సంఘారాధనలు

⌘K
  1. Home
  2. Docs
  3. సంఘారాధనలు...
  4. 12. మృతుల భూస్థాపన క్రమము

12. మృతుల భూస్థాపన క్రమము

(క్రైస్తవ విశ్వాసమునందు మృతి నొందినవారిని భూస్థాపన చేయునప్పుడు మాత్రమే ఈ క్రమము నుపయోగింపవలెను.)

     * (సంఘములో యెవరైన చనిపోయినయెడల సంఘాధ్యక్షునికి తెలియజేయవలెను, క్రైస్తవు లెవరైన మృతి నొందినప్పుడు చావు గంట కొట్టించవలయును.)

(ఈ క్రమము భూస్థాపనకు పూర్వము ఆలయము నొద్ద గాని, యిటియొద్ద గాని ఉపయోగించవచ్చును.)

  గురువు ప్రాకారద్వారమునొద్ద శవము నెదుర్కొని దానికి ముందుగా దేవాలయములోనికి వెళ్ళుచు, ఈ క్రింది వచనములలో ఒకటిగాని, కొన్నిగాని చెప్పవచ్చును. లేక కీర్తన పాడవచ్చును.

                   బోధకుడు

  నేనే పునరుత్థానమును, జీవమునైయున్నాను. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. బ్రతికి నాయందు విశ్వాసముంచుప్రతివాడు ఎన్నటికిని చనిపోడు.

                                                              (యోహాను 11:25,26.)

జీవమార్గమును నాకు నీవు తెలియజేసెదవు.   నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. నీ కుడిచేతిలో నిత్యసుఖములు కలవు.   (కీర్తన 16:11)



      ఆదామునందు అందరు ఎలాగు మృతిపొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరు బ్రతికింపబడుదురు.                      [1కొరింధి 15:22.]

   నీతిమంతులు నశించుట చూచి యెవరును దానిని మనసున పెట్టరు. భక్తులైనవారు తీసికొని పోబడుచున్నారు. కీడుచూడకుండ నీతిమంతులు కొనిపోబడుచున్నారని యెవరికిని తోచదు. [యెషయా 57:1]

  యేసు మృతిపొంది తిరిగి లేచెనని మనము నమ్మిన యెడల అదే ప్రకారము యేసు నందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడ వెంటబెట్టుకొని వచ్చును. [1థెస్సలో 4:14]

  ఈ చిన్న వారిలో ఒకరినైనను తృణీకరింపబడకుండ చూచుకొనుడి. వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖము ఎల్లప్పుడు పరలోకమందు చూచుచుందురని మీతో చెప్పుచున్నాను. [మత్తయి 18:10]

    కీర్తన: మరణము కాదీబాధ (77)

 వేదపఠనము:- పా.ని.:దా.కీ. 23అ. క్రొ.ని:-యోహాను11:21-27. ప. పాఠము 1థెస్స4:13-18.

                                      ప్రసంగము

   బోధకుడు:- తండ్రికిని, కుమారునికిని, పరిశుద్ధాత్మకును. మహిమ కలుగునుగాక!

     సంఘము:- ఆదియందు, యిప్పుడు, ఎల్లప్పుడు యుగయుగము లందుండున

ట్లు మహిమ కలుగును గాక!

    బో:- ప్రభువు మీకు తోడై యుండునుగాక!

     సం:- మీ యాత్మకును, తోడై యుండును గాక!

    బో:- ప్రభువా! మమ్మును కనికరించుము.

    సం:- క్రీస్తూ మమ్మునుకనికరించుము 

    బో:- ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను.

    సం:- ప్రభువైన యేసూరమ్ము.

                                                                ప్రార్ధన

   పరలోకపుతండ్రీ! భూలోకమదున్న విశ్వాసి మరణించుట నీయందు విశ్రాంతి పొందుటయేగాని మరణముగా నుండదని నీ భక్తులయొక్క యనుభవములో నేర్పినావు. గనుక వందనములు. ఈ లోకములో పాపము, వ్యాధి, కష్టములు, బాధ, కన్నీరున్నందున నిజ విశ్రాంతి లేని మానవునికి నీ చేతులలందు, నీ రొమ్మున నానుకొని నిజ విశ్రాంతి పొందుటకై నీ యొద్దకు చేర్చిన నీకు వందనములు, నీతోను, పరలోకపు దూతలతోను, నరలోకపు పరిశుద్ధులతోను భూలోకపు విశ్వాసులతోను, స్వేచ్ఛగా తిరుగుటకై పాపమును త్రాళ్ళను తెంపి నీయొద్ద చేర్చిన నీకు నుతులు. మరియు నీ యందు నిద్రించుటవలన నరకమను నిత్యమరణమునుండి తప్పింపబడి, మా ప్రభువైన క్రీస్తుతో కూడ నిత్యము పరిపాలించు కృప ననుగ్రహించిన నీకు వందనములు. మా స్తుతులు నిత్య జీవాధిపతియైన క్రీస్తు ప్రభువు ద్వారా చెల్లించుచున్నాము.  ఆమెన్.

