రక్షణ వార్తావళి

⌘K
  1. Home
  2. Docs
  3. రక్షణ వార్తావళి...
  4. రెండు పునాదులు

రెండు పునాదులు

 ప్రసంగ పాఠము:మత్తయి 7:24-27;లూకా 6:46-49.

    యేసుప్రభువు చెప్పిన ఉపమానము: ఒకరు ఇల్లుకట్టుకొనుటకు రాతి స్థలములో లోతుగా త్రవ్వి, పునాదివేసి, గట్టి ఇల్లు కట్టుకొని, అందులో నివసించుచుండెను. కొన్నాళ్ళకు వర్షము వచ్చినది. కొన్నాళ్ళకు వరద వచ్చినది. కొన్నాళ్ళకు గాలి వచ్చినది. వర్షము ఇంటిపైకి వచ్చినది. వరద గోడలను కొట్టినది. గాలి ఇంటిని, గోడలను కొట్టినది. గాని ఇల్లు పడలేదు. ఎందుకనగా ఆ ఇల్లు రాతిమీద నున్నది. మరియు యేసుప్రభువు ఇసుక మీద ఇల్లు కట్టినవానిని గురించి కూడ చెప్పెను. అయితే ఇసుక మీదనున్న ఇంటి పునాది గట్టిగా లేదు. ఆ పైవి మూడును అనగా వర్షము, వరద, గాలి ఈ ఇంటిని కొట్టినవి. పునాది జబ్బు పునాదియైనందున ఈ ఇల్లు పడిపోయినది. వర్షానికి కప్పు పడినది. వరదలకు గోడలు పడినవి. గాలి, విసరినందున ఇల్లు పూర్తిగా పడిపోయి కొట్టుకొని పోయినది.
   గనుక లోకములో రెండు రకముల ఇండ్లు గలవు. కొందరు రాతి ఇంటివలె స్థిరముగా నుందురు. కొందరు ఇసుక గృహమువలె త్వరగా పడిపోవుదురు లేక తప్పిపోవుదురు. ఎందుకు ఇల్లుపడిపోయినది వర్షము వలన, వరద వలన, గాలి విసరి కొట్టుట వలన పడిపోయినది. ఆలాగే ఎవరైనను క్రీస్తు మతములోనికి బోధకులను గాని, ఇతరులను గాని నమ్మివస్తారో వారు పడిపోవుదురు. ప్రభువును నమ్మి వచ్చినయెడల పడిపోరు. ఆయనను నమ్మి వచ్చిన ఎన్ని వర్షములు, ఎన్ని వరదలు, ఎన్ని గాలులు అనగా ఎన్ని శోధనలు, కష్టములు, చిక్కులు వచ్చినను రాతి ఇంటివలె స్థిరముగా నుందురు. ఆ ఇంటికి మూడు రకముల కష్టములు వచ్చినరీతిగా ప్రభువును నమ్మిన వారికి కూడ మూడు రకముల శోధనలు వచ్చును. 1. ఆకాశము నుండి వర్షము వచ్చెను. అనగా పాపము వలన వచ్చు శాపములు, కీడులు, వ్యాధులు, అయినను వీరు లెక్కచేయరు. 2. భూమి మీదనుండి వరద వచ్చెను. అనగా ఇరుగు పొరుగు వారి వలన, బంధువుల వలన, ఎవరి ద్వారానైన వచ్చు కష్టములు. అయినను వీరు స్థిరముగా నుందురు. 3. మధ్య నుండి గాలి వచ్చెను. అనగా (గాలి=దయ్యము) వీటి ద్వారా వచ్చు కష్టములు. అయినను వీరు స్థిరులే. ఇవన్నియు విశ్వాసికి  వచ్చును గాని అవి అతనిని కదపలేవు. కొందరు బోధకులను నమ్ముకొని వస్తారు. చుట్టాలు వచ్చినారని కొందరు క్రైస్తవులగుదురు. చదివిస్తారని కొందరు వస్తారు. ఉద్యోగములు వచ్చునని కొందరు వస్తారు. జబ్బులు పోవునని కొందరు వస్తారు. వీరందరు ఇసుక మీది పునాది వంటి వారు గనుక పడిపోవుదురు. ప్రభువును నమ్మి వచ్చిన వారు క్రీస్తు అను బండ మీద కట్టబడిన వారు గనుక పడిపోరు. ముందే క్రీస్తును నమ్మవలెను. అప్పుడు ఇతర మేళ్ళు కలుగును. ఆయన అన్నీ ఇస్తాడు. పాపపరిహారము చేసి, రక్షించి, పరలోకమునకు పంపించును. ఇదే గొప్పపని. ఈ లోకములోని మేళ్ళు అంత గొప్పవి కావు. ప్రభువు దగ్గరకు వచ్చిన యెడల బోధ (వాక్యము), పాపపరిహారము, మోక్షము దొరుకును. గనుక దైవభక్తి:భుక్తికి, ముక్తికి సాధనము.
ఈలోకము నందు కావలసినవియు, తరువాత మోక్షానందమును దొరుకును. ఈ లోకములోనివి అన్నీ ఇచ్చిన ఆయన, మోక్షము ఎందుకివ్వడు? మోక్షమిచ్చిన ఆయన ఇహలోకములోనివి ఎందుకివ్వడు?.      
  నూతన యెరూషలేము అను పట్టణము మోక్షములో ఉన్నత స్థానము. అందులోనికి వెళ్ళేవారు గొప్పభక్తులు. తక్కువ భక్తులు దాని చెంతనున్న మోక్షములో నుందురు. ఆ పట్టణమునకు 12పునాదులు, 12గుమ్మములు గలవు. ప్రభువును గురించి బోధించిన 12 మంది శిష్యులు ఆ పట్టణమునకు పునాది వేసినారు. అనగా సువార్తను ప్రకటించినారు గనుక వీరు ఆ పట్టణమునకు 12 పునాదులుగా ఉన్నారు. అందుచే వాటికి 12 అపొస్తలుల పేర్లు పెట్టబడెను. విశ్వాసులకు పునాది వేసినవారు వీరే. వీరికి పెండ్లి కుమార్తె అను బిరుదు కలదు. వానవలె శాపములు వచ్చినను, వరదవలె లోకస్తుల వలన సకల విధములైన కష్టములు వచ్చినను, గాలివలె సాతాను, దయ్యములు మీద బడి హింసించినను నిలువబడినవారే నూతనయెరూషలేము అను ఆ పై పట్టణమునకు చేరుదురు. ఈ మూడు రకములైన  కష్టములకు లొంగనివారికి పెండ్లికుమార్తె కళ వచ్చును. ప్రభువు శిష్యులకు కష్టములు, చిక్కులు, భయములు కలిగినను వారు విసుగుకొనక సహించుకొనుచు ఆనందించిరి. అట్టి విశ్వాసులే నూతన యెరూషలేమునకు వెళ్ళుదురు. అందులో చేరు కృప చదువరులకు కలుగును గాక!
           బండ మీద పునాదియే నిండు పునాది, గుండు పునాది.
    పునాదులు:
    మత్తయి 7:24-27;లూకా 6:46-49; యోహాను 17:24;
    అ. కార్యములు 16:26; రోమా 15:20; 1కొరింధి 3:10-12;
    ఎఫెసి 2:20; 1 తిమోతి 6:19;
    2 తిమోతి 2:19;హెబ్రీ 6:1; 11:10.
    సూక్తులు:

    1. అధైర్యము వలన నరజీవితము వర్ధిల్లదు.

    2. దైవ చిత్తము సజ్జనభాగ్యము.
    పరీక్షాంశము : యేసుక్రీస్తు ప్రభువుగా వెలసిన దేవుడు తప్ప నరులకు ఇహ, పరములయందు మరియొక  ప్రాపకుడు లేడు అని క్రైస్తవులు ప్రకటించు బోధను బహు తీక్షణముగ  పరీక్షించండి.
   ద్విపద:- యేసుక్రీస్తు మన - యేక రక్షకుడు
           యీ సువార్తార్ధము - యెంచి కన్ గొనుడు. 

Please follow and like us:

How can we help?

Leave a Reply