స్తుతులు
మత్తయి 28:16-20, మార్కు 16:19,20. లూకా 24:50-53 కార్య 1:6-11.
యే సుప్రభువా! నీకు పరలోకమందు సర్వాధికార మీయబడెను అందుచేత నీకనేక వందనములు. యేసుప్రభువా నీకు భూమిమీద సర్వాధికార మీయబడెను. అందుచేత నీ కనేక స్తోత్రములు యేసుప్రభువా! నీవు పరలోకమునకు వెళ్ళకముందు ఒక వాగ్ధానము ఇచ్చినావు. అదియేదంటే "ఇదిగో. నేను యుగసమాప్తి పర్యంతము సదాకాలము మీతోకూడ ఉన్నాను" ఈ మాటనిమిత్తమై నీ కనేక స్తుతులు సమర్పించుచున్నాము. ప్రభువా! నీకు పునరుత్థానమైన తరువాత నీవు పరలోకమునకు చేర్చుకొనబడినావు అని వ్రాయబడియున్నది కాబట్టి నీ కనేక స్తుతులు. ప్రభువా! నీవు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడవై యున్నావని వ్రాయబడి యున్నది. గనుక నీ కనేక నమస్కారములు.
యేసుప్రభువా నీవు పరలోకమునకు వెళ్ళినప్పటికిని, భూలోకములోనున్న నీ శిష్యులకు సహకారుడవై యున్నావని వ్రాయబడి యున్నది గనుక నీకనేక గౌరవస్తోత్రములు. ప్రభువా! భూమిమీద నీ శిష్యులద్వారా జరుగుచువచ్చిన నీసూచక క్రియలవలన వాక్యము నీవు స్థిరపరచుచున్నావు అని వ్రాయబడియున్నది. గనుక నీ కనేక వందనీయ స్తోత్రములు.
ప్రభువా! నీవు ఆరి ఆశీర్వదించినావని వ్రాయబడియున్నది. కాబట్టి నీకనేక కృతజ్ఞతాస్తోత్రములు. యేసుప్రభువా! నీవు పరలోకమునకు ఆరోహణమైనావని వ్రాయబడి యున్నది గనుక చాల వందనములు. యేసుప్రభువా! నీవు నీ శిష్యులను ఆశీర్వదించుచుండగా ఆరోహణుడవైనావని వ్రాయబడియున్నది. గనుక నీకనేక వందనాలు, యేసుప్రభువా! ఆరోహణ సమయమందు నీ శిష్యులు నీకు నమస్కారము చేసిరి. అంత్య దినము వరకు ఉండే నీ శిష్యులవల్ల నీకు నమస్కారములు కలుగుచుండునుగాక! యేసుప్రభువా! నీవు వెళ్ళినందుకు వారు దఃఖించక మహానందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరిగనుక నీకు వందనములు. యేసుప్రభువా! నీవు వెళ్ళిన తరువాత వారు దేవాలయమునకు వెళ్ళి యెడతెగక దేవుని స్తోత్రము చేయుచుండిరి. గనుక నీకు వందనములు. ఆమెన్.
Please follow and like us: