(ప్రతి సంవత్సరము ఫిబ్రవరి నెలలో ఈ పండుగను ఆచరింతుము.)
ఆది 4:1-7, 14:20; 28:22, లేవి 27:30-33 ద్వితియో 14:22-29. 16:17 సంఖ్య 18:21; 25:26. 2దిన 31:5;10. 1దిన. 29:9. సామె. 3:9-10. 19:17. మలాకీ 3:8-10. నెహెమ్యా. 10:37. మత్తయి.2:11 , 5:20. లూకా. 21:1-4 యోబు 41:11. కార్య 11:29; 20:35. రోమా 15:26. 1కొరింధి 16:1-2. 2కొరింధి 8 అధ్యా. 9:5-8; 12-14 గలతి 6:6, ఫిలిప్పి. 4:18-19. 1తిమోతి. 6:19. హెబ్రి 7:1-5:13:14-17.
దేవుడిచ్చెను, మనము ఆయన సేవకు కృతజ్ఞత కానుక యియ్యవలెను. దేవుడిచ్చెను. మనము బీదల కియ్యవలెను. దేవుడిచ్చెను. మనము రోగుల కియ్యవలెను. దేవుడిచ్చెను. మనము అక్కర కనబడినప్పుడు ధనికులకు సహితము ఇయ్యవలెను. మనము ధర్మకార్యములన్నింటికిని యియ్యవలెను. దేవుడు నిత్యము యిచ్చువాడై యున్నాడు. గనుక మనమును నిత్యము యిచ్చువారమై యుండవలెను. ధన్యతయైనను, ధన సంపాదన యైనను, ఐశ్వర్యమైనను, దేవుని మెప్పైనను, మనసానందమైనను, ఇందులోనే కనబడును.
దానకర్తవైన తండ్రీ! నీవు మాకు ఎండ, వెన్నల, వర్షము, గాలి, నేల, వృక్షములు, జీవరాసులను మాకు దానములుగా నిచ్చిన నీకు స్తుతులు. కృపగల తండ్రీ దూతలను, బైబిలును, సంఘమును, ఇవియు నీ దానములే. గనుక నీకు వందనములు. తండ్రీ, క్రిస్మసు నాడు కుమార దానము. మంచి శుక్రవారమునాడు కుమారుని ప్రాణ దానము పెంతెకొస్తునాడు దైవాత్మ దానమును, మాకు దయచేసిన నీకు మా హృదయపూర్వక వందనములు.
తండ్రీ మేమిచ్చు కానుకలు నీవిచ్చు దానముల ఎదుట ఏ మూల? మేము కృతజ్ఞతతో మాహృదయమును నింపుకొనుటయే మేమిచ్చు కానుకల కంటె గొప్ప కానుక. గనుక యీ గొప్ప కానుకయైన కృతజ్ఞత నీకు చెల్లించుచున్నాము. మా స్తోత్రములు క్రీస్తు నామమున అంగీకరించుము. ఆమెన్.
ప్రార్ధన:- జాలిగల తండ్రీ! నీవు మాకు యిచ్చున్నట్లు మేము నీకును, రోగులకును, పేదలకును, సమస్త ధర్మ కార్యములకును యిచ్చునట్లు దీవించుము. నీవు సర్వదా యిచ్చుచున్నట్లు మేమును ఎప్పుడును యిచ్చు దానములను, ధర్మ గుణమును దయచేయుమని త్వరగా వచ్చుచున్న యేసు నామమున వేడుకొనుచున్నాము.
Please follow and like us: