సంఘారాధనలు

⌘K
  1. Home
  2. Docs
  3. సంఘారాధనలు...
  4. 10. వివాహారాధన

10. వివాహారాధన

(వివాహా దినమునకు పూర్వము మూడు ప్రకటనలు ఆలయములో చేయవలయును.)

_____ఉన్న______ యొక్కయు___ఉన్న__________యొక్కయు,______ వివాహ ప్రకటన చేయుచున్నాను. వీరిద్దరును వివాహము చేసికొనకూడదని ఏ హేతువువైనను, న్యాయమైన ఆటంకమైనను, మీలో యెవరైనను తెలిసికొని ఉన్నయెడల దానిని తెలుపవలెను.

    * (1) వివాహ మాడగోరువారి దాంపత్యము పరిశుద్ధ లేఖనమునకు అనుగుణ్యముగా నుండుట. (2) రాజ్య సంఘ చట్టములకు అనుకూలించుట. (3) వధూవరులు యుక్త వయస్కులు గలవారై యుండవలెను. (4) వివాహ కార్యక్రమము ఆలయములో జరుపవలెను. (అవసరమైన యెడల యితర స్థలములోను జరిపింపవచ్చును.)

                                          వివాహ కార్యక్రమము 

     ( వరుడు ముందుగా ఆలయమునకు వెళ్ళి నియమిత స్థలములో కూర్చుండవలెను. ఆ తరువాత వధువు ప్రవేశించునప్పుడు కీర్తన పాడవలెను. మరియు సంఘములేచి నిలువబడవలెను.)

                                         గురువు ఈ క్రింది దీవెన చెప్పవలెను

  తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామమున కృపాసమాధానములు కలుగును గాక.

  సంఘము నిలువబడియుండగా ఏదైన ఒక వాక్యము చదువ వలెను. (దా.కీర్తన 37:3-7 67 లేక 128.)



    త్రియేక దేవుడవైన తండ్రీ నీ పావన లక్షణముల నిమిత్తము వందనములు. మానవుని నిమిత్తమై సమస్తమైన దానము గల సర్వ సృష్టిని సృజింజించిన నీకు స్తుతులు. మానవుని నీ స్వరూపము నందు నీ పోలిక చొప్పున సృజించిన తండ్రీ! నీకే స్తుతులు. ఆదిమానవునికి సాటియైన సహాయమును సమకూర్చిన తండ్రీ! వినుతులు: కానా వివాహమునకు పిలువబడి నీళ్ళను ద్రాక్షరసముగ చేసిన కుమారుడవైన తండ్రీ! ప్రణతులు, పెండ్లి కుమారుడుగా రానైయున్న క్రీస్తు ప్రభువునకు భూలోకములో సంఘ వధువును సిద్ధపరచి మహిమ మేఘములోనికి కొనిపోయి ప్రభువునకు జతచేయు పరిశుద్ధాత్మతండ్రీ సంస్తుతులు. మీరును, పరలోకపు దూతలును, పరిశుద్ధులును, యీ వివాహములోనికి వచ్చి నూతనముగా జతపరచబడు యీ వధూవరుల నాశీర్వదింప గలందులకు ప్రార్ధించుచున్నాము. ఆమెన్.

     కిర్తన. (మంగళ ప్రమోదము .... .... వినోదము ......)

     బైబిలు పఠనము:-

    (1) పాత నిబంధన పాఠము : ఆది 2:18-24

    (2) క్రొత్త నిబంధన పాఠము: యోహాను 2:1-11

    (3) పత్రిక పాఠము: ప్రకటన 19: 6-9

                                                  ప్రార్ధన

 త్రియేకుడవైన తండ్రీ నీయాశీర్వాదము భూమి మీద జరుగుచున్న వివాహములమీద నున్నది. గనుక వందనములు. నీవు వివాహము ఏర్పర్చినప్పుడు అదివరకు చరిత్ర గాని, వృత్తాంతముగాని లేదు.

              నీ తీక్షణమైనప్రేమను బట్టి యిద్దరు ఒక్కరుగాను,ఒక్కరు ఇద్దరుగాను జీవించుచు ఒకరిలో నొకరిని చూచుకొనుచు వారిలో నీ స్వవరూపమును సృష్టికి కనబరచుచు ఏలికవై పరిపాలించవలెనని ఏర్పర్చినందున వివాహము అన్నిటిలోను ఘనమైనది గాన వందనములు. లోకమంతటిలో జరుగు వివాహములయొద్ద నీవు ఉన్నావు. ఎందుకనగా అందరు నీకు ప్రియమైనవారు. మనుష్యులు నీ నుండి వేరైనారు గాని,నీవు ఎప్పుడును వేరుగా లేవు. నీవు దయగలవాడవు. అందుచేత మానవులను నడిపించేవాడవు.మనిషిలో లోపమున్నను నీ ప్రేమలో లోపములేదు గాన వందనములు.ఆది దంపతులను ఎట్ట్లి ఘనమైన ఏలికలనుగా చేయ నుద్ధేశించినావో ఆ ఘనమైన కార్యమును క్రీస్తు స్వరూపముగల వధువు సంఘముతో క్రీస్తుప్రభువు వచ్చి వెయ్యి యేండ్ల పాలన కాలమప్పుడు దానిని ప్రత్యక్షపరచును. గాన, వందనములు. ఈ వివాహ కార్యక్రమము నీ మహిమకొరకును, ఈ వధువరుల కృపాక్షేమము కొరకును, యిక్కడ నున్న అందరి దీవెనకొరకును, జరిగించుమని త్వరగా రానైయున్న క్రీస్తు ప్రభువు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమెన్.       

                                              ప్రసంగము

  (పురుషుని ఎడమవైపున స్త్రీ నిలువబడియుండగా గురువు ఇట్లు చెప్పవలెను.)

  బోధ: మిక్కిలి ప్రియులారా! యీ స్త్రీ పురుషులకు పరిశుద్ధవివాహము చేయుటకు దేవుని సముఖమందును, యీ సభ యెదుటను మనము కూడియున్నాము. వివాహమనునది దేవుడు తానే నియమించిన ఘనమైన స్థితియై యున్నదని దేవుడే ఆదామును నిర్మించి ప్రక్కటెముకను హవ్వను చేసి భార్యగా యిచ్చుటవలనను, ఆది దంపతుల పతన సమయమున స్త్రీ సంత్రానము నందు లోకమునకు రక్షకుడుగా జన్మించునను వాగ్ధానము చేయ బడిన క్రీస్తు ప్రభువు వచ్చి కానా వివాహములో నీళ్ళను ద్రాక్షా రసముగా చేసిన మొదటి అద్భుత క్రియ వలనను క్రైస్తవ సంఘమును పరిశుద్ధాత్ముడు వధువుగా సిద్ధపరచి వరుడైన క్రీస్తు ప్రభువుతో ఐక్యపరచుటకై మధ్యాకాశములోనికి కొనిపోనైయున్నందున క్రీస్తునకును, ఆయన సంఘమునకును గల మర్మమైన ఐక్యమును సూచించుచున్నది, గనుక వివాహము ఆ పరిశుద్ధమైన స్థితిని అలంకరించినది. మరియు ఇది ఘనముగా యెంచదగినది. పరిశుద్ధలేఖనము మెచ్చుకొనుచున్నది. కాబట్టి దీనిని యెవరును అనాలోచనగాను, చులకనగాను, పూనుకొనకూడదు. వివాహమేర్పడిన ఉద్ధేశములకు తగినట్లుగా యోచించి భక్తి వినయములతోను, వివేకముతోను, సుబుద్ధితోను, దైవభయముతోను దీనిని పూనుకొనవలెను.                    

                                ఉద్ధేశము లేవనగా;
  1. దేవుడు: మీరు ఫలించి అభివృద్ధినొంది, విస్తరించి భూమిని నింపుడని, దానిని లోబరచుకొనుడని ఆశీర్వదించుట వలన కుటుంబములుగా నేర్పరచబడి పిల్లలను కలిగి వారిని దేవుని మహిమార్ధమును, మన ప్రభువైన యేసుక్రీస్తు నందలి ప్రేమ, జ్ఞానములయందును, పెంచబడినట్లు వివాహమేర్పరచబడినది.
  2. వివాహమును గురించిన తలంపు నరజాతిలో సహజమైన తలంపుగా కనబడుచున్నది. ఇది బైబిలులోని వాక్యమునకనుగుణ్యముగా నున్నది. పాపమువలన వివాహమునకు కొంత వరకు భంగము కలిగినను గౌరవబుద్ధి తొలగలేదు. ఇట్టి గౌరవ బుద్ధి కలిగియుండుటను బట్టి యిది యేర్పడియున్నది..
    1. ఒకరి కన్న యిద్దరుండుట మేలును, బలమునైయున్నది. దేహాత్మల విషయములయందు యేకమై ఒకరికొకరు తోడై ఒకటే ఆరాధన, ఒకే విశ్వాసము, ఒకే నిరీక్షణ కలిగి సంతోషముగా జీవించుటకై దేవుడు తన కృపచొప్పున నియమించుటనుబట్టి ఇది యేర్పడియున్నది.
    2. ఆరాధనానంతరమున పుస్తకములో తన పేర్లను వ్రాయుటను బట్టి భూమి మీదనున్న భక్తుల కుటుంబములో వీరి కుటుంబము ఒకటిగా నియమించుటకు యిది యేర్పడియున్నది. వివాహము బోధకుడు:- దేవుని సన్నిధి యందు నిలిచియున్న వీరిద్దరు పరిశుద్ధ స్థితిలో జతపరచబడుటకు వచ్చియున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నవారిలో యెవరికైన వీరి వివాహమాడరాదని న్యాయసమ్మతమైన హేతువేదైన తెలిసియున్న పక్షమున దానిని యిప్పుడు వెల్లడి చేయవలెను. లేనియెడల యికమీదట యెప్పటికిని ఊరకుండవలెను. (అభ్యంతరము లేకున్న గురువు వివాహమాడనై యున్న వారితో యిట్లు చెప్పుము.) బోధకుడు: దైవ నిర్ణయమునుబట్టి సంఘధర్మము ననుసరించి వివాహము చేసికొనుటకు వచ్చియున్న మీరు యీ వివాహమువలన జత పరచబడకూడదని హేతువేదైన మీలో యెవరికైన తెలిసియున్న పక్షమున దానిని యిప్పుడు ఒప్పుకొనవలయునని హృదయ రహస్యముల నెరిగిన సర్వశక్తిగల దేవుని సన్నిధానమున మీకు గట్టిగా ఆజ్ఞాపించుచున్నాను. ఎందుకనగా దేవుని వాక్యప్రకారముగాక వేరు విధముగా యెవరైనను జతపరచబడినయెడల అట్టి వివాహము దైవాశీర్వాదము పొందనేరదని మీరు బాగుగా గ్రహించవలసియున్నది. ప్రార్ధన
    సర్వశక్తియుతుడవును, నిరంతర మహిమాన్వితుడవైన దేవా! సమస్త ఆశీర్వాదములకు దాత సకాలమందు సమస్త మానవుల చేత స్తుతి, స్తోత్రములు పొందగలిగిన దేవా! యీ వివాహ సమయమున నీ ప్రసన్నత మాకనుగ్రహించి, వివాహము చేసికొనుచున్న వీరిద్దరిపై నీ కృపావరములను కుమ్మరించుము. ఈ నిర్ణయము చొప్పున వీరిద్దరును పరిశుద్ద వివాహములో ప్రవేశించుచుండగా ఒక నూతనకుటుంబముగా వీరిద్దరిని నీ యాత్మతో ప్రతిష్టించి నీ మహిమార్ధము సోభాయమానమగు క్రైస్తవ జీవితము నందు పెంపారజేయుము. నీ వనుగ్రహించు సకల శుభ సౌఖ్యములను కృతజ్ఞతతో అనుభవించుటకును, తమ విధి కృత్యములను చక్కగా నిర్వహించుకొనుటకు శ్ర్ అమలయందు ఓర్పు కలిగి సాంసారిక జీవితమును క్రమముగా జరిగించుకొనుటకును నీ నడిపింపును, ఆదరణను అనుగ్రహించుమని త్వరగా వచ్చుచున్న క్రీస్తు నామమున వేడుకొనుచున్నాము. ఆమెన్. (గురువు పురుషుని ఇట్లు అడుగవలెను) ……దేవుని నిర్ణయము చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడియుండుటకు యీ స్త్రీని స్వీకరింతువా? యీమెను ప్రేమించి, ఆదరించి సుఖదుఃఖములయందు కాపాడి బ్రతుకు కాలమంతయు యీమెనే హత్తుకొనియుందువా? పురుషుడు ______ ఉందును. ( స్త్రీని యిట్లు అడుగవలెను.) …… దేవుని నిర్ణయముచొప్పున పరిశుద్ధ వివాహస్థితిలో కూడియుండుటకు యీ పురుషుని స్వీకరింతువా? యీయనకు లోబడి, ప్రేమించి, ఆదరించి, ఘనపరచి, సుఖదుఃఖములయందు కాపాడి బ్రతుకు కాలమంతయు యీయనను హత్తుకొని యుందువా? స్త్రీ _ ఉందును. (గురువు యిట్లు ఇట్లు చెప్పవలెను.) వివాహము చేసికొనుటకు యీ స్త్రీని పురుషినికిచ్చు వారెవరు? (ఆ స్త్రీని వివాహార్ధమై యిచ్చెడి తండ్రి, లేక పోషకుడు ఆమె కుడిచేతిని పెండ్లి కుమారుని కుడిచేతికి ఒప్పగింపవలెను.) _____ ____ అను నేను _____ అను నిన్ను నా జీవితకాలమతయు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను, కీడుకైనను, కలిమియందును లేమియందును, ఆరోగ్యమందును, నిన్ను ప్రేమించి సమ్రక్షించుటకై నా భార్యగా పెండ్లి చేసికొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని ప్రమాణము చేయుచున్నాను. (వారు తమ చేతులు విడిచిపెట్టిన తరువాతినీ స్త్రీ తన కుడిచేతితో పురుషుని కుడిచేతిని పట్టుకొని గురువువెంట చెప్పవలెను.) … … = అను నేను… … అను నిన్ను నా జీవితకాలమంతయు దేవుని పరిశుద్ధ నిర్ణయముచొప్పున మేలుకైనను, కీడుకైనను, కలిమియందును, లేమియందును, ఆరోగ్యమందును, అనారోగ్యమందును, నిన్ను ప్రేమించి, సమ్రక్షించుటకై నా భర్తగా పెండ్లి చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని ప్రమాణము చేయుచున్నాను. (అందరు నిలువబడి కీర్తన పాడవలెను.) ( గురువు మంగళ సూత్రమును, లేక ఉంగరమును తీసికొని ప్రార్ధింపవలెను.) ప్రార్ధన పరిశుద్ధుడవైన తండ్రీ; పై అలంకారముగానున్న యీ మంగళసూత్రము (ఉంగరము) క్రీస్తు వలన కలుగు నీతి ప్రవర్తనాలంకారము గలిగి తమ జీవితము అలంకరింపబడి తాముచేసిన ఒడంబడికలను యాజ్ఞలను నెరవేర్చుటకై యెప్పుడును [జ్ఞాపకము చేయు సాధనముగా నుండునట్లు ఆశీర్వదించుమని పరిపాలించుటకై అలంకరింపబదిన వధువు సంఘముతో రానైయున్న క్రీస్తు నామమున వేడుకొనుచున్నాము. ఆమెన్. (పురుషుడు మంగళసూత్రమును స్త్రీ మెడలో కట్టుచు ఇట్లు చెప్పవలెను.) (లేక ఉంగరము.) నా ఆస్తి యంతటిలో నిన్ను పాలి భాగస్తురాలినిగా చేసికొని నిన్నెల్లప్పుడు ప్రేమిచి నమ్మకమైన భర్త్గా నుందునని వాగ్ధానమునకు సూచనగా ఈ మంగళసూత్రమును, తండ్రియొక్కయు, కుమారునియొక్కయు, పరిశుద్ధాత్మయొక్కయు పేరట కట్టుచున్నాను, అంగీకరించుము. స్త్రీ __ అంగీకరించుచున్నాను. అని చెప్పవలెను. (పురుషుడు స్త్రీ కైనను, స్త్రీ పురుషునికైనను ఉంగరమును ధరింపజేయునప్పుడు చెప్పవలెను.) వివాహ సంబంధమైన ప్రేమకును, నమ్మకమునకును, సూచనగా ఈ ఉంగరమును అంగీకరించుము. (వధూవరులు మోకాళ్ళూనూదురు. సభ నిలిచియుండును. గురు విట్లు (ప్రార్ధించును.) ప్రేమా స్వరూపుడవును కృపాభరితుడవునైన ఓదేవా! పరభూలోకములందలి సకల కుటుంబములను యేకకుటుంబముగా పిలిచి పోషించి పరిపాలించుచున్న ప్రభువా విరిపై నీ నిండైన దీవెనలను కుమ్మరించుము, వీరిద్దరి కవసరమైన సకల కృపావరముల ననుగ్రహించి వీరిరువురు చేసికొనిన ప్రమాణములను మీరకుండునట్లును కావలసిన నిష్కళంకమైన ప్రేమతో వర్ధిల్లునట్లును, కటాక్షిచుము! మరియు వీరు నీతి సమాధానము ననుసరించి జీవిత కాలమంతయు కృతజ్ఞతతో నిన్ను సేవించుచు సకల విధముల అభివృద్ధి పొందినట్లు వీరిని దీవించుమని మహిమాస్వరూపియైన యేసుప్రభువు పేరట వేడుకొనుచున్నాము ఆమెన్. (గురువు వారి కుడిచేతులను కలిపి యిట్లు చెప్పవలెను.)</code></pre>—– ను —- ను పరిశుద్ధ వివాహమునకు సమ్మతించి ఆసంగతి దేవును సముఖమందును, ఈ సభయెదుటను, ప్రచురణ పరచి ఒకరికొకరు తమ ప్రమాణములను చేసియున్నారు. గనుక దేవుని నిర్ణయమును బట్టియు సంఘము వలనను, ప్రభుత్వమువలనను, నా కియ్యబడిన అధికారమును బట్టియు, వీ రిరువురును భార్యాభర్తలని తండ్రియొక్కయు, కుమారునియొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు, నామమందు ప్రకటించుచున్నాను. గురువు:- కాబట్టి దేవుడు జతపరచిన వారిని మనుష్యుడు వేరుచేయకూడదు. ప్రార్ధనమహిమ రూపుడవైన తండ్రీ! మహిమ మేఘముమీద వచ్చుచున్న మా ప్రియప్రభువు రాకకొరకు సిద్ధపడి, మేఘములో ఆయనను కలిసికొనుటకు ఈవధూవరులు నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా ఆశీర్వదింపుము. ప్రభువా! వీరు ఒకరికొకరు చేసికొనిన ఒడంబడికలను నెరవేర్చి ఒకరినొకరు ప్రేమించుకొనుచు నీ పరిశుద్ధ ప్రేమలో పరిపూర్ణులగునట్లు నీ యాత్మతో నింపి, నీ యాజ్ఞలప్రకారము నమ్మకముగా నడుచుకొనునట్లు, నీ మహిమైశ్వర్యములో పాలుపొందునట్లును కృప ననుగ్రహింపుమని పెండ్లికుమారుడుగా రానైయున్న క్రీస్తు యేసు ప్రభువుద్వారా వేడుకొనుచున్నాము, ఆమెన్. (వధూవరులు మోకరించియుండగా గురువులందరు వారిపై తమ చేతులుంచి దీవించవలెను.) దీవెన:- పరిశుద్ధుడైన దేవుడు, మహిమగల ప్రభువైన దేవుడు. సమస్త కృపావరములకు దాతయైన దేవుడు ఇహమందు సర్వసంపదలను, పరమందు మహిమ భాగ్యమును మీకనుగ్రహించుగాక! అన్నిటిలోను వివాహము ఘనమైనదనియున్నది. గనుక దంపతుల కుటుంబజీవితము దైవభక్తి కలిగి ఘనముగా వర్ధిల్లునట్లు సర్వశక్తి దేవుని దీవెన కలుగునుగాక! ప్రభువు రాత్రి భోజనము యోహాను 6:55-57 ప్రార్ధన:- జీవాహారమైయున్న ప్రభువా! నీపావనశరీర రక్తములు పుచ్చుకొనుటవలన కలుగు పాపపరిహారమును, స్వష్తత కార్యమును, నీతో చనువుగల సహవాసమును నీ స్వరూప సౌదర్యమును, మానవమరణము మరణమైయుండక మోక్షమునకు మార్గమై యుండు స్థితియును, సజీవముగా రెండవ రాకడలో వెళ్ళుదీవెనయును, వీరికి దయచేయుము. ఈ సంస్కారపు విందు ననుభవించుచున్న వీరి మోక్షలోకపు విందులో పాలుపొందు కృపయు దయచేయుము. ఆమెన్. (వధూవరులకు సమభక్తత్వము నియ్యవలెను.) దీవెన</code></pre>మన ప్రభువైన యేసుయొక్క పరిశుద్ధ శరీరమును, ఆయన అమూల్యమైన రక్తమును మిమ్మును పరిశుద్ధపరచి ఆయన మహిమ రూపమును మీకిచ్చి రెండవ రాకకును, అనంత జీవనమునకును, మిమ్మును సిద్ధపరచును గాక! ఆమెన్. (అందరు నిలువబడియుండగ) తండ్రికిని, కుమారునికిని, పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు, యెల్లప్పుడుయుగయుగముల యుండునట్లు మహిమ కలుగును గాక! ఆమెన్. గురు – నీ వాక్యము నాపాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునైయున్నది. సంఘ __ నీవాక్యము నన్ను బ్రతికించియున్నది, నా బాధలో యిదే నాకు నెమ్మది కలిగించుచున్నది. గురు: ప్రభువు మీకు తోడైయుండునుగాక సం: ప్రభువు మమ్మును ఆశీర్వదించును గాక. గురు: ప్రభువా! మమ్మునుకనికరించి మాకు కనబడుము. సం: ప్రభువా! మమ్మును కనికరించి మాతో మాట్లాడుము. గురు: ప్రభువా! నీవే మాదాగు చోటు సం: ప్రభువా! నీ సన్నిధిచాటున మమ్మును దాయుము. గురు: ప్రభువు త్వరగా వచ్చుచున్నారు. సం: ప్రభువైన యేసూ రమ్ము. ముగింపు ప్రార్ధన పరలోకపు తండ్రీ ఈ వధూవరులు తమ బ్రతుకుకాలమంతయు కృపాక్షేమములు గలవారై జీవించుటకు నీ పావన రెక్కలక్రింద కాపాడుము. ప్రభువా వీరి శరీర జీవితమునకు, మహిమజీవితమునకు, అవసరమైన సకల సదుపాయములు దయచేయుము. నీ పావనాత్మతో నింపి నీచిత్తమును బయలు పరచుటకు నీవే కనబడి మాట్లాడుము. భూలోకపు భక్తులతోను, పరలోకపు భక్తులతోను, దూతలతోను, నీతోను, సహవాసముగలవారై జీవించు కృప దయ చేయుము. వీరి గృహములో ఉన్న సమస్త వస్తువులు పరలోకపు గృహమందున్న మహిమను జ్ఞాపకముచేయు నీవే గృహమైయుండునట్లు దీవించుము. వీరి గృహమునకు నీవే యధిపతివైయుండుము. గృహహమందు</code></pre>జరుగు విందు పరలోకపు విందును జ్ఞప్తిని తెచ్చునట్లు దీవించుము. వీరి కుటుంబములో జరుగు ప్రార్ధనాస్తుతులు వీరుచేయు ధర్మకార్యములు నీ సన్నిధిని జ్ఞాపకముగా నుండునట్లంగీకరించుము. వీరితో యెల్లప్పుడు నీ వుండుము. వీరికి కలుగు కష్టములలో నీవు తోడ్పడి వీరికిని వీరితోనున్నవారికిని నిన్ను బయలుపరచుకొనుము. వీరిలోని లోపములను పరిహరింపుము. ఇద్దరు ఒక్కరుగాను, ఒకరుయిద్దరుగాను ప్రేమించుకొనుచు నీతో కలిసి జీవించునట్లు ఆశీర్వదించుము, నీ వాక్యమందు వీరిని పెంచుము. నీ రాకడకొరకు సిద్ధపరచుము. నీ వాక్యము నుపదేశించుటకును, నీకు సాక్షులుగా నుండుటకును, వీరిని ఆయత్తపరచుము. బిడ్డలను దయచేయుము. వీరిని నీ భయమునందును, భక్తియందును; పెంచునట్లు నీకృప దయచేయుము. వీరిని యేకృపగల ఉద్ధేశముతో లోకమునకు పంపినావో ఆ నీ ఉద్ధేశమును నెరవేర్పగలస్థితి దయచేయుము. జీవితాంతమునందు మోక్షభాగ్యము ననుగ్రహింపుము. మా ఈ ప్రార్ధనలను, అంగీకరించుమని త్వరగా మహిమ మేఘములోనికి పెండ్లికుమారుడుగా రానైయున్న క్రీస్తు ప్రభువు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమెన్. పరలోక ప్రార్ధన దీవెన ప్రభువు మిమ్మును ఆశీర్వదించి మిమ్మును కాపాడునుగాక! ప్రభువు మీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి మిమ్ము కరుణించునుగాక! ప్రభువు మీమీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి మీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమెన్. ఆది 2:18-24. 24అ. కీర్తన 23 అ. సామె 10: 22 12:4, 18:22 31:10. మత్తయి 19:3-6 యోహాను 2:1-11. 1తిమోతి 4:4. 5;6:17. ఎఫెసి 5: 22-33 కొలస్సై 3:18,19 ప్రకటన 19: 6-9 1పేతురు : 3:1-7.
Please follow and like us:

How can we help?