Watch Night Service: 31వ తేది మధ్యరాత్రి గం|| 11 నుండి గం|| 1-00 వరకు అనగా రానున్న సంవత్సరములో ప్రవేశించు వరకు చేయు ప్రార్ధన లేక ఆరాధన.
మత్తయి 28:20. కీర్తన 103; కొలొస్సె 3:1-15
యుగ సమాప్తి:- ఈమాట గ్రీకుభాషలో అయోనని అందురు. ఈఅయోనను మాట బైబిలులో చాల పర్యాయములు గలదు. యుగము అనగా ఒకప్పుడు ఎక్కువ సంవత్సరములుండును. ఒకప్పుడు తక్కువ సంవత్సరములుండును. ఎన్ని సంవత్సరములు యుగము అనునది చెప్పలేము. ఒక సంగతి అయిన తర్వాత యుగము, ఇంకొక సంగతి జరిగిన తర్వాత మరియొకయుగము. "బైబిలుమిషను" అను గాలిలో వ్రాయబడిన ప్రత్యక్షత గాలి మొదలు మేఘము వరకు నుండును. ఎందుకనగా భూమి మొదలు మేఘము వరకు గాలి ఉండును.
ఒక పుస్తకమున్నది, దాని పేరు గాలిపుస్తకము. బజారునకు వెళ్ళి ఒక పుస్తకము తెచ్చి వాడుదుము, పెట్టెలోనే ఎప్పుడును దాని నుంచము, ఆ పుస్తకము కొంతసేపు బల్లమీద, కొంతసేపు చేతిలోను కొంతసేపు పెట్టెలోను ఉండును. అయితే ఈగాలిపుస్తకము అలాగుకాదు. ఉదయము మొదలు సాయంకాలము వరకు, సాయంకాలము మొదలు ఉదయము వరకు ఉండును. దీనికి 12 పేజీలుండును. మొదటి పేజీ తెల్లగానుండును. ఎర్రగీత దీనిక్రింద నల్లగీత ఉండును. రెండవ పేజీలోను అట్లేయుండును. ఎర్రగీతమీద సౌఖ్య కాలమనియు నల్లగీతమీద కష్టకాలమనియు ఇట్లు పన్నెండు ఆకులమీద నుండును. ఇది గాలిపుస్తకము గనుక ఎప్పుడుబడితే అప్పుడే ఉండును. కొన్ని మార్లు వుండి కొన్నిమార్లు లేకపోవుటకు బజారు పుస్తకముకాదు. ఈ ప్రకారము అది యుగములలో నుండును, ఈ దినము మనము...సం. అనుచున్నాము. ఈ అంచుమీదనుండి కొత్త సంవత్సరము ... సం.ము అంచుమీదికి దూకివెళ్ళుదుము. పాతసంవత్సరములో నున్న గీతలే క్రొత్త సంవత్సరము లోనికి వచ్చును. ఈ గీతలు ఎప్పుడు తపించుకొందుమనగా ప్రభువు వచ్చినప్పుడు గాలిద్వారా ఎప్పుడు మేఘములోనికి ప్రవేశింతుమో అప్పుడు తప్పించుకొందుము, కష్టకాలము గీతవంటి నల్లగీతలు అప్పుడురావు, ఎర్రగీత ఎప్పుడునుపోదు. అనగా సౌఖ్యము ఆనందము,. సన్నిధికూటములు, ప్రార్ధనలు సువార్త ప్రకటన, పత్రికలు, స్తుతులు ఈమొదలైనవి ఉన్నయెడల ఆ నల్లగీత ఎందుకుపోదు అనవచ్చును. అది ఇక్కడపోయేది కాదు గనక పోదు. అది మనమీద ఉండక మన కాళ్ళ క్రింద ఉండును. గతించిన పాత సంవత్సరమును గురించి స్తుతించవలెను. రానైయున్న క్రొత్త సంవత్సరమును గురించి స్తుతించవలెను. ఎందుకనగా ఎర్రగీత స్థిరపడుటకు నల్లగీత సహయపడును. మన భూలోక జీవితము ఒక పాత సం. వంటిది. రాబోయే మహిమలోక జివితము ఒక క్రొత్త సంవత్సరము - మరనాత అందరకు పాతసంవత్సరపు - మరనాత.
ప్రార్ధన
ఓ దయగల తండ్రీ! మాయొద్దనుండి ఒక స్నేహితుడు వెళ్ళిపోవుచున్న సలాము చేయుదుము. అప్పుడే ఒక క్రొత్త స్నేహితుడు వచ్చిన ఆయనకు కూడ సలాము చేయుదుము. అర్ధము మాత్రము బేధము. వెళ్ళిపోయే స్నేహితునితో అయ్యా : వెళ్ళిరండి అను భావము. వచ్చే స్నేహితునితో అయ్యా దయచేయండి, కూర్చోండి అను భావము, ఇద్దరకు Shake hand ఇస్తాము. అలాగే పాత సంవత్సరమును సాగనంపి క్రొత్త సంవత్సరమును ఆహ్వానించు చున్నాము. అయితే మనము దానిని సాగనంపుట లేదు. దానంతట అదే వెళ్ళిపోవును, క్రొత్త సంవత్సరమును రమ్మని మనము పిలవడములేదు, దాని అంతట అదే వచ్చును. బైబిలుమిషనును మనము పిలువలేదు దాని తలంపేలేదు. దాని అంతట అదే వచ్చినది. దాని అంతట అదే సాగుచున్నది. మనము పనిగట్టుకొని గట్టిగా త్రోసివేసిన అదివెళ్ళదు. గాలి తుఫాను వచ్చిన మన మందరము బయటకువెళ్ళి చేతులుచాపి ఆగుమని చెప్పిన ఆగునా? అలాగే బైబిలుమిషను ఎందరు ఆపిన ఆగదు. ఈ సంగతి ప్రభువును అడిగి తెలిసికొనవలెను. ఓప్రభువా! యుగ సమాప్తి వరకు ఉండునని చెప్పినావు. దాని వివరము గొప్పది, యుగమనగా ఏమిటి, యుగసమాప్తి అనగా ఏమైనది నీవు చెప్పినగాని తెలియదు. కాబట్టి మేము అడుగువరకు, నీవు చెప్పువరకు ఆగియుంటాము. ఈ ప్రార్ధన నీ ఘనమైన నామమునుబట్టి ఆలకించుము, ఆమెన్.
Please follow and like us: