రక్షణ వార్తావళి

⌘K
  1. Home
  2. Docs
  3. రక్షణ వార్తావళి...
  4. యేసు నామము

యేసు నామము

దైవ నామ స్మరణ చేయగోరు వారలారా! దేవునికి ఆది లేదు,

అంతములేదు. అయినను తన నివాసము మన నివాసమునకును, మన

నివాసమునకును సందర్భమగునట్లు ఆయన నర జన్మమెత్తినందున

నరులాయనను సంభోధించుటకే మోక్షలోకము నుండి వచ్చిన యేసుక్రీస్తు అను

నామము ధరించెను. యేసు అనగా రక్షకుడు క్రీస్తు అనగా రక్షింపగల పనికి

ఏర్పాటైన అభిషిక్తుడు ఈ పత్రికలో యేసునామమును గురించియే

వివరింతుము. క్రీస్తు, యేసుక్రీస్తు క్రీస్తుయేసు అను నామములు గ్రంధములో

భక్తులు ఉపయోగించిరి. ఈ నామ స్మరణ వల్లనే మనకు ఉభయలోక

సౌఖ్యములు కలుగును., వినండి. ప్రతివారును తమ అభిప్రాయమును

వెల్లడించుకొన వచ్చును. కాని బేధములు కనబడునపుడు ద్వషభావము

కలుగనీయరాదు. ఇట్లు వర్తించుటయే మెచ్చుకొనదగిన నీతి.

1. దేవుడు యేసు అను నామములో వెలసెను. గనుక ఇది మనకు తెలిసిన 

అన్ని నామముల కన్న గొప్ప నామము.

2. ఇది మనము పెట్టుకొన్న నామమైన యెడల మన భక్తిని బట్టి గొప్ప 

నామమగును. గాని ఆయన పెట్టుకొన్న నామము గనుక మనము పెట్టుకొన్న

గొప్ప నామము కంటె గొప్ప నామము.

3. ఇది దేవుని నామము. మనుష్యనామము. రెండు విధములుగా 

ఉపయోగపడునామము గనుక గొప్ప నామము.

4. యేసు అను పేరు మనుష్యుని వద్దకు తీసికొని వచ్చినది మోక్ష 

లోకమందలి దేవదూత, నరుల నోట నుండి వెలువడినది కాదు. మహా

పరిశుద్ధుడైన దేవదూత నుండి వెలువడినది. (ఇప్పుడీ నామము భక్తులు,

భక్తిహీనులు ఉచ్చరింప వచ్చును.)

5. తెలుగులో మాటకు మొదట యకారము రాదు. యేసు అను పేరులో 

యకారమున్నది. దీనిని బట్టి చూడగా అది తెనుగు భాషాపదము కాదు.

మోక్షలోక భాషా పదము. గనుక గొప్ప నామము. యేసు అని వ్రాయుటకు

బదులు ఏసు అని వ్రాయ కూడదు.

6. యేసు- క్రీస్తు అను మాటలు మోక్షలోక భాషాపదములు గనుక ఇవి 

ఉచ్చరించుచున్న భూనివాసులు పరలోక భాష (దేవదూతల భాష)

మాటలాడుచున్నారని చెప్పవచ్చు ఇది ఉభయ భాషా పదము గనుక గొప్ప

నామము అ.కా.4:12.

7. యేసు అను మాటకు రక్షకుడని అర్ధము. ఈ గొప్ప అర్ధమును బట్టి అది 

గొప్ప నామము.

8. రక్షకుడు అనగా సైతాను అధికారము నుండియు, పాపముల నుండియు, 

పాపఫలితములగు వ్యాధులు, ఇబ్బందులు, అజ్ఞానము, చిక్కులు,

అపాయములు మొదలైన వాటి నుండియు మనలను తప్పించువాడు మరియు

మరణము వలన కలుగు హాని నుండియు తుదకు పాప ఫలితములో కడవరి

ఫలితమగు నరకము నుండియు తప్పించువాడు. ఇన్ని గొప్ప అర్ధములు ఈ

నామము వలన తేలుచున్నవి గనుక ఇది గొప్ప నామము.

9. యేసును ఆశ్రయించిన వారికి కూడ మరణము కలుగును గాని అది 

మోక్షమునకు ద్వారముగా ఏర్పడును. మన శరీరము మోక్షములో పనికి

రాదు. దానిని ఇక్కడనే మట్టిలోనే విడిచి పెట్టవలెను. యేసు ప్రభువును

నమ్మని వారు కూడ చనిపోవునపుడు తమ శరీరమును ఇక్కడే విడిచి

పెట్టుదురు గాని వారు ఆశ్రితులవలె మోక్షమునకు వెళ్ళలేరు.

  1. యేసు ప్రభువు ఎంత కన్యక గర్భమందు జన్మించినను ఎంతగా

పాపాత్ములతో కలిసి మెలిసి సహవాసిగా తిరిగినను నరుల పాపములు

ఆయనను అంటుకొనలేదు. ఎందుకనిన ఆయన కేవలము మనుష్య సంతతిలో

కేవలము మనుష్య రీతిగా జన్మించి యుండలేదు. ఆయన దేవుడై యుండి నర

శరీరధారియైనను దేవుడుగా నుండుట పూర్తిగా మానివేయలేదు.

అవసరమైనప్పుడెల్ల తన దైవత్వమును కనబరచునట్టి పనులు చేయుచునే

యుండెను. ఆ కాలమందు ఫోటోగ్రాఫర్లులేరు. ఒకవేళ ఉండి ప్రభువు యొక్క

ఫోటో తీసిన యెడల అతను ఏమనును,ఓహో! ఈయన ఒక పక్షమున

దేవుడును, ఇంకొక పక్షమున మానవుడునై యున్నాడని ఇతరులకు చెప్పక

మానడు. నేడు చిత్రకారులు ఆయన రూపురేఖలు చిత్రించుచున్నారు. వారు

క్రీస్తు ప్రభువు యొక్క మనుష్యత్వమును కనుపరుపగలరు గాని, దైవత్వమును

కనుపరగలరా? ఇట్టి కథ ఒకప్పుడు జరిగినది.

  1. ఆయన తన ప్రజలకు రక్షకుడని మత్తయి 1:21లో నున్నది. అది

విశాలార్ధమందు అన్ని కాలములలో, అన్ని స్థలములలో, అన్ని

జనాంగములలోనున్న విశ్వాసులకు సంబంధించును. ఆయన జన్మించిన

కాలమందు ఆయన పుట్టిన జనాంగ ప్రజలగు యూదులకు సంబంధించి

యుండినను వారిలో నమ్మనివారు ఎట్లు జనాంగ ప్రజలగు యూదులకు

సంబంధించి యుండినను వారిలో నమ్మనివారు ఎట్లు ఆయన ప్రజలు

కాగలరు? ఎవరైనను నమ్మిన వారైన యెడల వారే ఆయన ప్రజలు, వైధ్యుని

నమ్మని రోగి బగుపడని యెడల ఎవరి తప్పు? వైధ్యుడు అసమర్ధుడని

చెప్పగలమా! అట్లే కొందరు రక్షింపబడని యెడల వారిదే తప్పు. యేసు ప్రభువు

సర్వజనులకు రక్షకుడే కాని సర్వజనులు ఆయనను ఆశ్రయించువారు కారు.

ఇది మనము బాగుగా గుర్తింపవలెను.

  1. యేసు బాలుడు ఎంత దేవుడైనను తనను పెంచిన ఇహలోక జననీ

జనకులకు బహు విధేయుడై ప్రవర్తించెను (లూకా 2:50-52).

  1. ఆయన పెద్దవాడైన తరువాత పాపులను కనికరించి పాప పరిహారము చేసి

అద్భుతకరమైన మనశాంతిని కలిగించెను. ఇట్లు ప్రజలను పాపముల నుండి

రక్షించెను.

  1. అనేక మంది రోగులను ఔషధము లేకుండ తన ప్రభావముతో

స్వస్థపరచెను. ఇట్లు ప్రజలను వ్యాధుల నుండి రక్షించెను.

  1. తన బోధ వినుటకై వచ్చినవారికి ఆహారము అయిపోయినప్పుడు ఆయన

తన ప్రభావము వల్ల ఆహారము కావించి తృప్తి పరచెను. ఇట్లు ఆయన ప్రజలను

క్షుద్భాధ నుండి రక్షించెను.

  1. నీటి ప్రయాణములో నావ మునిగిపోవు సమయమందు గాలిని,

నీటిపొంగును తనవాక్కు చేత అణచి వేసెను. ఇట్లు ప్రజలను ప్రాణాపాయముల

నుండి రక్షించెను.

  1. భూత పీడితులు పడిన బాధలు చూచి చాలా కాలము నుండి ఉన్న

భూతములను తన ఆజ్ఞ వలన వెళ్ళగొట్టెను. ఇట్లు ఆయన ప్రజలను

దయ్యములనుండి రక్షించెను.

  1. మృతుల విషయములో తన శక్తిని కనబరచుటకును, ప్రజల దుఃఖము

నివారించుటకును మృతులను కొందరిని బ్రతికించెను. ఇట్లు ఆయన ప్రజలను

మరణము నుండి రక్షించెను.

  1. యేసుప్రభువు బోధ విన్నవారు ఆ కాల బోధకుల బోధ కన్న గొప్ప బోధ

అని గ్రహించి ఆశ్చర్యపడిరి అని వ్రాయబడి యున్నది. (మత్తయి 7:28)

ఈయనవలె ఎవరును మాట్లాడ్దలేదు అని ఆయనను పట్టుకొన వెళ్ళిన భటులు

అధికారులకుంచెప్పిరి అని వ్రాయబడియున్నది. యోహాను 7:46 ఇట్లు ఆయన

బోధ వలన ప్రజలను అజ్ఞాన స్థితి నుండి రక్షించెను.

  1. శరీర మరణము యొక్క శక్తి నుండియు, నిత్య మరణమగు నరకము

నుండియువిశ్వాసులును రక్షించుటకు తానే స్వయముగా మరణమైతేనే గాని

వేరే మార్గము లేదని ఆయన యొద్దకు శత్రువుల మూలముగా మరణమును

రానిచ్చి తిరిగి బ్రతికి వచ్చుట వలన పాపకారకుడైన పిశాచిని, పాపమును,

పాపఫలితములను గెల్చెను. ఇట్లు ప్రజలను అన్ని భీతుల నుండి రక్షించెను.

ప్రాణ సమర్పణ చేసి లోకమునకు తన ప్రేమను ప్రత్యక్ష పరచెను.

  1. ఆయన భూలోకమునుండి కాక కేవలము పరలోకము నుండియే

వచ్చియున్న వాడు. అందుచేతనే మరల ఆయన పరలోకమునకే వెళ్ళెను అని

ప్రజలు తెలిసికొనునట్లు ఆయన మహిమ శరీరముతో మోక్షారోహణుడాయెను.

ఇట్లు ఆయన ప్రజలను మోక్షలోక నిరీక్షణ లేని స్థితి నుండి రక్షించెను. మేము

ఆశ్రయించిన తీసికొని వెళ్ళునని విశ్వాసులు నిరీక్షించుటకు ఆయన

ఆరోహణము ఆధారమాయెను. ఆయన ఈ పాప లోకము నుండి నేటి వరకు

విశ్వాసులను మోక్షమునకు తీసుకొని వెళ్ళుచు ఇట్లు రక్షించుచునే

యున్నాడు. ఇట్లు ఆయన తన ప్రజలను శ్రమలలోకము నుండి రక్షించుచునే

యున్నాడు.

  1. ఆయన శీఘ్రకాలములోనే మేఘాసీనుడై గగన మార్గమునకు వచ్చి,

అప్పుడు సజీవులైయున్న భూలోక వాసులకు మరణము లేకుండ చేసి

మోక్షమునకు తీసికొని వెళ్ళును. ఇట్లు ఆయన తన ప్రజలను మరణమునుండి

కూడ రక్షింపనైయున్నాడు. మీరిందుకు సిద్ధపడండి.

  1. ఆయన నేడు కూడ పూర్వకాలాద్భుతములు చేయుచున్నాడని వార్తా

పత్రికల వలనను, చూచినవారు చెప్పగా వినుట వలనను, స్వయముగా

చూచుట వలనను తెలిసికొనగలరు. ఇట్లు అట్టివారిని ఆయన అనిశ్చయత

నుండి రక్షించుచున్నాడు.

  1. ఇద్దరు ముగ్గురు నా నామమందు సమావేశ్సమగునపుడు నేను

వారియొద్ద ఉందునని ఒక పర్యాయమును, నేను వెళ్ళి మిమ్మును తీసికొని

వెళ్ళుటకు వచ్చెదనని మరియొక పర్యాయమును, నేను మోక్షమునకు

వెళ్ళుచున్నాను. గాని నిత్యము మీతోనే ఉన్నానని కడవరి పర్యాయమును

చెప్పి ఆయన మోక్షమునకు వెళ్ళెను. ప్రభువు వెళ్ళిపోయెనని సంఘస్తులు

బెంగగా నుండవలసినది గాని వారట్లుండక మిక్కిలి సంతోషించిరి. ఎందుకనగా

ఆయన వారిని తన మాటల వలన బెంగ నుండి రక్షించెను.

25. యేసు ప్రభువు దగ్గర ఒక శిష్యుడు ఒక పుట్టు కుంటివానిని చూచి 

యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పగా నడవ గలిగెను. చూచినారా!

యేసు నామమునకు ఎంత గొప్ప శక్తి ఉన్నదో, ఇతని విషయమై ప్రమేయము

వచ్చినపుడు ఆయన తన ఉపన్యాసములో చెప్పిన మాట వినండి. ఆయన

వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి ఈ సర్వాంగ పుష్టి

కలుగజేసెను (అ.కా.3:16)

26. కొందరు యేసుదాసు, ప్రభుదాసు, క్రీస్తుదాసు అను పేర్లు 

పెట్టుకొనుచున్నారు. మంచిదే అట్టివారు పూర్తిగా యేసుక్రీస్తు ప్రభువు సేవ

చేసిన యెడల ఆ పేరునకు తగిన వారగుదురు. పేరునకు తగిన

క్రియలుండవలెను. యేసునకు తగినట్టుగా ప్రజలను ఎప్పుడును రక్షించుచునే

యుండెను గనుక పేరునకు తగిన క్రియ, క్రియకు తగిన పేరు ఆయన

విషయములో నెరవేరినది. ఇందుచేత యేసు గొప్ప స్మరణీయ నామము కాదా!

(కొన్నిటి నుండి కొందరిని రక్షింపగల మహానుభావులు కొందరు గలరు

అయినను వారి సేవ క్రీస్తు చేసిన సేవకు సమానమగుట లేదు). యేసు చేసిన

ఉపకారాద్భుతములు లెక్కకు మించినవి (యోహాను 21:25).

27. యేసుతో నున్న వారు ఆయన జీవితము, బోధ పరీక్షించి వ్రాసినారు. 

వారి వ్రాతలను మనము పరీక్షించి, సత్యము తెలిసికొని అవలంభింపవలెను.

28. లోకస్థులు కోరుకొన్నందు వలన ఆయన యేసు అను పేరు 

పెట్టుకొన్నాడు అని చెప్పవచ్చును. ఎట్లనగా లోకములో పాపము

ప్రవేశించినందున దేవుడు ఆది నరులు విడిచిపెట్టి దేవ లోకమునకు వెళ్ళెను

గనుక ఆయన తిరిగి రావలెను అను కోరిక నరులలో నుండెను. నిరాకారుడైన

దేవుడు ఉన్నవాడున్నట్టుగానే వచ్చిన యెడల భస్మమై పోదుము. గనుక

ఆయన మనుష్యరూపములో రావలెనను కోరిక ప్రజలలోనుండెను. వచ్చి ఒక

బొమ్మవలె ఎదుట నిలువబడక మనతో కలసి మెలసి యుండి మనకన్ని

విషయములలో తోడ్పడవలెనను కోరిక ప్రజలయందుండెను. ఇట్టి కోరికయే

ఆయనను రమ్మని పిలిచిన పిలుపు – నేడును యేసు నామము వాడు వారికి

అన్ని కీడులనుండియు విముక్తి కలుగును. ఇన్నిటి నుండి జనులను

రక్షింపగల దేవ పురుషుని నామముకన్న మరి యే నామము గొప్పది

కాగలదు.

యేసు నామ ధ్యానమును, ఆ నామము వల్ల కలుగు ధన్యతయును మీకు 

కలుగును గాక!

Please follow and like us:

How can we help?