యెషయా 7:3, లూకా 2:14, 1తిమోథి 1:17, ప్రకటన 1:6, 4:8, 11. 5:12, 13:15, 3:4 19:1 2కొరింథి 13:14,
సంఖ్యా 6:24, 26.
- పాప ప్రేరేపణ గల వారలారా, దేవుడు మీకు పాపవిసర్జన శక్తి నిచ్చి మిమ్మును దీవించును గాక!
- అనారోగ్య వంతులారా, దేవుడు మీకు ఆరోగ్యమునిచ్చి మిమ్మును దీవించునుగాక!
- లేమిగలవారలారా, దేవుడు మీకు కలిమినిచ్చి మిమ్ములను దీవించునుగాక1
- బిడ్డలులేనివారలారా, దేవుడు మీకు శిశుదానముచేసి, మిమ్మును దీవించునుగాక!
- భూత పీడితులారా, దేవుడు మీకు విముక్తి దయచేసి మిమ్మును దీవించును గాక!
- మందమతి గలవారలారా, దేవుడు మీకు నిర్మలమైన జ్ఞానమునిచ్చి మిమ్మును దీవించునుగాక!
- శత్రుబాధ గలవారలారా, దేవుడు మీకు శత్రుబాధ లేకుండ జేసి మిమ్మును దీవించునుగాక!
- అన్యాయము పాలగుచున్న వారలారా, దేవుడు మీకు న్యాయమనుగ్రహించి మిమ్మును దీవించునుగాక!
- ఋణ బాధ గలవారలారా దేవుడు మీకు ఋణబాధ తీర్చి మిమ్మును దీవించునుగాక!
- యుక్తకాలమున పెండ్లి సమకూడనివారలారా, దేవుడు మీకు మంచి జత నేర్పరచి మిమ్మును దీవించునుగాక!
- కుటుంబ కలహములుగల వారలారా, మీకు కలహము నాపుజేసి ఐకమత్యత కలిగించి మిమ్మును దీవించునుగాక!
- నానావిధములైన చిక్కులుగలవారలారా, దేవుడు మీ చిక్కులను విడదీసి మిమ్మును దీవించునుగాక!
- దైవభక్తి కుదరనివారలారా, దేవుడు మీకు మనోనిదానమును స్థిరభక్తావేశమును పుట్టించి మిమ్మును దీవించునుగాక!
- చదువరులారా, దేవునియెడల అపనమ్మిక భీతి విసుగుదల తొందరపడు గుణము అనాలోచన చింత నిరాశ మొదలగునవి మీలోనికి చేరకుండునట్లు దేవుడు మిమ్మును దీవించునుగాక!
- జీవాంతమందు మీకు మోక్ష భాగ్యము లభించునట్లు దేవుడు మిమ్మును దీవించునుగాక!
Please follow and like us: