సంఘారాధనలు

⌘K
  1. Home
  2. Docs
  3. సంఘారాధనలు...
  4. 15. ఉపకార, అపకార నివారణ స...
  5. ప్రార్ధనాదికము

ప్రార్ధనాదికము

(1) దేవా! సృష్టికర్తా! తండ్రీ! మా కందరకును కనబడి మాతో మాటలాడుము. గాలిని, వెలుగును వానను ఉచితముగా ఇచ్చుచున్న నీకు అనేక నమస్కారములు.(2) ప్రయాణీకులకు రాక పోకలయందు, బసయందు యేచిక్కు రాకుండా కాపాడుము. (3) జన సమర్ధముచేత కలుగు రాపిడివలన కష్టము కలుగనీయకుము. (4) ప్రజలకు జాగరూకత మెళకువ నేర్పించుము. (5) అన్న పానాదుల వలన గాని, కొనబడి వస్తువులవలన గాని, స్నానము వలన గాని, గాలివలన గాని, వర్షమువలన గాని, ఎండవలన గాని హా నిరాకుండ కాపాడుము. (7) కక్షలుగలవారివలన గాని భేదాభిప్రాయములుగల వారివలనగాని, మనస్పర్ధలుగల వారివలన గాని మత సంబంధమైన వివాదములవలన గాని కీడు కలుగనీయకుము. (8) అందరిలోను స్నేహ భావమునుకలిగించుము. (9) రక్షక భటులతో పాటు నీ దేవదూతలను కూడా కావలివారినిగా నియమించుము. (10) ఆటపాటలవలన ఎట్టి అపాయము కలుగనీయకుము. (11) దొంగతనము మొదలగు యే పాపమునకైనను, సందు దొరకనీయకుము. (12) బీదలను, చిన్న పిల్లలను, వ్యాధిగ్రస్తులను కాపాడుము.

  (1) దేవా! ప్రజాసౌఖ్యార్ధమై సదుపాయములు యేర్పరచుచున్న అధికారులను, వారి పరిచారకులను దీవించుము. (2) ఇక్కడకు వచ్చు ప్రతివారిని పేరుపేరుచొప్పున దీవించుము. (3) ప్రజలను కాపాడుటకై ఏర్పడిన పోలీసువారిని తమ ఉద్యోగ ధర్మమును యుక్తముగా నెరవేర్చుకొనునట్లు దీవించుము. (4) స్థలములను పరిశుభ్రము చేయువారిని దీవించుము. (6) భోజనాదులు సిద్ధపరచి వడ్డించువారిని దీవించుము. (7) ఈ జనమును దీవించుమని ప్రార్ధించువారిని దీవించుము. (8) ఈ సందర్భమున మా హిందూదేశమంతటిని దీవించుమని వేడుకొనుచున్నాము. చదువరులు, వినువారు యివిగాక యేవైన క్రొత్త ప్రార్ధనలు, దీవెనలు చేర్చుకొనవచ్చును. 

   దేవా! నీవు భూమిని కలుగజేసినప్పుడు సమస్తమును దీవించినావు. అయినను మేము నేడు చూచుచున్నట్లు

చా లవరకు కష్టస్థితియే కనబడుచున్నది. కనుక పశ్వాదులను, పక్షులను, వృక్షాదులను, నేలను మరల మరల దీవించుచుండుము. తథాస్తు.

Please follow and like us:

How can we help?