సంఘారాధనలు

⌘K
  1. Home
  2. Docs
  3. సంఘారాధనలు...
  4. 13. వారబోధిని (30 సంఘ జీవితాంశములు)

13. వారబోధిని (30 సంఘ జీవితాంశములు)

                              (బైబిలు మిషను బోధించు ప్రత్యేక బోధలు)

                                              బాప్తీస్మము

    మత గురువు ఉదకము నిచ్చు బాప్తీస్మము ఆత్మీయ జీవిత జన్మస్నానమైయున్నది. ఇది తండ్రి, కుమార పరిశుద్ధాత్మల నామమందు పొందు బాప్తీస్మము గనుక ఆయన మనతండ్రి,   బంధుత్వము మనమాయన బిడ్డలము.ఇట్టిజన్మ బంధుత్వము బాప్తీస్మమువలన యేర్పడును. బైబిలులో బాప్తిస్మమనియున్నది గాని పద్ధతిలేదు. బాప్తీస్మమిచ్చు గురువు, క్రీస్తునందు విశ్వసించి  పొందు వ్యక్తి, అట్టి సమయమున పరిమితిలేని నీటిని వినియోగించి త్రిత్వనామమున యిచ్చు నదియే బాప్తీస్మము, గనుక ముంచినను, పోసినను బాప్తీస్మమే. బాప్తీస్మము ఒక్కటే అని పౌలు ఎఫెసి 4:5లో వ్రాసిన ప్రకారము యెవరు, ఎప్పుడు ఎవరి వలన అనగా ఏ సంఘములో బాప్తీస్మము పొందినను అది బాప్తీస్మమే. మత్తయి 28:19; 3:11 అ.కా. 1:5 గలతి 3:27.

                                              పరిశుద్ధాత్మ బాప్తీస్మము

   క్రీస్తు ప్రభువు నీళ్ళతో కాక పరిశుద్ధాత్మతో యిచ్చు స్నానమైయున్నది. ఇది ఆత్మీయ జీవనము యొక్కయు, ఆ జీవన పరుని సువార్త సేవయొక్క వృద్ధిని కలిగించు సాధనమైయున్నది. నీటి బాప్తీస్మము వలన క్రెస్తవసంఘ సభ్యత్వము కలుగును. పరిశుద్ధాత్మ బాప్తీస్మము వలన పరలోక సభ్యత్వము లభించును. యోహను3:5 యోవేలు 2:28,29 అ. కార్య 1:5,2 అధ్యా

                                        స్వరీయ భాష  

          ఇది విశ్వాసికి పరిశుద్ధాత్మ యిచ్చు ఒక వరము. గనుక దీనిని నిషేధింపరాదు. దీని అర్ధమును, ఒక వరమే. పరలోకము చేరబోవు వారు నేర్చుకొందురు. ఇతర వరములనుగూర్చి బైబిలులో యింత వివరముగా వ్రాయబడలేదు.

  1కొరింధి 12:10,13:1; 14:2. 39:40 మార్కు 16:17.           



                                                          ప్రవచనము

 దైవాత్మావేశము వలన  బైబిలు కాలపు ప్రవక్తలు మూడు కాలములలోని సంగతులు ప్రజలకు చెప్పిరి. అవి గ్రంధములలో కూడ వ్రాసిరి. వారి వ్రాతలే ప్రవచనములు. ఇట్టి ప్రవచనవరము దేవుడు నేడును కొందరికి యిచ్చుచున్నారు. మరియొక విధమైన ప్రవచనమేదనగా వ్రాయబడిన ప్రవచా వాక్యములను దైవాత్మ సహాయమువల్ల బహు వివరముగా బోధించుట, ఇదికూడ దేవుడు నేడు కొందరికి యిచ్చుచున్నారు. కొందరు బైబిలు కాల ప్రవక్తలవంటి ప్రవక్తలు నేడు లేరు అని చెప్పుచున్నారు. ఆ వరము బైబిలు కాలముతోనే ఆగిపోయినది. అని వారు తలంచుచున్నారు. పాదురులే ప్రవక్తలని వారి తలంపు.

  1కొరింధి 12:10. 14:39. 40. 1 పేతురు 1:10,11.

                                       దశమ భాగము

  రాబడిలో పదియవ వంతు గుడిలో సమర్పించుట  యూదుల ఆజ్ఞాచారము. అంతకన్న ఎక్కువ సమర్పించుట మన అనుభవ ఆచారమైయుండకూడదా? మత్తయి 5:20, 1కొరింధి 16:2, 2కొరింధి 8;4, మలాకీ 3:10.



