన్నిధి గదిలోనికి రాకుండా ఎట్లుండగలరు? వారిని గౌరవించుటకు మేము కుర్చీ వేయుట తప్పుకాదు.

అంతరంగ సహవాస అనుభవము, అంతరంగ ప్రేమ పరలోకమునకు చూపించుటకు తప్పుగా భావించువారు మా కొరకు ప్రార్ధించాలి. ప్రభువును మీరు అడిగి జవాబు పొంది మేము చేయునది తప్పు అనండి చదువరుల అంతరంగముతో పెండ్లి కుమారుడైన ప్రభువు మాట్లడును గాక!

Please follow and like us:

How can we help?