సంఘారాధనలు

⌘K
  1. Home
  2. Docs
  3. సంఘారాధనలు...
  4. 14. కాలోచిత ప్రార్ధనలు...
  5. పెంతెకొస్తను పండుగ

పెంతెకొస్తను పండుగ

(పరిశుద్ధాత్మ తండ్రికి స్తుతి ప్రార్ధన)

    పరిశుద్ధాత్మవైన దేవా! నీవు దేవుడవు. గనుక నీకు వందనములు. పరిశుద్ధాత్మవైన తండ్రీ! నీవు తండ్రివి గనుక వందనములు చేయుచున్నాను. ఓ తండ్రీ! సృష్టికాలమందు నీవు సృష్టిని కాపాడుటకై సృష్టిమీద ఉన్నావు. నీకనేక వందనములు ఆచరించుచున్నాను. తల్లి కోడిరెక్కలక్రింద పిల్లలను దాచి కాపాడు రీతిగా నీవు నాకు ఏ కీడును రాకుండ కాపాడుదువని నీకు వందనములు చెల్లించుచున్నాను. నీవెంతదేవుడవైనను నాలో నివసించుటకు పూనుకొని యున్నావు. గనుక నిన్ను వందించుచున్నాను.

   పై నుండి మనమీద ఆత్మ కుమ్మరింపబడువరకు నగరి విడువబడును. జన సమూహములుగల పట్టణము విడువబడును. కొండయు కాపరుల గోపురమును,గుహలుగానుండును. అవి అడివిగాడిదలగు ఇష్టమైన చోట్లుగాను, మందలు మేయు భూమిగాను నుండును. అని యెషయా చేత నీవు వ్రాయించినావు. కాబట్టి నీకు స్తుతులు. ప్రభువా! నీ కుమ్మరింపు లేనియెడల నేను పాడైపోయిన భూమివలె నుందునని యీ వచనము వలన తెలిసికొనుచున్నాను.ఆదరణకర్తవైన తండ్రీ! పెంతెకొస్తు పండుగనాడు నూట యిరువది మంది ఆత్మతో నిండుకొన్న వారైనారు. గనుక నీకు స్తుతులు చేయుచున్నాను. నేను కూడ నీతో నిండినవాడనై యుండగోరుచున్నాను. కృప దయచేయుదువని నమ్మి స్తుతులు ఆచరించుచున్నాను. ఓ ఆత్మతండ్రీ! గాలివంటి ధ్వని ఇల్లంతయు వ్యాపించిన రీతిగానే నీవు నా జీవితమంతట వ్యాపించుమని ప్రార్ధించుచు అట్లు చేయుదువని నమ్మి నీకు స్తుతులు సమర్పించుచున్నాను.  విశ్వాసుల హృదయములలో వ్యాపించనున్న తండ్రీ! నాలోను వ్యాపించుతండ్రీ! పూర్వ ప్రవక్తలలోను, అపొస్తలులతోను, ఉండి వారిచేత పనిచేయించిన ప్రకారముగా నా చేతకూడ పని చేయించుమని ప్రాధించుచు నీకు స్తుతులు చెల్లించుచున్నాను.

   నా తలంపులోను, మాటలలోను, చూపులలోను, తినుటలోను, ఆచారములోను ప్రయత్నములలోను, కార్యాలలోను, సేవలలోను, కష్టకాలములోను, సౌఖ్యకాలములోను, నా బ్రతుకు కాలమంతటిలోను, నీవు వ్యాపించుచున్న యెడల నా ధన్యత యేమని చెప్పెను? నీ కనేక స్తోత్రములు, ప్రియమైన నా తండ్రీ! నీవు నాలో లేనియెడల ప్రభువు యేసు సంపాదించిన రక్షణ భాగ్యమును అందుకొనలేను. అందుకొన్నను నిలుపుకొనలేను. పొందినది వాడుకొనలేను. గనుక అందుకొని, నిలుపుకొని, వాడుకొనునట్లు నీవు సర్వములో వ్యాపించి యుండుము.  

ఇది నాకోరిక. ఇది నా వాక్కు. ఇది నా విశ్వాసము.నెరవేర్చగల తండ్రీ! నేనెంత మంచితనము కలిగియున్నను దానిలో నీవు లేకపోయిన యెడల దానికి జీవమే లేదు. గనుక నాలో ఎప్పుడును, చురుకు దనము కలిగి పనిచేయు జీవముండునట్లు నీవు నాలోవ్యాపించియుండుము. ఈ నీ పని నిమిత్తమై నా అంతరంగమంతటను నీకు స్తోత్రములు స్తోత్రములు, స్తోత్రములు. ఆమెన్.

                పరిశుద్ధాత్మ బాప్తీస్మమును గూర్చిన ప్రవచనములు

  యెషయా 32:14-17. యెహెజ్కేలు 39:29. యోవేలు 2:28-29 జెకర్యా 12:10.

  మత్తయి 3:11 మార్కు 1:8 లూకా 3:16 కార్యములు 1:4-5

                                          పరిశుద్ధాత్మ పనులు

   యోహాను 14:17;14:25,26;17:13.

                                       పరిశుద్ధాత్మ బిరుదులు

   హెబ్రి 9:14. కీర్తన 130:7-13  1కొరింధి 2:10 లూకా 1:35. రోమా 15:19. 1పేతురు 4;14. యోహాను 3:5-6. 1యోహాను 5:4. 2తిమోతి 3:16. 2 పేతురు 2:21 యెషయా 11:2. యోహాను 14:26. 1కొరింధి 12:8, యోహాను 16:13 మత్తయి 12:28. లూకా11:20. కార్య 20:28. కార్య 16:6, 7:10. యోహాను 14:17. 1కొరింధి 14:25, 3:16, 6:19. కార్య 9:31 2కొరిధి 1:3 యెహెజ్కేలు 37:28. రోమా 15:16. హెబ్రి 10:15. 1యోహాను 5;9. యోహాను 16:8-11; 15:26; 14:16, యోహాను 14:17, 14:26.5:3-5. గలతి 5-22, 1థెస్సలొ 1:6. రోమా 15:13. గలతి 5:5. యోబు 33:4 కార్య 1:16 1పేతురు 1:11-12,2 పేతురు 1-21.
Please follow and like us:

How can we help?