                            ప్రత్యక్షతలు                                  

  1. దర్శన ప్రత్యక్షత:- దీనిలో విశ్వాసులకు అంతయు, అన్నియు కనబడవచ్చును. భూలోకము, పరలోకము, పాతాళలోకము, వాయుమండల లోకము, ఈ మొదలైన స్థలములు, వానిలోని సమస్తము, సమయానుకూలముగా కనబడవచ్చును. దీనినే దర్శనమందురు. దేవుడు, దూతలు, మహిమ, కనబడిన సంతోషము. అపవిత్రస్థానములు, అపాయము-ఈ మొదలైనవి కనబడినప్పుడుకూడ సంతోషము కలుగవలసినదే ఎందుకనగా అవి యున్నవి గనుక కనబడకపోవునా?

   యెషయా 6అ సంఖ్య 12:8, అ.కా. 9:27, ఎఫెసి 3;3. అ.కా. 10:3-4.

 మత్తయి 17:3, అ.కా. 9:12, 16:9-10, యోహాను 4:7, లూకా. 10:18-19.

                                 సర్వ ప్రత్యక్షత

  దీనిలో పై నుదహరించిన వారిలో ఎవరో ఒకరు మాటలాడిన మాటలు వినబడును. ముఖ్యముగా ప్రభువుయొక్క, పరిశుద్ధులయొక్క మాటలు వినబడును, నా గొర్రెలు నా శభ్దమువినును అని యేసుప్రభువు యోహాను 10 అ. లో చెప్పినమాట యిచ్చట జ్ఞాపకమునకు వచ్చుచున్నది. 1సమూ. 3:10,1రాజులు 19:12, యోహాను 10:27, అ. కా 9:4. ప్రకటన 1:11-12.

                                            వ్రాత ప్రత్యక్షత

  దీనిలో సందేశము అనగా వర్తమానము, గాలిలో వ్రాయబడే అక్షరములు అందు కనబడును. లేదా అచ్చువేయబడిన అక్షరములవలె కనబడును. దావీదునకు దేవుడు గుడియొక్క నిర్మాణ పద్ధతి వ్రాత మూలముగా చూపెనని దినవృత్తాంతములో వ్రాయబడియున్నది గదా ఒక్కొక్కప్పుడు చేతి వ్రాతకూడ కనబడును. మరియు పరలోకము నుండి ఒక అట్టబోర్డు వచ్చును. దానిపై ఒకరు వ్రాసి చూపింతురు. చదివి నోట్సులో వ్రాసికొనవచ్చును.

  నిర్గమ 31:18, 1దినవృ 28:19, దానియేలు 5:5, యోహాను 8:6.

                              స్వప్న ప్రత్యక్షత

    ప్రభువు యోసేపునకు స్వప్నములో కనబడి సంగతి తెలియపరచినట్లు విశ్వాసికి కలలో కనబడి తెలియజేయును. పగలు చూచినది కలలో కనబడిన యెడల అది ప్రత్యక్షతకాదు. దైవ ప్రత్యక్షత స్వప్న ప్రత్యక్షతయే.

   ఆది 37:7-10, సంఖ్య 12:6, 1రాజులు 3:5 మత్తయి 2:12. 13, 1:20; 27:19.

                                                ఊహా ప్రత్యక్షత 

  ఇదియును దైవ ప్రత్యక్షతలలో నొకటి. ఇట్లు చేయుటకు పరిశుద్ధాత్మకును, మాకును తోచెను. అని అ.కా. 15:28,29లో గలదు. నెహెమ్యా 2:12.

                                     జ్ఞాన ప్రత్యక్షత

 ఇది దేవుడనుగ్రహించిన జ్ఞానమునుబట్టి గ్రహించుకొను శక్తి సొలొమోను వేశ్యలకు తీర్పు తీర్చినది జ్ఞానమునుబట్టికాదా! జ్ఞానమును బట్టియేకదా! నూతన యంత్రములు, స్టీమర్లు, విమానములు మొదలైనవి కనిపెట్టుట దేవుని సార్వత్రిక ప్రేమ అవిశ్వాసులకు కూడ యిట్టి జ్ఞానమిచ్చును. ఇది ఆత్మీయజ్ఞానము కాదు,విశ్వాసులకు ఆత్మీయ జ్ఞానము యియ్యబడును జ్ఞానముకూడ ఒక వరమని బైబిలులో ఉన్నది.

