రక్షణ వార్తావళి

⌘K
  1. Home
  2. Docs
  3. రక్షణ వార్తావళి...
  4. నామార్ధము

నామార్ధము

        దేవుడు యేసు క్రీస్తుగా నరావతార మెత్తిన వ్యక్తికి మెస్సీయ, క్రీస్తు, 

యేసు క్రీస్తు, యేసుక్రీస్తు అని పేర్లు. మెస్సీయ అన్నను, క్రీస్తు అన్నను

అభిషిక్తుడనియే అర్ధము. దేశమును పాలించు ఒక రాజునకు ఎట్లు

పట్టాభిషేకమగునో అట్లే ఈ అవతార పురుషునికి మానవ సంఘమును

రక్షించుటకై అభిషేకమాయెను. ఈయన అభిషిక్తుడనబడెను. అనగా

నియమింపబడిన వాడు. రక్షణ పనికి నియమింపబడిన ప్రత్యేక పురుషుడు.

రక్షించునట్టి పనికి నియమింపబడిన వ్యక్తి ఈయనే అను అర్ధము క్రీస్తు అను

పదములో గలదు. యేసు అను మాటకు రక్షకుడని అర్ధము. యేసు క్రీస్తు

అనగా రక్షకుడగు అభిషిక్తుడు (గలతీ 6:14). క్రీస్తు యేసు అనగా అభిషిక్తుడగు

రక్షకుడు.(ఫిలిప్పీ2:5). మెస్సీయ అను పేరు దానియేలు 9:20లోను, క్రీస్తు

అను పేరు లూకా 2:51లోను, యేసు అను పేరు లూకా 1:31 లోను, మత్తయి

1:21లోను కనబడుచున్నది.

   ఆయన జన్మమునకు పూర్వము పరలోకము నుండి గబ్రియేలను 

దేవదూత, ఆయన తల్లిగా ఏర్పడిన కన్యక మరియాంబకు ప్రత్యక్షమై “ఇదిగో

నీవు గర్భము ధరించి కుమారుడిని కని ఆయనకు యేసు అని పేరు

పెట్టుదువు.” అని ప్రవచించెను (లూక1:13). మరియు మరియాంబకు భర్తగా

ఏర్పడి యోసేపునకు ప్రభువు దూత స్వప్నమందు ప్రత్యక్షమై “దావీదు

కుమారుడవైన యోసేపూ, నీ భార్య యైన మరియను చేర్చుకొనుటకు

భయపడకుము ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది ఆమె

యొక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే

రక్షించును. గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు” అని చెప్పెను.

(మత్తయి 1:20,21).

యేసే క్రీస్తని అ. కార్య 2:36, 1యోహాను 2: 22లో ఉన్నది దీని అర్ధమేమి?   

యేసు అను వ్యక్తి మాత్రమే రక్షణోద్యోగమునకు నియమింపబడినవాడని

అర్ధము. మరియొక సంగతి గమనించవలెను. మెస్సీయ అనుపేరును, యేసూ

అను పేరునూ, క్రీస్తు అను పేరును మోక్ష లోకమునుండి వచ్చిన పేర్లే. ఆయన

పరలోకము నుండి దిగి వచ్చిన వ్యక్తి. యేసుక్రీస్తు ప్రభువు దేవుడును, పాపము

లేని మనుష్యుడును గనుక అన్ని కాలములోను, అన్ని స్థలములలోను, అన్ని

అవస్థలలోనున్న ప్రజలందరిని రక్షింప సమర్ధుడు. భూలోకమునుండి

వచ్చినవాడు ఏదో ఒక దేశమునుండి వచ్చినవాడై యుండవలెను. అట్టివాడు ఆ

ఒక్క దేశమునకే సహకారియై యుండగలడు. అయితే యేసు యొక్క దైవ

స్థితియును, మానవ లోకమున ఆయన నరుడుగా చూపిన మాదిరియును

పరీక్షింపగ ఆయన సర్వకాల రక్షకుడును, సర్వజన రక్షకుడును అని

ఋజువగుచున్నది. యేసు, క్రీస్తు అను నామములు స్వదేశ నామములుకావు.

పరదేశ నామములుకావు అవి మోక్షలోక నామములు. కనుక

స్వదేశీయులైనను, పరదేశీయులైనను ఆయన నామ స్మరణ చేసిన యెడల

మోక్షమునకు వెళ్ళగలరు. ఒక దేశములో వెలసిన ఘనుని పూజింప

వలైనదని మరియొక దేశస్తులకు చెప్పిన యెడల మా దేశములో మాకు

ఘనులు లేకనా మీ దేశ మీ దేశ ఘనుని పూజింప వలెనని అనక మానరు.

అయితే క్రీస్తు ప్రభువును గూర్చిన ప్రమేయము వేరుగా నున్నది. ఆయన అన్ని

దేశములకు దేవ రక్షకుడు గనుక మేము ఆయనను పూజింపనవసరము

లేదని ఏ దేశస్థులును అనుటకు అవకాశములేదు. అందరు కలిసి ఆయన మా

దేశ రక్షకుడు, మా గ్రామ రక్షకుడు, నా రక్షకుడు అని ఆనందించుటకు ప్రతి

వారికిని హక్కు గలదు. మరి యెవరి వలనను రక్షణ కలుగదు ఈ

నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుష్యులలో

ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అని అ,కా. 4:12లో గలదు.

ఇది బైబిలు అంతటిలో యేసుక్రీస్తు ప్రభువే రక్షకుడని ధృడపర్చుటకు గొప్ప

ఆధార వాక్యమై యున్నది. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకములో ఉన్నప్పుడు

పాపాత్ములకు పాపక్షమాపణ అనుగ్రహించెను (మార్కు2:50. రోగులను తన

హక్కు చేత బాగు చేసెను. (మత్తయి 8:17) మృతులైన కొందరిని లేపెను.

(యోహాను 11:42,43).

యేసు క్రీస్తు ప్రభువు ఈ లోక్సమునకు వచ్చునని ముందుగనే దైవజ్ఞులు 

వ్రాసిన వ్రాతలను బట్టియు, అట్టి వ్రాతలకు అనుగుణ్యముగా క్రీస్తు ప్రభువు

బోధలను బట్టియు, ఆయన ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన చేసిన

బోధలను బట్టియు, ఉపకారాద్భుతములను బట్టియు, ఆయన చూపిన పవిత్ర

ప్రవర్తన మాదిరిని బట్టియు, తన ఇష్టానుసారముగ సర్వలోక పాప పరిహారార్ధమై

యజ్ఞమై హతుడగుటను బట్టియు, పునరుత్థానుడై ఆరోహణుడగుటను

బట్టియు చూడగా చదువరులకు ఆయన దేవుడనియు లోకైక రక్షకుడనియు

తోచక మానదు.

Please follow and like us:

How can we help?