 పరిశుద్ధుడుడవైన, ఓ తండ్రీ! పరలోకపు పరిశుద్ధులకును భూలోకపు విశ్వాసులకును, సహవాసము కలిగించిన నీకు స్తోత్రములు. పరమందున్న పరిశుద్ధులు నీతో నున్నారు. భూమిమీద నున్న విశ్వాసులు నీతో నున్నారు. భూమిమీదనున్న విశ్వాసుల జీవము మా ప్రభువెన క్రీస్తుతో నీయందు దాచబడి యున్నదని కొలస్సై 3:3 లో వ్రాయించినావు. గనుక నీవద్ద పరలోకపు పరిశుద్దులును, భూలోకపు విశ్వాసులును, నీతోనే యున్నారు. గనుక స్తోత్రము. ఇట్లే సహవాసమును మా ప్రభువైన క్రీస్తు రూపాంతరసమయమందున పరిశుద్ధులైన మోషే, ఏలీయాలువచ్చి మాట్లాడుట భూమిమీదనున్న అపొస్తలలు చూచియున్నారు. ఈ చరిత్రవల్ల భూమిమీదనున్న విశ్వాసులకును, నీ వద్దనున్న పరిశుద్ధులకును, సహవాసము ఉన్నట్లు కనబడుచున్నది. అందుకే క్రెస్తవసంఘ విశ్వాస ప్రమాణములో పరిశుద్ధుల సహవాసమును నమ్ముచున్నామనియున్నది. గనుక ప్రభువా, నీ యందు నిద్రించువారు నీతో నున్నను, నీవు మాతో నున్నావు గనుక వారు మాతో ఉన్నారు, ఉన్నవారు రూపాంతర మప్పుడు అపొస్తలులకు కనబడినట్లు మాకును కనబడి మాట్లాడుము. ఇట్టి విశ్వాసానుభవము నందు మమ్మును  పెంచుమని త్వరగా భూలోక, పరలోక సంఘములను మేఘములో ఆకర్షింపనైయున్న క్రీస్తు ప్రభువుద్వారా వేడుకొనుచున్నాము.

 కృపానిధివైన తండ్రీ చనిపోయిన తన కుమారుని నిమిత్తము దుఃఖించుచున్న విధవరాలిని మా ప్రభువు ఓదార్చినట్లు దుఃఖించుచున్న వీరిని నీవే ఓదార్చుమని రక్షణ కర్తయైన క్రీస్తుద్వారా వేడుకొనుచున్నాము. ఆమెన్.          

                          పరలోక ప్రార్ధన - దీవెన

                                  సమాధియొద్ద జరుపబడు ఆరాధన.

     * (సమాధుల దొడ్డిద్వారము ప్రవేశించుచు కీర్తన పాడుట గాని, ఈ క్రింది వచనములలో కొన్ని గాని చెప్పవచ్చును.)

  బో :- మృతులు దేవుని కుమారుని శబ్దము విను ఘడియ వచ్చుచున్నది. ఇప్పుడే వచ్చియున్నది. దానిని వినువారు జీవితురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. (యోహాను  5: 25)

          ....  ....  .... ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో నున్నవారంద రాయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసినవారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చెదరు. (యోహాను 5:28-29.)

   మృతులలోనుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన యెడల మృతులలోనుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడ మీలో నివశించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. (రోమా 8:11)                  

                                                     ప్రార్ధన

    పరలోకపు తండ్రీ! మానవుని అపరాధమువలన మంటినుండి తీయబడిన మనిషి మన్నయి పోవునని ఆదాముతో పలికియున్నావు. ఆదామునందు అందరికి మరణము ఏలాగు సంభవించెనో మా ప్రభువైన క్రీస్తునందు అందరు పునరుత్థానులగుటకు ఆయనను ఈలోకమునకు పంపి మా పాపమునకు శిక్ష ఆయన శరీరమందు విధించి మా మరణమును కొట్టివేసి నిత్యజీవము గలవారినిగా మార్చిన నీ కృపకై స్తుతులు. మహిమగల తండ్రీ! దావీదు నా మన్ను నిన్ను స్తుతించునా!" అని పలికెను. ఐనను నీవు మన్నై మానవుని శరీరమును నీ కుమారుని మహిమ రాకవలన మహిమ శరీరముగా మార్చిన నీకు స్తోత్రములు. 

    * (శవమును సమాధిలోనికి దింపుచుండగా ఒక చిన్న కీర్తన, లేక ఒక సంగీతము పాడవచ్చును.)

 బోధకుడు:- ఆర్భాటముతో, ప్రధానదూత శబ్దముతోను, దేవుని బూరతోను, పరలోకమునుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైనవారు మెదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడ యేకముగా ప్రభువు నెదుర్కొనుటకు ఆకాశమమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతోకూడ నుందుము.  (1 థెస్స 4:16-17)

(శవముపై కొద్ధి మట్టి వేయుచు సేవకుడు ఇట్లు చెప్పును.)

  సఋవశక్తిగల దేవుడు తన అధిక కృపచేత ప్రభువైన క్రీస్తునందు నిద్రించుచున్న మన ప్రియ సహోదరుని (లేక సహోదరి) ఆత్మను ఆయన సాన్నిధ్యమైన పరదైసునందు చేర్చుకొనెను. గనుక మన ప్రభువైన యెసుక్రీస్తు మహిమ రాకడయందు పాలుపొందుటకై పునరుథానము కలుగునను నిశ్చయము దృఢమైన విశ్వాస నిరీక్షణయును గలవారమై ఈయన (ఈమె) శరీరమును మంటికి మన్నుగాను, బూడిదగాను, దుమ్ముకు దుమ్ముగాను, భూమికి అప్పగించుచున్నాను.        

 బో:- సమస్తమును తనకు లోబరచుకొనజాలిన శక్తినిబట్టి ఆయన దీన శరీరమును మహిమగల శరీరమునకు సమరూపము గల దానినిగా మార్చును. (ఫిలిప్ఫీ 3:21)

ఇదిగో మీకు మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించముగాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూర మ్రోగగానే మార్పు పొందుదుము. బూర మ్రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదుము.

క్షయమైన యీ శరీరము   అక్షయతను  ధరించుకొన వలసియున్నది. మర్త్యమైన యీ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసియున్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు యీ మర్త్యమైనది, అమర్త్యతను ధరించుకొనినప్పుడు విజయమందు మరణము మ్రింగివేయబడెనని వ్రాయబడిన వాయము నెరవేరెను.  (కొంధి 15:51-54)

                                 ముగింపు ప్రార్ధన

   జీవాధిపతివైన తండ్రీ! మానవుని శరీరప్రాణాత్మలను నీవు పావన పరచి నీకుమారుని మహిమ రాకడలో పాలుపొందునట్లు దీవెన దయచేసిన నీకుస్తుతులు. ఆయనతో భూమిమీద వెయ్యేండ్లు పరిపాలనచేయు అధికారము ననుగ్రహించిన నీకు నుతులు.నీవే ఆలయమైయుండి గొర్రెపిల్లయైన క్రీస్తే దీపమైయుండిన మోక్షమందు నిరంతరము జీవించు కృప దయచేసిన నీకు వందనములు. ఇట్టి ధన్యకరమైన స్థితి మా అందరకును దయచేయుమని రారాజుగా వచ్చుచున్న క్రీస్తు ప్రభువుద్వారా వేడుకొనుచున్నాము.  ఆమెన్.       

                                        పరలోక ప్రార్ధన - దీవెన

   కీర్తన 90- 130, ద్వితి 33:27, యోబు 19:25,26. కీర్తన 15:15. 23 కీ, కీర్తన 116:15. యెషయా 26:19, 57:1 దానియేలు 12:2 సామెతలు 10:7 లూకా :14:1, యోహను 5: 19-29, 11:21-27, 14:1-6. రోమా 6:5. 8:11. 14:15,16, 5:1-10. ఫిలిప్ఫి 3:20-21, కొలస్సై 3:3. 1థెస్సలొనికై 4:13-18. 5:23 ప్రకటన 7: 9-17 21: 3-7. లూకా 20:36.
Please follow and like us:

How can we help?