 1రాజులు3:11-12,అ.కా. 6:10, 1కొరింధి 1:6;12:8.

                                                              వాక్య ప్రత్యక్షత

     మనము ప్రార్ధన చేసిన తరువాత జ్ఞానము నుపయోగించి బైబిలు తీసి జాగ్రత్తగా వెదకిన యెడల మన ప్రార్ధనకు సరిగా తగిన వాక్యమే దొరుకును. లూకా 4:17,18 తెలివి తక్కువగాను, అజ్ఞాముగాను, వెదకిన యెడల కావలసిన వాక్యము దొరకకపోవును.

  ఉదా:- ఒకప్పుడు క్రేకరుల మిషను క్రైస్తవుడు దేవా! ఏమి పనిచేయవలెనో నీ వాక్యములో చూపిన ఆ ప్రకారము చేస్తాను. అని ప్రార్ధించి బైబిలు తెరువగా "యూదా ఉరిపెట్టుకొనెను" అని వచ్చినదిబబ్బే ఇది సరిలేదు. అని మరల బైబిలు తెరవగా "నీవును వెళ్ళి అలాగు చేయుము" అని వచ్చినది. సిగ్గుపడి మరల తెరువలేదు. ఇది చాదస్తపు భక్తి. నీలో జ్ఞానములేదు.

    షరా:- 1. కొందరికి వీటిలో ఏదో ఒకటి ఉన్నది. కొందరికి 2 లేక 3 ఉండును. కొందరికి అన్ని ఉండును. దీనిని సరియైన రీతిని వాడుటను బట్టి వరములు ఉపయోగములోనికి వచ్చును. భయంకరమైన సంగతి యేమనగా దయ్యము కనబడితే ప్రభువని కొందరు అందురు. ప్రభువు కనబడితే కొందరు దయ్యమని అనుకొందురు. నీటి మీద ప్రభువు కనబడితే శిష్యులు భూతమని తలంచిరి. గనుక జాగ్రత్తగా ఆలోచించవలెను. సాతాను వెలుగు దూతవేషము ధరించునని పౌలు వ్రాయుచున్నాడు.

 2. కనిపెట్టు సమయములో యీ వరము వాడుకతో నుండును. గాని కొందరికి ఎప్పుడుబడితే అప్పుడు ఉండును. హృదయ స్థితినిబట్టి యీ వరముండును విశ్వాసులారా! తప్పుడు దర్శనములకు, పిశాచులకు,  దూరస్థుల  గుడి మరియు దర్శనములు అర్ధము కానప్పుడు అర్ధము కొరకు ప్రార్ధించండి.

   3. ఒక్కొక్కప్పుడు స్వప్నములు సరికాకపోవచ్చును. ఒక్కొక్కప్పుడు దర్శనములు సరికాకపోవచ్చును. ఒక్కొక్కప్పుడు ఊహలుకూడ సరికాకపోవచ్చును. కాని వాక్య ప్రత్యక్షత యెప్పుడును సరిగానే ఉండును. ఎందుకనగా అది వ్రాయబడియున్నది. గనుక దానిని మార్చుటకు వీలులేదు. ఎలాగనగా "అడుగుడి మీకు యియ్యబడును" అనే వాక్యముండగా దీనిని ఎవరు మార్చగలరు? లేదని కాదని ఎవరనగలరు? దేవదూతలు అనరు గాని, అంటే మనమాటే నెగ్గును. ఎందుకంటే పత్రము మార్చ వీలులేదు. మాట అయితే మార్చవచ్చును.

  4. నీవు ప్రార్ధన చేసినావు. నెరవేరలేదు. అని ఇతరులు గాని, నీ స్వంత మనసుగాని, పిశాచిగాని, చెప్పినయెడల ఆ మాట ఎంత మధురముగా నున్న నమ్మవద్దు. వ్రాత వాక్యమే నమ్ముము. అప్పుడు క్షేమము కలుగును.

 పాద శుద్ధి:- ప్రభువు శిష్యుల పాదములు కడిగెను. మీరును ఇట్లు చేయుడని చెప్పెను. ఈ మాటనుబట్టి పాదుర్లు నేటి కాలమందు ప్రభువు భోజన కాలమందు సభికుల పాదములు కడుగవలెను.

ప్రభువు భోజనము:- ఈ భోజన సమయమందు విశ్వాసికి అంతరంగముగ క్రీస్తుయొక్క శరీర రక్తములు దానిలో అందును. ప్రభువు భొజనము ఎంత తరచుగా ఆచరిస్తే అంత మంచిది. సమభాక్త్వము పుచ్చుకొన్న వెంటనే కొందరు రోగులు స్వస్థపడుదురు.     మత్తయి 26:26-29, 1కొరింధి 11:23-34.        4. నీవు ప్రార్ధన చేసినావు. నెరవేరలేదు. అని ఇతరులు గాని, నీ స్వంత మనసుగాని, పిశాచిగాని, చెప్పినయెడల ఆ మాట ఎంత మధురముగా నున్న నమ్మవద్దు. వ్రాత వాక్యమే నమ్ముము. అప్పుడు క్షేమము కలుగును.

 పాద శుద్ధి:- ప్రభువు శిష్యుల పాదములు కడిగెను. మీరును ఇట్లు చేయుడని చెప్పెను. ఈ మాటనుబట్టి పాదుర్లు నేటి కాలమందు ప్రభువు భోజన కాలమందు సభికుల పాదములు కడుగవలెను.

ప్రభువు భోజనము:- ఈ భోజన సమయమందు విశ్వాసికి అంతరంగముగ క్రీస్తుయొక్క శరీర రక్తములు దానిలో అందును. ప్రభువు భొజనము ఎంత తరచుగా ఆచరిస్తే అంత మంచిది. సమభాక్త్వము పుచ్చుకొన్న వెంటనే కొందరు రోగులు స్వస్థపడుదురు.     మత్తయి 26:26-29, 1కొరింధి 11:23-34. 

    దైవిక స్వస్థత:-  1. ఔషధము లేకుండ కేవలము విశ్వాస ప్రార్ధనలవల్లనే జబ్బులు బాగుచేసుకొనుటకు దైవిక స్వస్థత అని పేరు యెహోవాను ఆశ్రయింపనందున ఆసాకుశిక్ష కలిగెను. గాని ఔషధము వాడుటవలన కాదు. మూలికలలో దేవుడే స్వయముగా స్వస్థపరచు శక్తిని పెట్టెను. అని మన అనుభవమువలన తెలిసికొనుచున్నాము. పుండునకు అంజూరపు పండ్లను కట్టవలెను. ఆ మాటను బట్టి చూడగా ఔషధములు నిషేధములు కావని కనబడుచున్నది. కాని కేవలము విశ్వాసమువల్లనే బాగుచేసికొనుట శ్రేయస్కరము. (స్వస్థి పత్రిక చదివినారా?)

  నిర్గమ 15:26; కీర్తన 107:20; యెషయా 53:5; మత్తయి 4:23-24; అ,కా. 3:16; 1 పేతురు 2:24.  

 దయ్యములను వెళ్ళగొట్టుట :- ఇది ప్రభువు తనకిచ్చిన ఒక గొప్ప వరము. నేడును ఈవరము కొంతమందికి యిచ్చుచున్నాడు. విశ్వాసి అపవిత్రాత్మ పట్టినవాని యెదుట వాక్యము బోధించి ప్రార్ధన చేసిన యెడల ప్రభువు అపవిత్రాత్మను వెళ్ళగొట్టును. ఇది కూడ మేము ప్రయత్నించుచున్నాము.[కొందరు దయ్యములు ఉన్నవని నమ్మరు. అట్లు నమ్మకపోవుట దయ్యములకు ఎంతో ఇష్టము]      మత్తయి: 10:8, మార్కు:16:17.  

                                                పరిశుద్ధుల సహవాసము

  విశ్వాస ప్రమాణములో పరిశుద్ధుల సహవాసము నమ్ముచున్నానని ఉన్నది. పరిశుద్ధులు అనగా యీ లోకములోని పరిశుద్ధులు, పరలోకములోని పరిశుద్ధులు, ఈ లోకపరిశుద్ధులతో సహవాసముచేయుట సుళువే. పరలోక పరిశుద్ధులతో సహవాసము చేయవలెనని మేము బోధించుచున్నాము. వారు మన ప్రార్ధనలోనికి వస్తారుకదా! రూపాంతర పర్వతము మీదికి మోషే, ఏలీయాలు వచ్చిరి అను సంగతియు, ప్రభువు మరణ దినమున పరిశుద్ధులు వచ్చినారను సంగతియు, ఆరోహణ దినమున యిద్దరు మనుష్యులు వచ్చినారను సంగతియు, ఈ సందర్భమున వివరించుచున్నాము.               మత్తయి 17:1-4; 27:52,53; అ.కా.1: 10-11.



                                        దైవ వాక్యము

   బైబిలు గ్రంధము దైవావేశముచేత వ్రాయబడిన గంధము. క్రైస్తవ మతమునకు మూలగ్రంధము. దేవుని మనస్సును చూపించునట్టి గ్రంధము ఈగ్రంధములో వ్రాయబడిన కృపావరములన్నియు అన్ని కాలములందును, దేవుడు తన కిష్టమైనవారికి అనుగ్రహించును. సృష్టిద్వారా, మనస్సాక్షిద్వారా, దైవప్రత్యక్షతద్వారా, ఉపకారములద్వారా, కష్టములద్వారా, కొన్నివిషయములు బైలుపరచవచ్చును కాని అన్నిటికంటె బైబిలు వ్రాతవాక్యము మానవమాత్రులమైన మన కండ్లకు అన్నియు కనబరచును. గనుక బహు విశ్వాసనీయము, మనము వాక్యము చూపించునపుడు సైతాను నోరుపడిపోవును. అందుచేతనే యేసు ప్రభువు వ్రాయబడియున్నదని ముమ్మారుచెప్పి సైతానును తోలివేసెను. కీర్తన 119:72; మత్తయి 4అ హెబ్రి 4:12;11:3. 

                                               కనిపెట్టుట

  ప్రతివారును రోజు ప్రార్ధనలో అధమపక్షము ఒక గంట కనిపెట్టు వాడుక కలదు. ఒక అంశమును గురించి ప్రార్ధించి ముగించిన వెంటనే వెళ్ళిపోక అక్కడనే కొంత సేపు కనిపెట్టిన యెడల ప్రభువు మన మనసులో జవాబు తోచునట్లు చేయును. కనిపెట్టు గంట అనే చిన్న పుస్తకమును చదువండి. కీర్తన 37:7. 

                                              దైవ సన్నిధి

 1. వీలైనసమయము, స్థలము, చూచుకొని ఉదరశుద్ధి హృదయశుద్ధి, దేహశుద్ధి, వస్త్రశుద్ధి కలిగిన 7 గురు ప్రతిదినము కూడుకొని కీర్తనపాడి, వాక్యమును వరుసగా చదివి ప్రార్ధనమెట్ల ప్రకారము కార్యక్రమమును జరిగించి పిదప యిష్టము వచ్చిన ప్రశ్నలనువేసి జవాబు కొరకు కనిపెట్టిన ప్రభువు కనబడి మాట్లాడును. ఉత్తరమిచ్చును.

   ||.  1. ఒకసారి ఆయన కనబడి మాట్లాడును. 2. మరియొకసారి దేవదూతలను పంపును. 3. ఇంకొకసారి మోక్షలోక పరిశుద్ధుల ఆత్మలను పంపును. 4. వేరొకసారి భూలోకభక్తుల ఆత్మలను పంపును. 5. తరువాత భూలోకములోని భక్తిహీనుల ఆత్మలను పంపును. 6. అటుపిమ్మట భక్తిహీనుల మృతుల ఆత్మలను పంపును. 7. కోరిన వాటిని, కోరినవారిని పంపును. వారందరు కనబడి మాట్లాడి ప్రత్యుత్తర మిత్తురు. 8. పిదప ఒక భూతమునుకూడ రానిచ్చును. ఆ భూతము పారిపోగా ఆయనవచ్చి ఆ భూతము చెప్పిన మాటలు నమ్మకుడి. వాడి మాటలకు వెరువకుడని చెప్పి ఆదరించును.

  |||   ఎంత గొప్పవంశమునందు జన్మించినను, ఎంత ఆరోగ్యము, ధనము, ఉద్యోగము, విద్య, పేరు, బంధుత్వము సంపాదించినను దైవ సన్నిధి ధ్యానముతో సాటియగునా? ధ్యాన విద్య వలన తక్కినవాటన్నిటికి, రాణింపు, సహాయము కలుగును.

  నిర్గమ 33:14,15. కీర్తన 16:11; 31: 20; 32:7, జెఫన్యా 1:7. అ.కా. 9:27. ఎఫెసి 3:3. అ.కా. 10:3, 4. మత్తయి 17:3. అ.కా. 9:12; 16:9, 10; యాకోబు 4:7. 

                                                 విశ్వాస జీవితము

  రక్షణ ఒక్క క్రీస్తుప్రభువువల్లనే దొరుకును. అని నమ్ముట విశ్వాసజీవితమై యున్నది. మరియు పోషణకూడ యేసుప్రభువువల్లనే కలుగును అని నమ్ముటయు విశ్వాసజీవితమైయున్నది. అనగా శరీర ఆత్మీయజీవితములకు కావలసినవన్నియు పరిపూర్ణముగా దొరుకునని నమ్ముటయే విశ్వాసమైయున్నది. బైబిలుమిషనువారు పోషణవిషయమై మిషనులనుగాని, మనుష్యులనుగాని అడుగకయే పొందుచున్నారు. దేవుడు సమయోచితముగా ఏవరిద్వారానైన ఒకరిద్వారా సహాయము పంపుచున్నారు. దేవునికి స్తోత్రములు. బైబిలుమిషను ప్రభువు దర్శనములో కనబడి, స్వయముగా మాట్లాడే మిషనైయున్నది. మత్తయి 10:10, ఫిలిప్పి 4:19. 1 తిమోతి 6:17.

                                                    పెండ్లి కుమార్తె

  రక్షింపబడినవారందరును యీ సంఘములోనివారు కారు. కాని హృదయస్థితినిబట్టి ప్రభువు ఏర్పర్చుకొనువారు ఈ పెండ్లి కుమార్తె సంఘస్థులు, మరియు వీరిలో ఎవరు ప్రభువు వచ్చు వరకు ఉందురో వారు   సజీవముతో ఎత్తబడుదురు. ఎవరు ప్రభువుయొక్క రాకడను నమ్మి సిద్ధపడుదురో వారు మహిమ శరీరధారులై ప్రభువు వచ్చునప్పుడు ఆయనతో మేఘమెక్కి వెళ్ళుదురు. క్రీస్తునందలి మృతులును లేచి వత్తురు. ఆ గుంపు, యీ గుంపు కలసి పెండ్లికుమార్తె అనబడును. ప్రకటన 22:21, హెబ్రి 12:23.

                                                     నగలు

     నగలు ధరించుకొనవచ్చునని ఒకచోటను, తీసివేయవలెనని ఒకచోటను, బైబిలులో వ్రాయబడియున్నది.గనుక సందర్భానుసారముగా ఈ రెంటిని అనుసరింపవచ్చును, నీ చెయ్యి ఆటంకముగా నున్న యెడల నరికివేయుమని ప్రభువు చెప్పెను. గనుక నీకు ఆటంకముగానున్న వాటిని తీసివేయవచ్చును, నూతన యెరూషలేములోని పెండ్లికుమార్తె ఆభరణములతో నుండును. అవి మహిమాభరణములు, పెండ్లికుమార్తె ఇప్పుడు భూమి మీదనున్నది. భూమి మీద నున్న పెండ్లికుమార్తెకు నగలు నిషేధములు కావు. అనాగరికమైన నగలు మర్యాదను చెడగొట్టును. నీ ఆస్థిని అమ్మి పేదలకిమ్మని ప్రభువు ఒక ధనికునితో చెప్పెను. ఆ మాట మంచిసమరయుని కథ విన్న శాస్త్రితో చెప్పలేదు. నగలు పైయాచారమునకు సంబంధించినవి. ఆది 24:53 నిర్గమ 3:22. 12:35 1పేతురు 3:3. మార్కు 9;43-47.

       క్రీస్తు ప్రభువు రెండవ రాకడ - ప్రభువు రెండవసారి రావలసిన రాకడముందు జరుగవలసిన గురుతులన్నియు జరిగిపోయినని, గనుక ఆయన మన కాలమందే త్వరగా వచ్చునని మేము నమ్ముచున్నాము. ఆయన యెప్పుడు వచ్చినను త్వరగా వచ్చునని నమ్ముటలో హానిలేదు గదా! [నమ్మకపోవుట వలన హాని ఉన్నది.] క్రీస్తు వారి జీవితములోని జన్మమును, సిలువ మరణ, పునరుత్థాన, ఆరోహణములను నమ్మి కడవరి అంశమగు రాకడను నమ్మని యెడల ఏమి ప్రయోజనము? 1థెస్సలో 4:13-18. మత్తయి 24 అ. మార్కు 13అ. లూకా 21అ.

       ఏడేండ్ల శ్రమకాలము - విశ్వాసుల సంఘము [పెండ్లి కుమార్తె] వెళ్ళిపోయిన తరువాత భూమి మీద మిగిలియున్న వారికి ఏడేండ్లు శ్రమ. అంతి క్రీస్తు అను క్రీస్తు విరోధివల్ల కలుగును. ఆ సమయమందు చాలమంది మారుమనసు పొందుదురు. ప్రకటన 6అ 1-18అ|| వరకు, మార్కు 13:19. జెఫన్యా 1:14-18 ప్రకటన 6:17.           ఏడేండ్ల శ్రమకాలము - విశ్వాసుల సంఘము [పెండ్లి కుమార్తె] వెళ్ళిపోయిన తరువాత భూమి మీద మిగిలియున్న వారికి ఏడేండ్లు శ్రమ. అంతి క్రీస్తు అను క్రీస్తు విరోధివల్ల కలుగును. ఆ సమయమందు చాలమంది మారుమనసు పొందుదురు. ప్రకటన 6అ 1-18అ|| వరకు, మార్కు 13:19. జెఫన్యా 1:14-18 ప్రకటన 6:17.     

                           హర్మె గెద్దోను యుద్ధము

   క్రీస్తు ప్రభువు పరలోకమునుండి వచ్చి అంతి క్రీస్తుతో హర్మె గెద్దోను నొద్ద యుద్ధము చేసి, అతనిని, అతని సహాయకుడగు అబద్దప్రవక్తను, దయ్యములను, అగ్ని గుండములో వేయును. అయితే సాతానును వెయ్యియేండ్లు చెరసాలలో బంధించును. ప్రకటన 16:12-15. 19:19-20 జకర్యా 14అ||

  వెయ్యియెండ్లు పరిపాలన - క్రీస్తుప్రభువు భూమిమీద శాంతి పరిపాలన చేయును. అప్పుడే లోకమంతటికిని, సువార్త పూర్తిగా ప్రకటింపబడును. ప్రకటన 20:4-6, 19:15, 16, 5:10.



 సజీవుల తీర్పు - వెయ్యి యేండ్లలో సువార్త విన్నవారు ఏమి తీర్మానించు కొన్నారో విని, తీర్పు విధించుటకు యేసుప్రభువు భూమి మీద సిం హాసనము  వే సుకొనును. దీనినే సజీవుల తీర్పందురు. మరియు గొర్రెమేకలను వేరుచేయు తీర్పందురు. మత్తయి 25:31-46.

 సాతాను విడుదల - ప్రభువు సైతానును విడుదల చేయగా, అతడు భూమిమీదికి వచ్చి అనేకులను సైన్యముగా ప్రోగుచేసుకొని యుద్ధమునకు వెళ్ళును. ఆ సైన్యమును ఆకాశ అగ్ని దహించును. అప్పుడు ప్రభు సైతానును అగ్ని గుండములో వేయును. ప్రకటన 20:7-10.

 అంత్య తీర్పు - ఆదాము మొదలుకొని అప్పటివరకు సమాదులలో ఉండి, మారుమనసు పొందని వారందరు యీ తీర్పులోనికి వచ్చెదరు. అప్పుడే కొందరు ప్రభువా నీ నామమున మేము ప్రవచింపలేదా? అని అడుగుదురు. ప్రకటన 20:11-15. ప్రసంగి 12:14 దానియేలు 2:27-29.    

   పరదైసు ___ క్రీస్తునందు మృతులైన వారి ఆత్మలు పరదైసునకు వెళ్ళును. ఇది మోఖములోనిదే! నేడు నీవు నాతోకూడ పరదైసులో నుందువు అని ప్రభువు ఒక నేరస్థునితో చెప్పినది పరదైసే? ప్రభువు వలెనే శిష్యులు హెడెస్సులో బోధింతురు. లూకా 16:22,23:43 2 కొరింధి 12:4 ప్రకటన 2:7.

   హేడెస్సు ___ ఇది పాతాళ లోకములోనున్న ఒక లోకము, మారుమనస్సు పొందని మనుష్యుల ఆత్మలు ఉండును. యెసుప్రభువు యిక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించునట్లు పేతురు వ్రాయుచున్నాడు. దేవుడు సర్వశక్తి గలవాడు గనుక మారుమనసు పొందనివారిని జీవాంతమందైనను రక్షింపగలడు. నేను పాతాళమునకు పోయినను, నీవు అక్కడికి వచ్చి పట్టుకొందువు అని దావీదు కీర్తన 139:8లో నున్నది. సాధుసుందరసింగుగారు వ్రాసిన పరలోక దర్శనములను పుస్తకములో ఈ సంగతి తెలిసికొనవచ్చును. కీర్తన 9:17, 139:8. ఆమోసు 9:2-1సమూ 2:6 1పేతురు 3:20, 4:6 ఫిలిప్పి 2:9-11. యెషయా 13:14.

    పరలోక ప్రార్ధన కూటము __ ఇక్కడ భూలోకము నిమిత్తమై ప్రార్ధనలు చేయబడును. ఈ ప్రార్ధన కూటముయొక్క సంగతి మిక్కిలి వినోదకరమైనది. ప్రకటన 4:6, యెషయా 6:3. యెహెజ్కేలు 1అ.

 నూతన యెరూషలేము___ఇది పెండ్లికుమార్తె వరుసలోని వారి నివాస స్థలము. ప్రకటన 21:2.

 రక్షింపబడినవారి మోక్షము ఏవిశ్వాసులు పెండ్లికుమార్తె వరుసలోనికి వెళ్ళలేరో వారు మోక్షములోనే మరియొక భాగమునకు వెళ్ళగలరు. అదియే రక్షితుల మోక్షము. ప్రకటన 7:1-14,20;4.14:3

    భూలోక మోక్షము __పాత్రల కాలములోని విశ్వాసులు భూమి మీద ఎప్పుడును ఉండిపోదురు. వెయ్యేండ్ల తరువాత ఈ భూమి పరలోకములో ఒకభాగమై యుండును. ప్రకటన 21:1, 2పేతురు 3:13        భూలోక మోక్షము __పాత్రల కాలములోని విశ్వాసులు భూమి మీద ఎప్పుడును ఉండిపోదురు. వెయ్యేండ్ల తరువాత ఈ భూమి పరలోకములో ఒకభాగమై యుండును. ప్రకటన 21:1, 2పేతురు 3:13

     బైబిలుమిషను__ 1938 సం||రం జనవరి 31వ తేది రాజమండ్రిలో దేవుడు యం. దేవదాసు అయ్యగారికి గాలిమీద బైబిలుమిషను అని వ్రాసి చూపించెను. లూథరన్ మిషను విడిచి పెట్టవలెనని ప్రభువు ఆయనకు ఫిబ్రవరి నెలలో వ్రాసి చూపించెను ఒక సెన్యముయొక్క యువరాజు వలె బయటికి వచ్చి వేయుమని ప్రభువు మార్చి నెలలో వ్రాసి చూపించెను. ప్రభువుయొక్క ఆజ్ఞ చొప్పున లూథరన్ మిషనుకు రాజీనామా పెట్టిరి. గాని వారంగీకరింపలేదు. అయినను లూథరన్ మిషనులోని ప్రభుభోజన సంస్కార దినమున గుడికి వెళ్ళిరి. ఆయనను వారు బల్ల యొద్దకు రానీయలేదు. ఇది ఏప్రియల్ నెలలో జరిగినది. గుడిలో యధాస్థలమున కూర్చుండి ప్రభువా! నీవే నాకు సంస్కార భోజనము ననుగ్రహింపుమని ప్రార్ధింపగా ప్రభువే స్వయముగ అప్పుడే దర్శన మందు కనబడి రొట్టె, ద్రాక్షారసమును యిచ్చిరి. అదివరకే త్రిత్వదేవుని వలన దర్శనములో పాదిరి పనికి ఆర్డినేషను పొందియున్నారు గనుక బైబిలుమిషను పనివారికి ఆయన ఆర్డినేషను యిచ్చిరి. నేటికి బైబిలు మిషనులో అనేక మంది పాస్టర్లు, పనివారు, సభ్యులు, అభిమానులు కలరు. ఇది ఆంధ్రరాష్ట్రములోనే కాక అనేక రాష్ట్రములలోను, అనేక స్థలములలోను వ్యాపించియున్నది. బైబిలుమిషను ద్వారా అనేక పుస్తకములు, పత్రికలు, పద్యములు, కీర్తనలు ప్రచురింపబడుచున్నవి. బైబిలు మిషనులో జీతనాతాముల ఏర్పాట్లు లేకపోయినను సువార్తను ఉచితముగా ప్రకటించుచు దేవాలయములను నిర్మించుచున్నారు. ఆయా స్థలములలో మూడేసి దినములు సభలు జరిగించుచు, ఉచిత భోజన ఏర్పాట్లు చేయుచున్నారు. 1949వ సం||రం నుండి ప్రతిసోమవారము గుంటూరు వద్దనున్న పెదకాకానిలోని కీ.శే. జె. రాజారావుగారి తోటలో స్వస్థత కార్యక్రమము జరుగుచున్నది.
Please follow and like us:

How can we help?