క్రీస్తుప్రభువు తన జీవము పోగొట్టుకొన్నట్లు సిలువ చరిత్ర వలన తెలియుచున్నది కాని పునరుత్థాన చరిత్ర వలన ఆయన జీవము గలవాడని తెలియుచున్నది. మన కాలములో ఎవరైన ఒకరు చనిపోయి మూడవనాడు లేచిన యెడల ప్రజలు ఎంతో
అద్భుతపడుదురు. క్రీస్తులేచిన పునరుత్థాన జీవము ఇంతకన్నా గొప్పది. ఎందుకనిన ఆయన అందరి కొరకు చనిపోయెను. అందరికొరకు లేచెను. “మనము పాపముల విషయమై చనిపోయి, నీతి విషయమై జీవించునట్లు ఆయన తానే తన శరీరమందు మన
పాపములను మ్రాను మీద మోసికొనెను.” 1పేతురు 2:24. చనిపోయిన ఆయన చనిపోయినట్లే ఉండిపోయిన యెడల మనము పాపముల విషయములో చనిపోయెన వారమై యుందుము. ఆయన లేచినాడు గనుక అనగా జీవముతో సమాధిలో నుండి
వచ్చివేసినాడు గనుక మనము ఆయనను బట్టి అనగా ఆయన పునరుత్థానమును బట్టి ఈ లోకములో జీవింపగలుగు వారగుదుము. మనము శరీర రీతిగ చనిపోన తర్వాత, శరీర రీతిగ చనిపోయిన ఆయన లేచినట్లు మనమును పునరుత్థాన కాలమందు లేతుము.
అంత వరకు పాపములేని స్థితియందు జీవించుచునే యుందుము. ఆయన పునరుత్థాన జీవము వలననే మనకు ఈ లోకములో పరిశుద్ధ జీవము.
2)శక్తి:- ఆయన శక్తి తన చావును చంపిన శక్తి-చావునకే గొప్ప శక్తి గలదని అనుదినము చనిపోవుచున్న వారి సంగతి చూచుచున్న మనకు తెలుసు కాని ఈ శక్తి చావు శక్తి కంటె గొప్పాయమును నెరవేర్చుటకు ఆయన చావ గలిగెను. పాపులను, ఆ మరణ
శాపము నుండి రక్షింప వలెనను కృపా న్యాయమును బట్టి లేవ గలిగెను. అది పాపము వలన మరణము అను న్యాయమును నెరవేర్చుటకు ఆయన చావ గలిగెను. పాపులను, ఆ మరణ శాపము నుండి రక్షింప వలెనను కృపా న్యాయమును బట్టి లేవ గలిగెను.
ఆయన మనుష్యుడు గనుక చావ గలిగెను. దేవుడు గనుక లేవ గలిగెను మంచి శుక్రవారము అను పేరు ప్రభుని సిలువ మరణ దినమునకు కలిగినది. ఆ దినమందు పాపులకు కలిగినది మంచి ఏది? శ్రమ నివారణాయెను. మన శ్రమలో ఆయన శ్రమ తలంచుకొన్న
యెడల ఆదరణ కలుగును. తుదకు ఆదరణ కంటె యెక్కువ పని జరుగును. అది యేది? పూర్తిగ కష్టము నివారణ యగుటయె. సిలువ చరిత్ర పాత నిబంధనలోని యజ్ఞమును జ్ఞాపకము చేయుచున్నది. క్రీస్తు లోక పాప పరిహారార్ధమై, లోక పాపములను తన మీద
వేసికొని మహా యజ్ఞమాయెను. ఇట్టి మరణము మనకు రావలసినది. కాని ఆయనకు వచ్చినది. గనుక ఇట్టిది మనకు రాదు.
మంచిశుక్ర వారపు దీవెనలు మీకు కలుగును గాక! ఆమెన్.