కీర్తన 103:2. నెహెమ్యా 9:21 కీర్తన 26:7.
ఓ దేవా, తండ్రీ నీ నామమహిమను కలుగజేసిన నీకు అనేక స్తోత్రములు.అన్ని అనుగ్రహ దానములగు భూమి యాకాశముల నిమిత్తమై వందనములు. నిత్యము నిన్ను స్తుతించుచు మాకు కావలిబంటులుగా నున్న దేవదూతల నిమిత్తమై నీకు స్తుతులు.
మా కొరకు అన్ని చేసిపెట్టి ఆయనతో సమానులుగా ప్రేమించిన నీ ప్రియకుమారుడైన క్రీస్తు ప్రభువు నిమిత్తమై నీకు నుతులు. మాలోను, మాతోను ఉండి మమ్మును మహిమ రాకకు ఆయత్త పరచుచున్న పావనాత్మ నిమిత్తమై స్తోత్రములు. నీ దివ్యలక్షణ రూపమును అనాదినుండి అనంతము వరకు మాకొరకై చేయుచున్న రక్షణ కార్యక్రమమును అన్ని లోకములలో మాకొరకు ఉంచిన భాగ్యమును, పాపమును, పరిశుద్ధతను, మా కన్నులకు కనబరచు రాజగ్రంధమైన బైబిలు గ్రంధము నిమిత్తము ప్రణుతులు. మేము నిత్యము నీతో జీవించుటకై మాకొరకు సిద్ధపరచిన మహిమ మోక్షము నిమిత్తమై స్తో త్రములు. నిన్ను నీవు మాకై యిచ్చిన సమస్త దానములను లోకమునకు చూపుచు తెలియజేయుచున్న క్రైస్తవ సంఘము నిమిత్తము వందనములు. పైనున్న సమస్త దానములను మేము అందుకొనుటకును, అనుభవించుటకును, ఆనందించుటకును, మాకు అనుగ్రహించిన భూలోక దైవసన్నిధి సహవాసము నిమిత్తమై నీకు వందనములు.
Please follow and like us: