క్రీస్తు శ్రమల ప్రవచనములు-వాటి నెరవేర్పులు
ప్రవచనము నెరవేర్పు
- యూదులు అన్యులు ఆయనను యోహాను 1:10,11 అన్న- కయప – నిరాకరాకరించుట కీర్తనన 2:1; యూదులు- హేరోదు, పిలాతు- అన్యులు. 22: 12; 41:5; 56:5; 69:8; 118:22-23 యెషయా 6:9-10; 8:14; 29:13; 49:7; 53:3; 65:2.
- ప్రభువును బాధించువారు కీర్తన 22:6; మత్తయి 26:3; మార్కు14:1, లూకా 22:1. 35:7; 12; 56:5;71:10; 109:2.
- యెరూషలేము ప్రవేశించుట కీర్తన 8:2; మత్తయి 21:1-11; మార్కు 11:1-11; 118: 26; జెకర్యా 9:9, లూకా 19: 29-44, యోహాను 12: 12-19.
- గెత్సెమనెకీర్తన 22:14-15 మత్తయి 26:36-39. మార్కు 14:3-36
లూకా 22: 42,44
- స్నేహితుని వలన అప్పగింపబడుట మత్తయి 26:49; మార్కు 14:45; లూకా 22:47; కీర్తన 41:9;51:2-14. యోహాను 18:3.
- శిష్యులచే విడిచి పెట్టబడుట. మత్తయి 26:31.56. జెఖర్యా 13:7.
- ముప్పది నాణెముల విలువ. మత్తయి 26:15,మార్కు 14: 10,11; జెఖర్యా 11:12. లూకా 22:5.
- కుమ్మరివారి పొలము కొనుట మత్తయి 27:7. జెఖర్యా 11:13.
- యూదా ఇస్కరియోతు మరణము మత్తయి 27:8-10,కార్య 1:18,19. కీర్తన 55:15, 23; 109:17.
- మనకు బదులు ఆయనకు శ్రమ, మత్తయి 20:28. యెషయా53 : 4,6,12, దానియేలు 9:26.
- అబద్దసాక్ష్యములు చెప్పుట మత్తయి 26:59,60; కీర్తన 27:12; 35:11; 109:2. మార్కు14;55-60 లూకా23:1,2.
- ఆయన నోరు తెరవకుండుట. మత్తయి 26:62; 27:12-14; కీర్తన 38:13; యెషయా 53:7. మార్కు 14:60; 15:4-5.
- ఆయనను కర్రతో కొట్టుట మీకా 5:1 మత్తయి 27;30, మార్కు 15:19
- అవమానించుట, గుద్దుట, మత్తయి 26:67; 27;26;30,31. కొట్టుట,ఉమియుట, కీర్తన మార్కు 14:65.లూకా 22:62-65; 35:15.21; యెషయా 50:6 యోహాను 19:1-3.
- అపహరించుట. కీర్తన మత్తయి 27:39-44 మార్కు 22:7,8,16;109:25. 15:1.29-32. లుకా 23;35-38.
- ఆయనను పొడుచుట, లూకా 23;33, యోహాను 19;18 (సిలువ) గాయములు కీర్తన 22:16. జెఖర్యా 3;6.
- సిలువ మీద 1వ మాట లూకా 23:34. శత్రువుల కొరకు ప్రార్ధన, విజ్ఞాపన. కీర్తన 109:4; యెషయా 53:12.
- 4వ మాట నా దేవా నా దేవా. మత్తయి 27:46, మార్కు 15:34, కీర్తన 22:1.
- 7వ మాట ఆత్మను అప్పగించుట లూకా: 23:46.
కీర్తన 31:5.
- చేదుచిరక ఇచ్చుట మత్తయి 27:34,మార్కు 15:23, కిర్ర్తన 69:21. లూకా 23:37 యోహాను 19:29.
- నేరస్తులలో ఒకడుగా ఎంచ మత్తయి 27:38. మార్కు 15:27 బడుట, యెషయా 53:12. లూకా 23:33, యోహాను 19:18.
- వస్త్రము కొరకు చీట్లు. మత్తయి 27:35.మార్కు 15:24. కీర్తన 22:18. లూకా 23:34, యోహాను 19:23,24.
- యౌవనములో మరణము. 33 1/2సం. అప్పుడు చనిపోయెను. కీర్తన 89:45; 102:24
- ఇష్టపూర్వకమైన మరణము మత్తయి 26:47-56, కీర్తన 40:8. యోహాను 18:1-11.
- ఎముకలు విరువబడవు. యోహాను 19: 33-36. నిర్గమ 12:46; కీర్తన 34:20.
- ధనికులతో పాతిపెట్టుట. మత్తయి 27:57-60, మార్కు
యెషయా 53:3. 15:42-46. లూకా 23:50-53
యోహాను 19;38-41.
Worship
మత్తయి 26:36-75. 27 అ|| మార్కు 14:32-72. 15అ|| లూకా 22:39-71; 23అ|| యోహాను 18,19.అ||
1. ప్రభువా; తోటలో నీవు "ఈగిన్నె నాయొద్దనుండి తొలగిపోనిమ్ము" అని ప్రార్ధించినావు. మా పాపముల వలననే నీకు ఎంతో బాధ కలుగబట్టి శ్రమతొలుగకపోయినను ప్రార్ధించినావు. సహించినావు. గనుక నీకు మా నమస్కారములు. 2. మాపాపములవలననే నీకు అంతరంగములో శ్రమ. మనసులో శ్రమ, శరీరములో శ్రమ, గనుకనే నీ రక్తము చెమటగా వచ్చినది. నా నిమిత్తము ఇట్టి గొప్ప శ్రమ అనుభవించినావు గనుక నీకు స్తోత్రములు. 3. యూదా నిన్ను ముద్దుపెట్టుకొని అప్పగించెను. ఇది నీకు గొప్ప విచారము. అయినను నీవు అతనిని శపింపలేదు. ఈలాగు శత్రువులను క్షమించుటకు మాకు మాదిరి నేర్పిన ప్రభువా నీకు పరిశుద్ధ నుతులు. 4. పేతురు చెవినరకుట పిశాచి పని అట్లుచేసిన పేతురునకు కత్తిని గూర్చిన బోధచేసి, పేతురును క్షమించి, మల్కుని స్వస్థపరచి లోకమునకు శాంతి బోధ చేసిన ప్రభువా నీకు నిత్యజీవ స్తుతులు. 5. నీ శిష్యులలో ఒక యోహాను తప్ప తలగా నున్న పేతురును, పాదముగానున్న యూదా ఇస్కరియోతును, తప్పిపోవుట మాత్రమేగాక అందరును పారిపోయిరి. ఇది నీకెంతవిచారము? ఐనను నీవు వారిపై కోపించలేదు. మరియు ఇట్లే విశ్వాసులు కూడ శ్రమలలో ఆదరించు స్నేహితులులేక యుందురనియు, మాకు బోధ, చేసిన ప్రభువా నీకు ప్రణుతులు. 6. ముద్దాయి వలె నీ చేతులు వెనుకకు కట్టి నిన్ను యెరూషలేము వీధులలో నడిపించినవారు. ఇది నీకెంత అవమానము? మా పాపములను బట్టి వచ్చిన ఈ యవమానమును భరించి పరలోకములో మేము ముద్దాయిలము కాకుండ చేసిన దేవా! నీకు సాష్టాంగ నమస్కారములు. 7. నేరస్తులమైన మేము, ఆ ప్రజలు ఆ ప్రధాన యాజకులును, రేపు పరలోకములో నీ యెదుట నేరస్తులవలె నిలువబడకుండ చేయుటకై నేరములేని నీవు నేరస్థునివలె ప్రధాన యాజకుల యెదుట నిలువబడిన ప్రభువా నిన్ను మేమెట్లు స్తుతించగలము? గనుక నీకే హృదయ పూర్వక వందనములు అర్పించుచున్నాము. 8. నీముఖముపై ముసుకు వేసిరి. ఎందుకనగా, పాపము చేయు మేము నీ ముఖమునకు మరుగా లేమనియు, నీ కన్ను మమ్మును చూచుచున్నదను విషయమును మా మనోనేత్రములకు చూపిన ప్రభువా! నీకు మంగళ స్తోత్రములు. 9. కొరడాలతో నిన్ను కొట్టినప్పుడు నీ శరీరమంతయు, రక్తశిక్త మాయెను. మా రక్తాపరాధమునకు నీకు శిక్ష. మాకురక్ష నీకు శిక్ష. మారక్తాపపరాధమునకు మమ్మునుకొట్టవలసినది. మా రక్తము చిందింప వలసినది. కాని నీ రక్తము మాకు బదులు చిందించిన ప్రభువా నీకు నిత్య సంస్తుతులు. 10. పిలాతు కోర్టులో నీయందేమి నేరము కనబడలేదను మాట వినబడినను గవర్నమెంటుకు పన్నియ్య వద్దని బోధించు చున్నాడనియు, ప్రజలను తిరుగుబాటు చేయించుచున్నాడనియు, లేనిపోని నేరములు నీపై పడుటను బట్టియు నిన్ను అనుసరించువారు నిర్ధోషులైనను, వారిపై లోకముచే లేనిపోని నేరములు వేయబడునను జ్ఞానకాంతి మా కనుగ్రహించిన ప్రభువా? మా జ్ఞానమునకు తోచినన్ని స్తుతులు. 11. మానవులు నొకరినొకరు హేళన చేసికొనుట దేవుని హేళన చేయుటయే అను విషయమును మాకు తెలియుటకే నీవు అయిదు కోర్టులలోను హేళన పొందిన ప్రభువా; నీకు మా కృతజ్ఞతార్పణలు. 12. నీలో ఏ నేరమును లేదని పిలాతునకు తెలిసినను, యూదులకును, రోమా వారికిని భయపడి నిన్ను సిలువకు అప్పగించినట్లు మేమును, నిన్ను ఒప్పుకొనుటకు పిరికివారముగా నుండుమను మా నేరమును భరించిన ప్రభువా! నీకు మా వినయ ప్రణుతులు.
13. రాబోవు తీర్పు మాకు లేకుండ చేయుటకు పిలాతు చేతులలో అన్యాయపు తీర్పును పొందిన ప్రభువా! నీకు అనంతకాలస్తుతి.
14. నీ స్వజనులగు యూదులవలన, నీవు నిలువగా వచ్చి పారిపోయిన విశ్వాసులవలన, నిన్ను విడిపింపవలసిన రోమా ప్రభుత్వపువారైన పర జనుల వలన నీకు సిలువ. నిన్ను సిలువ వేసిన పై గుంపులలో మేము లేకుండునట్లును, నీ శ్రమ తగ్గించినవారి గుంపులో నుండగలుగునట్లును, నీ దీవెన మా కనుగ్రహింతువని నమ్మి ప్రభువా! నిన్ను ఘనపరచుచు, వందించుచున్నాము.
- మేము పది ఆజ్ఞలకు విరోధముగా చేసిన పాపములన్నియు నీమీద సిలువగా నెత్తబడెను. అందరిపాపములు కలసి ఒక భారమైన సిలువగా నీపై బడెను. మేము గ్రహింపలేనంత భారమైన సిలువ మా రక్షణ నిమిత్తము మోపిన ప్రభువా! నీకు మా మనసు సమర్పింప గలిగినన్ని నుతులు.
- లోకములో ఎవరును నీకన్న ఎక్కువ శ్రమను పొందలేరు. ఎవరైనను శ్రమను పొందిన యెడల తమ ఒక్కరికొరకే పొందగలరు. గాని నీవలె గతించినవారి నిమిత్తమును, ఉన్నవారి నిమిత్తమును, రాబోవువారి నిమిత్తమును, అనగా అన్నికాలములలో గల ప్రజలందరి నిమిత్తమును శ్రమపొందలేరు. చరిత్రలో ఎక్కడనులేని ఇట్టి గొప్ప శ్రమ చరిత్ర మాకొరకు పొందిన ప్రభువా నీకు మంగళ హారతులు.
- మా చెడుగును నీపై వేసికొని, సిలువను భరించి సిలువ దగ్గర విశ్వాసికి హాయినిచ్చిన ప్రభువా! నీకు మా ఆనందస్తోత్రములు.
- కొట్టి, ముండ్లకిరీటముబెట్టి కల్వరికొండపైనున్న సిలువపై పరుండబెట్టి నీ చేతులలోను, కాళ్ళలోను, మేకులుకొట్టి నీ శరీరమంతటిని బాధించుటచూడగా, నాచేతులతోను, పాదములతోను,శరీరమంతటితోను చేసిన పాపమునకు శిక్ష భరించిన ప్రభువా! నా ప్రాణముతోను, ఆత్మతోను, శరీరముతోను నిన్ను స్తుతించుచున్నాము.
- సిలువకు అంటగొట్టినబాధ, ఆ సిలువనెత్తి గోతిలో నిలువబెట్టినప్పుడు బాధ, మేకులు ఆయనను లాగిపట్టినప్పుడు బాధ, తలపై ముండ్లకిరీటము కదలుటవలన బాధ, వీటన్నిటిని నన్ను ఎక్కువగా ప్రేమించుటనుబట్టి సంతోషముతో భరించిన నా ప్రభువా! నీ ఋణమును నేనెట్లు తీర్చుకొనగలను? గనుక నా వందననార్పణలను నీకు చెల్లించుచున్నాను. 20.ప్రక్కలో బళ్ళెపుపోటువలన రక్తముకార్చి సాతానుప్రక్కను దాని సహవాసములో నున్నవారిని నీ ప్రక్కకు, నీ సహవాసమునకు ఆహ్వానించి విశ్వాసికి ఎంతో సంతోషము కలిగించిన ప్రభువా! నీకు నిత్య మంగళస్తోత్రములు. 21.గెత్సెమనెలో పడిన శ్రమకు చెమట రావలెను. గాని రాకూడని రక్తమువచ్చుటయును. సిలువపై బళ్ళెముతో ప్రక్కలో పొడువగా రక్తము కారవలసినదిగాని రాకూడని నీరు వచ్చుటయుచూడగా, ఎంత సహించినను ప్రజలు మారకున్నారను మనోదుఃఖము వలనను, ఎవరును గ్రహింపలేని మనోవేదనవలనను, నీ గుండె నీరగునట్లు చేసిన శ్రమను నా కొరకు భరించిన ప్రభువా! నీకు అనంత కోటి నుతులు.
- మేలు తలంచిన నీ శిరస్సున మరల ముండ్లకిరీటము వేయకుండను, మేలు చేసిన నీ చేతులలో మరల సీలలు కొట్టకుండగను, మేలు చేయుటకు నడచిన నీ పాదములలో మరల మేకులు కొట్టకుండగను, పాపులను చేర్చుకొన్న నీ ప్రక్కలో మరల బళ్ళెము పొడువకుండను, నా పాదముల చెడుద్వార మరల నిన్ను సిలువ వేయకుండ కాపాడుదుననియు నమ్మి నిన్ను నా అంతరంగమంతటితోను నుతించుచున్నాను. యీ మా స్తుతులను జయశీలుడైన క్రీస్తు ప్రభువుద్వారా చెల్లించుచున్నాము. ఆమెన్.
Please follow and like us: