కీర్తన 34:7. 107:19-21, 43:1. 76:10, 103:2 33:1. 119:164. 26:7 నెహెమ్యా 9:31-32. ప్రకటన 14:8-11. 5:12-14 15:3-4.
మహోపకారివైన తండ్రీ! రాత్రికాలమున కలుగు కీడు లన్నిటినుండి మమ్మును తప్పించుటకు కావలిదూతను మా వద్ద ఉంచినందుకు నీకు స్తుతులు. తండ్రీ! మంచు, ఎండ , గాడ్పు, అగ్ని, వాన, కలహము, వ్యాధి, భూకంపము, దుర్వార్తలు వినుట వలన కలుగు కీడు లన్నిటినుండి తప్పించుచున్న నీ ఉపకార లక్షణమునకై స్తోత్రములు.
సర్వశక్తి గల దేవా! దురాత్మలు,మృగములు, జలచరములు,పక్షులు, పాపనైజము, శాపము, సాతాను, పాపఫలితము, అపాయము, అంటువ్యాధులు, అపనమ్మిక, మరణములు,శత్రువులు, విషపురుగులు, జంతువులు, కపట సహోదరులు, చోరులు, అజాగ్రత్త అజ్ఞానము, అనాగరికత, ప్రయాణ సాధనములు, వీటి వలన కలుగు సమస్త విధములైన హానిని నిర్మూలము చేయుచున్న నీకు వందనములు. మా స్తుతులు త్వరగా రానైయున్న క్రీస్తు ప్రభువు ద్వారా చెల్లించుచున్నాము. ఆమెన్.
Please follow and like us: