రక్షణ వార్తావళి

⌘K
  1. Home
  2. Docs
  3. రక్షణ వార్తావళి...
  4. వెలుగు పాఠము

వెలుగు పాఠము

ప్రసంగ పాఠము: ఆదికాండము 1:3; యోహాను 1:4

ఈ వర్తమానములోని ధ్యానాంశము “వెలుగు” అనగా “దేవుడు పెట్టిన దీపము”. కనుక మన ధ్యానాంశము “వెలుగుచున్న దీపము”. ఆరిపోయిన దీపము కాదు. వెలుగుచున్న దీపము. ఇది మీరు మనస్సులో బాగుగ ముద్రించు కొనండి. దేవుడు పెట్టిన దీపములు మీలో ఎన్ని ఉన్నవో పరీక్షించుకొనండి.

I. దీపములు:- యోబు 38:7. ఇక్కడ దేవదూతల గురించి వ్రాయబడిఉన్నది. వారు పాపము లేనివారు. పరిశుద్ధులు మరియు కాంతి గలవారు. క్రిస్మసు నాడు దేవదూత గొల్లల యొద్దకు వచ్చినప్పుడు కాంతి కనిపించినది. గనుక దేవదూత, “దీపము” అన్నమాట. అలాగైతే దేవదూతలందరూ దీపములే. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 1:7లో చూస్తే, దేవదూతలు అగ్నిజ్వాలలని కనిపించుచున్నది.

మనము మైనపువత్తి వెలిగిస్తే దానిలో అగ్నిజ్వాల ఉన్నది. అలాగే ప్రమిద దీపములోను అగ్నిజ్వాల ఉన్నది. లాంతరులోను అగ్నిజ్వాల ఉన్నది గదా! అలాగుననే దేవదూతలకు అగ్నిజ్వాలలని పేరు వచ్చినది. ఎంతమంది దేవదూతలున్నారో, అన్ని అగ్నిజ్వాలలై యున్నారు. ఎన్నికోట్ల దేవదూతలున్నారో వారు అన్ని కోట్ల దీపాలై ఉన్నారు. వీరు దేవుడు మొట్ట మొదట పెట్టిన దీపముల సమూహము. వీరందరూ దేవుని దగ్గర, ఆయన సిం హాసనము దగ్గర ఉన్న కోటానుకోట్ల దీపములై యున్నారు.

II. ఆ దీపముల దగ్గర నుండి కొన్ని వేల మైళ్ళు క్రిందికి రాగా, దిగువను దేవుడు మరికొన్ని దీపాల సమూహాలను అమర్చెను. ఆ దీపాలు సూర్య, చంద్ర, కోటాను కోట్ల నక్షత్రాలు. అవన్నీ దీపాలు గనుక, ఆకాశ మండలమంతా దీపము, దీపములు (ఇవి నక్షత్రములు), కాబట్టి దేవుడు వెలిగించిన దీపములు రెండు భాగములుగా చూచియున్నాము.

III. ఆదికాండము 1:3లో వెలుగు కలుగునుగాక! అని దేవుడు అనగానే అక్కడ వెలుగుచున్నది. ఆకాశ మండలమును బట్టి వచ్చిన కాంతి యిక్కడ యున్నది. భూమిమీద కాంతి ఎలాగున్నదనగా : క్రిస్మస్ రోజున ఒకవత్తి వెలిగించి, దానితో మిగతా వత్తులను వెలిగించినట్లు భూమి మీద కాంతి యున్నది. ఆకాశ కాంతిని బట్టి ఇది (సూర్యుడు) ఒక కాంతి అయిపోయింది. ఖగోళ శాస్త్రజ్ఞులు చెప్పేది- సూర్యకాంతిని బట్టి చంద్ర, నక్షత్రములకు కాంతి అనియు, ఆ కాంతిని బట్టియే భూమి మీద పగలు, రాత్రి కలుగుచున్నది. అందుకని మన వస్త్రాలు, నేల, వృక్షాదులు కాంతిగా కనిపించుచున్నవి. అన్నీ కాంతిగానే ఉన్నవి. ఇప్పటికి 3దీపాల కాంతి, భూమి మీద ఉన్న కాంతి మరియు నేలపై ఉన్నవన్నీ కాంతిగా ఉన్నవి. గనుక ఇది మూడు దీపాల గుంపు. భూమి మీద ఉన్న దీపాల గుంపులో గొప్పదీపము మనిషియే. యోహాను 1:4-9 ప్రకారము నిజమైన వెలుగు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఆ వెలుగు క్రీస్తే. ఆయనలో జీవమున్నది. అది మనుష్యులకు వెలుగైయుండి ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. గనుక ఆదాము మొదలు లోకాంతము వరకుండే మనుషులందరూ కోటానుకోట్ల దీపములే. (1) దేవదూతలు (2) నక్షత్రాలు (3) భూమిమీద మనుష్యులును కోటానుకోట్ల దీపములె. గుడిలో ఉన్న మనమునూ దేవుడు వెలిగించిన దీపాలే. భూమి మీద చెడ్డవారు, దుష్టులు ఉంటారు-వారిలోనూ దేవుడు వెలిగించిన వెలుగు ఉన్నది. ఎంత దుష్టునిలోనైనా ఏదో ఒక మంచి గుణము లేకపోదు. ఉదా:- మనిషిని చంపినవాడు, చిన్నబిడ్డ ఎదురు రాగానే ముద్దాడెను. నరహంతకునిలో ఆ మంచిగుణము కూడ ఉన్నది.

  1. సింహాసనము దగ్గర దీపాలగుంపు (దేవదూతలు)
  2. ఆకాశములో దీపాల గుంపు (జ్యోతులు)
  3. భూమిమీద మరొక దీపాలగుంపు (మనుష్యులు)
  4. వుశ్వాసుల దీపాలగుంపు – ఇవి ఆరిపోవు గాని అవిశ్వాసులు దీపాలు కునుక వచ్చును. కాబట్టి విశ్వాసులే దీపాలనే గుంపులో ఉన్న గుంపు.
  5. విశ్వాసుల గుంపులో చనిపోయినవారు మహిమలో ఒక గుంపుగా ఉన్నారు. గనుక వారిలో సంపూర్ణ వెలుగు ఉన్నది. వారి చుట్టు ప్రభువున్నారు. పరలోకానికి వెళ్ళినవారిలో పరిశుద్ధులు దేవదూతలున్నారు. ఆ దేవదూతలు దీపాలు అయినట్లు పరిశుద్ధులును దీపాలు అయియున్నారు. ఈ 5 గుంపులు జ్ఞాపకముంచుకొనండి. మీరు ఏ దీపాల గుంపులోని వారో ఆలోచించుకొనండి. (1) కునికే గుంపో లేక (2) పరిశుద్ధుల గుంపో పరీక్షించుకొనండి.

ఎవరిలో ఏ తప్పున్న ఆ ప్రక్కనే చీకటియున్నది. ఏ మంచిగుణము ఉన్నా అందులో నుండి వెలుగు వచ్చును.

  1. మత్తయి 5:14 ప్రకారము విశ్వాసులందరు దీపాలే. ఈ వాక్యాన్ని బట్టి విశ్వాసులు ఎందరుంటే, వారు అన్ని దీపాలు. ఈ దీపాలు యేసుప్రభువును బట్టి వచ్చిన దీపాలు. సూర్యుని బట్టి చంద్ర నక్షత్రాల దీపాలు. యోహాను 8:12లో యేసు-నేను లోకమునకు వెలుగై యున్నాను అన్నారు. ఆయననుబట్టి విశ్వాసులకు వెలుగు వచ్చినది. మత్తయి 5:14లో – మీరు లోకానికి వెలుగైయున్నారు అనెను. యోహానులో – నేను వెలుగైయున్నాను అన్నారు. తన వెలుగు, విశ్వాసులకు వెలుగు. విశ్వాసులకు ఎంత గొప్ప బిరుదు యేసుప్రభువు పెట్టెను! నక్షత్రాలకు, దేవదూతలకున్న బిరుదు పెట్టెను. మనమెంత కృతజ్ఞులమైయుండవలెను.!
  2. కీర్తనలు 119:105,-ఇక్కడ దీపము దేవుని వాక్యమే. ఆది1:3లో వెలుగు కలుగుగాక అని అన్నారు. ఆ వాక్యమే వెలుగు. యోహాను 1:1-5లో ఆ వెలుగే అందరిని వెలిగించినది. ఇది వాక్య దీపము.
  3. దేవదూతల సంఘ దీపము.
  4. జ్యోతుల సంఘదీపము.
  5. భూమిమీద మనుష్యుల సంఘదీపము.
  6. భూమి మీద జీవ రాసుల సంఘ దీపము.
  7. భూమిమీద వస్తువుల సముదాయ దీపము.
  8. భూమి మీద విశ్వాసుల సంఘదీపము.
  9. దేవుని వాక్యముల దీపము గుంపు ఉన్నది.

ఈ 7వ దానిలో ఉన్న దీపముల గుంపు బైబిలే. బైబిలులోని ఆకులన్నీ (పేజీలన్నీ) దీపములే. ప్రతి ఆకు మీద వచనమున్నది. ఆ వచనాలు అన్నీ దీపాలే. ఆకాశ నక్షత్రాలవలె ఇవియును ఎన్నో కోట్ల దీపాలుగాయున్నవి. ఈ దీపాల పుస్తకము బైబిలు. అవన్నీ దీపాలే. ఇది ఎవరి ఇంటిలో లేదో వారికి దీపములు లేనట్లే. వారికి కిరసనాయిల్ దీపాలుంటవి. కాని దేవుని దీపాలు లేకపోతే ఏమి ప్రయోజనము?. ఈ దేవుని దీపము (బైబిలు) ఇక్కడ, పరలోక మండలములోను ఉండును. బీదలమైన మనమందరము పెద్ద బైబిలు కొనుక్కొనవలెను. ఈ బైబిలు “దీపాలగుంపు” గనుక ప్రతి యింటిలో ఉంచుకొనండి.

ట్రాక్టు సొసైటీ వారు బైబిలు వివరాలు అచ్చువేయుచున్నారు. బైబిలు పుస్తకాల వివరాలు అచ్చువేయుచున్నారు. అవన్నీ దీపాలే. (1) బైబిలు వ్యాఖ్యానము. (2) పత్రికల ప్రకటన ద్వారా ప్రతి మతోద్ధారణ. ఇవి కూడా దీపాలే. అయ్యాగారు బైబిలు వివరాల పత్రికలు కోటానుకోట్లు వేసిరి. ఈ పత్రికలు దీపాలే. ఇవి అన్నియు పెద్దవత్తి అయిన బైబిలు దీపాన్నీ బట్టి వెలిగించబడినవి. 600 కోట్ల మందిని పత్రికల ద్వారా వెలిగించవచ్చును. గుంటూరు సంఘములు పత్రికలు అచ్చువేయుచున్నారు. ఇది తెలుగు జిల్లాలో జరుగుచున్న గొప్ప సంగతి. ఇంతకు ముందెవ్వరు వేయలేదు. ఈ పని చేయించుచున్న మీరు దీపాలు వెలిగించుచున్నారు అన్నమాట.

  1. దేవదూతల దీపావళి.
  2. నక్షత్రాల దీపావళ్.
  3. మనుష్యుల దీపావళి.
  4. జీవరాసుల దీపావళి.
  5. వస్తువుల దీపావళి.
  6. విశ్వాసుల దీపావళి.
  7. పరిశుద్ధుల దీపావళి.
  8. దేవుని వాక్య దీపావళి.
  9. కాగితాల దీపావళి.
  10. పత్రికల దీపావళి.

వందన దీపావళి చేయండి.

Please follow and like us:

How can we help?

Leave a Reply