రక్షణ వార్తావళి

⌘K
  1. Home
  2. Docs
  3. రక్షణ వార్తావళి...
  4. బాప్తిస్మ ప్రసంగము

బాప్తిస్మ ప్రసంగము

ప్రసంగ పాఠము :మార్కు: 16:16.

ప్రార్ధన:- త్రియేక దేవుడవైన ఓ తండ్రీ! నీనామమందు బాప్తిస్మము పొందువారికి కొన్ని మాటలు చెప్పే కృపయు, ఇదివరకు పొందినవారికి ఇవి ఉపయోగముగా నుండేటట్లు ఆత్మ సహాయము దయ చేయుమని వేడుకొంటున్నాము. ఆమెన్.

ఇదివరకు బాప్తిస్మము పొందినవారికి ఈ సంగతులు తెలుసు. నీళ్ళు శిరస్సు మీద పోసి బాప్తిస్మమిస్తూ యున్నారు. చేతితో పోసేటప్పుడు చేతినీళ్ళు, చెరువులో, ఏటిలో ఇచ్చేటప్పుడు వాటినీళ్ళు. అక్కడ, ఇక్కడ నీళ్ళే కొలతలేదు. బాప్తిస్మము పరిశుద్ధమైన బాప్తిస్మము. గనుక మురికినీళ్ళలో ఇవ్వడము బాగుండదు. గుడిలో నీళ్ళు, బేసిన్లో నీళ్ళు పరిశుద్ధమైనవి. బాప్తిస్మము పరిశుద్ధము గాన నీళ్ళు పరిశుద్ధమే. ఇవన్నీ గుర్తులే. ఎందుకు ఇట్లు బాప్తిస్మము ఇస్తున్నారని ప్రశ్నించగా- యేసుప్రభువు సమాధిలో మూడవనాడు లేచినాడు. యేసుప్రభువు మునిగినప్పుడు  పాత శరీరము పోయి, లేచినప్పుడు క్రొత్త శరీరము వచ్చింది. అట్లే బాప్తిస్మము ద్వారా పాతగుణములు పోయి క్రొత్తగుణములు వస్తున్నవి అని అంటున్నాము. పాతగుణము పోగొట్టుకొని క్రొత్తగుణము తెచ్చుకోవడము మనిషి పని. ఆకాశము నుండి ఎండ, మేఘముల నుండి వర్షము రప్పించుట దేవునిపని, పాదిరిగారు చేతితో పైనుండి నీరుపోసినట్లు యేసుప్రభువు పైనుండి భూమిమీదకు వచ్చెను. ప్రభువు దైవాత్మను 120 మంది మీదికి పైనుండి పోసినట్లు  పాదిరిగారు నీటిని పోస్తున్నారు. దైవాత్మ ఇప్పుడే క్రుమ్మరింపబడుట జరుగాలని అడిగెతే మరీమంచిది. ఆత్మ కుమ్మరింపు దేవుడిచ్చేది. నీటిబాప్తిస్మము పాదిరిగారు ఇచ్చేది. నేను చెప్పేదేమనగా నీటితో పాదిరిగారు ఇచ్చేది పూర్తి స్నానముకాదు. ప్రభువు ఆత్మలో కూడా ఇచ్చేది కలిపితే నిండు స్నానమవుతుంది. అందుకే ప్రభువు ఒక్కడే, ఆత్మ ఒక్కటే, బాప్తిస్మము ఒక్కటే (ఎఫెసీ:4:5). నమ్మండి, బాప్తిస్మము పొందండి. అప్పుడు మీకు రక్షణ.నమ్మకపోయినా, బాప్తిస్మము పొందకపోయినా రక్షణలేదు. ఆటంకాలుంటే మీ నమ్మిక చాలును.విశ్వాసము వలన రక్షణ వున్నదని చెప్పెను. నమ్ముట అనగా ఆత్మలో క్రియ, బాప్తిస్మము అనగా బహిరంగ క్రియ. నమ్మినపుడే క్రైస్తవులైనారు. ప్రభువు బాప్తిస్మమెందుకని చెప్పెననగా అందరికి తెలియుటకు. నమ్మనివానికి శిక్ష, నమ్మినవానికి రక్షణ. బైబిలులో ఉన్నట్లు చేయండి. తీర్ధములో జనము క్రిక్కిరిసినపుడు పాయలుచేసి ముందుకు వెళ్ళినట్లు, ఆటంకాలు తొలగించుకొని బాప్తిస్మము పొందండి. నమ్మినప్పుడు, బాప్తిస్మము పొందినప్పుడే క్రైస్తవులు. ఉదాహరణకు పెండ్లి చేసేటప్పుడు క్రొత్తచుట్టాలు వస్తారు. బాప్తిస్మము పొందునప్పటి నుండి మీరు మాకు, మేము మీకు; ఇంకా పరలోక భక్తులు, చనిపోయిన భక్తులందరునూ, భూమిమీద అనేకులైన సజీవ భక్తులునూ, దేవదూతలునూ, త్రియేక దేవుడునూ చుట్టాలే. ఎంత పొడుగు చుట్టరికం దొరికింది! ఎందుకూ పనికిరాని మనమెంత ధన్యులము! అందుకే ఘనపర్చుడీ దేవుని అనే కీర్తనలో 'పరలోక పరిశుద్ధులు....ప్రాముఖ్య సాధనము..' అని పాడుకొనుచున్నాము. యేసుప్రభువు పాతచుట్టమైనాడు. కనుక మీరు ఎప్పుడూ పడిపోక, ధైర్యముగా ఉండి, అనేకులను ప్రభువు తట్టు త్రిప్పండి, బడాయిగా నడువండి క్రొత్త చుట్టరికం దొరికినందుకు. శ్రమలను బట్టి వెనుకకు పోవద్దు. ఉదా:- భర్త కోపధారియైనా, తిట్టినా, కొట్టినా, చంపినా భార్య ఎక్కడికి పోదు. మీరు కూడా అంత స్థిరముగా ఉండాలి. భూమి, ఆకాశములు గతించినా నా మాటలు ఎల్లప్పుడు నిలిచి యుండునని యేసుప్రభువు చెప్పెను. మత్తయి 24:35. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడుననే మాట మార్కు :16:16 లోని మాట ఎప్పటికీ గతించదు. మీరీ కొద్దీ మాటలద్వారా ధైర్యము తెచ్చుకొని, ప్రభువు నందు స్థిరవిశ్వాసము గలవారై, రాకడకు సిద్ధపడు మహిమ సంపాదించు కొందురు గాక! ఆమెన్.
Please follow and like us:

How can we help?

Leave a Reply