రక్షణ వార్తావళి

⌘K
  1. Home
  2. Docs
  3. రక్షణ వార్తావళి...
  4. పుష్కలోపదేశము

పుష్కలోపదేశము

దేశీయులారా, ప్రియులరా, మికు శుభము కలుగుగాక! ఒక వైధ్యుడు ఒక 

రోగితో యీ మాట అన్నాడు. అయా, మీరు అనేక మంది వైద్యులిచ్చిన మాత్రలు

వేసికొన్నారు. నేనిచ్చునట్టి మాత్రలు కూడ వేసికొని చూడండి.

స్నేహితులారా ఈ మాట యెంత మంచిమాట! ఈ మాటలో ఆయన దయ 

కనబడుచున్నది. మేము మీకు ఇటువంటి మాటయే చెప్పుచున్నాము. మీకు

మీ స్వంత మతము తెలియునుమీకు తెలిసినంత వరకు అందులో భక్తిగా

నుండవలెనని ప్రయత్నించుచున్నారు సంతోషమే. క్రైస్తవ మతమును గురించి

కూడా తెలిసికొనుడి. అందులో ఎక్కడైన మంచియున్న యెడల దాని ప్రకారము

చేయుడి. దేవుడు మిమ్మును దీవించుగాక!

క్రైస్తవ మతము యొక్క చరిత్ర ఆలకించుడి. లోకములు పుట్టకముందు

దేవుడొక్కడే యుండెను. ఆయన లోకములు కలుగజేసి మనుష్యుని కూడ

సృజించెను. మనుష్యులకు దేవుడు తన గుణములే దయచేసినాడు గాని వారే

పాపములో పడిపోయిరి. అందుచేత లోకమును రక్షించుటకు రక్షకుని

పంపెదనని దేవుడు మాట యిచ్చినాడు. ఆ మాట పట్టుకొని నరులు రక్షకుని

కొరకు కనిపెట్టినారు. తుదకు దేవుడు మనుష్యుడుగా జన్మించినాడు. ఆయనకే

యేసురీస్తు అని పేరు. దేవునిని చూడవలెనని మానవుని కోరిక గనుక దేవుడు

మనుష్యుడగుట సరిపోయినది. ఆ యేసుక్రీస్తు ప్రభువు 1) మోక్ష మార్గమును

గురించి బోధించెను 2) పాపుల పాపములు పరిహరించెను. 3) రోగులను తన

మాట చేత బాగుచేసెను 4)దయ్యములు పట్టినవారిలో నుండి దయ్యములు

వెళ్ళగొట్టెను 5) ఆకలిగొన్నవారికి ఆహారము పెట్టెను 6) ఆపదలోనున్న వారిని

రక్షించెను 7) దుఃఖించువారిని ఓదార్చెను 8) మృతులను కొందరిని రక్షించెను

9) పగవారి మేలు కోరెను 10) ఇతరులలో నున్న తప్పులు చూపించెను 11)

తనలో ఏ దోషము లేకుండ నడచి మాదిరి చూపించెను 120 దుష్టులాయనను

దేవుడని గ్రహింపక సిలువ వేసి చంపినారు 13) యేసుప్రభువు లోక

పాపములను తన మీద వేసికొనుటకు వచ్చినాడు గనుక తనను

చంపనిచ్చినాడు 14) ఆయన మనుష్యుడగుట చేత చనిపోయెను 15) దేవుడే

కనుక బ్రతికి వచ్చినాడు 16) శిష్యులకు కనబడినారు 17) భక్తులు

చూచుచుండగా శరీరముతో మోక్షమునకు వెళ్ళినాడు. ఇటువంటి పనులు

చేసిన ఆయన రక్షకుడు కాకపోయిన యెడల మరెవరు రక్షకులు కాగలరు?

ఆయనను నమ్మితే మోక్షము.

క్రీస్తు ప్రభువు 1. సైతానును జయించెను. 2. పాపములను జయించెను. 3. 

దుర్భోధలను జయించెను 4. పగవారి పగను జయించెను 5. యాధులను

జయించెను 6. ఇబ్బందులను జయించెను 7. కష్టములన్నిటిని జయించెను 8.

మరణమును జయించెను 9. నరకమును జయించెను ఇన్ని

జయించినజయించినవాడు మనకు రక్షకుడు కాని యెడల మరియెవరు

రక్షకులు కాగలరు?

 ఇప్పుడు మనమాయనను ప్రార్ధించిన యెడల మన పాపములను 

పరిహరించును.

మన కష్టములన్నిటిని తొలగించును. తుదకు మోక్షలోకము లోనికి

చేర్చుకొనును. ఆయన త్వరలోనే వచ్చి తన కథను నమ్మిన వారిని

మోక్షలోకమునకు తీసికొనివెళ్ళును. వారికి చావుండదు. ‘ఆయన వచ్చు వేళ

అయినది గాన ఈ కథను నమ్ముట వలన సిద్దపడుడి,’ అని మేమందరికి

బోధించుచున్నాము. మిగిలిన వారికి గొప్ప శ్రమలు కలుగును. అపుడు

యూదుల జనాంగము అనగా క్రీస్తు ప్రభువు జన్మించిన జనాంగము ఆయన

తట్టు తిరుగును. ఇతరులును కోట్ల కొలది తిరుగుదురు. అపుడు ప్రభువు

యేసు పాప కారకులగు సైతానును అతని సమూహమును బంధించి వేయును

కనుక పాప కార్యములు జరుగని శాంతి కాలము ప్రవేశమగును. దానికి ప్రభువే

పాలకుడు. తుదకు తీర్పు జరుగును. ఈ సంగతులు బైబిలను క్రైస్తవ వేదము

నందు గలవు. ఇది దేవుడు లోకమునకిచ్చిన గొప్ప బహుమాన గ్రంధము.

చదువుడి దేవుడు మిమ్మును వర్ధిల్ల జేయును గాక!

 దేవుడు అందరి దేవుడు. ఆ దేవుడే యేసు క్రీస్తుగా భూమి మీద 

వెలసినాడు కావున యేసు క్రీస్తు అందరి యేసు క్రీస్తు అయి యున్నాడు. అనగా

అందరి రక్షకుడై యున్నాడు. ఆ యేసు క్రీస్తు ప్రభువు తన సంగతి అందరికి

బోధించుడి అని చెప్పినాడు గనుక క్రైస్తవ మతము అందరి మతమై యున్నది.

ఇది నమ్మువారు ధన్యులు. మతము నమ్మకముతోనే యున్నది. ఆ నమ్మిక

నిజమైన సంగతిని బట్టి యుండు నమ్మికయై యుండవలెను. కల్పన బట్టి

యుండకూడదు. అపుడు విశ్వాసికి ఉపకారము కల్గును. క్రైస్తవ మతము ఒక

దేశ మతము కాదు. ఒక ద్వీప మతము కాదు. ఒక జనాంగము యొక్క

మతము కాదు, ఒక ఖండము యొక్క మతము కాదు. ఒకే ఒకరి మతము

గాదు. ఇది అందరి మతమై యున్నది క్రైస్తవులలో అనేక మంది నామక

క్రైస్తవులున్నారు. చాలా విచారము.అంతమాత్రమున మతము దైవ మతము

కాకపోదు. క్రైస్తవ మతము మనుష్యుని బట్టి స్థాపన కాలేదు. దేవుని బట్టి స్థాపిత

మయినది.

 మతమనగా నేమి? 1) దేవుని గురించి ఉన్న సంగతులు ఉన్నట్లుగా 

బోధింప గలుగునదే మతము. 2) మానవునికి ఉపకారముగా నుండు

విషయములు బోధింప గలుగునదే మతము. 3) ఏది పాపమో, ఏది పావనమో

ఎత్తి చూపించ గలుగునదే మతము. 4) పాపమును విసర్జింప వలెనను బుద్ధి

మనకు గలదు గాని విసర్జింపగల శక్తి లేదు. అట్టి శక్తి ననుగ్రహింపగల ఒక దేవ

రక్షకుని చూపించ గలుగునదే మతము. 5) పవిత్రముగా నడుచుకొనవలెనను

ఆశ మనకు గలదు కాని శక్తి చాలదు. అట్టి శక్తి ననుగ్రహింపగల యొక దేవ

రక్షకుని చూపించ గలుగునదే మతము. 6) దైవ భక్తిని కలిగించుకొని దానిని

వృద్ధి చేసుకొనుటకు అవసరమైన ఏర్పాట్లు చేయగల్గునదే మతము.

  మతస్థుడనగా నేమి? మత బోధ ప్రకారము ప్రవర్తించుటకు 

ప్రయత్నించువాడే మతస్థుడు. అట్లు ప్రవర్తించని యెడల అది అతని నేరమే

గాని మతము యొక్క నేరము కాదు.

 యేసు క్రీస్తు నామము స్వదేశ నామమా? విదేశ నామమా? స్వదేశ 

నామము కాదు-విదేశ నామము కాదు. మోక్షలోక నామము. ఈ నామము

వలనే మోక్షము. ఇదే క్రీస్తు మత బోధ.

యేసుక్రీస్తు అనగా ఎవరు? యేసు  అనగా అభిషేకము పొందినవాడు 

యేసుక్రీస్తు అనగా మానవులను రక్షింపగల ఉద్యోగమునకు రాజు వలె

పట్టాభిషేకము పొందినవాడు. నియమిత రక్షకుడు-వైశేషికుడు.

మేము ప్రేమింప వలసిన వారలారా! 1. సైతానును దయ్యములను

తప్పించుకొనుడి. 2. పాపములను తప్పించుకొనుడి 3. వ్యాధులను

తప్పించుకొనుడి 4. కరువులను, యిబ్బందులను తప్పించుకొనుడి 5.

చిక్కులను, అపాయములను, పాపమునకు రావలసిన దుష్ట

ఫలితములన్నిటిని తప్పించుకొనుడి 6. అన్నిటికన్న చివర రానైయుండి,

అన్నిటికన్న గొప్ప కీడుగా నుండబోవు నిత్య నరకమును తప్పించుకొనుడి. ఈ

విషయములో దేవుడు మీకు సహాయము చేయుగాక!

మా బోధ నిజమో కాదో తెలిసికొనవలెననిన ఒక పనిని చేసి తీరవలెను.

అదేదనగా ప్రతి దినము ఒక గంటయైనను మోకాళ్ళ మీద దైవ ప్రార్ధన

చేయవలెను (ఇంతకంటె ఒక గొప్ప సత్య జ్ఞాన సాధనము మీకు చూపలేము.).

దేవుడు మీకు సత్యమును బయలుపరుపక మానడు. స్వప్నములోనో,

దర్శనములోనో మీ కది కనబడును లేదా మీ జ్ఞానమునకు అర్ధమగును.

Please follow and like us:

How can we help?