చదువరులారా! ఒక వేళ మీరు ఇతర దైవములను, ఉపకార సాధనములను ఆశ్రయించియుండవచ్చును. అయితే క్రీస్తును కూడా ఆశ్రయించి చూచినారా? ఆశ్రయించి యుండవచ్చును. అయితే క్రీస్తును కూడా ఆశ్రయించి చూచినారా? క్రీస్తు ఎవరనుకున్నారు?
ఆయన దేవుడు గనుక ఆశ్రయింప వచ్చును. ఆయన మన నిమిత్తమై నరుడై జన్మించినాడు కనుక మరింత యెక్కువ సంతోషముతో ఆశ్రయింప వచ్చును. క్రీస్తు అనగా నియమితుడు – నరులను రక్షించుటకు ఏర్పాటైన ప్రత్యేక పురుషుడు. ఆయన నరుడైనందున
పూర్వీకులకు కనబడెను. వారి ఇండ్లలో బస చేసెను. మోక్షము సంపాదించుటకు కొన్ని సుళువైన సూత్రములు బోధించెను. నడిచి చూపించెను. కనుక ఆయనను ఆశ్రయింప వచ్చును. సర్వలోకమునకు ఉపకారము చేయుటకై వచ్చెను. కనుక ఆయనను
ఆశ్రయించిన యెడల నిశ్చయముగ మేలు చేయును. కనుక ఆశ్రయింప వచ్చును. ఎట్టి రోగినైనను, ఎట్టి నిరుపేదలైనను, దేవుడగు క్రీస్తును నమ్మనివారైనను మనసు కుదుర్చుకొని కొంత సేపైనను ఆశ్రయించిన పక్షమున ఆయన విడిచి పెట్టడు గనుక ఆశ్రయింప
వచ్చును. ఆయన వలన ఈ లోకములోను నిజ సౌఖ్యము కలుగును గనుక ఆశ్రయింప వచ్చును. ఆయన మేలు చేయువాడు. ఎంత గొప్ప ఆపదలో నున్న వారినైనను ఆయన తప్పించును కనుక ఆశ్రయింప వచ్చును.
మన కోరికలు మంచివైన యెడల ప్రార్ధించునప్పుడు అన్నియును నెరవేర్చును. ఎంత గొప్ప పాపాత్ములైనను క్షమించుమని యడిగిన యెడల క్షమించి, పాపములను పరిహరించును. మీ చిక్కు యేదైనా ఆయనకు చెప్పి చూడండి అది ఆయన వచ్చిన ఘోర
మరణమును తప్పించుకొనక చనిపోయెను కనుక ఆయనను ఆశ్రయింపవచ్చును. చనిపోయినవాడు చనిపోయినట్లే యుండక మరల బ్రతికి వచ్చెను. ఇంత గొప్ప శక్తి గలవాడు గనుక మీకు యెటువంటి పనియైనను చేసిపెట్టగలడు. కనుక ఆయనను ఆశ్రయింప
వచ్చును. ఈ లోకములో ఆయన చేసిన పనులన్నియు మన ఉపయోగము నిమిత్తమే కనుక ఆయనను ఆశ్రయింప వచ్చును.
ఆయన మహిమ శరీరముతో మోక్షమునకు వెళ్ళి తన భక్తుల కొరకు కనిపెట్టుచున్నాడు. రేపో మాపో ఆయన మేఘాసీనుడై వచ్చి, అప్పుడు ఇంకను జీవించియున్న భక్తులకు మహిమ శరీరము ధరింపజేసి మోక్ష పురమునకు కొంచుకొని పోవును. వారికి
ఎన్నడును చావుండదు, పాపముండదు, బాధ యుండదు, ఆకలి దప్పులుండవు. దైవ సన్నిధి యుండును. అనంతానందము కలిగియుండును. మనము అక్కడకు వెళ్ళిన గాని ఈ వృత్తాంతములు అనుభవములోనికి రావు. అయినను వాటిని గురించి ఇక్కడ
ఉన్నప్పుడు క్రీస్తును నమ్మి ఆశ్రయించిన యెడల చాల వరకు అనుభవములు తెలిసికొనవచ్చును. మనకంటే ముందుగ వెళ్ళిన భక్తులతోను, అది వరకున్న దేవ దూతలతోను మనకు గొప్ప మైత్రి కలుగును. ఇట్టి ధన్యత ఎవరికి అవసరము లేదు? ప్రయత్నించు
వారికందరికిని ఈ ధన్యత కలుగక మానదు. మానవులు ప్రతి వస్తువును, ప్రతి ఉపకార చరిత్రయును పరీక్షించుచున్నారు గదా! అట్లే క్రీస్తు తత్వమును పరీక్షింపనగును. అట్టి పరీక్ష వ్యర్ధము కాదు. అనుదినము ధ్యానములో ఉన్న యెడల నమ్మిక పుట్టక మానదు.
లోకములో పుట్టిన మహా మహోపకారుల కంటే ఉభయ లోకముల ఉపకారియగు “క్రీస్తే” గొప్పవాడని దైవ గ్రంధమగు బైబిలు చూపుచున్నది. కనుక ఆయనను ఆశ్రయింప వచ్చును.