ప్రియులారా, మన సమీపమందు మంచిగాని, చెడ్డగాని జరుగుచున్నప్పుడు వినకుండా ఉండలేము, చూడకుండ ఉండలేము. చెడును విసర్జింతుము, మంచిని అవలంభింతుము. ఇది పర స్వభావము. ఇది మనలో దేవుడు పెట్టినది గనుక విధాయకముగ
వాడి తీరవలెను.
2. వీధిలోనికి వివిధములైన బట్టలురాగా వెళ్ళి చూచి కావలసినవి కొందురు గదా! క్రెస్తవ మతము మన లోకములో రెండు వేల ఏండ్ల నుండి ఉండి సమస్త ధర్మములను ముఖ్యముగా మోక్ష మార్గమును బోధించుచున్నది. పాఠశాలలు, ముద్రాక్షశాలలు, వైధ్య
శాలలు, అనాధశాలలు స్థాపించుచున్నది. వివిధములైన యంత్రములు ట్రైన్లు, బస్సులు, బైసికిళ్ళు, ఎలక్ట్రిక్ లైట్లు, క్రొత్త క్రొత్త ఔషధములు, శరీరములోని అంతర్భాగములు చూడగల ఎక్సరేలు, టెలిగ్రాములు, టెలిఫోనులు, ఫోటోగ్రాఫులు, విమానములు ఈ మొదలైన
ఉపకార శాధనములుకల్పించినవి క్రెస్తవ దేశములే గదా! వీటిలో కొన్ని యితరులు కూడ కల్పించుట నిజమైన యెడల అవి వారు సాగింపలేకపోయిరి. ఇట్టి ఉపకార మతమును పరీక్షింపరాదా! మతము దైవమతమైనను క్రెస్తవులలో కూడ లోపములు గలవు. వాటిని
విసర్జింపవలెను.
3. వరద వచ్చునని ప్రభుత్వము వారు చాటించినప్పుడు గ్రామస్తులు నిద్రపోవుదురా! కూడని పనులవలన హాని అనియు, తుదకు జీవంతమందు నరకమనియు క్రెస్తవమతము బోధించుచున్నది గనుక విసర్జింపకుండ ఊరుకొందురా?
4. క్రీస్తుప్రభువు దేవుడును, మన నిమిత్తమై అవతరించిన నరుడునై యున్నాడనియు అందుచేతనే సర్వజనులకు మేలు చేయగలడని క్రైస్తవసంఘము బోధించుచున్నది. ఆయన మందులు లేకుండ రోగులను బాగు చేసెననియు, అపాయము తప్పించెననియు,
సర్వలోక పాపపరిహారార్ధమై ప్రాణ త్యాగము చేసినను పునర్జీవితుడై మోక్షమునకు వెళ్ళి నేడు క్రైస్తవ సంఘమును వ్యాపింప జేయుచున్నాడనియు బైబిలును బట్టి చెప్పుచున్నారు పరీక్షించండి.