రక్షణ వార్తావళి

⌘K
  1. Home
  2. Docs
  3. రక్షణ వార్తావళి...
  4. విశ్వాసాంతరంగము

విశ్వాసాంతరంగము

గొప్ప నమ్మికతో ఒకప్పుడొక స్త్రీ, యేసుక్రీస్తు కడకు వచ్చి ప్రభువా, నా కుమార్తె దయ్యము పట్టి మిగుల బాధపడుచున్నది. ఆ దయ్యమును వెళ్ళగొట్టుము అని వేడుకొనెను. ఆయన యేమియు మాటలాడలేదు. అందువలన ఆమె నమ్మిక తగ్గలేదు. ఆమెను పంపివేయుమని తర్వాత శిష్యులాయనతో చెప్పిరి. ఇందువలనైన ఆమె నమ్మిక తగ్గలేదు. అటు తర్వాత యేసుప్రభువు ఒకమాట పలికెను. ఈ మాటలో ఆయన ఆమెకు ఏమైనకొంచెమైన సహాయము చేయువాడుగ అగుపడలేదు. ఇందువలన ఆమె నమ్మిక తగ్గలేదు. ఆమె నమ్మిక పట్టు పట్టునకు పెరుగుచుండెను గాని తరుగుచుండలేదు. ఎందుచేత? క్రీస్తు యేసును గూర్చి ఆమె విన్న మంచి వార్తలను బట్టియు, ఆయన దయగల ముఖవర్చస్సును బట్టియు ఆమె నమ్మిక తగ్గలేదు. ఆయన చర్యలు ఆమె తప్పగ భావించుకొనలేదు. రక్షకుడెందుకట్లు ప్రవర్తించెను? ఆమెలోని విశ్వాసమును, ఆయన తన చర్యల మూలముగా కాలక్రమమున బైటకు రప్పించి, అక్కడి వారికి వెల్లడించుటకై అట్లు వర్తించెను. ఆమెలో దాగియున్న భక్తిని పని కల్పించెను. అప్పుడది తేజోమయముగ ప్రకాశించెను. ఆమెలో దాగియున్న భక్తికి పని కల్పించెను. అప్పుడది తేజోమయముగ ప్రకాశించెను. పిమ్మట ఏమి జరిగినది? ఆమె నమ్మిక ఇదివరకే తెలిసియున్న ఆ దైవాతారి ఆమె తట్టు చూచి అమ్మా! నీ విశ్వాసము గొప్పది; నీవు కోరినట్టే నీకు అవునుగాక అని పలికెను. చూచినారా? విశ్వాసమునుబట్టి అమ్మా అని పిలుచుట వలన దేవుడామెనెంత గౌరవించెను! నీ విశ్వాసము గొప్పది అని మెచ్చుకొనుట వలన ఆమె విశ్వాసము నెంత గౌరవించెను! ఈయన నా మనవి వినుతీరు కనిపించుట లేదు. ఇంటికి వెళ్ళెదను అని అనుకొనక, నిరుత్సాహా పరచునట్టి సంగతులు చూచి నిరాశపడక, ఆయన సన్నిధిని నిలిచియున్న ఆ స్త్రీని యేసుప్రభువునెటు దీవించెనో చూడుడి. “నీవు కోరినట్టే నీకు అవునుగాక” ఎంత గొప్ప దీవెన! నరుడగు నున్న దేవుని యాశీర్వచనము గడించిన ఆమె యెంత ధన్యురాలు!                                              

అటు పిమ్మట ఏమి జరిగినది? ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. ఆ స్త్రీ ఇంటికి వెళ్ళి తన చిన్న కుమార్తె మంచము మీద పండుకొని యుండుటయు, దయ్యము వదలిపోయి యుండుటయు చూచెను. ఆమె సంతోష మేమని చెప్పెను?  దారిలో ఆమె కేమైన అనుమానము తోచియుండునా? లేదు. బోధకుని మాటయే ఆమెకు స్థిరము. చదువరులారా! కష్టస్థితిలో నున్నవారికి యేసుక్రీస్తు ప్రభువు సహాయకారి యని గ్రహించుకొందురుగాక. ఆ కష్టము దయ్యమంత హానికరమైనదైనను సరే, నమ్మితే ఆయన తొలగింపగలడు. మిత్రులారా, క్రీస్తు వృత్తాంతమును విన్న మీదట నమ్మిక కలిగించుకొన్న ఆమెకు దిగులు విషయములెన్ని తారసిల్లినను మనస్సు చివుకుమనలేదు. నమ్మిక తగ్గలేదు. గాని గొప్ప విశ్వాసమును పేరు వచ్చినంతగా దానిని ఎక్కువ చేసికొనెను. మీ మాటయేమి?.

   2. నీతి పాఠము: క్రీస్తుప్రభుని మాటలలో పైకి కఠినత్వము కనిపించినను, ఆయన ముఖబింబములో అది కనిపింపనందున ఆయన ప్రార్ధన ఆలకించుననియె ఆమె గ్రహించుకొనెను. ప్రేమరూపియగు దేవుడు నరుల మొరనాలకింపకుండ నుండగలడా?.    3. ప్రార్ధన:- దేవా, నీవు నా ప్రార్ధన ఆలకింపనట్టు కనబడినను నేను అపార్ధము చేసికొనకుండ నన్ను కాపాడుము. ఆమెన్.

Please follow and like us:

How can we help?