రక్షణ వార్తావళి

⌘K
  1. Home
  2. Docs
  3. రక్షణ వార్తావళి...
  4. క్రైస్తవ మతము ఎందులో ఎక్కువ

క్రైస్తవ మతము ఎందులో ఎక్కువ

జవాబు:- జనసంఖ్యలో, బైబిలును 2000 భాషలయందు అచ్చువేయుటలో, పరీక్షార్ధమై యితర మత గ్రంధములు కూడ ప్రచురించుటలో, వ్యాఖ్యానములు, ఇతరగ్రంధములు, పత్రికాదులు ప్రచురించుటలో, మతబోధకులను సిద్ధపరచుటలో, పనివారిని అన్ని

దేశములకు మతప్రకటన నిమిత్తమై పంపుటలో, జీతముల పద్ధతిని స్త్రీలను, పురుషులను పనివారినిగా ఏర్పర్చుటలో, దేవాలయములు నిర్మించుటలో, మతము నిమిత్తమై గొప్పధనము ఖర్చుపెట్టుటలో, పాఠశాలలు, ఆస్పత్రులు, బోర్డింగులు, చేతిపనుల శాలలు,

అనాధ శాలలు స్థాపించుటలో, మనుషులందరి క్షేమ్ము నిమిత్తమై దైవప్రార్ధన చేయుటలో, నాగరికత ప్రవేశపెట్టుటలో, నరమాంసభక్షకులను సైతము సాధువులనుగా మార్చుటలో, ఇతర మతములను పిలుచుటలో, లోక జనులందరిని సహోదర ప్రేమయందు

ఐఖ్యపరచి ఒకటిగా చేయు ప్రయత్నములో, పశ్వాదులకు కూడ వైద్యశాలలు స్థాపించుటలో, గుడ్డివాండ్రకు చదువు నేర్పుటలో, దైవప్రార్ధన వలన, బోధవలన పాపులకు, రోగులకు, భూతపీడితులకు, బిదలకు, సంతానములేని వారికి, చిక్కులలోనున్న వారికి,

పశ్వాదులకు, ఉపకారము చేయు స్వస్థిశాలలు నియమించుటలో, అక్షరములు లేని భాషలకు లిపి కల్పించుటలో క్రైస్తవులే యెక్కువగా కనబడుచున్నారు మరియు హతసాక్ష్యములో యెక్కువ అనగా మతములు వదలి పెట్టవలెనని యితరులు పీడించినను, వదలక

వారి చేతిలో హతమగుటలో యెక్కువ.

 2) ఇంకను క్రైస్తవమత దేశములయొక్క ఏ పనులు యెక్కువ?

జవాబు:- పుస్తకములు అచ్చువేయు ముద్రాక్షారశాలను సంకల్పించి స్థాపించుటలో, గ్యాసులైట్లు, ఎలక్ర్టిక్లైట్లు, ట్రైన్లు, కార్లు, బైసికిళ్ళు, ఓడలు, స్టీమర్లు, టెలిస్చోపులు, టెలిగ్రాములు, టెలివిజన్లు, గ్రామఫోనులు, బ్రాడ్ క్యాస్టులు, కండ్ల అద్దములు, ఎక్సరేలు, కలములు,

మందులు, మరలు, గడియారములు, ఫోటోగ్రాపులు, విమానములు ఈ మొదలైన పరోపకార సాధనములు కల్పించుటలో క్రైస్తవులే ఎక్కువ. వీటిలో కొన్ని పూర్వము ఇతరులు చేసిరి అనుమాట నిజమైనయెడల అవి వారు కొనసాగింపలేకపోయిరి అనుమాట కూడా

నిజమే. క్రైస్తవులు మాత్రము నేటివరకు కొనసాగించుచున్నారు.

  3) క్రీస్తు ఒక్కడే రక్షకుడని అన్ని దేశములలో బోధించుటలో క్రైస్తవమతము ఎక్కువ (అ.కార్య. 4:12; ఫిలిప్పి 2:9-11; ఎఫెసీ 4:5-7). కొందరు అన్ని మతములు ఒకటే అని అందురు. క్రైస్తవమతము ఎక్కువ.

 4) ఆదివారము క్రైస్తవులకు దైవారాధన దినముగాను,

ఇతరులకు సెలవు దినముగాను ఏర్పడినది. ఈ విధముగా క్రైస్తవమతము ఇతర మతములకు కనబరచుకొనుటలో యెక్కువ.

5) క్రైస్తవులు కాలవిభజన చేయుటలో క్రీస్తు శకము వాడుచున్నారు. ఇతర మతస్థులుకూడ యిదే వాడుచున్నారు. 1999వ సంవత్సరము అని ఉత్తరములలో వ్రాసికొనుచున్నారు. ఇతరి నుండి డిశంబరు వరకు ఒక సంవత్సరము యొక్క లెక్క. ఇది రులు కూడ

ఈలాగే వ్రాసికొనుచున్నారు. జనవరి నుండి డిశంబరు వరకు ఒక సంవత్సరము యొక్క లెక్క. ఇది యితర మతస్థులు కూడ వాడుచున్నారు. తెలియనిరీతిగా ఆదివారమును, క్రీస్తుశకమును, మాసములను అన్ని మతములోనికి స్వభావసిద్ధముగా ప్రవేశించినవి.

ఇట్లు క్రీస్తుమతము ఇతరులకు కనబడుటలో యెక్కువ.

6) మంచికిని, చెడుగునకును, వీటిఫలితములకును సంబంధించిన చరిత్ర యొక్క మూలములు బైబిలులో కనబడుచున్నవని అనుటలో క్రైస్తవమతము ఎక్కువ.

7) క్రైస్తవ మతము అన్ని మతముల యెదుటికి వెళ్ళుచున్నందువలన యెవరికిలేని నిందలు, ఆటంకములు, ఇబ్బందులు, హింసలు దీనికే కలిగియుండుటలో, విరోధులను క్రీస్తుతట్టు త్రిప్పుటకై కడవరకు యత్నించుటలో ఎక్కువ.
Please follow and like us:

How can we help?